ముగించు

వీధిబాలల సంక్షేమ శాఖ

ఎ) శాఖ / సంస్థ గురించి పరిచయం:

రక్షణ, సంరక్షణ అవసరమైన బాలలకు మరియు చట్టంతో విభేదించబడిన బాలలకు , రక్షణ, సంరక్షణ మరియు పునరావాసము వంటి కార్యక్రమాలు సమర్ధవంతముగా మలుచేయటానికి బాలల సంక్షేమమ శాఖ 1990 వ సంవత్సరములో కారాగార శాఖ నుండి విభజనచేయడమైనది . “ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ 1958 ” ప్రకారము నేరస్తులను సంస్కరించు నిమిత్తమై “సంస్కరణాలసేవలు విభాగము ” కూడా 1995 సంవత్సరములలో బాలల సంక్షేమ శాఖలో విలీనము చేయబడినది.

 

I. పరిశీలన/పరివీక్షణ సేవలు (Probation Services):

క్రమ సంఖ్య పేరు మరియు హోదా చిరునామా, ఫోన్ నెం: మరియు మెయిల్ ఐడి నెం: పని స్వభావము
1 శ్రీ. బి. జి. కె. కాశిం దొర,ప్రాంతీయ పరివీక్షణ తనిఖీ అధికారి , నెల్లూరు డోర్ నెం :27-02-1081, ఏ. సి. నగర్, నెల్లూరు,Ph:9100045416,nellorerip@gmail.comkasimdora.baddani@ap.gov.in నెల్లూరు రీజియన్  అనగా శ్రీ. పొట్టి శ్రీ రాములు నెల్లూరు , ప్రకాశం మరియు గుంటూరు జిల్లాల నందు పనిచేయుచున్న జిల్లా మరియు అదనపు జిల్లా ప్రొబేషన్ అధికారులు నెల్లూరు, కావలి , ఒంగోలు, గుంటూరు మరియు తెనాలివారి  పై నియంత్రణ, మార్గనిర్ధేశం మరియు పర్యవేక్షణ  చేయడం . సమీక్షలు మరియు తనిఖీలు చేయడం.
2 శ్రీ. డి. సుబ్రహ్మణ్యం , జిల్లా పరివీక్షణాధికారి, నెల్లూరు, డోర్ నెం :27-6-166, ఏ. సి. నగర్, నెల్లూరు,Ph:9100045421,dpospsrnellore@gmail.comsubramanyam.dupati@ap.gov.in

I.విచారణ విధులు :

1. ప్రాధమికవిచరణ:

అపరాధుల పరివీక్షణా చట్టం 1958 ప్రకారం , అపరాధి యొక్క పూర్వ చరిత్ర మరియు మంచిప్రవర్తన ఆధారముగా శిక్షకు బదులుగా  ప్రత్యాంన్యాయముగా సదరు శిక్షా కాలాన్ని అధికారి యొక్క పర్యవేక్షణలో ఉంచుటకుగాను ,  గౌరవ న్యాయస్తానముల ఆదేశానుసారము ప్రాధమిక దర్యాప్తులు చేయటం.

2. సామజిక దర్యాప్తులు:

బాలల న్యాయ చట్టం 2015 ప్రకారం , గౌరవ బాలల న్యాయ మండలి మరియు బాలల సంక్షేమ సమితి యొక్క ఆదేశానుసారం ,18 సంవత్సరముల లొపు వయస్సు కలిగిన , రక్షణ, సంరక్షణ అవసరమైన బాలలపై  మరియు చట్టంతో విభేదించబడిన బాలలపై , సామజిక దర్యాప్తు గావిచి, సమర్పిచటం.

3. పెరోల్ విచారణలు:

కేంద్ర కారాగారములనందు జీవిత శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు  ఒక నెల సెలవుపై విడుదలకు, పర్యవేక్షణాధికారి కేంద్ర కారాగారముల వారి అభ్యర్థన మేరకు  పెరోల్ విచారణ గావించటం.

4. గృహ విచారణ , విడుదలకు  ముందస్తు విచారణ మరియు ఇతర విచారణలు :

సంరక్షణ సంస్తల పర్యవేక్షణాధికారుల అభ్యర్ధనలపై , చట్టం తో  బిభేదించబడిన మరియు రక్షణ &సంరక్షణ అవసరమైన బాలల యొక్క గృహవిచారణలు, విడుదలకు ముందు విచారణలు మరియు సంరక్షణ సంస్తలయందు ఉన్న బాలల గూర్చి అవసరమైన విచారణలు చేసి , నివేదికలు సమర్పిచడం .

II.పర్యవేక్షణవిధులు:

జీవితకాల శిక్ష అనుభవిస్తు, శిక్షాకాలం పూర్తికాకుండా, మంచిప్రవర్తనపై విడుదలచేసిన “మాజీ ఖైదీలను””,  అపరాధి యొక్క పూర్వ చరిత్ర మరియు మంచిప్రవర్తన ఆధారముగా శిక్షకు బదులుగా  ప్రత్యాంన్యాయముగాపర్యవేక్షణలో ఉంచిన నేరస్తులను , బాలురపరిశీలన గృహములనుండి మరియు ప్రత్యేకబాలుర గృహములనుండి విడుదలైన బాలలను, మరియు గౌరవ బాలల న్యాయ మండలి మరియు బాలల సంక్షేమ సమితి యొక్క ఆదేశానుసారం పర్యవేక్షణలో ఉంచిన బాలలను పర్యవేశించడం.

III.పునఃరావాస విధులు:

గౌరవ జిల్లా కలెక్టరు వారి సమక్షంలో ,జిల్లా పరివీక్షణ సలహా సమితి సమావేశము(District Probation Advisory Committee Meeting) ను నిర్వహించి, పర్యవేక్షణలో ఉన్న మాజీ ఖైదీలకు మరియు పూర్వ చరిత్ర మరియు మంచిప్రవర్తన ఆధారముగా శిక్షకు బదులుగా  ప్రత్యాంన్యాయముగా  పర్యవేక్షణలో ఉంచిన నేరస్తులకు పునఃరావాస  కల్పనకు కృషి చేయటం.

IV.బాలల సంరక్షణ సంస్థల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరియు తనిఖీ:   

1. బాలల సంరక్షణ సంస్థలు యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ:బాలల న్యాయచట్టం 2015 ప్రకారం , బాలల సంరక్షణ సంస్థలు  (ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర) గౌరవ జిల్లా కలెక్టరు వారి అధ్యక్షతన జరుగు “”జిల్లాస్థాయి ఆమోదకమిటీ(District Level Approval Committee) “” ద్వారా  రిజిస్ట్రేషన్ పొందవలసిఉంటుంది. అందుకు అవసరమైన ప్రక్రియ కు  జిల్లా ప్రొబేషన్ అధికారిని “”జిల్లా నోడల్ అధికారిగా నియమించడమైనది.

2. బాలల సంరక్షణ సంస్థలను తనిఖీ చేయడం: జిల్లా ప్రొబేషన్ అధికారి నేతృత్వంలో “”జిల్లాస్థాయి ఇన్స్పెక్షన్ కమిటీ”” ద్వారా  బాలల సంరక్షణ సంస్థలను తనిఖీ చేయటం జరుగుతుంది.

3 శ్రీ. డి. సుబ్రహ్మణ్యం , అదనపు జిల్లా పరివీక్షణాధికారి(FAC), కావలి,ఎస్. పి. ఎస్. ఆర్. నెల్లూరు జిల్లా” డోర్ నెం:5-8-1, పుచ్చలపాటివారి వీధి , కావలి,ఎస్. పి. ఎస్. ఆర్. నెల్లూరు జిల్లా,Ph:9100045421,dpospsrnellore@gmail.comsubramanyam.dupati@ ap.gov.in —do—

 

II. సంస్థాగత సేవలు( Institutional Services):

1. స్వచ్ఛంద సంస్థల ద్వారా బాలల సంరక్షణ సంస్థల నిర్వహణ:

రక్షణ మరియు సంరక్షణ అవసరమైన బాలల కు “జిల్లా బాలల సంరక్షణ సమితి” ఆదేశానుసారము బాలల సంరక్షణ సంస్థల ద్వారా పునఃరావాసం కల్పించడం జరుగుతుంది.ప్రస్తుతం 29 ప్రభుత్వేతర (ఎన్.జి.ఓ ) బాలల సంరక్షణ సంస్థలు ఈజిల్లా నందు పనిచేయుచున్నాయి.

2. బాలల సంరక్షణ సంస్థల రిజిస్టేషన్ప్రక్రియ:

బాలల చట్టం 2015 నందు సెక్షన్ 2(21) ప్రకారం బాలలసంరక్షణ సంస్థలు అనగా , చట్టంతో విబేధించబడిన బాలలు మరియు రక్షణ, సంరక్షణ అవసరమైన బాలల కొరకు ఏర్పాటు చేయబడిన దత్తత ఏజన్సీలు , బాలుర గృహాలు, బాలుర పరిశీలన గృహాలు, బాలుర ప్రత్యేక గృహాలు మరియు ఓపెన్ షెల్టర్ గృహాలు. సదరు గృహములందు బాలలకు పాక్షికం గా లేదా సంపూర్ణంగా పునరావాసం ఏర్పాటుచేయబడతాయి. సదరు బాలల సంరక్షణ సంస్థలు కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ నిధులు పొందుచున్న వా లేదా అనే విషయముతో సంబంధము లేకుండా, ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర బాలల సంరక్షణ సంస్థలన్నియు తప్పనిసరిగా సెక్షన్ 41, బాలల న్యాయ చట్టం 2015 ప్రకారం “రిజిస్ట్రేషన్” కలిగియుండాలి.గౌరవ జిల్లా కలెక్టరు వారి అధ్యక్షతన జరుగు “జిల్లాస్థాయి ఆమోదకమిటీ(District Level Approval Committee)” ద్వారా రిజిస్ట్రేషన్ పొందవలసిఉంటుంది. అందుకు అవసరమైన ప్రక్రియ కు జిల్లా ప్రొబేషన్ అధికారిని “జిల్లా నోడల్ అధికారిగా నియమించడమైనది.

3. బాలల సంరక్షణ సంస్థలను తనిఖీ చేయడం:

జిల్లా ప్రొబేషన్ అధికారి నేతృత్వంలో “జిల్లాస్థాయి ఇన్స్పెక్షన్ కమిటీ” ద్వారా బాలల సంరక్షణ సంస్థలనందు పునరావాసము, సౌకర్యాల కల్పన మరియు బాలల సమస్యల గూర్చి ప్రతి మూడు మాసములకు ఒక్కసారి , జిల్లా ప్రొబేషన్ అధికారి నేతృత్వములో బాలల సంరక్షణ సంస్థలను “జిల్లాస్థాయి ఇన్స్పెక్షన్ కమిటీ(District Level Inspection Committee)” ద్వారా తనిఖీ చేయడం జరుగుతుంది.