ముగించు

వ్యవసాయ శాఖ

ఎ) శాఖ / సంస్థ గురించి పరిచయం :

ఆంద్రప్రదేశ్ రాష్ర్టము “ భారతదేశపు అన్నపూర్ణగా ఖ్యాతి” గాంచినది. ఆంధ్రప్రదేశ్ లో 63% ప్రజలు గ్రమాలలో నివసిస్తూ వ్యవసాయము, వ్యవసాయ ఆధారిత రంగాలపై ఆధారపడి వున్నారు.

నెల్లూరు జిల్లా వరి పంట పండించడంలో ప్రధాన్యత వున్నది. ‘’నెల్లి ” అనగా వరి అని అర్ధం. 2017-18 సంవత్సరములో నెల్లూరు జిల్లా దేశంలోనే వరి పంటలో రికార్డు స్తాయిలో దిగుబదడులు సాధించినది. ఖరీఫ్ (6711 కిలోలు హెక్టారుకు) మరియు రబీ (8611 కిలోలు హెక్టారుకు) సీజనులో అత్యిధిక సగటు దిగుబడులు సాధించినది నెల్లూరు జిల్లా ఖ్యాతిని నాలుదిశల వ్యాప్తిచేసినది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వ్యవసాయానికి, రైతుల సంక్షేమానికి ఎక్కువ ప్రధాన్యిత ఇస్తున్నది. చాలా కాలము నుండి రైతులు ఎదుర్కుంటున్న అవరోధాలు, సమస్యలను ఒక ప్రణాళికా బద్ధముగా పరిష్కరించుకుంటూ రాష్ట్రంలో వ్యవసాయం, పరిశోధనా సంస్థల సహకారంచే ఉత్పత్తిదాయకంగా, లాభదాయకంగా, స్తిరంగా, వివిధ శీతోష్ణస్తితులను తట్టుకొనే విధముగా ప్రయత్నం చేయబడుచున్నది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వ్యవసాయము అనుబంద రంగాలలో ఆదర్శవంతమైన రాష్ట్రంగా రూపొందించుటకు ముందస్తు ప్రణాళికలు రచించి అమలుపరచడం జరుగుతున్నది.

దాని లక్ష్యములు

  • పంటల ఉత్పాదకతను పెంచుట.
  • పంట సాంద్రతను పెంచుట.
  • నీటిని నిల్వచేయుట, బిందుసేద్యముల ద్వారా కరువు ప్రభావాన్ని తగ్గించుట.
  • కరువు రక్షిత పరమైన వాతావరణానుకూలిత పంటల సరళిని రైతులలో ప్రత్సహించుటము.
  • పంతకోతల అనంతరం వృధాను తగ్గించే పద్దతులను అవలంభించుట.
  • ఎన్నుకొన్న పంటల విశ్లేషణకు, విలువలను పెంచుటకు, వితరణకు (processing) తగిన ఏర్పాటు చేయుట.
    రైతుయొక్క సంక్షేమానికి పాటుపడటమే విద్యుక్తధర్మంగా , రైతు సమాజము యొక్క సమన్వయానికై ప్రభుత్వం యొక్క ముఖ్యాoగముగా వ్యవసాయశాఖ స్థాపించబడినది. నెల్లూరు జిల్లాలో ప్రధానంగా వరి, వేరుశనగ, శనగ పంటలు ఎక్కువ విస్తీర్ణములో పండించబడును. వీటిలో ఎక్కువ పోషకాలు వుండుట వలన ఎక్కవమంది ప్రజలు వీటిని ఆహారంగా తీసుకుంటున్నారు. వీటితోపాటుగా అపరాలపంటలైన కంది, మినుము, పెసర మొదలగు పంటలను కూడా ఎక్కువ విస్తర్ణములో సాగుచేయబడుచున్నవి.

ఈ లక్ష్యాన్ని ఫలవంతం చేయుటకే వ్యవసాయ శాఖ ఈ పద్దతులను అవలంభించుచున్నది.

  • సాయిల్ హెల్త్ కార్డులను పంపిణీ చేసి భూసార పరిక్ష ఆధారంగా ఎరువులను నిర్ణయించుట.
  • నాణ్యమైన విత్తనాలను సందర్భానుసారంగా బయోమెట్రిక్ విధానం ద్వారా పారదర్శకంగా పంపిణీ చేయుట. సమగ్ర పోషక యాజమాన్యము (INM), సమగ్ర చీడపీడల యాజమాన్యం (IPM) నాణ్యమైన నీటిపారుదల వ్యవస్త మొదలగువాటి ద్వారా సమగ్ర పంటల యాజమాన్యం (ICM).
  • నేల నాణ్యతను బట్టి పోషకాల నిర్దేశం మరియు జింక్ , బోరాన్ వంటి సూక్ష్మపోషకాలను సరియైన మోతాదులోఅందించుట.
  • ఉత్పాదకతను పెంచుటకు సమస్యాత్మకమైన నేలలను పునరుద్ధరించుట.
  • వ్యవసాయ భూముల అభివృద్ధికి, పర్యవరణ పరిరక్షణ కై వాటర్ షెడ్ పద్ధతిద్వారా సహజవనరుల నిర్వహణ.
  • కరవు కాటకములు, వరదలు, తుఫానులు మొదలగు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనుట.
  • ఫలవంతమైన వ్యవసాయ కార్యక్రమాలకై క్షేత్రస్తాయిలో యంత్రముల వాడకం.
  • వ్యవసాయం, అనుబంధ కార్యక్రమాలలో సాంకేతిక, ఆర్ధిక లాభములకై రైతు సంఘాలను (రైతు-మిత్ర గ్రూప్) ఏర్పరుచుట.
  • రైతుకు వ్యవసాయ ఋణ సదుపాయం అందించుట. ముఖ్యంగా కౌలు రైతులకు ఋణ సౌకర్యం వృద్దిచేయు చర్యలు చేపట్టడం.
  • రైతుకు పంటల బీమా ద్వారా ఆదాయ ధీమా కల్పించుట.
  • ఫలవంతమైన శిక్షణా కార్యక్రమాలకే శిక్షణా అధికారులను నియమించుట.
  • ఆధునిక వ్యవసాయ పద్ధతులయందు రైతుకు తర్ఫీదునిచ్చుట.
  • సాంకేతిక నైపుణ్యమునుసాదించుటకు వ్యవసాయశాఖలోని సిబ్బందికి తగిన శిక్షణను ఇచ్చుట.
  • ఇంటర్నెట్ సర్వీసులు మరియు అగ్రీస్నెట్ ద్వారా రైతులుకు పంట ఉత్పతులు , సాధనాల పంపిణీ , క్రయవిక్రయాలు అను విషయంలో ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించుట.

 

సంస్థాగత నిర్మాణం

AGRI

 

వనరులు

వ్యవసాయశాఖలో పటిష్టమైన మానవ వనరులు గలవు. ఇందు క్షేత్రస్తాయిలోనే గాగుండ పర్యవేక్షణ అధికారులు కూడా కలిపి 200 మంది కలరు. వీరికి శిక్షణా కార్యక్రమాలు, వర్క్ షాపులు, చర్చలు, మొదలగు వాటి ద్వారా నూతన సాంకే‌తిక పరిజ్ఞానములో శిక్షణ ఇవ్వబడును. ఇంతేగాక రైతు శిక్షణ కేంద్రము, ప్రయోగ శాలలు మొదలగు వాటిద్వారా రైతులకు అవసరమైన విజ్ఞానాన్ని అందిచుచు వ్యవసాయంలో సత్ఫలితాలు సాధించుటకు కృషి చేయబడుచున్నది. వీరికి సాంకేతిక సహాయము అందించుటకు 214 మంది బహుళార్దసాధక విస్తరణ అధికారులను (MPEO) కూడా నియమించటం జరిగింది.

వ్యవసాయ సంబంధిత శాఖలు/సంస్థలు

రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన వ్యవసాయ పరిశోధనా సంస్థ, నెల్లూరు, పొదలకూరు మరియు పెట్లూరు పరిశోధనలద్వారా నూతన విజ్ఞానమును అందించుచున్నవి. ఇంతేకాక APSAIDC, APMARKFED మొదలగు సంస్తల సహకారం కూడా తీసుకుంటున్నది.
వర్షపాతము (2018-19)
నెల్లూరులో వ్యవసాయం వర్షపాతం మీదనే ఆధారపడి వున్నది. వ్యవసాయ ఉత్పత్తులు వర్షపాత విభజన బట్టి వుండును. ఈ జిల్లాలో ఈశాన్య ఋతుపవనముల ప్రభావము ప్రధానమైనది. 2018-19 సం,, లో సాధారణ వర్షపాతం కంటే నైరుతి ఋతుపవనముల (జూన్ నుండి సెప్టెంబర్ వరకు) కాలంలో 44.3 శాతం తక్కువుగా నమోదు అయినది. ఈశాన్యఋతుపవనముల (అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు) కాలంలో 50.4 శాతం తక్కువుగా మరియు శీతాకాలంలో కూడా సాధారణం కంటే 71.68 శాతం తక్కువుగా నమోదు అయినది.

నెల్లూరు జిల్లాలో 2018-19 వ సం.లో నమోదైన వర్షపాత వివరములు

క్ర.సం ఋతువు వర్షపాతము 2018-19 (మి.మీ)    
    సాధారణము వాస్తవము %వ్యత్యాసము
1 నైరుతి ఋతుపవనముల (జూన్ నుండి సెప్టెంబర్ వరకు) 331.3 184.6 -44.3%    
2 ఈశాన్యఋతుపవనముల (అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు) 661.4 328.1 -50.4%    
3 శీతాకాలం (జనవరి – ఫిబ్రవరి) 19.9 13.6 -31.6%    
4 వేసవికాలం (మార్చి-మే) 67.8 19.2 -19.2%    
  మొత్తము 1080.4 547.8 -49.29%    

నీటిపారుదల

వేర్వేరు వనరుల ద్వారా నీటిపారుదల విస్తీర్ణం 4.77 లక్షల హెక్టర్లు..కాగా కాలువల ద్వారా 2.50 లక్ష ల హెక్టర్లు, చెరువుల ద్వారా 1.25 లక్ష ల హెక్టర్లు, భూగర్బ జాలం ద్వారా 0.76 లక్ష ల హెక్టర్లుకు సాగు అవకాశం వున్నది.

నీటి పారుదల విస్తీర్ణం

S.NO వనరులు పంటల విస్తీర్ణం ఖరీఫ్ (హె,,) పంటల విస్తీర్ణం రబీ (హె,,) మొత్తం విస్తీర్ణం (హె,,)
1 కాలువలు 964 100603 101567
2 బోరులద్వారా 36245 33637 69882
3 చెరువులు   12387 12387
4 ఎత్తిపోత పధకం 404 1815 2219
5 ఇతర వనరులు 84 522 566
  మొత్తం 37697 149401 187098

భూకమతములు

వ్యవసాయోత్పత్తికి చాలా వరకు సాగుబడి విస్తీర్ణముపై ఆధార పడి వుంటుంది. జనాభా లెక్కలప్రకారం 2010-11 సం. నికి రాష్ట్రంలో ఒక్కో రైతు సాగుచేసిన నేల విస్తీర్ణం 1.06 హె. తర్వాతి సంవత్సరములలో సాగుబడిచేసిన పొలములు విభజించటం వలన ఈ విస్తీర్ణం తగ్గుతు వచ్చినది.
నెల్లూరు జిల్లాలో 5.17 లక్షల హెక్టర్లు విస్తీర్ణములో 5.52 లక్షల భూపరిమితులు కలవు. వేర్వేరు వర్గాలకు చెందిన భూపరిమితుల సంఖ్య వాటిలో సాగు చేయబడిన భూ విస్తర్ణము 2010-11 సం.. లో సన్నకారు 67.39 శాతం వుండ గా 28.62 శాతం సాగుబడి చేసిన భూ విస్తర్ణము, చిన్నకారు రైతుల సంఖ్య 20.19 శాతం కాగా సాగుబడి చేసిన భూ విస్తర్ణము 28.76 శాతం, మధ్యస్త రైతుల సంఖ్య 27.99 శాతం కాగా సాగుబడి చేసిన భూ విస్తర్ణము 43.13శాతం .

పంటల సరళి

నెల్లూరు జిల్లాలో పంటలు ఖరీఫ్ మరియు రబీ సీజనులో 2018-19 సం.లో 2.28 లక్షల హె. లలో పండించడమైనది. ప్రధానముగా వరి (166638 హె.), మినుము (9209 హె.), శనగ (11040హె.), వేరుశనగ (9488 హె.), పెసర (2452 హె.) ఈ జిల్లాలో పండించబడును. 2018-19 సం. లో 20 శాతం ఖరీఫ్ లో 80 శాతం రబీలో పంటలు సాగుచేయబడినవి.

భూసారాన్ని పరీక్షించుట

భూసారపరీక్షలకు మట్టి నమూనాలు సేకరించుట, పరీక్షించుట అను కార్యక్రమము ఒక పద్దతి ప్రకారము నిర్వహించి భూసార పరిస్తితిని మూల్యంకనము చేసి లవన లక్షణాలకు సంభంధించి సమస్యలను గుర్తించి భూసార పరీక్షల ఆధారంగా భూసారమును పెంచుటకు అవకాశం ఎర్పరచడం.

ఈ పధకం యొక్క లక్ష్యములు

  • భూసారమును మూల్యాంకము చేయుట.
  • సమస్యాత్మకమైన నేలలును గుర్తించి సాగుచేయుట.
  • ఎరువులను సంతులితంగా, సమగ్రముగా వాడడం ద్వారా సాగుబడి ఖర్చును తగ్గించుట.
  • భూసారమును పెంచుట.

మట్టినమూనాలను సేకరించుట

2019-20 సం. లో 27718 నమూనాలు ప్రతి మండలములోని ఎంపిక చేసిన గ్రమములోని ప్రతి కమతం నుండి సేకరించి పరీక్షలు నిర్వహించి పరీక్షా ఫలితాలను సాయిల్ హెల్త్ కార్డుల ద్వారా రైతులకు అందించడమైనది.

భూసార పరీక్ష కేంద్రము
నెల్లూరు లోని భూసార్ర పరీక్ష కేంద్రములో ప్రభుత్వ పధకము అమలుచేస్తున్న గ్రమా

జాతీయ స్తాయిలో స్టీరికృత వ్యవసాయానికై భూసార నిర్వహణ (NMSA)

లక్ష్యములు
  • అవసరానుసారము రసాయినిక ఎరువులను, ఇతర సూక్ష్మ పోషకాలను, సేంద్రియ ఎరువులును ఉపయోగించి భూసారమును, ఉత్పాదకతను పెంచుటకై సమగ్ర పోషక నిర్వహణ (INM) ను చేపట్టుట.
  • స్టీరీకృత సేంద్రియ వ్యవసాయం ద్వారా భూసారమును వృద్ధి చేయుట.
  • క్షారాధారిత నేలలును సరిచేసి వాటి సారౌను, ఉత్పాదకతను పెంచుటకై తగిన మార్పులు చేయుట.
  • ఎరువుల నాణ్యతను వృద్ధి చేయుటకు సూక్ష్మపోషకాల ఉపయోగాలను ప్రోత్సహించుట.

ఎంపిక చేసిన గ్రమాల నుండి సేకరించిన మట్టి నమూనాల పరీక్ష అనంతరము, 4032 హే.లలో పోషకలోపాలు గుర్తించడమైనది. ఈ లోపాలను సవరించుటకు రైతుకు ఒక హే ,కు రూ. .2500/-లు విలువుగల పోషకాలు అందించి తద్వారా అధిక దిగుబడులు సాధించేదిశగా ప్రయత్నము చేయబడుచున్నది.

బడ్జెటు : రూ.96.23 లక్షలు.

సమగ్ర పోషక యాజమాన్యము (INM)

నెల్లూరు జిల్లా నేలలలో 45.8 శాతం జింక్ లోపం, 33.0 శాతం ఇనుప ధాతు లోపం, 12.1 శాతం నేలలు లవణ భూములు, 20 శాతం క్షార భూములు వున్నాయి. పోషకలోపాలు వున్న భూముల్లో పోషకలిని నేరుగా భూమిలో వేయడం ద్వారా గాని పంటలపై పిచికారి చేయుట ద్వారా కానీ పంటలలో కనిపించిన ఈ పోషకాల లోపాలను సవరించవచ్చును.

ఉపయోగాలు
  • భూసారాన్ని మెరుగుపరచడం మరియు కాపాడటం.
  • అధిక ఎరువుల వాడకాన్ని తగ్గించడం.
  • పంట దిగుబడులను పెంచడం.
పధకం మార్గదర్శకాలు
  • జింక్ , బోరాన్ మరియు జిప్సం వంటి ద్వితీయ శ్రేణి పోషకాలను భూసార పరీక్ష ఫ్లితాల ఆధారంగా 100 శాతము రాయితితో రైతులకు ఆధార్ ఆధారముగా డి-కృషి యాప్ ద్వారా అందించబడుచున్నది.
  • జిప్సము వరి, వేరుశనగ పంటలకు భూమిలో 500కిలోలు హెక్టారుకు, చౌడునేలలను బాగుచేయడానికి 1000 కి హెక్టారుకు ఇవ్వబడును.
  • బోరాన్ పత్తి, వేరుశనగ పంటలకు భూమిలో వేసినట్లయితే హెక్త్రౌకు 2.5 కిలోలు మొక్కలపై పిచ్చికారు చేయడానికి 1.5 కిలోలు హెక్త్రౌకు ఇవ్వబడును.

2019-20 సం.లో సూక్ష్మ పోషకాల పంపిణీ లక్ష్యములు.

క్ర.సం. సూక్ష్మపోషకము లక్ష్యము (టన్నులలో)
1 జింకుసల్ఫేటు 318
2 జిప్సము 4000
3 బోరాన్ 5.0

 

విత్తనాలు

విత్తనపంపిణి పధకము- లక్ష్యములు
  • వ్యవసాయ ఉత్పత్తి పెంచుటకు విత్తనాలు ముఖ్య నిర్ణయాత్మక సాధనాలు.
  • ఆహారోత్పత్తి, ఉత్పాదకత పెంచుటకు రైతులకు నాణ్యత గల విత్తనములను పంపిణీ చేయుట ఎంతో అవసరము.
  • ఎక్కువ విస్తీర్ణమును సాగుబడిక్రిందికి తెచ్చుటకు దృవీకరించిన లేదా నాణ్యతగల విత్తనాలను రైతులకు తక్కువ ధరలో ఎక్కవ పరిమాణంలో పంపిణీ చేయవలెను.
  • సబ్సిడీలో ఇచ్చే విత్తనాలను నోడల్ ఏజెన్సీ అయిన APSSDC ద్వారా రైతులకు సరఫరా చేయబడుచున్నవి.
  • మొక్కజొన్న, జొన్న, సజ్జ విత్తనాలను 50శాతము సబ్సిడీపై లేదా క్వింటాలకు రు..2500 /- మించకుండా రైతులకు సరఫరా చేయడం జరుగుతున్నది.
  • విత్తన పంపిణీ పారదర్శకత కోసంబయోమెట్రిక్ విధానములో చేయబడుచున్నది.

2019-20 సం.లో విత్తన పంపిణీ లక్ష్యములు.

క్ర.సం. పంటపేరు రకము ఖరీఫ్ (క్వి.) రబీ (క్వి.) మొత్తము (క్వి.)
1 వరి BPT 5204 300 1000 1300
    NLR 34449 1000 5000 6000
    NLR 33892 300   300
    RNR15048   1000 1000
    MTU 1156   500 500
  మొత్తము   1600 7500 9100
2 కంది LRG-41 20   20
3 మినుము PU-31   500 500
    LBG 752 200 200 400
  మొత్తము   200 700 900
4 పెసర IPM2-14 25 300 325
5 శనగ JG-11   9500 9500
    KAK-2   2500 2500
  మొత్తము     12000 12000
6 వేరుశనగ K-6 100   100
  మొత్తము   1945 20500 22445

 

పచ్చిరొట్టఎరువులు
    • భూసార పరిరక్షణకు పచ్చిరొట్ట ఎరువులు ఒకటే సరియైన మార్గము.తద్వారా రసాయినిక ఎరువుల వాడకాన్ని తగ్గించుట మానవుల ఆరోగ్యాన్ని పరిరక్షించుట.
    • 2019-20 సంవత్సరములో 21000 క్వింటాళ్ళ పచ్చిరొట్ట విత్తనాలు సరఫరా 75శాతము సబ్సిడీపై రైతులకు అందించాలని లక్ష్యముగా పెట్టుకొని అందించబడుచున్నది.
క్ర.సం. పచ్చిరొట్టపైరు లక్ష్యము (క్వి..లలో)
1 జీలుగ 10000
2 జనుము 2000
3 పిల్లిపెసర 9000

గ్రమవిత్తనకార్యక్రమము

గ్రమవిత్తనకార్యక్రమము నాణ్యమైన ప్రకటించిన రకాల విత్తనాలను రైతులకు సరియైన సమయములో తక్కువ ధరలకు పంపిణీ చేయుటకు ఉద్దేశించబడినది.

పధక మార్గదర్శకాలు

  • ఫౌండేషన్ విత్తనాలు 50 శాతము రాయితీతో, పప్పుధాన్యాలు 60 50శాతము రాయితీతో పంపిణీ చేయబడుచున్నది.
  • ఈకార్యక్రమమును 10 ఎకరాలలో కనీసం 25 మంది రైతులతో వుండాలి మరియు గ్రమములో పండించే ముఖ్యమైన పంటను ఎన్నుకోవాలి.
  • రైతులకు విత్తనాల ఉత్పత్తి సాంకేతికతపై ఒక్కరోజు శిక్షణా కార్యక్రమములు మూడు సార్లు ఇవ్వబడును.
  • 2019-20 సంవత్సరములో ఖరీఫ్ సీజనులో బి‌పి‌టి5204 వరి రకము 6 యూనిట్లకు సరిపడా 45 క్వి,, సరఫరా చేయబడును.

 

పొలంబడి

చీడపీడల నియంత్రణకు రసాయినిక పురుగు మందుల వినియోగం నానాటికీ పెరుగుతున్నందున సాగు ఖర్చు నాసిరకం ఉత్పత్తులు పెరగడానికి దారి తీస్తున్నది. దీనిపై రైతులకు శిక్షణ ఇవ్వటానికి ‘పొలంబడి అనే పధకాన్ని రూపొందించటం జరిగినది.

లక్ష్యములు

  • ఆరోగ్యమైన పంటలు పెంచటం.
  • మిత్ర పురుగులను సంరక్షించడం. క్రమం తప్పకుండా పొలం పరిశీలించడం. రైతులను పంటల ఆవరణాన్ని అర్ధం చేసుకొని వారి వృత్తిలో నైపుణ్యం సంపాదించడం.
  • ఈ శిక్షణ పూర్తిగా క్షేత్రపరమైనది. రైతుల భాగస్వామ్యం వారి ఆవిష్కరణలపై ఆధారపడినది. అనగా “చేస్తూ నేర్చుకోవడం”.
  • ఈ శిక్షనను తన సొంత క్షేత్రములో శాస్త్రబోధన ఉద్దేశించబడినది. శిక్షణా ప్రణాళిక స్థానిక అవసరాలపై ఆధారపడును. రైతులే తమకు అవసరమైన, అర్ధవంతమైన విషయములను నిర్ణయిస్తారు.
  • పొలంబడి సైజు : 10 హెక్టర్లు. రైతుల సంఖ్య : 30 నెం.
  • 2019-20 సం.లో 14 పొలంబడులను వరి (8), వేరుశనగ (4), పొద్దుతిరుగుడు (2) పంటలలో నిర్వహించబడును.

 

వ్యవసాయ ఋణాలు

మన దేశ ఆర్ధిక వ్యవస్థలో ముఖ్యరంగమైన వ్యవసాయంలో వ్యవసాయోత్పత్తిని , ఉత్పాదకతను పెంచుటకు వ్యవసాయ ఋణాలు ప్రముఖపాత్ర వహిస్తాయి. ఇతర పెట్టుబడి సాధనాలతో పాటుగా వ్యవసాయాన్ని సుస్థిరం మరియు మరియు లాభదాయకం చేయుటకు వ్యవసాయ ఋణం ఎంతో ముఖ్యమైనది. చాలాకాలం వరకు వ్యవసాయ ఋణం ప్రేవేటు రుణదాతల చేతిలో వుండేది. కానీ వీరిచే ఋణం చాలినంతగా లేకపోవడం వలన రైతులపై ఎక్కువ భారం పడుట, రుణగ్రహీతల దోపిడీకి గురి అవ్వడం సాధారణముగా వుండేది.ఈ స్తితిని మార్చుటకు సహకార సంఘాలు, వ్యాపార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మొదలగు సంస్తలు ఏర్పరిచినవి. ఇవి సమయానికి తగినంత రుణమును తక్కువ వడ్డీకి రైతులకు అందించును.

లక్ష్యములు

1. పంట రుణాలు : 5215.21 కోట్లు.
2. ధీర్ఘకాలిక రుణాలు : 2266.49 కోట్లు.
మొత్తము : 7481.70 కోట్లు.

భూమి సాగు దారు (కౌలు రైతు) రైతులకు రుణాలు మంజూరు

ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది కౌలు రైతులు, ఎటువంటి లిఖితపూర్వకమైన ఒప్పందం లేకుండ భూమిని కౌలుకు తీసుకుంటారు.
కౌలు దారు రైతులకు న్యాయం చేయడానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము దేశంలోనే మొట్టమొదటిగా “ఆంధ్ర ప్రదేశ్ లాండ్ లైసెన్సు కల్తీవేటర్ల చట్టము, 2011 తేదీ.23.12.2011 న రూపొందించినది. ఈ చట్టంద్వార అర్హత కలిగిన సాగుదారు రైతులకు, ఋణ అర్హత (ఎల్‌ఈసిద) కార్డులను ప్రతి సంవత్సరము జారీ చేస్తున్నారు. ఈ ఋణ అర్హత కార్డులను సమర్పించుట ద్వారా వీరు ఆర్ధిక సంస్తల నుండి రుణం పొందుతుకు, ఇన్ పుట్ట్ సబ్సిడీ సౌకర్యాన్ని అందుకొనుటకు, పంటల బీమా చేయుటకు, పంట నష్ట పరిహారం పొందుటకు అర్హులు.

  • 2019-20 సంవత్సరానికి లక్ష్యం : 18924 మందిక

పంట దృవీకరణ పత్రములు (సర్టిఫికేట్ ఆఫ్ కల్టివేషన్)

రాష్ట్రంలో వున్న కౌలు రైతులందరు బ్యాంకుద్వార పంట రుణాలు పొందేటందుకు వీలుగా ఋణ అర్హత పత్రములతో పాటు పంట ధృవీకరణ పత్రములను (సర్టిఫికేట్ ఆఫ్ కల్టివేషన్) జారీ చేయుటకు వ్యవసాయ శాఖ 2016-17 సంవత్సరము నుండి ప్రారంభించినది.

వీటి ద్వారా బ్యాంకులు కౌలు రైతులకు ఎటువంటి తనఖా అవసరం లేకుండ రు.1లక్ష వరకు పంట దిగుబడిని తనఖా క్రింద తీసుకొని రుణాలు ముంజూరు చేస్తారు. దీని వలన కౌలు రైతులందరు పంట ఋణ సౌకర్యం పొందే వీలు కలుగుతుంది.

కౌలు రైతులకు పంట దృవీకరణ పాత్రలు (సర్టిఫికేట్ ఆఫ్ కల్టివేషన్) మార్గదర్శకాలను అనుసరించి జారీ చేయవలసిందిగా అన్ని జిల్లాల అధికారులను కోరడమైనది. కౌలు రైతులు పంట దృవీకరణ పత్రాలు (సర్టిఫికేట్ ఆఫ్ కల్టివేషన్) సమర్పించిన ఎడల బ్యాంకు రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ మరియు పంటల బీమా సదుపాయాన్ని పొందవచ్చు.

  • 2019-20 సంవత్సరానికి లక్ష్యం : 60000 మంది

ప్రధానమంత్ర ఫసల్ బీమా యోజన (PMFBY)

ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టం జరిగినపుడు రైతును ఆర్ధికంగా ఆదుకొనుటకు మరిన్ని రైతు స్నేహపూరితమైన ప్రయోజనాలు జోడించి భారత ప్రభుత్వము “ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY)పేరుతో పంటల బీమా పధకాన్ని ప్రవేశపెట్టినది.

ఈ పధకంలోని ప్రధాన అంశాలు

  • రైతు స్నేహపూరిత ప్రాధాన్యంగా అత్యల్ప ప్రీమియం రైతు నుండి స్వీకరించబడును.
  • ప్రధాన పంట వరి గ్రమము యూనిట్ గా అమలు చేయబడును.
  • ఆహార పంటలు మరియు నూనె గింజల పంటలకు రైతు కట్టవలసిన పిమియమ్ ఖరీఫ్ 2%, రబీలో 1.5% మాత్రమే.సంవత్సరీక మరియు వాణిజ్య పంటలకు రైతు కట్టవలసిన పిమియమ్ అత్యధికంగా 5% మాత్రమే.
  • రైతు కట్టగా మిగిలిన మొత్తం పిమియంను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయి.
  • పంట విస్తీర్ణం / దిగుబడి అంచనా వేసి తద్వారా బీమా పరిహారం చెల్లించుటకు అభివృద్ధిచేసిన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించబడును.
  • పంట మధ్య కాలంలో నష్టపోయిన యెడల అంచనా వేసిన పరిహారంలో 25% రైతుకు ముoదస్తుగా చెల్లించబడును. మిగిలిన పరిహారం పంట కోతల అనంతరం చెల్లించబడుతుంది.

YSR ఉచిత పంటల బీమా

  • రైతులపై ఎటువంటి ఆర్ధిక భారము పడకుండా “YSR ఉచిత పంటల బీమా” ద్వారా ఈ ఖరీఫ్ 2019 నుండి రైతులందరి తరపున పంటల బీమా పిమియమ్ రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించినది.
  • ఈ‌ సీజనులో ఇప్పటికే బీమా పిమియమ్ చెల్లించిన రైతులకు కూడా వారు చెల్లించిన ప్రీమియం ప్రభుత్వము వారి బ్యాంకు ఖాతాలకు తిరిగి చెల్లిస్తుంది.
  • ప్రభుత్వము నోటిఫై చేసిన పంటలకు ఒక రూపాయి నమోదు కొరకు చెల్లించి నిర్దేశించిన గడువులోగా రైతులు తమ పంటలకు బీమా చేసుకొనుటకు ఈ ప్రభుత్వము వీలు కల్పించినది.ఈ ఉచిత బీమా పధకం అమలుకు కావల్సిన అదనపు ఆర్ధిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వము భరించడానికి తగు ఆదేశాలు జారీ చేయడం జరిగినది.
  • దిగుబడి నష్టంపై ఆధారపడి విత్తినప్పటి నుండి పంట కోతవరకు కలిగే దిగుబడి నష్టాలకు పరిగణలోనికి తీసుకొని బీమా పరిహారం చెల్లించబడుతుంది.
  • పంట రుణాలు తీసుకొని రైతులు నాన్ లోనీలుగా స్వచందంగా ఈ పధకంలో నమోదు కావచ్చు.
  • రుణాలు పొందని రైతులు , కౌలు రైతులు, ఎంపిక చేసిన పంటలను సాగుచేస్తే నిర్ణీత గడువు తేదీలోగా బీమా చేయు నిమిత్తము దగ్గరలోని కామన్ సర్వీసు కేంద్రములలో (CSC) సంభందిత డాక్యుమెంటలతో ఒక రూపాయి చెల్లించి ఉచితంగా చేరవచ్చును.

ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన(PM-KMY)

  • ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన దేశంలోని సొంత భూమి కలిగివున్న చిన్న మరియు సన్న్ కారు రైతులకు సామాజిక భద్రత కల్పించడం కొరకు ప్రరం భించడమైనది.
  • రైతులు పొదుపు చేయకపోవడం లేదా తక్కువ మొత్తంలో పొదుపు వుండటంవల్ల వృద్దాప్యానికి చేరుకున్నపుడు వారికి జీవనాధారం వుండదు. కావున వారికి ఈ పెన్షన్ ద్వారా ఆర్ధిక చేయూత కల్పించడం జరుగుతుంది.
  • ఈ పధకం క్రిండ అర్హత కలిగిన చిన్న మరియు స్న్న కారు రైతులందరికి 60 సం. నుండిన తరుయాత నెలకు రు.3000/- స్థిర పెన్షన్ ఇవ్వబడుతుంది.
  • 18-40 సం. ల మధ్య వయసుగల చిన్న మరియు సన్న కారు రైతులు ఈ పధకంలో చేరి వయస్సును బట్టి 60 సంవత్సరముల వరకు నెలకు 55 రూపాయల నుండి 200 రూపాయల వరకు ప్రిమయం చెల్లించాలి.
  • ఈ పధకం లో రైతులు ఉచితంగా నమోదు చేయబడతారు. కావున కామన్ సర్వీసు కేంద్రములలో (CSC) రైతులు ఎటువంటి చెల్లింపు చేయకుండానే నమోదు చేసుకొనవచ్చును.

YSR రైతు భరోసా

 

వ్యవసాయ యాంత్రకరణ

  • వ్యవసాయ క్షేత్ర పనులలో పశువుల మరియు మనుష్యుల యొక్క సామర్ధ్యానికి ప్రత్యామ్నాయంగా యంత్రపరికరాలను అభివృద్ధిపరచి వాటిని వినియోగించుట.
  • వ్యవసాయ యాంత్రకరణ మానవుల, దుక్కితేద్దుల కష్టాన్ని త్గ్గించడం, పంటలు వేసే తోవ్రతను పెంచడం, వివిధ పంటల ఉత్పాదకాల వినియోగ సమర్ధతను మదింపుచేయడం,కాల వ్యవధులలో ఖచ్చితత్వం, పంట ఉత్పత్తిలో వివిధ దశలలో నష్టాలను తగ్గించడంలో వ్యవసాయ పనిముట్ల వాడకం జరుగును. తక్కువ ఉత్పత్తి వ్యయంతో ఉత్పాదకత ఉత్పత్తిని పెంచడం వ్యవసాయ యాంత్రికరణ అంతిమ లక్ష్యం.
  • వ్యవసాయ యాంత్రకరణ వ్యవసాయ మరియు అనుభంధ ఉత్పత్తుల యొక్క లక్షణాత్మక మరియు గుణాత్మక విలువల యొక్క నష్టాన్ని తగ్గిస్తుంది.
  • వ్యవసాయ యాంత్రకరణ అభివృద్ధి అన్ని ప్రంతములలో సమానంగా లేదు. కారణాలు ఏమనగా ఎక్కువ వ్యవసాయ కమతాలు, చిన్నకారు రైతులలో వ్యవసాయ పనిముట్ల పట్ల అవగాహనా రాహిత్యము మరియు మెట్టప్రంత వ్యవసాయం.
  • నెల్లూరు జిల్లాలో వ్యవసాయ విధ్యుత్ లభ్యత 2.43కిలోవాట్ లు . దీనిని మెరుగుపరచడానికి యంత్రాలును సబ్సిడీలో రైతులకు అందించుటకు మరియు ఆర్ధికంగా వెనుకబడి వున్న ప్రంతాలపై మరింత కేంద్రీకరణ ద్వారా మెరుగుపరచవచ్చు.

నిధుల సమీకరణ

రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక (SDP) :

వ్యక్తిగత రైతులకు వ్యక్తిగత పనిముట్లు/ఉపకరణాలు సరఫరా చేయడం ఉద్దేశ్యముగా వుండి. ఈ పధకం పంటల నిర్వహణలో ఏకైక నిర్వహణకు వీలు కల్పిస్తుంది.

2019-20 సం. లో బద్జేట్ కేటాయింపు : రు.110 లక్షలు.

రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (RKVY):

రైతుల సమూహానికి (రైతు మిత్రబృందాలు/ ఉమ్మడి బాధ్యత బృందాలు మొదలగు పంట ఆధారిత యంత్ర పరికరాల సమూహాన్ని సరఫరా చేయడమనేది 60:40 (కేంద్రం:రాష్ట్రమ్) నిధులను అందించే విధానంలో పధకం ఉద్దేశ్యం వుంది.

2019-20 సం. లో బద్జేట్ కేటాయింపు : రు.128.60 లక్షలు.

వ్యవసాయ యాంత్రకరణపై సబ్ మిషన్ (SMAM):

వ్యవసాయ యంత్రముల సరఫరా కోసం 60:40 (కేంద్రం:రాష్ట్రమ్) నిధులతో యంత్ర పరికరములను రైతులకు అందించబడును.

2019-20 సం. లో బద్జేట్ కేటాయింపు : రు.128.60 లక్షలు.

వ్యవసాయ యాంత్రికరణలో అధిక మొత్తములో నిధులు ఇమిడియున్నందున పధకం అమలులో పారదర్శకతకు అధిక ప్రముఖ్యతను ఇవ్వడమైనది. దరఖాస్తును అందుకొనుట మొదలుకొని పరికరాల పంపిణీ వరకు తక్షణ, పారదర్శక లావాదేవీ వుండేలా చూడటానికి గడచిన రెండు సంవత్సరాల నుండి మీ సేవ ద్వారా ఆన్ లైన్ అప్లికేషన్ విధానాన్ని అనుసరించడం అనేది అత్యంత విజయవంతమైంది.

వెబ్ సైట్: www. agrimachinery.nic.in

అద్దెయంత్ర కేంద్రములు (CHC)

వ్యవసాయ యాంత్రకారణ సబ్సిడీ పధకాల క్రింద ఖరారు చేసిన పరికరాలు భూమిని సిద్దం చేయడం మొదలుకొని పంట, పంట అనంతర దశ వరకు ఈ క్రింది విధంగా రైతులకు ఉపయుక్తముగా వుంటాయి.

  1.  SMSRI ప్యాకేజీ: వరి నాటు యంత్రములు
  2. 4 వాకర్ వరి నారు యంత్రము లేదా 6 వరుసలు.
  3.  మొక్కజొన్న యంత్ర ముల ప్యాకేజీ.
  4.  వేరుశనగ యంత్ర ముల ప్యాకేజీ.
  5.  కోత యంత్రముల ప్యాకేజీ.

ప్రధానమంత్ర కృషి శించాయి యోజన (PMKSY)

ఉద్దేశ్యం

వర్షాధారిత వ్యవసాయ ప్రాంతాలలో నెలలో టెమ్ శాతం మెరుగు పరచడం.
వర్షపు నీటిని నిల్వ చేయడానికి కట్టడాలు నిర్మించి తద్వారా పంట పెరుగుదలలో క్లిష్టమైన దశల్లో సాగు నీరు అందించడం.
వర్షపు నీటి వృధాను నివారించడం , సాగు ఖర్చు తగ్గించడం ద్వారా పంట దిగుబడి పెంచి తద్వారా వర్షాధార ప్రాంత రైతుల స్థితి గతులు మెరుగు పరచపరచవలెను.
ఈ పధకము ద్వారా రైతులకు నీటి సరఫరా గొట్టాలు, కరెంటు మోటర్లు, ఆయిల్ ఇంజన్లు సబ్సిడీపై అందించబడును.

2019-20 సం. లో బద్జేట్ కేటాయింపు : రు.750 లక్షలు.

జాతీయ ఆహార భద్రత మిషన్ (NFSM)

ఈ పధకం భారత ప్రభుత్వముచే 11 వ పంచవర్ష ప్రణాళిక నుండి ప్రరంభించ బడి 12 వ పంచవర్ష ప్రణాళికలో కూడా కొనసాగించబడినది.

ప్రధాన అంశములు

  • తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి మరియు అధిక ఉత్పాదకత సాధించడానికి సముదాయ ప్రదర్శ నా క్షేత్రములను ఏర్పాటు చేయుట, ప్రo తాలకు అనుగుణంగా పంటల క్రమము ఆధారంగా ప్రదర్శనా క్షేత్రములను నిర్వహించుట.
  • ప్రదర్శనా క్షేత్రముల నిర్వహణకు కావలసిన ఉపకరణములు, జీవ కారకాలు, జీవ ఎరువులు మరియు జీవ పురుగు మందులను ప్రొత్సహించుట.
  • వ్యవసాయ పరికరాలను రాయితీతో సరఫరా చేయడం.
  • పరిమితమైన నీటి వనరులను, సమర్ధవంతంగా వినియోగించుట కొరకు, నీరు ఆదా చేయు పరికరాలైన తుంపర మరియు నీటి సరఫరా గొట్టాలను మరియు చమురు యంత్రములను రాయితితో సరఫరా చేయడం.
  • రైతులకు పంటల క్రమము ఆధారముగా శిక్షణా తరగతులను ఖరీఫ్ మరియు రబీలో నిర్వహించడం.
  • 2019-20 సం. లో బద్జేట్ కేటాయింపు : రు.78.61 లక్షలు.

నూనె గింజలు జాతీయ మిషన్(NFSM-OILSEEDS)

  • ఈ పధకం నూనె గింజలు వంటనూనెల ఉత్పత్తి పెంపుదలకు ఉద్దేశించినది.
  • IPM/INM సూక్ష్మసేద్యము మరియు ఉత్పత్తి/సంరక్షణాల నూతన సాంకేతికతను ప్రదర్శించుచు FLD/ప్రదర్శనల ద్వారా రైతుల పొలము నందు సమగ్ర పంటలను ఎక్కువ విస్తర్ణములో నిర్వహించుట.
  • ఆధునిక క్షేత్ర సాధనాల /పరికరాల పంపిణీ ద్వారా వ్యవసాయ యాంత్రకరణను అభివృద్ధి చేయుట.
  • పొలంబడి(FFS) తో పాటు అంతర్గత శిక్షణల ద్వారా రైతుల, విస్తరణ కార్యకర్తల సామర్ధ్యాన్నిపెంచుట.
  • 2019-20 సం. లో బద్జేట్ కేటాయింపు : రు.30.29 లక్షలు.

ప్రకృతి వైపరీత్యములు

ప్రకృతి వైపరీత్యములు విభాగము, ప్రకృతి వైపరీత్యములైన తుఫాను , భారీ వర్షములు, వరదలు, అకాల వర్షములు, కరువు , వడగండ్ల వాన, అగ్ని, భూకంపము మరియు పిడుగు వలన నష్టపోయిన వ్యవసాయ పంటలకు సంభం ధించినది.

ఉద్దేశ్యం

  • ప్రకృతి వైపరిత్యముల వలన 33% కంటే ఎక్కువ నష్ట పోయిన రైతులకు త్వరితగతిన పెట్టుబడి రాయితీ అందించడం.
  • వర్షాభావ పరిస్తితులకు ఆకస్మిక ప్రణాళిక చేయడం.
  • ప్రకృతి వైపరీత్యములు సంభవించిన వెంటనే వ్యవసాయ శాస్త్రవేత్తలతో కూడిన వ్యవసాయ అధికారుల బృందము పంట నష్టపోయిన పొలాలను పర్యటించి పంట నష్ట తీవ్రతను అంచనా వేసి రైతులకు తగు సాంకేతిక సూచనులు ఇవ్వడం జరుగుతుంది.
  • కరువుకు సంబంధించి కరువు మండలాలను అంచనా వేయడము కోసం వివిధ ప్రమాణాలైన వర్షపాత వివరములు, దీర్ఘకాల పొడి వాతావరణ వివరములు, పంట విస్తీర్ణ వివరములు మరియు 33% కంటే నష్ట పోయిన వివరాలను జిల్లా కలెక్టర్ల ద్వారా జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు నుండి సేకరించడం జరుగుతుంది.
  • పంట నష్ట వివరాలను 26 నిలువు గడులు కలిగిన పట్టికలో పొందుపరచి పెట్టుబడి రాయితీ విడుదల కోసం ప్రభుత్వానికి సమపృంచడం జరుగుతుంది.
  • ప్రభుత్వము నుండి పెట్టుబడి రాయితీ విడుదలైన తరువాత జిల్లా అధికారుల ద్వారా రైతుల ఖాతాలలోకి నేరుగా జమ చయటం జరుగుతుంది.

రైతు శిక్షణా కేంద్రము

  • రైతు శిక్షణ కేంద్రము ద్వారా శిక్షణ కార్యక్రమములు,వర్క్ షాపులు, చర్చలు మొదలగు వాటి ద్వారా నూతన సాంకేతికత పరిజ్ఞాములో శిక్షణ ఇవ్వబడును.
  • రైతులకు అవసరమైన విజ్ఞానాన్ని అందించుచు, వ్యవసాయములో సత్ఫలితాలు సాధించుటలో రైతు శిక్షణ కేంద్రము కృషి చేయుచున్నది.
  • ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమును కరపత్రములు తెలుగులో అచ్చువేసి రైతులకు అందించబడుచున్నది.
  • దూరదర్శన్ , ఆల్ ఇండియా రేడియోలకు వ్యవసాయానికి సంబంధించిన సమాచారాన్ని ప్రచారము చేయుచున్నది.
  • వ్యవసాయ ప్రదర్శనల నిర్వహణ, స్వతంత్ర దినోత్సవము, గణతంత్ర దినోత్సవములకు సంభంధించిన శకటములు ఏర్పాటు చేయుట.
  • 2019-20 సం. లో బద్జేట్ కేటాయింపు : రు.13.50లక్షలు.

వర్షాధార ప్రంత అభివృద్ధి (RAD)

ప్రభుత్వము వర్షాధార ప్రంతములను అభివృద్ది పరచుటకు లభ్యమైన ప్రకృతి వనరులను ఎక్కువుగా ఉపయోగించుకొనుచు సుస్తిర పద్ధతిలో రైతులకు జీవనోపాధిని, ఆర్ధిక స్టిరాత్వాన్ని అందించవలననే దిశగా కృషి చేస్తోంది.

ఆచరణ పద్దతి

  • వర్షాధార ప్రంత అభివృద్ధి ప్రణాళికను అమలు చేయుటకు షుమారు 100 హే.. ప్రంతమును 1 లేక 2 గ్రమమూలకు చెందినదిగా వుండాలి.
  • ఈ పధకము ద్వారా సాగుబడి చేయు భాగాన్ని ఎన్నుకొని అన్నీ వనరులను ఉపయోగించుచు పాడి పరిశ్రమ, వాన సమ్ర్క్షన, అడవులలో పచ్చిక బయళ్ళు ఉన్న ప్రంతము మొ. ఇతర వనరులను రాబడి పెంచుకొనే చర్యలను ఉపయోగించవలెను.
  • గ్రమము యొక్క సామాజిక, సంస్కృతిక పోలికలను బట్టి ప్రత్యేకమైన సమగ్ర వ్యవసాయ పద్ధతిని ఒక గ్రమసమూహములో అనుసరించవలెను.
  • భూమిని, నీటిని సంరంక్షించుకొను కార్యక్రమములు ఉదా: కాంటూరు బండింగు, టెర్రసింగ్, కాంటూరు ట్రెంచింగు, నాలా బండ్స్ మొ,ఎల్‌జి కార్యక్రమములు సబ్సిడీపై చెపట్టబడుచున్నవి.
  • పంట ఆధారిత సాగుబడి పద్ధతి, వన సంరక్షణ ఆధారిత సాగుబడి పద్ధతి, అటవీ పచ్చిక బయళ్ళు, పశుగ్రాసము అభివృద్ధి, కూరగాయు, పూలతోటలు మొ.నావి సమగ్ర సాగుబడి క్రింద దాణా నిలవ గుంటలు పశుగ్రాసముల అభివృద్ధి చేపట్టుట.
  • ఎక్కువ లాభములు చేకూర్చు కార్యక్రమములలో గదేలు, గిడ్డంగులు వసతులు కూడా చేర్చబడినవి.
  • నీటిని సమర్ధంగా ఉపయోగించుటకు 25% సాగుబడి విస్తీర్ణాన్ని సూక్ష్మ నీటి సేద్యం, బిందు సేద్యము మరియు స్ప్రింకర్ల ద్వారా చేసే వ్యవసాయాన్ని ప్రోత్సహించుట.
  • 2019-20 సం. లో బద్జేట్ కేటాయింపు : రు.208.41లక్షలు.

భూసార పరీక్ష కేంద్రము

  • నెల్లూరు లోని భూసార పరీక్ష కేంద్రములో ప్రభుత్వ పధకము అమలుచేస్తున్న గ్రమములనుండి సేకరించిన మట్టినమూనాలను మరియు నేరుగా రైతులు తీసికొని వచ్చిన మట్టి మరియు నీటి నమూనాలను పరీక్షించుట.
  • పరీక్షించిన పిదప సాయిల్ హెల్త్ కార్డుల ముద్ర వేయించి భూసారా పరిక్ష ఫలితాల ఆధారముగా ఎరువుల మోతాదులను రికమెండ్ చేసి సూచనలు ఇవ్వబడును.
  • విశ్లేషానంతరము ఫలితాలను ఆన్లైనులో అగ్రిస్నేట్ పోర్టల్ మరియు ఎన్ఇసి పోర్టల్ పెట్టబడును.
  • విశ్లేషానంతరము ఫలితాలను ఎస్.ఎమ్.ఎస్ ల ద్వారా రైతుల మొబైల్ ఫోన్ లకు తెలుగులో పంపించబడును.
  • విత్తనాలు నాటుటకు ముందుగానే రైతులకు కార్డులు పంపిణీచేయబడును.
  • భూసార స్తితిని గూర్చి అవగాహన సదస్సులను గ్రమ స్తాయిలో ఏర్పాటుచేయుట.
  • విశ్లేషణ ఆధారముగా తగినంత పరిమాణములో సూక్ష్మ పోషకాలు 100% సబ్సిడీపై రైతులకు అందించబడును.

జీవ నియంత్రణ ప్రయోగశాల

  • నెల్లూరు జిల్లాలో పండించే పంటలలో వరి, వేరుశనగ, అపరాలు, కంది, శనగ ముఖ్యమైనవి. రైతులు పంటలను పురుగులు, తెగుళ్లు బారి నుండి కాపాడుటకు సస్యరక్షణకు పెట్టె ఖర్చులు అధికమై దిగుబడులు తగ్గి ఆర్ధికముగా బాగా నష్టపోతున్నారు.
  • విచక్షణా రహితముగా పురుగు మందులు వాడుట వలన పురుగులు రోగ నిరోధక శక్తిని పెంచుకొని ఏమందులకు లొంగకుండా వున్నవి.
  • రైతులకు మేలు చేసే బదనికలు (మిత్రపురుగులు) పొలములలో అంతరించి పోతున్నాయి మరియు వాతావరణం, ఆహారము, నీరు కలుషితమవుతున్నవి.
  • ఈ పరిస్తిని అదుపు చేయుటకు మరియు మిత్రపురుగులను రక్షించి వృద్ధిచేయుటకు జీవనియంత్రణా ప్రయోగశాల, 1999లో ఏర్పాటు చేయబడినది.
  • జీవనియంత్రణ అనగా ఒక జీవిని ఉపయోగించి మనకు నష్టాన్ని కలిగించు మరొక జీవిని నసింపచేయుట. ఈ ప్రయోగ శాలలో ట్రయికొడెర్మవిరిడి, ట్రయికోగ్రమా గ్రడ్డుపరాన్నజీవి మరియు సుడోమోనాస్ తయారు చేయుచున్నారు.

1. ట్రయికోగ్రమా గ్రడ్డుపరాన్నజీవి:

ఈ పరాన్న జీవి వారిని ఆశించు ఆకుముడత, కాండము తొలుచు పురుగు గ్రడ్లలో తన గ్రడ్లను పెట్టి ఆ గ్రడ్లను నాశనము చేస్తుంది. ఈ కార్డును చిన్న చిన్న ముక్కలుగా చేసి పొలంలో అన్నీ దిశలలో ఆకు అడుగు భాగములో ఎండ తగలకుండా కుట్టాలి. ఈ పరాన్నజీవులు ఉదయం పుట గ్రడ్లనుండి వచ్చి పోలమంత వ్యాపించును. ఒక కార్డు ఖరీదు : రు.40/-లు

2. ట్రయికోడెర్మావిరిడి:

పండించే చాలా పంటలలో వేరుకుళ్ళు, మాగుడు తెగులు, ఎండు తెగులు ఆశించి విపరీత నష్టాన్ని కలుగ చేస్తున్నాయి. వీటి నివారణకు విత్తన శుద్దిగా ఒక కిలో విత్తనానికి 4-10గ్ర. మందును 10మీ.లీ నీటిలో కలిపి విత్తన శుద్ది చేయాలి. దీనిని భూమిలో వేయవచ్చును మరియు పైరుపై పిచికారి చేయవచ్చును. ఒక కిలో ఖరీదు : రు.100/-లు

3. సుడోమొనస్ ఫ్లోరెసెన్స్:

ఈ బాక్టీరియా వరి, వేరుశనగ, కూరగాయలు, పండ్ల తోటలలో నెల మరియు విత్తనము ద్వారా వచ్చే అగ్గి తెగులు, పొడతెగులు, మాగుడుతెగుళ్లను అరికడుతుంది. విత్తన శుద్ధిగా 6-8 గ్ర. కిలో విత్తనానికి పట్టించి శుద్దిచేయాలి. ఒక ఎకరానికి 2 కి. మందును 90 కిలోల పశువుల ఎరువుతో కలిపి భూమిలో చల్లి వాడవలెను.

ఒక కిలో ఖరీదు : రు.150/-లు

 

 

d) పరిచయము

Joint Director of Agriculture, Nellore
Mobile No : 8886614211
Mail Id : jdanellore[at]gmail[dot]com
Call Centre No : 1800 425 3363

 

Mandal Agricultural Officers, SPSR Nellore District

క్రమసంఖ్య వ్యవసాయ అధికారి పేరు MANDAL NAME MOBILE NUMBER
1 టి.రజని ఏ.ఎస్.పేట 8886613692
2 జి.మధురిమ అనంతసాగరం 88866 13693
3 సిహెచ్.సుబ్బాయమ్మ అల్లూరు 8886613683
4 ఎస్.ప్రసాద్ రావు ఆత్మకూరు 88866 13691
5 పి.శిరీష బాలాయపల్లి 88866 13639
6 ఎస్.విజయలక్ష్మి బోగోలు 88866 13681
7 ఎన్.సురేంద్రరెడ్డి బుచ్చిరెడ్డి పాలెం 88866 13688
8 వి.శశిధర్ చేజర్ల 88866 13703
9 జి.భవాని చిల్లకూరు 88866 13709
10 వి.నిరంజన్ కుమార్ చిట్టమూరు 88866 13715
11 వయ్.రాధ దగదర్తి 88866 13682
12 పి.సుజాత డక్కిలి 88866 13640
13 ఎస్.ఎన్.కాంచన దొరవారిసత్రం 88866 13674
14 VACANT, MAO దుత్తలూరు 88866 13720
15 ఎస్.వి.నాగమోహన్ గూడూరు 88866 13707
16 ఆర్.దేవప్రసాద్ ఇందుకూరుపేట 88866 13698
17 బి.శైలజ జలదంకి 88866 13679
18 ఎమ్.సురేష్ బాబు కలిగిరి 88866 13677
19 బి.శ్రీదేవి కలువాయి 88866 13704
20 సిహెచ్.శ్రీనివాసులు కావలి 88866 13680
21 సి.హెచ్. కొడవలూరు 88866 13686
22 Vacant, MAO కొండాపురం 88866 13678
23 ఎన్.సుచేంద్రప్రసాద్ కోట 88866 13717
24 జి.ఇంధీరవతి కోవూరు 88866 13685
25 ఎస్.కె.జహీర్ మనుబోలు 88866 13708
26 పి.శ్రీధర్ రెడ్డి మర్రిపాడు 88866 13675
27 డి.హరికరుణాకర్ మూత్తుకూరు 88866 13701
28 ఈ.ఎస్.వరప్రసాద్ నాయుడుపేట 88866 13713
29 బి.శ్రీనివాసచక్రవర్తి నెల్లూరు 88866 13695
30 వి.రమేష్ ఓజిలి 88866 13710
31 జి.ప్రవీణ పెళ్ళకూరు 88866 13714
32 ఏ.వాసు పొదలకూరు 88866 13702
33 వి.ప్రతాప్ రాపూరు 88866 13705
34 ఎన్.శ్రీహరి సంగం 88866 13689
35 వి.అశోక్ సీతారామపురం 88866 13671
36 ఎన్.కవిత సూళ్ళూరుపేట 88866 13719
37 పి.హైమవతి సైదాపురం 88866 13642
38 ఏ.జ్యోతిర్మయి తడ 88866 13721
39 యు.గీతకుమారి తోటపల్లిగూడూరు 88866 13700
40 పి.చెన్నారెడ్డి ఉదయగిరి 88866 13672
41 ఎన్.శ్రీహరినారాయణ వరికుంటపాడు 88866 13673
42 సి.హెచ్.విజయభారతి వాకాడు 88866 13716
43 సి.హెచ్.మంజుల వెంకటాచలం 88866 13696
44 టి.విజయలక్ష్మి వెంకటగిరి 88866 13638
45 పి.వెంకటకృష్ణయ్య విడవలూరు 88866 13687
46 కె.కిశోర్ బాబు వింజమూరు 88866 13676

 

e)IMPORTANT WEBSITE LINKS :

Statement showing the Website Address

క్రమసంఖ్య వివరణ Website URL
1 ఈ – సీడ్ https://eseed.ap.gov.in/eseed/
2 ఈ – రైతు సేవలు http://103.210.73.16/OLMS/
3 రైతు కొరకు https://farmer.gov.in/
4 వారం నివేదికలు http://www.apagrisnet.gov.in/weekly_report.php
5 వ్యవసాయ యాంత్రీకరణలో ప్రత్యక్ష నగదు బదిలీ https://www.agrimachinery.nic.in/
6 వాతావరణ నివేదికలు https://isro.vassarlabs.com/forecast
7 ఋణ అర్హత పత్రం http://lecagri.ap.gov.in/LEC/?rvn=1
8 వ్యవసాయ యంత్రికరణ http://www.apagrisnet.gov.in/farm2018-19.php
9 ఏం.పి.ఈ.వో మూల్యాంకనం http://103.210.73.133/Services/
10 వ్యవసాయ పంచాంగం http://www.apagrisnet.gov.in/panchangam.php
11 ఈ – పంట http://103.210.72.120/epantarabi/
12 ఆమ్నేక్స్ https://apagri.infinium.management/GIS_AP/app/map_ds_ol.jsp
13 శాట్షూర్ https://ap.satsure.co/
14 ఏపీ వ్రీమ్స్ http://apwrims.ap.gov.in/
15 ఆర్.కె.వి.వయ్ http://www.apagrisnet.gov.in/rkvy.php
16 గ్రామ కార్యాచరణ ప్రణాళిక http://103.210.75.132/vap/
17 వ్యవసాయ సాగు పత్రము http://103.210.75.132/COC/CultivationCert.php
18 పాడి పంటలు http://www.apagrisnet.gov.in/padipantalu.php
19 భూసార విశ్లేషణ పత్రము https://soilhealth.dac.gov.in/
20 ఏ.సి.జెడ్. విశ్లేషణ http://34.208.164.85/cropsown/district/state/Andhra%20Pradesh/Total%202016-17/ALL/ALL