ముగించు

పట్టు పరిశ్రమ శాఖ

పట్టుపరిశ్రమ ప్రొఫైల్ :

నెల్లూరు జిల్లాలో పట్టు పరిశ్రమ – పట్టు రైతులు మల్బరీ తోటలు సాగు చేపట్టి పట్టు పురుగుల పెంపకం ద్వారా పట్టు గూళ్ళ ఉత్పత్తి అమ్మక పై సాలీన ఒక ఎకరము తోట నుండి 4,5 పంటలు చేయుట ద్వారా రూ. 1,00,000/-రూపాయలు ఆదాయము చేకూరును. రెండు ఎకరములలో 8-10 పంటలు చేయగలిగి నెలకొకసారి ఆదాయం రూ.30,000/- వరకు పొందే ఏకైక పంట పట్టు పరిశ్రమ. పట్టు పరిశ్రమ సన్న చిన్న కారు రైతుల ఇంట సిరుల పంట.

స్ట్రక్చర్

SERICULTURE

పట్టు పరిశ్రమ ప్రగతికి ప్రభుత్వ ప్రాధాన్యతాoశములు:

ప్రభుత్వము జాతీయ ఉపాధి హామీ పధకము అనుసందానం చేయటం ద్వారా మల్బరీ తోటలు పెంచుటకు సన్న/చిన్నకారు రైతులకు ఎకరము / రెండు ఎకరములు మల్బరీ ప్లాంటేషన్ కు రూ. 1,54,136/- షెడ్ నిర్మాణము టైపు -1 రూ. 6.00/- లక్షలు మరియు టైపు -2 రూ. 4.95/- లు అటులనే షేడ్యూల్ కులములు షేడ్యూల్ తెగల వారికి టైపు -1 రూ. 6.47 లక్షలు & టైపు -2 రూ. 4.79 లక్షలు ఆర్దిక సహాయము అందిస్తున్నది.

సి.డి.పి. పధకం :

ప్రతి రైతుకు మల్బరీ నారు మొక్కలు నాటినందులకు ఎకరం 1కి. రూ. 14,000/- లు 75% సబ్సిడీ, షేడ్యూల్/ షేడ్యూల్ తెగల వారికి 90% సబ్సిడీ. అటులనే షెడ్ నిర్మాణము ప్రతి రైతుకు టైపు -1 క్రింద రూ. 4.00 లక్షలు 75% సబ్సిడీ, షేడ్యూల్ / షేడ్యూల్ తెగల వారికి 90% సబ్సిడీ, టైపు -2 షెడ్ నిర్మాణము క్రింద రూ. 3.60 లక్షలు షేడ్యూల్ / షేడ్యూల్ తెగల వారికి ఆర్దిక సహాయము అందిస్తున్నది .

నాణ్యమైన పట్టు ఉత్పత్తి కొరకు బైవోల్టిన్ రకము పట్టు గూళ్ళ ఉత్పత్తి :

పట్టు గూళ్ళ ఉత్పత్తి ద్వారా అధిక ఆదాయం అనగా రు.30,000/- లు నుండి 35,000/-ల వరకు ఆదాయం చేకూరి రెండు ఎకరములలో సాలీన 4-5 పంటలు బైవోల్టిన్ రకము పట్టు పురుగులు పెంపకం ద్వారా అధనముగా రూ. 1,00,000/-ల నుండి రూ.1,20,000/-ల వరకు అంటే 30-35% అదనపు అభివృద్ధి లభిస్తుoది.

చాకీ పురుగుల పెంపకం :

కలిగిరి మండలం జిర్రావారిపాలెం నందు రూ. 10.00 లక్షలతో ప్రభుత్వ సహాయముచే షేడ్యూల్ కులము వారికి గత సంవత్సరం చాకీ సెంటర్ స్థాపించుట జరిగినది. పట్టు పురుగులు పెంపకం లో చాకీ పురుగుల దశ కీలకమైనది. పట్టు గ్రుడ్లు పిగిలినప్పటి నుండి రెండవ దశ వరకు అంటే మొదటి నుండి 8 .రోజులు పెంచి రైతులకు సప్లై చేయుట

టస్సారు పట్టు పురుగులు పెంపకం :

తెల్ల మద్ది చెట్ల పై టస్సారు పట్టు పురుగులు పెంపకం ద్వారా చల్లా యానాదులకు జీవనోపాధి కల్పించడం.

2018-19 మరియు 2019-20 ఆగష్టు 2019 వరకు లక్ష్యం / ప్రగతి

వ.నెం ప్రాదాన్యతాoశo యూనిట్లు 2018-19 2019-20
      లక్ష్యం ప్రగతి ప్రగతిశాతం సంవత్సర లక్ష్యం ఆగష్టు, 19  వరకు లక్ష్యం ప్రగతి ప్రగతి శాతం
1 కొత్తగా మల్బరీ తోటల పెంపకం ఎకరాలలో 150 153 102 150 60 8 13
2 పట్టు గుడ్ల బ్రషింగ్                
సి.బి. రకం నెం.లక్షలలో 4.48 4.305 96 5.15 1.65 1.455 88
బి బి.వి. రకం నెం.లక్షలలో 0.92 1.268 137 1.06 0.17 0.1635 96
3 పట్టు గూళ్ళ ఉత్పత్తి                
6 సి.బి. రకం మెట్రిక్ టన్నులు 291 273.77 94 335 107.35 92.96 87
7 బి.వి. రకం మెట్రిక్ టన్నులు 67.22 94.835 141 77 12.3 10.917 89
4 డ్రిప్ ఎకరాలలో 150 153 102 150 35 8 23
5 రేరింగ్ షేడ్స్ నిర్మాణములు నెంబరు 20 20 100 25 0 0 0
6 రేరింగ్ పరికరములు సప్లై యూనిట్లు 20 20 100 25 0 0 0
7 టస్సారు                
బ్రషింగ్ నెంబరు 0 0 0 4000 0 0 0
బి గూళ్ళ ఉత్పత్తి నెంబరు 0 0 0 50000 0 0 0

ఆర్.కె.వి.వై. స్కీమ్ వివరములు

వ.నెం పధకం వివరములు యూనిట్ విలువ (రూ.లలో) సబ్సిడీ (రూ.లలో) బ్యాంకు లోన్/ రైతు వాట  (రూ.లలో)
1 రేరింగ్ గృహం టైప్ –I (50’x20’x15’) (50%) 275000 137500 137500
2 వరండా (ఆర్.కె.వి.వై) 50% 45000 22500 22500
3 డిసిన్ ఫెక్షన్ పరికరములు (75%) 5000 3750 1250
4 ఫారం యాoత్రీకరణ పని ముట్లు (బ్రష్ కట్టర్ ,పవర్ స్ప్రేయర్ ) గరిష్ట మొత్తం రు. 10,000/- వరకు సబ్సిడీ చెల్లింపు

సి.ఎస్.ఎస్. స్కీమ్ వివరములు

వ.నెం పధకం వివరములు యూనిట్ విలువ (రూ.లలో) సబ్సిడీ (రూ.లలో) బ్యాంకు లోన్/ రైతు వాట  (రూ.లలో)
1 వి-1 మల్బరీ నారు మొక్కలు  (90%) 45000 40500 4500
2 రేరింగ్ గృహం టైప్ –I  (50’x20’x15’) (90%) 400000 360000 40000
3 రేరింగ్ గృహం టైప్ -II  (30’x20’x15’) (90%) 250000 225000 25000
4 షూట్ రేరింగ్ స్టాండ్ మరియు పరికరములు  ( 90%) 70000 63000 7000
5 (90%) డిసిన్ ఫెక్షన్ పరికరములు 5000 4500 500
6 ఫారం యాoత్రీకరణ పని ముట్లు (బ్రష్ కట్టర్ ,పవర్ స్ప్రేయర్ ) గరిష్ట మొత్తం రు. 10,000/- వరకు సబ్సిడీ చెల్లింపు

జిల్లా కార్యాలయపు సిబ్బంది వివరములు.

వ.నెం. పేరు హోదా ఫోన్ నెంబర్
1 ఇ.రామయోగిరెడ్డి సహాయ సంచాలకులు (పూ.అ.భా) 9912014121
2 వి.ఆశాలత సాంకేతిక సహాయకురాలు 8096529624
3 ఎ.బి.సుధాకర రాజు సాంకేతిక సహాయకుడు 8790929696
4 బి.వెంకటేశ్వర రెడ్డి సాంకేతిక సహాయకుడు 9490277131
5 బి.మస్తాన్ సాంకేతిక సహాయకుడు 7989448287

ఈ మెయిల్ / పోస్టల్ అడ్రసు:

Email: ad.seri.nlr[at]gmail[dot]com

సహాయ సంచాలకులు, పట్టు పరిశ్రమ,

వెంగళరావు నగర్, ఎన్.బి.టి.కాలనీ,

డైకాస్ రోడ్ , నెల్లూరు – 524004.