ముగించు

సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (యానాదులు)

ఎ) శాఖ / సంస్థ గురించి పరిచయం:

    • నెల్లూరు, చిత్తూరు మరియు ప్రకాశం జిల్లాలలో నివశిస్తున్న యానాదుల సమగ్ర అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జి.ఓ.ఆర్.టి.నెం.58 సోషల్ వెల్ఫేర్ (టి.డబ్ల్యు.బడ్జెట్-2) డిపార్టుమెంటు, తేది.31.05.2001 ద్వారా నెల్లూరు నందు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (యానాదులు), తేది.05.02.2002దిన ఏర్పాటుచేయబడినది. తదుపరి జి.ఓ.యం.ఎస్.నెం.60, సోషల్ వెల్ఫేర్ (టి.డబ్ల్యు.బడ్జెట్.2) డిపార్టుమెంటు, తేది.21.07.2004 ద్వారా కడప జిల్లా నందలి నాలుగు మండలాలలోని (43) గ్రామాలను ఈ ప్రాజెక్టు పరిధిలోకి చేర్చబడినది.
    • నవ్యాంధ్రలో మొత్తం 34 గిరిజన తెగలలో ప్రధానంగా అత్యధికంగా యానాది తెగల వారు నివశించుచున్నారు. మైదాన ప్రాంతాలలోని అన్ని మండలాలలోని నివశించుచున్నారు.
    • సాధారణంగా ఈ యానాది తెగ వారు చెరువుగడ్లపై, జనావాసానికి దూరంగా నివశిస్తుంటారు. ముఖ్యంగా వీరియొక్క ప్రధాన వృత్తి చేపల వేటగాను వ్యవసాయ కూలీలుగాను, పారిశుభ్ర కూలీలుగాను, రిక్షా కూలీలు మొదలగు వృత్తులు వీరియొక్క జీవనాధారం.
    • మొత్తం జనాభాలో 40.49% తో అక్షరాస్యత కల్గియున్నారు. ఇందులో పురుషులు 43.51 % మరియు స్త్రీలు 37.39% తో అక్షరాస్యతతో ఈ క్రింద తెల్పిన జనాభా (సెన్సెక్స్ 2011) కల్గియున్నారు.
విస్తీర్ణం చ.కి.మీ మండలాలు హ్యాబిటేషన్స్ సాధారణ జనాభా గిరిజన జనాభా శాతం
యానాది నాన్ యానాది మొత్తం ఎస్.టి యానాది
13076 46 1778 2963557 251677 34320 285997 9.65 88.00

 

బి) ఆర్గనైజేషన్ చార్ట్

ITDA

c)  పథకాలు / వార్షిక ప్రణాళిక

3.i బ్యాంకు లింకేజి పథకములుః

ప్రభుత్వ ఉత్తర్వుల నెం.31 గి.సం. (జి.సి.సి) శాఖ, తేది.01.06.2015 ప్రకారము మండల స్థాయి ఎంపిక కమిటీచే ఎంపికకాబడిన గిరిజన యానాది, యానాదేతరులు లకు ప్రభుత్వ ఉత్తర్వుల నెం.101 సోషల్ వెల్ఫేర్ (ఎస్.సి.పి-1) శాఖ తేది.31.12.2013, ప్రకారము 18 నుండి 55 మధ్య వయస్సు కల్గిన వారికి వివిధ రకాల జీవనోపాధి సహయతా పథకాలను మంజూరుచేయబడును. యానాదులకు యూనిట్ విలువలో 90% లేదా రూ.1.00 లక్షలు మరియు యానాదేతరులకు యూనిట్ విలువ 60% లేదా రూ.1.00 లక్షలు ఏది తక్కువ అయితే ఆ మొత్తమును సబ్సిడిని మంజూరుచేయబడును. ఆ మేరకు, ఈ ఆర్ధిక సం.ము అనగా 2019-20 లో 1333 మంది గిరిజనులకు రూ.1874.60 లక్షల మేర వార్షిక ప్రణాళికను ఆమోదము పొందియున్నది.

3.ii. ఎన్.ఎస్.టి.ఎఫ్.డి.సి:

ప్రభుత్వ ఉత్తర్వుల నెం.72 గిరిజన సంక్షేమ (టి.డబ్ల్యు.జి.సి.సి) శాఖ, తేది.06.06.2016 ప్రకారము 18 నుండి 45 సం.ముల మధ్య వయస్సు కల్గిన గిరిజన యానాదులకు ఈ పథకము క్రింద వివిధ నైపుణ్యతతో వ్యక్తిగత యూనిట్లను గిరిజన సంక్షేమ శాఖ సబ్సిడితో పాటు, లబ్దిదారుని వాటాతో టర్మ్ లోను మంజూరుచేయుట జరుగుచున్నది.

3.iii. అగ్రికల్చర్ సర్వీసు కనెక్షన్:

గిరిజన వ్యవసాయ రైతులకు మంజూరుచేసిన బోరుబావులకు 100% శాతం పూర్తి సబ్సిడితో ఈ పథకము క్రింద విద్యుత్ సౌకర్యము కల్పించుట జరుగుచున్నది.

3.iv. ఎస్.సి.ఎ-టి.ఎస్.ఎస్.

ఈ పథకము క్రింద ఇతర శాఖల సమన్వయముతో అనగా వ్యవసాయ, ఉద్యాన, మత్స్య మరియు పశుసంవర్ధక శాఖల సమన్వయముతో ట్రైకార్ సబ్సిడితో యూనిట్లను మంజూరుచేయబడుచున్నది. ఆ మేరకు, ఈ ఆర్ధిక సం.ములో అనగా 2019-20 లో 1135 మంది గిరిజన రైతులకు లబ్దిచేకూరే విధంగా రూ.467.14 లక్షలతో అమలుచేయుటకు ప్రణాళిక ఆమోదము పొందియున్నది.

3.v. నైపుణ్యాభివృద్ధి పథకములు:

గిరిజన సంక్షేమ శాఖ మరియు ఆం.ప్ర.రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యములో నిరుద్యోగ గిరిజన యువతీ, యువకులకు నైపుణ్యతో కూడిన వివిధ రకాల శిక్షణలను శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలము ఎర్రగుంట నేషల్ హైవే ప్రక్కన ఏర్పాటుచేసిన యూత్ ట్రైనింగ్ సెంటర్ లో రీటైల్ సెక్టారు, కంప్యూటర్ హార్డ్ వేర్, నెట్ వర్కింగ్, హాస్పిటాలిటీ, జనరల్ డ్యూటీ అటెండెంటు, బ్యాంకింగ్ సెక్టార్లలో ఉచిత శిక్షణను కల్పించి, శిక్షణాంతరము ప్రైవేటు సంస్థలలో ఉద్యోగావకాశాలను కల్పించబడును.

3.vi. గురుకుల విద్యాసంస్థలు:

  • పబ్లిక్ మరియు సప్లిమెంటరీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన గిరిజన విద్యార్ధులకు జూనియర్ కళాశాలలో కేటాయించిన సీట్ల మేరకు అడ్మిషన్లు కల్పించబడును.
  • గురుకుల విద్యాసంస్థలు అనగా సోమశిల, చిట్టేడు మరియు చంద్రశేఖరపురంలలోని పాఠశాలలో ప్రవేశ పరీక్ష లేకుండా 3వ తరగతి లో అడ్మిషన్లు కల్పించబడును. సదరు పాఠశాలలో ఇతర కులాల వారికి అనగా ఎస్.సిలకు-12%; బి.సిలకు-4%; ఓ.సిలకు-2% ప్రవేశము కల్పించబడును. బ్యాక్ లాగ్ ఖాళీలను గిరిజనులచే మాత్రమే సీట్లను పూరించబడును.
  • ఓజిలి మరియు చంద్రశేఖర పురం లలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రవేశ పరీక్షల ద్వారా 6వ తరగతిలో ప్రవేశం కల్పించబడుచున్నది.

3.vii. గిరిజన కాలనీలలో మౌళిక సదుపాయల కల్పన:

గిరిజన కాలనీలలో వివిధ రకాల మౌళిక సదుపాయాలు అనగా రోడ్లు, విద్యుత్ మరియు త్రాగునీటి సౌకర్యములను సంబంధిత శాఖల వారిచే ట్రైబల్ సబ్ ప్లాన్ క్రింద చేపట్టబడును.

3. viii. ఇంజనీరింగ్ పనులు:

ఐ.టి.డి.ఏ ప్రాజెక్టు పరిధీలోని నెల్లూరు, చిత్తూరు మరియు కడప జిల్లాలలోని జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారులు మరియు గురుకుల విద్యాసంస్థల ప్రిన్సిపాళ్ళ వద్ద నుండి వసతి గృహాలు, గురుకుల విద్యాసంస్థలలో మౌళిక సదుపాయాలు, చిన్న రిపేర్లు, భవన నిర్మాణాలకై వచ్చిన ప్రతిపాదనలను గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగముచే అట్టి పనులను చేపట్టబడుచున్నవి.

 

డి) అధికారుల వివరములు

వ.నెం. అధికారి పేరు మరియు హోదా మొబైల్ నెంబరు
1 వై.రోసిరెడ్డి, ప్రాజెక్టు అధికారి, ఐ.టి.డి.ఏ 9490957009
2 పి.సావిత్రమ్మ, ఏ.పి.ఓ (పరిపాలనా) 8886645573
3 ఆర్.గాయత్రిదేవి, ఏ.పి.ఓ (మత్స్య) 8886645579
4 ఎల్.శ్రీనివాస రావు, ఏ.పి.ఓ (ఉ) 8886645577
5 కె.అనురాధ, ఏ.పి.ఓ (వ్య) 8886645576
6 వి. క్రిష్ణారావు, ఏ.పి.ఓ (భూ.వ్య) 8886645578
7 కె.కోటేశ్వరరావు, మేనేజరు 8886645572
8 కె.వి.క్రిష్ణయ్య, జూనియర్ అకౌంట్సు అధికారి 8886645581
9 ఎ.వి.రమేష్, ఫీల్డు ఆఫీసరు 8886645580
10 కె.దివ్యజ్యోతి, సీనియర్ సహాయకులు 7382400074
11 ఎన్.కోటేశ్వరరావు, సీనియర్ సహాయకులు 9010121777
12 ఓ.శారద, సీనియర్ సహాయకులు 8886645584
13 సి.హెచ్.బి.మోహన క్రిష్ణ, సెక్షన్ రైటర్ 9491453308
14 బి.శారద, జూనియర్ సహాయకులు 9573153267
15 యం.రాజకుమార్, రికార్డు అసిస్టెంటు 9618186090

 

ఇ) కార్యాలయపు చిరునామా మరియు ఇ-మెయిల్ వివరములు

ఇ-మెయిల్ : poitda[dot]nlr[at]gmail[dot]com

చిరునామా : ప్రాజెక్టు అధికారి వారి కార్యాలయము,

ఐ.టి.డి.ఏ (యానాదులు),

కొండాయపాళెం గేటు దగ్గర

దర్గామిట్ట, ఎల్.ఐ.సి. ప్రక్కన

నెల్లూరు – 524004.

టెలిఫోను : 0861-2327940

 

ఎఫ్) ముఖ్యమైన వెబ్ సైట్ల వివరములు:

వ.నెం. వివరణ వెబ్ సైట్ చిరునామా
1 ఓ.బి.యం.యం.ఎస్. http://obmms.cgg.gov.in
2 జిల్లా ఎన్.ఐ.సి. కేంద్రము http://www.nellore.ap.gov.in/
3 సమాచార హక్కు చట్టం www.apic.gov.in
4 స్పందన http://spandana.ap.gov.in/officer_login
5 బయోమెట్రిక్ – అటెండెన్సు http://apitdanlr.attendance.gov.in
6 ఏ.పి. ట్రైబ్స్ http://aptribes.gov.in/
7 గిరి ప్రగతి http://giripragati.ap.gov.in/
8 సి.ఎఫ్.యం.ఎస్., http://cfms.ap.gov.in
9 గురుకులం http://aptwgurukulam.ap.gov.in/
10 జ్ఞానభూమి https://jnanabhumi.ap.gov.in