ముగించు

ఏ.పి. మార్క్ ఫెడ్ (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య లిమిటెడ్)

ఎ) ప్రొఫైల్:

ఏ.పి.మార్కఫెడ్(అంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య లిమిటెడ్.) నెల్లూరు జిల్లా లోని సహకార సొసైటీల యొక్క సమాఖ్యగా జిల్లాలోని రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించడం మరియు వారికి అవసరమగు ఎరువులను సరఫరా చేయు ముఖ్య ఉద్దేశ్యo తోటి ఏర్పాటు చేయబడినది. దీనికి తగిన విధంగా ప్రస్తుతం మార్క్ ఫెడ్ ఎరువుల నిల్వలను సమకూర్చుకొనుచు రైతులకు అవసరమగు ఎరువులు మరియు సుక్ష్మపోషకాలను సరఫరా చేయచున్నది మరియు రైతుల వద్ద నుండి సొసైటీల ద్వారా అపరాలను గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేయచున్నది.

సభ్యసంస్థలు:-

ప్రస్తుతము నెల్లూరు జిల్లాలో 88 ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలు మరియు ఒక జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ సభ్యులుగా ఉన్నయి. ఇవి రైతులకు అవసరమగు ఎరువులు, సూక్ష్మపోషకాలను అందించడం మరియు రైతుల యొక్క ఉత్పత్తులకు మద్దతు ధర కల్పిస్తున్నాయి. మరియు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ & ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలు యొక్క కార్యకలాపాల లావాదేవీలు జిల్లా సహకార బ్యాంకు నిర్వహిస్తుంది.

 

బి)  సంస్థ నిర్మాణ క్రమము:

MARKFED

సి)  పథకాలు/కార్యకలాపాలు/కార్యప్రణాళిక :-

ఎరువులు పంపిణి :-

ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలకు, ప్రైవేటు డీలర్లకు మరియు ప్రభుత్వ సంస్థలకు ఏ.పి.మార్క్ ఫెడ్ ,నెల్లూరు వివిధ రకాలైన ఎరువులను(యూరియా,డి.ఎ.పి మరియు ఇతర కాంప్లెక్స్ ఎరువులు) పంపిణి చేస్తుంది.

సూక్ష్మపోషకాలు & జిప్సమ్ పంపిణి ;

నేలల్లోని చౌడు మరియు సూక్ష్మధాతులోపాల నివారణకు జిప్సమ్ మరియు సూక్ష్మపోషకాలైన జింక్ సల్ఫేట్ 21%, జింక్ సల్ఫేట్ మోనోహైడ్రేట్ 33%, జింక్ EDTA 12%, బోరాన్ 10.5% మరియు బోరాన్ 20% లను వివిధ రాయితీ పథకాల ద్వారా నాణ్యత ప్రమాణికములకు లోబడి సకాలములో రైతులకు అందిస్తుంది.

పప్పుధాన్యాలసేకరణ;-

ఏ.పి.మార్క్ ఫెడ్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు పండించిన శనగలు,మినుములు మరియు పెసలు ను గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేయచున్నది.ఈ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వలన రైతులకు బయట మార్కెట్ లో కూడా తగిన ధరలు అందుబాటులో ఉంటూ బలవంతపు అమ్మకాలు నివారింపబడుచున్నవి.

 

డి) సంప్రదించవలసిన అధికారి వారి వివరాలు:-

వ.సంఖ్య పేరు & స్థాయి ఫోన్ నెంబర్
1 శ్రీ ఎస్.పవన్ కుమార్,జిల్లా మేనేజర్ 8978381839/0861-2327160
2 శ్రీ కె.రమేష్,అకౌంటెంట్ 6309009805
3 శ్రీ టి.వేణు,డి.ఈ.ఓ 8985084988
4 శ్రీ వై.వి.ఎస్.కె ప్రసాద్,సి.ఓ 9908203264

 

ఇ) ఈ-మెయిల్/పోస్టల్ అడ్రస్:

ఈ-మెయిల్ ఐ.డి: nellore[dot]markfed1[at]gmail[dot]com

చిరునామా:-

అంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య లిమిటెడ్, జిల్లా కార్యాలయము డోర్ నెం.26-14-189, సంగమిత్ర స్కూల్ రోడ్, సాయి బాబా గుడి దగ్గర, బి వి నగర్, మినీ బైపాస్ రోడ్, SPSR నెల్లూరు జిల్లా-524004.

 

ఎఫ్) డిపార్టుమెంటుకు సంబధించిన ముఖ్యమైన వెబ్ సైట్లు:-

www.apmarkfed.ap.gov.in