సి) పథకాలు / చర్యలు / ప్రణాళికా చర్యలు
1. ప్రజా పంపిణీ వ్యవస్థ: – దారిద్యరేఖకు దిగువన వున్న వారికి కేటాయించే తెల్ల రేషన్ కార్డ్ కలిగిన కుటుంబాలలో సభ్యులు ఒక్కొక్కరికి కిలోగ్రాము బియ్యం ఒకే ఒక్క రూపాయి చొప్పున 5 కిలోలు బియ్యం పంపిణీ చేయటం
2. అంత్యోదయ అన్న యోజన పథకం:- అంత్యోదయ అన్న యోజన కార్డు కల్గిన వారికీ కిలో బియ్యం రూపాయి చొప్పున కార్డుకి 35 కిలోల బియ్యాన్ని పంపిణి చేయటం
3. అన్నపూర్ణ పధకం:- ఏ.ఏ.పి కార్డు ధారులకు కార్డుకి 10 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణి.
4. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్ వాడీలు సంక్షేమ వసతి గృహములు తదితర విద్యా సంస్థలకు యం.యల్.యస్ పాయింట్స్ ద్వారా సరఫరా చేయబడు నిత్యావసర సరుకులు రవాణా మరియు నిర్వహణపై విజిలెన్స్ చేయుట.
5. దీపం పధకం:- జిల్లాలోని అన్ని కుటుంబాలకు వంట గ్యాస్ అనుసంధానం చేసి జిల్లాని నూరు శాతం వంట గ్యాస్ అనుసంధనిత మరియు పొగ కాలుష్య రహిత జిల్లాగా చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించేందుకై దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు 1600 రూపాయల రాయితీలో (ఇందు గ్లాస్ బండక) రూ. 1450/-, రెగ్యులేటర్ పరికరానికి రూ. 150/- ల జమనిది ఎల్.పి.జి దీపం పధకం కనెక్షన్ ల పంపిణీని సూపర్ వైజ్ చేయుట .
6. పెట్రోలు బంకులు, యల్.పి.జి. ఏజెన్సీస్ లకు B Form లైసెన్స్ లు మంజూరు చేయుట.
7. చౌక దుకాణం డీలరుల నియామకము