ముగించు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్

ఎ) శాఖ / సంస్థ గురించి పరిచయం:

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మైనారిటీస్ ఆర్ధిక సంస్థ 1985 సంవత్సరము జనవరి 19 వ తేదిన కంపెనీల చట్టం క్రింద రాష్ట్ర ప్రభుత్వం చే స్థాపించబడినది. ఈ సంస్థ మన రాష్ట్రం లోని సాంఘీకముగా, ఆర్ధికముగా, వెనుకబడిన మైనారిటీస్ అయిన ముస్లిములు, క్రిస్టియన్లు, పార్శికులు, సిక్కులు, భౌద్ధులు మరియు జైనులు మొదలగు వారికి అర్దికాభివ్రుద్దికి తోడ్పడే ముఖ్యఉద్దేశ్యముతో స్థాపించబడినది. 2011 జనాభా లెక్కల ప్రకారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మొత్తం జనాభా 29,63,557 ఇందులో మైనారిటీ జనాభా 3,18,107 (ముస్లింలు-2,88,378, క్రైస్తవులు-26,202, సిక్కులు-678, భౌద్ధులు-239 మరియు జైనులు-2,610).

 

బి) ఆర్గనైజేషన్ చార్ట్ :

MFC

సి) పధకాలు / కార్యకలాపాలు / కార్యాచరణ ప్రణాళిక :

1) బ్యాంకు లింకేడ్ సబ్సిడీ పధకము :

మైనారిటీస్ వర్గాల వారికి బ్యాంకుల ద్వార సబ్సిడీతో ఋణ సదుపాయం కల్పించట జరుగును. వారు వివిధ ఉపాధి పధకాలు ఎర్పాటు చేసుకొనుటకు వారు పొందే ఆర్ధిక సహాయంలో 50 శాతం సబ్సిడీ లేదా గరిష్టంగా రూ.1,00,000/-లకు మించకుండా సబ్సిడీ ఇవ్వటం జరుగుతుంది.

2) శిక్షణ మరియు ఉపాది పధకము :

ఈ పధకము క్రింద మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ మరియు క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతీ యువకులకు వృత్తి విద్య కోర్సుల యందు శిక్షణ మరియు ఉపాధి కల్పించబడును. (Training and Employment Programme) మరియు స్వయం ఉపాధి కోర్సుల యందు కూడా శిక్షణ ఇవ్వబడును (Self Employment Programme) టైలరింగ్, బ్యూటిషియన్, కంప్యూటర్ హార్డువేర్, అకౌంటింగ్ ట్యాలీ, ఆఫీస్ అసిస్టెంట్ మరియు డ్రైవింగ్ తదితర కోర్సుల యందు శిక్షణ ఇచ్చిన తదుపరి ఉపాధి కల్పించబడును.

3) న్యాయ శాస్త్ర పట్ట భద్రులకు శిక్షణ మరియు ఆర్ధిక సహాయం :

మైనారిటీస్ వర్గాలలో న్యాయ శాస్త్ర పట్టభద్రులకు న్యాయ పరిపాలన పరమైన శిక్షణ ఇవ్వటానికి ఆర్ధిక సహాయం అందజేయబడును. ఎంపికైన వారికి జిల్లా కోర్టు, సెషన్స్ కోర్టు, తాలుకా కోర్టు మొదలగు కోర్టు లలో పనిచేసే గవర్నమెంట్ ప్లీడరు, పబ్లిక్ ప్రాసుక్యుటర్ తో జత పరచి శిక్షణ ఇవ్వటం జరుగుతుంది.

డి) కాంటాక్ట్స్

వరుస సంఖ్య ఉద్యోగి పేరు హోదా ఫోన్ నెంబర్
01 కె.నారాయణ కార్యనిర్వాహక సంచాలకులు 9849901154
02 కె.మొహీబ్ కంప్యూటర్ ఆపరేటర్ (కాంట్రాక్టు) 9000774858
03 ఏ.మదన్ మోహన్ రెడ్డి ఆఫీస్ సబ్బార్డినేట్ (అవుట్ సోర్సింగ్ ) 9912322979
04 షేక్.ఖాదర్ వల్లి ఫీల్డ్ అసిస్టెంట్ (క్రిస్టియన్ కార్పొరేషన్ – అవుట్ సోర్సింగ్) 9441443126

 

ఇ) ఈమెయిల్ / పోస్టల్ అడ్రస్

ఈమెయిల్ : nellore[at]apsmfc[dot]com

పోస్టల్ అడ్రస్ : కార్యనిర్వాహక సంచాలకులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్,

బొల్లినేని హాస్పిటల్ దగ్గర,

బ్రహ్మనందపురం, దర్గామిట్ట (పోస్ట్),

నెల్లూరు – 524003.

 

ఎఫ్) ముఖ్యమైన వెబ్ సైట్ లింకులు

వరుస సంఖ్య పధకము పేరు వెబ్ సైట్ అడ్రస్
01 బ్యాంకబుల్ పధకము www.apobmms.cgg.gov.in
02 శిక్షణ మరియు ఉపాధి పధకము www.apsmfc.com