ముగించు

కార్మిక శాఖ

ఎ) శాఖ / సంస్థ గురించి పరిచయం:

కార్మిక శాఖ అనునది నిజానికి కార్మిక చట్టములు అమలు చేయు శాఖ. కానీ కొంతకాలం క్రితం కార్మిక సంక్షేమ శాఖగా రూపు దిద్దుకుంది. దీని విధులు ఏమనగా, సంఘటిత మరియు అసంఘటిత రంగములలో సంక్షేమ పధకాలు, కనీస వేతనముల నిర్ధారణ, చనిపోయిన కార్మికులకు మరియు గాయపడిన కార్మికులకు నష్ట పరిహారము ఇప్పించుట, వేతనముల చెల్లింపు, బోనస్ చెల్లింపు మొదలగునవి వాటి అమలుతో షాపులు, సంస్థలు, ఫ్యాక్టరీలు, మోటార్ ట్రాన్స్ పోర్ట్ మొదలగు వాటి కార్మికుల సంక్షేమము చూచుట వంటివి ముఖ్యమైన విధులు మరియు కార్మికుల పరంగా దిగువ చూపిన చట్టములను కార్మిక శాఖ అమలు చేయుచున్నది. జీవో.యం .యస్. నెంబర్.33 మరియు ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ( E.O.D.B) సూచనల ప్రకారము ఆన్ లైన్ ఇన్స్పెక్షన్ పోర్టర్ లో నిర్ధేశించిన తనిఖీలు మాత్రమే చేయవలెను. మరియు ఆదివారము, జాతీయ సెలవు దినములు పండుగల నిర్ధేశిత సెలవు దినములు తనిఖీలు మరియు రాత్రి పూట తనిఖీలు సెక్షన్ 12(1), 31(1), 7(1)లు ఆంధ్రప్రదేశ్ దుకాణములు మరియు సంస్థల చట్టము ప్రకారము కార్మిక కమీషనరు, విజయవాడ వారి ఉత్తర్వులు ద్వారా ప్రస్తుతం లేవు.

  1. వేతనముల చెల్లింపు చట్టము, 1936
  2. కనీసవేతనముల చట్టము, 1948
  3. వర్కింగ్ జర్నలిస్టు (CMP) చట్టము, 1955
  4. ప్రసూతి సహాయక చట్టము, 1961
  5. మోటారు రవాణా కార్మికుల చట్టము, 1961
  6. బోనస్ చెల్లింపుల చట్టము, 1965
  7. బీడీ మరియు సిగార్ కార్మికుల (CEO) చట్టము, 1966
  8. కాంట్రాక్ట్ లేబర్ (R&A) చట్టము, 1970
  9. గ్రాట్యుటీ చెల్లింపు చట్టము 1972
  10. ఆంధ్రప్రదేశ్ కర్మాగారములు మరియు సంస్థల (NF&OH) చట్టము, 1974
  11. సమాన వేతనముల చట్టము, 1976
  12. సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్(COS) చట్టము, 1976
  13. అంతర్ రాష్ట్ర వలస కార్మికుల చట్టము, (RE&CS) చట్టము,1979
  14. బాల కార్మికుల (P&R) చట్టము, 1986
  15. ఆంధ్రప్రదేశ్ కార్మిక సంక్షేమ మండలి నిధి చట్టము, 1987
  16. ఆంధ్రప్రదేశ్ దుకాణములు మరియు సంస్థలు చట్టము, 1988
  17. ఆంధ్రప్రదేశ్ భవన మరియు ఇతర నిర్మాణ రంగ కార్మికుల (RE&CS) చట్టము, 1996

1. న్యాయపరమైన సేవలు:

సహాయ కార్మిక కమీషనరు, నెల్లూరు మరియు గూడూరు వారు కనీస వేతనముల చట్టము, జీతముల చెల్లింపుల చట్టము, కార్మిక నష్ట పరిహార చట్టము, ఇండస్ట్రియల్ వివాదముల చట్టముల క్రింద వివిధ కేసులలో క్వాషీ జుడీషియల్ ఆధారిటీగా కోర్టును నిర్వహించెదరు.

ఉప కార్మిక కమీషనరు, నెల్లూరు వారు కనీస వేతనముల చట్టము, జీతముల చెల్లింపుల చట్టము, కార్మిక నష్ట పరిహార చట్టము, ఇండస్ట్రియల్ వివాదముల చట్టముల క్రింద వివిధ కేసులలో అప్పీలేట్ ఆధారిటీగా మరియు క్వాషీ జుడీషియల్ ఆధారిటీగా కోర్టును నిర్వహించెదరు.

 

బి) డిపార్టుమెంటు యొక్క ఆకృతి

 

LABOUR

ఉప కార్మిక కమీషనరు వారి కార్యాలయపు సిబ్బంది

 

LABOUR

సి) సంక్షేమ పధకములు/విధులు/కార్యాచరణ

  1. సంఘటిత రంగ కార్మికుల విభాగము:
  2. అసంఘటిత రంగ కార్మికుల విభాగము

1. సంఘటిత రంగ కార్మికుల విభాగము:

ఆంధ్ర ప్రదేశ్ కార్మిక సంక్షేమ నిధి బోర్డు, విజయవాడ

ఎ) ఈ దిగువ చూపిన పధకములను సంఘటిత రంగ కార్మికుల విభాగము ద్వారా రిజిష్టరు కాబడిన ఆంధ్ర ప్రదేశ్ కార్మిక సంక్షేమ నిధిలో సబ్యులైన కార్మికులకు (ప్రజా సాధికారిక సర్వేలోని నమోధుకాని చంద్రన్నబీమా (ప్రస్తుతము వై.ఎస్ .ఆర్. బీమా) ద్వారా వర్తించని కార్మికులకు) మంజూరు చేయుచున్నది.

  1. ప్రమాద మరణ పధకము: రూ. 5,00,000/- (కార్మిక సంక్షేమ మండలి నందు కార్మికులుగా రిజిష్టరు కాబడి ప్రజా సాధికారిక సర్వేలో నమోదుకాని చంద్రన్నబీమా మొత్తము లబించని కార్మిక సంక్షేమ మండలి లబ్దిదారులకు మాత్రమే) (ప్రస్తుతము వై.ఎస్ .ఆర్. బీమా)
  2. సాదారణ మరణ పధకము: రూ. 20,000/- (కార్మిక సంక్షేమ మండలి నందు కార్మికులుగా రిజిష్టరు కాబడి ప్రజా సాధికారిక సర్వేలో నమోదుకాని చంద్రన్నబీమా మొత్తము లబించని కార్మిక సంక్షేమ మండలి లబ్దిదారులకు మాత్రమే) (ప్రస్తుతము వై.ఎస్ .ఆర్. బీమా)
  3. అంత్యక్రియల పధకము: రూ. 10,000/-(కార్మిక సంక్షేమ మండలి నందు కార్మికులుగా రిజిష్టరు కాబడి ప్రజా సాధికారిక సర్వేలో నమోదుకాని చంద్రన్నబీమా మొత్తము లబించని కార్మిక సంక్షేమ మండలి లబ్దిదారులకు మాత్రమే) (ప్రస్తుతము వై.ఎస్ .ఆర్. బీమా)
  4. వివాహ కానుక పధకము: రూ. 20,000/- (కార్మిక సంక్షేమ మండలి నందు కార్మికులుగా రిజిష్టరు కాబడి ప్రజా సాధికారిక సర్వేలో నమోదుకాని చంద్రన్నబీమా మొత్తము లబించని కార్మిక సంక్షేమ మండలి లబ్దిదారులకు మాత్రమే) (ప్రస్తుతము వై.ఎస్ .ఆర్. బీమా)
  5. ప్రమాదవశాత్తు గాయపడి శాశ్వత అంగవైకల్యము పొందినవారికి రూ.2,50,000-00 (కార్మిక సంక్షేమ మండలి నందు కార్మికులుగా రిజిష్టరు కాబడి ప్రజా సాధికారిక సర్వేలో నమోదుకాని చంద్రన్నబీమా మొత్తము లబించని కార్మిక సంక్షేమ మండలి లబ్దిదారులకు మాత్రమే) (ప్రస్తుతము వై.ఎస్ .ఆర్. బీమా)

బి). దిగువ చూపిన పధకములు రిజిష్టరు కాబడిన ఆంధ్ర ప్రదేశ్ కార్మిక సంక్షేమ నిధి కార్మికులకు నేరుగా వారి బ్యాంకు అకౌంట్లో సహాయ కార్మిక కమీషనరులు నెల్లూరు మరియు గూడూరు వారి ద్వారా జమ చేయబడుతుంది.

6. అంగ వైకల్యము గల వారికి స్కాలర్ షిప్: రూ. 10,000/-

7. స్కాలర్ షిప్లు : రూ. 10,000/-

8. ప్రసూతి సహాయము: రూ. 20,000/-

9. కుటుంభ నియంత్రణ ఆర్దిక సహాయము: రూ. 5,000/-

10. దీర్ఘ కాలిక వ్యాధుల ఆర్దిక సహాయము: రూ. 50,000/-

2. ఆనంఘటిత కార్మికుల వ్యవస్థ:

ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు, విజయవాడ ద్వారా ఈ క్రింది పధకములు అమలు చేయబడు చున్నవి.

a)

  1. ప్రమాద వశాత్తు మరణము: రూ. 5,00,000/- (భవన నిర్మాణ కార్మికులుగా రిజిష్టరు కాబడి ప్రజా సాధికారిక సర్వేలో నమోదుకాని చంద్రన్నబీమా మొత్తము లబించని భవన నిర్మాణ కార్మికులకు మాత్రమే) (ప్రస్తుతము వై.ఎస్ .ఆర్. బీమా)
  2. శాస్విత అంగవైకల్యము : రూ. 5,00,000/- (భవన నిర్మాణ కార్మికులుగా రిజిష్టరు కాబడి ప్రజా సాధికారిక సర్వేలో నమోదుకాని చంద్రన్నబీమా మొత్తము లబించని భవన నిర్మాణ కార్మికులకు మాత్రమే) (ప్రస్తుతము వై.ఎస్ .ఆర్. బీమా)
  3. సహజమరణము మరియు ధహన ఖర్చులకు: రూ.80,000/- (భవన నిర్మాణ కార్మికులుగా రిజిష్టరు కాబడి ప్రజా సాధికారిక సర్వేలో నమోదుకాని చంద్రన్నబీమా మొత్తము లబించని భవన నిర్మాణ కార్మికులకు మాత్రమే) (ప్రస్తుతము వై.ఎస్ .ఆర్. బీమా)
  4. వివాహ కానుక పధకము:: రూ.20,000/- (భవన నిర్మాణ కార్మికులుగా రిజిష్టరు కాబడి ప్రజా సాధికారిక సర్వేలో నమోదుకాని చంద్రన్నబీమా మొత్తము లబించని భవన నిర్మాణ కార్మికులకు మాత్రమే) (ప్రస్తుతము వై.ఎస్ .ఆర్. బీమా)
  5. విధ్యా విషయక ప్రోత్సాహక పధకము : రూ.12,00/- (భవన నిర్మాణ కార్మికులుగా రిజిష్టరు కాబడి ప్రజా సాధికారిక సర్వేలో నమోదుకాని చంద్రన్నబీమా మొత్తము లబించని భవన నిర్మాణ కార్మికులకు మాత్రమే) (ప్రస్తుతము వై.ఎస్ .ఆర్. బీమా)

b) ఈ క్రింది స్కీముల మొత్తములు ఆన్ లైన్ ద్వారా బ్యాంక్ నుండి బోర్డు నంధు నమోధు కాబడిన భవన నిర్మాణ కార్మికులకు ఆర్ధిక సహాయము చేయబడుచున్నది. చంద్రన్నబీమా (వై.ఎస్ .ఆర్. బీమా) తో సంబంధం లేదు.

6. ప్రసూతి సహాయము పధకము : రూ. 20,000/- మహిళా కార్మికులు లేదా నిర్మాణ కార్మికుల కుమార్తె లకు మాత్రమే వర్తించును.

7. ప్రమాదములో శాశ్వత అంగవైకల్యము పొందిన భవన నిర్మాణ బోర్డు లబ్ది దారులైన భవన నిర్మాణ కార్మికులకు ఉచితముగా కృత్రిమ మోకాళ్ళు , మోచేతులు అంధచేయబడతాయి. ప్రతి మూడు సంవత్సరములకు వాటిని మారుస్తారు.

8. ఉన్నత చదువులు చదువుతున్న బోర్డు సబ్యులైన భవన నిర్మాణ రంగ కార్మికులకు సంవత్సరానికి రూ.5,000/- ఏ ప్రబుత్వ పధకములతో సంబందములేకుండా అంధచేయబడతాయి.

 

డి) సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు .

క్రమసంఖ్య డివిజన్ /మండల్  అధికారులు మొబైల్ నంబర్లు
1 ఉపకార్మిక కమీషనర్, నెల్లూరు 9492555114
2 సహాయకార్మిక  కమీషనర్, నెల్లూరు 9492555115
3 సహాయకార్మిక  కమీషనర్, గూడూరు 9492555116
4 సహాయకార్మిక  కమీషనర్, (SSS) నెల్లూరు 9492555114
5 సహాయకార్మిక  కమీషనర్, (SSS) కావలి నో గవర్నమెంట్ మొబైల్
6 సహాయకార్మిక అధికారి, 1వ వలయము , నెల్లూరు 9492555117
7 సహాయకార్మిక అధికారి, 2వ వలయము , నెల్లూరు 9492555118
8 సహాయకార్మిక అధికారి, 3వ వలయము , నెల్లూరు 9492555119
9 సహాయకార్మిక అధికారి, 4వ వలయము , నెల్లూరు 9492555120
10 సహాయకార్మిక అధికారి, కావలి. 9492555121
11 సహాయకార్మిక అధికారి. గూడూరు 9492555122
12 సహాయకార్మిక అధికారి,నాయుడుపేట 9492555123
13 సహాయకార్మిక అధికారి,ఆత్మకూరు 9492555124
14 సహాయకార్మిక అధికారి,ఉదయగిరి 9492555125
15 సహాయకార్మిక అధికారి,రాపూరు 9492555126

 

ఇ) ఈ మెయిల్ అడ్రసులు

dcl[dot]nellore[at]gmail[dot]com

acl[dot]nlr[at]gmail[dot]com

acl[dot]gudur[at]gmail[dot]com

aclsssnellore1[at]gmail[dot]com

aclsss[dot]kavali[at]gmail[dot]com

alo1[dot]nellore[at]gmail[dot]com

alo2[dot]nellore[at]gmail[dot]com

alo3[dot]nellore[at]gmail[dot]com

alo4[dot]nellore[at]gmail[dot]com

alo[dot]kavalii[at]gmail[dot]com

alo[dot]gudur[at]gmail[dot]com

alo[dot]naidupet[at]gmail[dot]com

atmakur[dot]alo[at]gmail[dot]com

alo[dot]rapur[at]gmail[dot]com

alo[dot]udayagiri[at]gmail[dot]com 

 

ఎఫ్) ముఖ్యమైన లింకులు:(వెబ్ సైట్స్)

  1. A.P.Labor Department http://www.labour.ap.gov.in
  2. A.P.Labor Department http://www.bocwboard.ap.gov.in
  3. A.P.Labor Department http://www.aplabourwelfareboard.gov.in