ముగించు

శ్రీ ప్రగడ కోటయ్య స్మారక భారతీయ చేనేత సాంకేతిక శిక్షణ సంస్థ, వెంకటగిరి

ఎ) శాఖ / సంస్థ గురించి పరిచయం

భారతదేశంలో అనాదిగా, వంశపారపర్యంగా చేనేత పరిశ్రమ నైపుణ్యం మరియు వృత్తి నైపుణ్యత తరతరాలుగా అభివృద్ది చెందుతూ ఒక కుటీర పరిశ్రమగా వున్నది. ప్రస్తుత తరుణంలో ప్రాపంచీకరణం మరియు అభివృద్ధి చెందుతున్న మార్కెట్ విధానాల వలన, పోటీతత్వం వలన చేనేత పరిశ్రమ ఒడుదుడుకులకు లోనవుతున్నది. ఈ తరుణంలో ఈ పరిశ్రమ ఒడుదుడుకులకు లోనవుతున్నది. ఈ తరుణంలో ఈ పరిశ్రమను కాపాడుకోనవలసిన భాద్యత ప్రతి ఒక్కరి మీద వున్నది. అందుకు అనుగుణంగా చేనేతలను పారిశ్రామికంగా అభివృద్ధి పరిచేదాని కొరకు భారత ప్రభుత్వం నడుం బిగించి దేశంలో చేనేత పరిశ్రమ అభివృద్ధి కొరకు 10 చేనేత శిక్షణా కేంద్రాలను స్థాపించినది.

కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు
1.వారణాసి(ఉత్తరప్రదేశ్) 1. వెంకటగిరి(ఆంధ్ర ప్రదేశ్)
2. సేలం(తమిళనాడు) 2. గడగ్(కర్ణాటక)
3. గువహతి(అస్సాం) 3. కన్నూర్(కేరళ)
4. జోద్ పూర్(రాజస్థాన్) 4. చాంపా(చత్తీస్ ఘడ్)
5. బర్గర్(ఒరిస్సా)  
6. శాంతిపూర్(వెస్ట్ బెంగాల్)  

అటువంటి వాటిలో ఒకటి భారత ప్రభుత్వ చేనేత మరియు జౌళి శాఖ చే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ చేనేత మరియు జౌళి శాఖ సంచాలకులు, అమరావతి వారి పర్యవేక్షణలో వెంకటగిరిలో 1992 లో ఏర్పాటు చేయబడినది.

ఈ సంస్థ వెంకటగిరిలో 25 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏర్పాటు చేయబడినది. ఈ సంస్థలో ప్రతి సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పాండిచ్చేరి, కర్ణాటక,కేరళ మరియు మహారాష్ట్ర కు చెందిన 60 మంది విద్యార్ధులు 3 సంవత్సరాల డి.హెచ్.టి.టి. డిప్లోమ లో ప్రవేశము పొందుతున్నారు.

బి) సంస్థాగత నిర్మాణం

SPKM

సి) పధకాలు / చర్యలు / ప్రణాళికా చర్యలు

లక్ష్యాలు

  1. చేనేత పరిశ్రమలో అత్యున్నత సాంకేతిక ప్రామాణాలను పెంపోందించుటకు ఉపకరించు స్వల్ప కాలిక మరియు దీర్ఘకాలిక శిక్షణనిచ్చి సాంకేతిక నైపుణ్యత గలిగిన మానవ వనరులను తయారుచేసి చేనేత మరియు జౌళి మరియు దుస్తుల తయారి పరిశ్రమలకు అందించుట.
  2. చేనేత పరిశ్రమకు సాంకేతిక నిపుణులను అనుసంధానించుట.
  3. విద్యార్ధులకు ప్రపంచ వస్త్ర పరిశ్రమకు అవసరమయిన అధునాతన దుస్తుల తయారి నైపుణ్య శిక్షణను అందించుట.

కార్యాకలాపాలు

బోధనంశాలు (పాఠ్యాప్రణాళిక)

శిక్షననందు క్రింద తెలిపిన అంశాలలో బోధన మరియు శిక్షణ ఇవ్వబడును.

  1. నూలు వడుకుట.
  2. వస్త్ర నిర్మాణము (నేత).
  3. రూప రచన.
  4. రంసల అద్దకం.
  5. రూప ముద్రణ.
  6. జౌళి పరీక్షలు.
  7. దుస్తుల తయారీ.
  8. విపణి మరియు యాజమాన్య పద్దతులు.
  9. కాలుష్య నియంత్రణ.
  10. కంప్యూటర్ ఉపయోగవిధానము.
  11. వ్యక్తిత్వ మరియు సమాచార నైపుణ్యము.

ప్రవేశ వయోపరిమితి

సంస్థ యిచుచ్చున 3 సంవత్సరాల డిప్లొమా కోర్సులో ప్రవేశము పొందుటకు వయో పరిమితి ఆ సంవత్సరంలో జూలై 1 వ తేదీ కి యస్.సి. మరియు యస్.టి. అభ్యర్ధులకు 15 నుండి 25 సంవత్సరాలు ఇతరులకు 15 నుండి 23 సంవత్సరాలు.

సీట్లు కేటాయింపు

సంస్థ నందు మొత్తం సీట్ల సంఖ్య -60, ఇందులో ఈ క్రింద తెలియపరిచిన దామాషా ప్రకారం సీట్ల కేటాయించబడును.

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములకు 47
తమిళనాడు 4
కేరళ 3
కర్ణాటక 3
పాండిచ్చేరి 1
మహారాష్ట్ర 1
మొత్తం 60

ఆంధ్రప్రదేశ్ తరుపున ఇతర రాష్ట్రములకు పంపు అభ్యర్ధుల వివరములు

  1. భారతీయ చేనేత సాంకేతిక శిక్షణా సంస్థ,సేలం(తమిళనాడు) – 11
  2. కర్ణాటక చేనేత సాంకేతిక శిక్షణా సంస్థ, గడగ్(కర్ణాటక) – 04

ప్రవేశ విధానం

10 వ తరగతి లేదా తత్సమానమయిన పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ మరియు ఇతర రాష్ట్రములకు చెందిన విద్యార్ధులకు సీట్లు కౌన్సిలింగ్ ద్వారా సీట్లు కేటాయించబడును.

శిక్షణ భత్యము

ఈ సంస్థ నందు ప్రవేశము లభించిన ప్రతి విద్యార్ధి విద్య సంవత్సరమునకు ఈ క్రింద తెలిపిన విధముగా 10 నెలలకు శిక్షణా భత్యమును పొందుదురు.

  1. మొదటి సంవత్సరం విద్యార్ధులు – 1000/-/నెలకు
  2. రెండవ సంవత్సరం విద్యార్ధులు – 11000/-/నెలకు
  3. మూడవ సంవత్సరం విద్యార్ధులు – 1200/-/నెలకు

డిప్లొమా ధృవీకరణ పత్రపరీక్షలలో ఉత్తీర్ణులై మంజూరు

3 సంవత్సరాల శిక్షణను విజయవంతముగా పూర్తీ చుకున్న విద్యార్ధులకు భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేనేత అభివృద్ధి కమీషనర్, న్యూ ఢిల్లీ వారి చే జారీ చేయబడ డిప్లొమో ధ్రువీకరణ పత్రం జారీ చేయబడును.

ప్రస్తుత విద్యార్ధుల సంఖ్య

ప్రస్తుతము సంస్థ నందు చదువుచున్న విద్యార్ధుల సంఖ్య వివరములు ఈ క్రింద తెలియపరచడమైనది.

క్రమ సంఖ్య విద్యార్ధి తరగతి బాలురు బాలికలు మొత్తం
1. మొదటి సంవత్సరం 46 14 60
2 రెండవ సంవత్సరం 46 12 58
3 మూడవ సంవత్సరం 37 16 53
  మొత్తం 129 42 171

డిప్లోమో పూర్తీ చేసిన విద్యార్ధుల వివరములు

ఇప్పటి వరకు 923 మంది విద్యార్ధులు 3 సంవత్సరముల డిప్లోమో శిక్షణను పూర్తిచేసుకున్నారు వారి వివరములు క్రింద తెలియపరచడమైనది.

క్రమ సంఖ్య పూర్తిచేసిన సంవత్సరము విద్యార్ధుల సంఖ్య
1 1995 28
2 1996 31
3 1997 41
4 1998 31
5 1999 35
6 2000 40
7 2001 27
8 2002 36
9 2003 41
10 2004 29
11 2005 20
12 2006 33
13 2007 34
14 2008 38
15 2009 42
16 2010 54
17 2011 27
18 2012 56
19 2013 18
20 2014 48
21 2015 27
22 2016 34
23 2017 48
24 2018 53
25 2019 52
  Total 923

923 మంది విద్యార్ధులను గాను 90 శాతం విద్యార్ధులు చేనేత ఎగుమతులు,దుస్తులు తయారీ కేంద్రములు,బట్టల తయారీ మిల్లులు, నూలు మిల్లులు,రూపరచన మరియు పరీక్ష కేంద్రముల యందు ఉపాధి పొందుచుచున్నారు.

కొంత మంది జౌల్యానిక పారిశ్రామిక వేత్తలుగా తమ సొంత వ్యాపార సంస్థలను నెలకొల్వి,ఇతర సాంకేతిక నిపుణులను కూడా ఉపాధి చూపుచున్నారు.

డి) సంప్రదించవలసిన అధికారుల వివరములు

క్రమ సంఖ్య పేరు మరియు హోదా చరవాని సంఖ్య
1 శ్రీ ఎ. మురళీకృష్ణ  అదనపు సంచాలకులు (హెచ్ & టి)/ప్రిన్సిపాల్ 8008705792
2 శ్రీ జి. వెంకట రామ్ అభివృద్ధి అధికారి (హెచ్ & టి)/పర్యవేక్షకుడు 9849352133
3 శ్రీ యస్. గిరిధర రావు అసిస్టెంట్ డిజైనర్ 9399936872
4 శ్రీ జి. హరినాధ బాబు డెమోన్స్ట్రెటర్(డైయింగ్) 9908473200
5 శ్రీ డి. చిన పోలయ్య  జూనియర్ అసిస్టెంట్ 9959709507

 

ఇ) ఇ-మెయిల్/చిరునామా

ఇ-మెయిల్ : iihtvgr[at]gmail[dot]com : tappal-hat-vgr[at]ap[dot]gov[dot]in

చిరునామ : అదనపు సంచాలకులు (హెచ్ & టి)/ప్రిన్సిపాల్

శ్రీ ప్రగడ కోటయ్య స్మారక భారతీయ చేనేత సాంకేతిక శిక్షణ సంస్థ

వెంకటగిరి – 524132, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.

 

ఎఫ్) ముఖ్యమైన అంతర్జాల వివరాలు

హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్ టైల్స్ డిపార్టుమెంట్ : https://www.handlooms.nic.in

స్టేట్ వెబ్ సైట్ : https://www.aphandtex.gov.in