ముగించు

సర్వ శిక్షా అభియాన్

విభాగనేత ప్రొఫైల్

సమగ్ర శిక్ష (ప్రాధమిక విద్య)అభియాన్ :-

“సర్వ శిక్ష అభియాన్” గా పూర్వము నుండి ప్రస్తుతము “సమగ్ర శిక్ష” (ప్రాధమిక విద్య) విభాగముగా నడుపబడుతున్న ఈ విభాగము ప్రాధమిక విద్యను విశ్వవ్యాప్తం చేయుటకొరకే సంఘ యాజమాన్యములో పాఠశాల వ్యవస్థను ఆధునీకరించుటకు పని చేయుచున్నది. సాంఘీక, ప్రాంతీయ, లింగ వివక్షత లేకుండా 6-14 సం,, ల వయస్సు గల పిల్లలందరికీ ప్రాధమిక విద్యను అందించడము లక్ష్యంగా పనిచేయుచున్నది. ఈ లక్ష్యానికి అనుగుణంగా అనేక బెటర్ వెంషన్స్ తో 2015-16 నుండి ప్రణాళికా బద్ధంగా ఈ ప్రాజెక్టు పనిచేయుచున్నది.

1. ప్రాధమిక విద్యను విశ్వవ్యాప్తం చేయుటకు ఈ క్రింది లక్ష్యాలు నిర్ధేషించడమైనది.

a. పాఠశాలల అందుబాటు.
b. విద్యార్ధుల నమోదు.
c. పాఠశాలలో విద్యార్డుల నిలకడ.

2. సామాజిక లింగ సమానత్వము సాదించుటకై క్రింది అంశాలపై ప్రణాళిక బద్దంగా సంస్థ పనిచేయుచున్నది.

d. బాలికా విద్య
e. ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్య
f. పట్టణ అనాధ పిల్లల విద్య
g. SC, ST పిల్లల విద్య
h. మైనారిటీ పిల్లల విద్య
i. సంఘ సమీకరణ
j. పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన.
k. నిర్వహణ మరియు పర్వవేక్షణ.

3. జిల్లాలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలు

1. పాఠశాల వయసు గల షెడ్యూల్ తెగల పిల్లలకి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వారిని పాఠశాలలో చేర్పించడం.
2. జిల్లాలోని తడ మండలములో తమిళం మాతృభాష గల పిల్లలకు తగు మద్ధతు నివ్వడం.

 

సంస్థాగత నిర్మాణము

 

 

వ్యూహాలు / చర్య / కార్య ప్రణాళిక

వ్యూహాలు చర్య కార్య ప్రణాళిక
ఎ) పాఠశాలలఅందుబాటు నెల్లూరు జిల్లాలో 3115 నివాస ప్రాంతములు గుర్తించగా అందులో  2984 ప్రాంతాలకు ప్రాధమిక విద్యా సౌకర్యములు ఉన్నవి. మిగిలిన 77 చిన్న నివాస ప్రాంతములలో ప్రాధమిక, ప్రాధమికోన్నత, స్థాయి పిల్లలు విధ్యార్ధులు పాఠశాలకు హాజరగుటకై రవాణా సౌకర్యమునకు రవాణా ఛార్జీలు చెల్లించి 2019 -20 సం.లో  100 శాతం పాఠ శాలలు  అందు బాటులోకి తెచ్చుటకు  చర్యలు గై కొన బడినవి. 1. పాఠశాలల  అందు బాటుకైక్రొత్తగా ప్రారంభించబడిన 18 ఉర్దూ ప్రాధమి కోన్నత పాఠశాలల్లో  విధ్యార్ధుల కొనసాగింపుకై  8 వ తరగతి  ప్రారంభించ  బడినది. 2. 77 నివాస ప్రాంతములలోని 839 మంది  ప్రాధమిక స్థాయి, 706 మంది ప్రాధమికోన్నత స్థాయి విధ్యార్ధులకు  రవాణా ఛార్జీలు  చెల్లించుట.
బి. విద్యార్ధుల నమోదు ఇప్పటివరకూ 98.13 శాతం విధ్యార్ధుల నమోదును  సాధించడ మైనది. 6- 14 సంవత్సరముల వయస్సు గల పిల్లలను 100 % పాఠ శాలల్లో నమోదు చేయుటకు లక్ష్యంగా నిర్ణ యించడ మైనది. లక్ష్యాలను సాధించుటకై సంఘ సమీకరణ సహాయముతో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించుటకై అవగాహన సదస్సులు నిర్వహించడము,  ఇప్పటికే గుర్తించబడిన 1050 మంది బడిబయటి   పిల్లలకు Non – Residential ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయుట.
సి. పాఠశాలల్లోవిద్యార్ధుల నిలకడ 2007 లో 94 శాతం, 2008 లో 96 శాతం, 2009 లో 97.94 శాతం, 2010 లో 98.74 శాతం, 2011 లో 99.38 శాతం గా ఉండి, ప్రస్తుతము 99.38  శాతం గా ఉన్న విధ్యార్ధుల నిలకడను 2020 నాటికి 100 శాతం గా ఉంచుటకు నిరంతర సమగ్ర హాజరు పర్యవేక్షణను  చేయడం. ఈ పర్య వేక్షణ కై పాఠ శాల కాంప్లెక్స్, ప్రధానోపాధ్యాయుడిని నియమించడము. బడి మానిన పిల్లలను బడిలో చేర్చిన తరువాత వారి కొనసాగింపుకై  చర్యలు తీసుకోవడం.  పాఠ శాలల్లో పిల్లలకు స్నేహ పూరిత వాతావరణాన్ని  కల్పించడము.  లక్ష్యాలను చేరుకొనుటకై 2904  పాఠశాలలకు  గాను 47 మండల విద్యా వనరుల కేంద్రాలకు, 312  పాఠశాలల సముదాయమునకు 5 కోట్లు రూపాయలు  మిశ్రమ గ్రాంట్ ఇవ్వడము.  ప్రతి విద్యార్ధికి 2 జతల సమ దుస్తులను ఇవ్వడము.39 ప్రాధమికోన్నత  పాఠశాలల్లో ప్రస్తుతము కొనసాగుతున్న సమాచారము  మరియు కమ్యూనికేషన్  టెక్నాలజీ తరగతులను, 242 పాఠ శాలలకు విస్తరించడము.  2026 ప్రాధమిక పాఠశాలలకు 3500 రూ. వంతున,244 ప్రాధమికోన్నత పాఠ శాలలకు రూ. 13,000/- లు  వంతున గ్రంధాలయ పుస్త కాల కొనుగోలుకై  చేయూత నివ్వడము.  324 ప్రాధమికోన్నత  పాఠశాలలకు  సైన్స్  మరియు గణిత  కిట్లను (82.66 లక్షల విలువ గల ) సైన్స్  మరియు గణిత  బోధనాభ్యాస కిట్లను పంపిణీ చేయడం.  సైన్స్  ఎగ్జిబిషన్  మరియు  క్విజ్ పోటీలను నిర్వహించడం 22833 మంది పిల్లలకు 1156 పాఠశాలల్లో పూర్వ ప్రాధమిక విద్యా కేంద్రాల్లో
    ప్రారంభించడము (అంగన్ వాడి కేంద్రాలు) మన జిల్లాకు ప్రత్యేకంగా “వీక్షణము” అనే ప్రత్యేక APP ద్వారా “శాలసిద్ధి” కార్యక్రమము ద్వారా విద్యార్ధుల హాజరును నిరంతరము విద్య వీక్షించడము.
డి. బాలికా విద్య  పాఠశాల యాజమాన్య కమిటీల ద్వారా బాలికా విద్య ప్రాముఖ్యత పై ప్రేరణ శిబిరాలను నిర్వహించడము. వివిధ పనులలో ఉన్న బాలికలను NGO లు, పొదుపులక్ష్మి గ్రూపు సభ్యుల సహాయముతో రక్షణ కల్పించి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో చేర్పించడము. పట్టణ ప్రాంతాల్లో బాలికా విద్య ప్రాముఖ్యత పై కళాజాతాలు నిర్వహించడము.  విద్యా హక్కు చట్టం పై బాలికల తల్లిదండ్రులకు, ప్రత్యేకంగా తల్లులకు అవగాహన కల్పించడము. బాలికలను వేధించడము, దుర్భాషలాడడం, అక్రమంగా తరలించడము మొదలైన వాటిని నిరోధించడము. NCLP మరియు పోలీసు వారి సహాయము తీసుకోవడము. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో స్వయం సంరక్షణ కోర్సులను నిర్వహించడము. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను పటిష్ట పరచి అన్ని వసతులు కల్పించడము.
ఇ. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు  క్రొత్తగా నమోదు అయ్యే ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడం. సాధారణ ఉపాధ్యాయులకు తరగతి గదిలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలను కలుపుకొని ప్రయాణం చేసే విధంగా తర్ఫీదు నివ్వడం.  భవిత కేంద్రాలలో ఫిజియో థెరపిస్టులను, ఆయాలను ఏర్పాటు చేయడం. 5 సంవత్సరముల లోపు పిల్లలకు వినికిడి మరియు దృష్టి లోపములను గుర్తించుటకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించడము.
ఎఫ్. పట్టణ అనాధ పిల్లలు  పట్టణ రెసిడెన్షియల్ హాస్టల్స్ కు ఆర్ధిక చేయూత నివ్వడము.  జిల్లాలో రెసిడెన్షియల్ హాస్టల్స్ నడుపుచున్న Child and Police Project సంస్థకు ఆర్ధిక చేయూత నివ్వడము జరిగినది.
జి. షెడ్యూలు కులాలు, షెడ్యూలు తరగతుల విద్య.  జిల్లాలో వున్న 47 మండలాలలో 36 మండలములలో యస్.సి, యస్.టి నిరక్షరాస్యత శాతము తక్కువగా వున్నది. ఈ మండలాలను ప్రభుత్వేతర సంస్థలకు మరియు విద్యాశాఖ అధికారులకు దత్తత ఇవ్వడం. బాలికా విద్యను ప్రోత్సహించుటకు బాలికలకు పాఠశాలలలో స్నేహ పూర్వక వాతావరణాన్ని కల్పించడము. యస్.సి, యస్.టి, మైనారిటీ మరియు మత్స్యకారుల ఆవాసాలలో విద్యా బోధకులను నియమించి తల్లిదండ్రులకు మరియు పిల్లలకు విద్య పై అవగాహన కల్పించడము. జిల్లాలోని 2775 మంది షెడ్యూలు తెగల బడి బయట పిల్లలను గుర్తించి “మన బడికి పోదాం” అనే కార్యక్రమము క్రింద 2019 ఏప్రిల్, మే నెలలలో బడిలో చేర్పించడం జరిగినది.  షెడ్యూలు కులాల విద్యార్ధులు చదువుచున్న పాఠశాలలలో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం. వారికి ఆట వస్తువులను ఏర్పాటు చేయడం. వారికి కె.జి.బి.వి లలో ప్రత్యేకంగా సీట్లు కేటాయించడం.  వారి ఆవాసాలలో రెసిడెన్షియల్ మరియు నాన్ రెసిడెన్షియల్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయడం. మొబైల్ వ్యాన్ ద్వారా జిల్లాలోని చల్లా యానాదుల సమాజంలో ఉన్న పిల్లలకు తల్లిదండ్రులకు విద్య ప్రాముఖ్యత పై అవగాహన కల్పించడం.
హెచ్. మైనారిటీ విద్య  విద్యా హక్కు చట్టము 2009 ప్రకారము జిల్లా లోని ఉదయగిరి, నెల్లూరు, కావలి, అనంతసాగరము, అల్లూరు, కోవూరు, వెంకటగిరి మరియు నాయుడుపేట మండలాలలో 20 ప్రాధమిక, ప్రాధమికోన్నత పాఠశాలలలో సమాంతర ఉర్దూ మీడియం తరగతులను నిర్వహించడం.  1016 మంది మద్రసాలలలో ఉన్న పిల్లలకు సాంప్రదాయక విద్యను ఏర్పాటు చేయడం. జిల్లాలోని ఉదయగిరి, నెల్లూరు, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం, గూడూరు మండలాలలో మైనారిటీ కె.జి.బి.వి లను నెలకొల్పడం. ప్రస్తుతం ఉన్న ఉర్దూ మీడియం పాఠశాలలలో కంప్యూటర్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం.
ఐ.  సంఘ సమీకరణ  పాఠశాల యాజమాన్య కమిటీలకు, గ్రామ పంచాయితీ సభ్యులకు విద్యా హక్కు చట్టంపై అవగాహన కల్పించదము. యస్.సి, యస్.టి, మైనారిటీలకు మరియు మత్స్యకార ఆవాసాలలో సమీకరణ శిబిరాలను ఏర్పాటు చేయడం. సంఘ నాయకులకు అవగాహన శిబిరాలను నిర్వహించడము.  పత్రికా, ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా, Hording లు స్తంభ బోర్డుల ద్వారా విద్యా హక్కు చట్టంపై అవగాహన కల్పించడము. ప్రధానోపాధ్యాయులకు, క్లస్టర్ రిసోర్సు పర్సన్లకు, మండల విద్యా శాఖాధికారులకు, ప్రభుత్వేతర సంస్థల సభ్యులకు, సంఘ నాయకులకు విద్యా హక్కు చట్టంపై అవగాహన కల్పించడము. ప్రవాస భారతీయులు, దాతలు, కార్పొరేట్ కంపెనీలు మరియు ప్రజా ప్రతినిధుల ద్వారా బడి ఋణం తీర్చుకుందాం అనే కార్యక్రమము ద్వారా సహాయాన్ని అభ్యర్ధించడము.
జే. పాఠశాలలలో మౌలిక సదుపాయాల కల్పన  అదనపు తరగతి గదుల నిర్మాణము. త్రాగునీటి సదుపాయము. పాఠశాల భవనాలకు మరమ్మత్తులు చేయడం. పాఠశాలలలో విద్యుత్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం. బాల బాలికలకు విడి విడిగా మరుగు దొడ్లను ఏర్పాటు చేయడం.  2019-20 సంవత్సరములో ఒక అదనపు తరగతి గది, 154 మరుగుదొడ్లు, 36 భవనాల మరమ్మత్తులకు నిధులు విడుదలై ఉన్నాయి.
కె. నిర్వహణ మరియు పర్యవేక్షణ  సంస్థాగత కార్య నిర్వహణ కొరకు జిల్లా ప్రాజెక్టు కార్యాలయము నందు క్షేత్ర స్థాయి మరియు పరిపాలనా సిబ్బందిని నియమించడము జరిగినది.  జిల్లా లోని అన్ని విద్యా వనరుల కేంద్రములలో ఒక మేనేజ్ మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇన్ చార్జి ని, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ను ఏర్పాటు చేయడమైనది. 318 క్లస్టర్లుగా పాఠశాలలను విభజించి ఒక్కొక్క క్లస్టర్ కు ఒక రిసోర్సు పర్సన్ ను ఏర్పాటు చేయడమైనది. జిల్లాలోని పాఠశాలల పర్యవేక్షణలో మొదటగా ప్రధానోపాధ్యాయులు తదుపరి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మండల విద్యా శాఖాధికారులు, జిల్లా విద్యా శిక్షణా సంస్థలో పని చేయుచున్న అధ్యాపకులు మరియు జిల్లా ప్రాజెక్టు కార్యాలయము లోని క్షేత్ర స్థాయి సిబ్బంది పర్యవేక్షించడము జరుగుతుంది.

 

కాంటాక్ట్స్

యెస్.నొం క్షేత్ర స్థాయి సిబ్బంది  పేరు అదికారి వారి హోదా అదికారి ID ఫోన్ నెంబర్
1 M.జనార్ధనాచార్యులు ప్రాజెక్టు ఆఫీసర్ , ( ఎఫ్.ఏ.సి).   9849909132
2 DR.V.జయభారతి ప్రత్యామ్నాయ పాఠశాలల సహ సమన్వయ కర్త 3090119 9000201532
3 B. శ్రీనివాసులు ఫైనాన్స్ & అక్కౌంట్స్ ఆఫీసర్,(F.A.C) 0800066 7337272564
4 M. శ్రీనివాసులు కమ్యూనిటీ సమీకరణ అధికారి (CMO) 0826827 9000104832
5 SK.MD.రహీమ్ నిర్వహణ మరియు ప్రణాళిక సహ సమన్వయకర్త (MIS&PLANING CO ORDINITOR) 0821346 9490812951
6 V.పూర్ణ చంద్ర రావు ప్రత్యేక అవసరాలుగల పిల్లల సమన్వయకర్త(I.E. Co-ordination) 0833957 9441524128
7 C. మస్తాన్ అసిస్టెంట్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్(APO) 0821236 9491325665
8 S.V.రత్నం  బాబు అసిస్టెంట్ సహాయ గణాంక  అధికారి (ASO) 0826811 9849900867
9 P. V. శ్రీనివాసులు సహాయ ప్రత్యామ్నాయ పాఠశాలల సహ సమన్వయ కర్త (Ast.ALSC) 0930736 7386600222
10 Sk.ఖాజా మోహిద్ధీన్ సహాయ విద్యా పర్యవేక్షణ అధికారి(ఉర్దు)[Ast.AMO (URDU)] 0835946 7093900557
11 K. నాగ శిరీష సహాయ విద్యా పర్యవేక్షణ అధికారి(Ast.AMO) 0823201 8008903375
12 U. సుధాకర్ సహాయ ప్రత్యేక అవసరాలుగల పిల్లల సమన్వయకర్త (A IECO) 0820666 9490810303
13 V. లక్ష్మమ్మ సహాయ  బాలికల అభివృద్ధి అధికారి (ASST.GCDO) 0821055 9491500261
14 G.శ్రీనివాసులు సహాయ కమ్యూనిటీ సమీకరణ అధికారి (ASST.CMO) 0843853 9441477609
15 T.శ్రీనివాస రావు డివై.ఇ.ఇ 14279425 9110760292
16 N.V.R.N.S.V.ప్రసాద రావు డివై.ఇ.ఇ NIL 8919473758
16 V.విజయకుమార్ పర్యవేక్షకులు 0800434 9985452811
17 K.రామచంద్ సీనియర్ సహాయకులు 0837399 9441232801
18 K.రాజేంద్రప్రసాద్ సీనియర్ సహాయకులు 0802151 9885345662
19 S. సుమతీ సీనియర్ సహాయకులు 0837399 9949564694
20 M.పావని సీనియర్ సహాయకులు 0837730 9885345662
21 N.విమల సీనియర్ సహాయకులు 0850995 9640480085
22 K.ప్రభాకర్ సీనియర్ సహాయకులు 0837404 6305364463
23 M.C.వెంగయ్య జూనియర్ సహాయకులు 0825054 9989765116
24 M. వేంకటేశ్వర రావు జూనియర్ సహాయకులు 0816540 8008518447
25 I.కమల  విష్ణు ఏ.టి.ఓ 0829640 8300020307

 

ఈమెయిల్ మరియు పోస్టల్ చిరునామా

ఈమెయిల్ ఇడి:apc_nlr[at]yahoo[dot]co[dot]in

తపాలా చిరునామా

ప్రాజెక్టు అధికారి

సర్వ శిక్ష అభియాన్ (ఎస్.ఎస్.ఏ)

జిల్లా ప్రాజెక్టు అధికారి కార్యాలయము

ఎంజి.బ్రదర్స్ వెనుక

దర్గా మిట్ట, నెల్లూరు-524003

 

వెబ్ సైట్లు

Samagra Siksha, MHRD :: GOVT OF INDIA :: http://samagra.mhrd.gov.in

Samagra Siksha,Govt. Of Andhra Pradesh :: https://ssa.ap.gov.in/SSA/

School Education :: Govt. Of Andhra Pradesh :: https://schooledu.ap.gov.in/DSE/