ముగించు

ఆసక్తి ఉన్న స్థలాలు

తల్పగిరి రంగనాధస్వామి ఆలయం, నెల్లూరు

తల్పగిరి రంగనాధస్వామి

తల్పగిరి రంగనాధస్వామి ఆలయం

  శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, నెల్లూరు పట్టణములో పవిత్ర పెన్నానది తీరాన అతి ప్రాచీనమైన శ్రీ తల్పగిరి రంగనాధస్వామి వారి దేవాలయము కలదు. ఆదిశేషునిపై పవళించిన భంగిమలో ఉన్న స్వామివారు ఇక్కడవిశేషము. శ్రీరంగనాధస్వామివారిని విష్ణువు ప్రతిరుపముగానూ, రంగనాయక అమ్మవారిని లక్ష్మీదేవి ప్రతిరుపముగానూ భక్తులు కొలుస్తారు. మనదేశాములోనే ప్రసిద్దిచెందిన రంగనాధస్వామి దేవాలయాలలో శ్రీ తల్పగిరి రంగనాధస్వామి దేవాలయము ఒకటిగా ప్రసిద్ది చెందినది. శ్రీమహాకవి తిక్కన వారు ఈదేవాలయప్రాంగణమునకు ఆనుకొనియున్నపెన్నానది తీరమున మహాభారతమును తెలుగులోనకి అనువదించారని నానుడి. ఈదేవాలయము గాలి గోపురము 7 అంతస్తులతో సుమారు 95 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ గాలి గోపురము పైభాగమున బంగారు పూత పూసిన 7 కలశములు ఉంటాయి. ఈ గోపురము చుట్టూ అనేకదేవత విగ్రహములను అందముగా తీర్చిదిద్దిన శిల్పకళా వైభవము శోభాయమానంగా ఉండును.

పూర్వం కశ్యప ప్రజాపతి ఈప్రాంతమునకు వచ్చియజ్ఞం చేయగా, ఆ యజ్ఞకుండం నుండి మూడు అగ్నులు ఉదయించి, అవి మూడు ప్రదేశాలకు వ్యాప్తి చెంది మూడు ఆలయాలుగా వెలశాయని అందులో నెల్లూరులో వెలసిన శ్రీతల్పగిరి రంగనాధస్వామి వారిఆలయము ఒకటని పురాణ వచనం. తమిళ రాష్ట్రములోని శ్రీరంగంలో గల రంగనాధస్వామి వారు ఆదిరంగమని , కన్నడ రాష్ట్రములోని శ్రీరంగ పట్టణములో గలస్వామి వారు మధ్యరంగమని, మన నెల్లూరు పట్టణములో గల ఈ తల్పగిరి క్షేత్రంలోని రంగనాధ స్వామి వారు ఉత్తర రంగమనిపండితుల అబిప్రాయము. శ్రీ వైకుంఠ ఏకాదశి నాడుఉత్తర ద్వార ప్రవేశము భక్తులకు కల్పించబడును. ఆలయ ప్రాంగణములో అలంకార మండపము, అద్దాల మండపము, గణపతి సన్నిధి మొదలగునవి కలవు. శ్రీరంగానాయకి అమ్మవారి సన్నిధికి దక్షిణము వైపున శ్రీ ప్రసన్న వేంకటేశ్వరాలయము తూర్పు అభిముఖముగా ఉన్నది. శ్రీరంగనాధస్వామి వారికి నిత్య పూజలతో పాటు పండుగ, పర్వదినాలలో విశేష పూజలు జరుగును. ప్రతి సంవత్సరము మార్చి – ఏప్రియల్ మాసములలో ( హిందూ క్యాలెండరు ప్రకారము మారుతుంది) స్వామివారి బ్రహ్మెత్సవములు ఘనముగాజరుగును. ఈ ఉత్సవాలలో స్వామివారు అనేక వాహనాలపై నేత్రానందకరముగా ఊరేగుతారు. స్వామి వారి రధయాత్ర చాల గొప్పగా, కనుల పండుగగా జరుగుతుంది. ఈ ఉత్సవాలలో భక్తులు ఎక్కువ సంఖ్యలోపాల్గొంటారు.

ఈ ఆలయము నెల్లూరు పట్టణములోని రంగనాయకుల పేటలో ఉన్నది. బస్టాండునకు మరియు రైల్వే స్టేషనుకు సమీపములో ఉంది ఆటో సౌకర్యముతో చేరుకోనగలరు.

జొన్నవాడ

జొన్నవాడ కామాక్షి

జొన్నవాడ కామాక్షి టెంపుల్

  శ్రీ మల్లికార్జున స్వామి , కామాక్షితాయి దేవాలయము పెన్నానది ఒడ్డున కలదు. త్రేతాయుగంలో మహాముని కశ్యపబ్రహ్మ యజ్ఞం చేసి శ్రీ మల్లికార్జున స్వామి వారిని సంతోష పెట్టినాడు. అందువలన ఈ ప్రదేశమునకు ‘యజ్ఞవాటిక జొన్నవాడ’ అని స్వమ్య్వారిచే నామకరణం చేయబడినది. శ్రీమల్లికార్జున స్వామి కామాక్షితాయి ఆలయము అసంఖ్యాక భక్తుల కోరికలను తీర్చు కొంగుబంగారముగా కీర్తించబడుచున్నది. ఈ ఆలయమును 1150 సం., ( త్రేతాయుగంలో) లో నిర్మించినట్లుగా తెలుస్తున్నది. ఈ ఆలయము నందే మహాకవి తిక్కన యజ్ఞము చేసి తిక్కన సోమయాజి అయినట్లుగా తెలియును. శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు ఈ ఆలయమును సందర్శించి ఆలయములో శ్రీచక్రమును ప్రతిష్టించినారు. కశ్యప మహర్షి ‘జన్నం’ అనే ఒక యజ్ఞం చేశాక అది జొన్నవాడఅని పిలవబడివాడుకలో జోన్నవాడగా నేడు పిలవబడుతోంది. ఇచట వెలసిన శ్రీ మల్లికార్జున స్వామి గొప్ప మహిమ గల వానిగా నిత్యాభిషేకములతో విరాజిల్లుతూ భక్తుల కోరికలు తీరుస్తూ భక్త వత్సలుడైనాడు. ఇచట గల కామాక్షితాయి అమ్మవారు ముగ్గురమ్ముల మూటపుటమ్మఅని భక్తుల ప్రగాడ విశ్వాసము . ఇక్కడ అమ్మవారు శక్తి స్వరూపిణిగా అవతరించి , కొలవబడుతున్నది. ఈ తల్లిని ఆరాధించేందుకు సాధారణ భక్తులే గాక గ్రహపీడితులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు , వివాహము కానివారు , సంతానహీనులు , మానసిక రోగులు మొదలగువారు ఎందరో వచ్చి అమ్మవారిని దర్చించి వారి వారి బాధలనుండి విముక్తి పొంది సత్ఫలితాలు పొందుచున్నట్లుగా ప్రసిద్ది. ఈ అమ్మవారిని బ్రహ్మ, ఇంద్రాది దేవతలెందరో కూడా ఆరాధించినారని నానుడి. ఈ అమ్మవారికి నిత్యపూజలతో పాటు పండుగ, పర్వదినాలలో విశేష పూజలు , ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం వైశాఖ మాసములో కామాక్షి తాయి అమ్మవారి బ్రహ్మోత్సవములు అత్యంత వైభవముగా జరుగుతాయి. ఈ ఉత్సవాలకు మన రాష్ట్రము నుండేగాక ఇతర రాష్ట్రముల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని , అమ్మవారని దర్శించుకొని వారి కృపాకటాక్షాలకు పాత్రులగుచున్నారు. ఈ ఆలయమునకు సమీపములో గల కచపతీర్ధం అనే సరస్సులో స్నానమాచరించుట వలన భక్తుల్ పాపకర్మలు తొలగునని నమ్మకం.

ఈ ఆలయము శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా , బుచ్చిరెడ్డిపాలెం మండలము జొన్నవాడ గ్రామములో కలదు. ఇది నెల్లూరు పట్టణములో గల ములుమూడి బస్టాండు నుండి 12 కి.మీ. దూరములో ఉండి, ఆర్. టి సి బస్సు లేడా ఆటో సౌకర్యము ద్వారా చేరుకోవచ్చును.

నరసింహకొండ

శ్రీ వేదగిరి లక్ష్మి నరసింహ స్వామి నరసింహకొండ

నరసింహకొండ

శ్రీ వేదగిరి లక్ష్మి నరసింహ స్వామి నరసింహులు కొండ శిఖరము పై వెలసినట్లుగా , కీ.శ. 870- 915 మద్య పల్లవ రాజు నరసింహ వర్మచే ఈ దేవాలయము నిర్మించినట్లు శాసనాలు తెలుపుచున్నవి. పూర్వం ఈ స్వామి చెంత వేదఠనం జరుగుతూ ఉండేదని అందువలనే దీనిని వేదగిరి అని అనటారు. ఈ వేదగిరికి దక్షిణాన ఉన్న అప్పటి ఏడూ హోమగుండాలు నేడు ఏడూ కోనేరులుగా నిలిచి యున్నాయి. పూర్వం కశ్యప మహర్షి లోక కళ్యాణం కోసం యజ్ఞం చేస్తున్నప్పుడు యాగా ప్రధానంగాలైన త్రేతాగ్నులను మూడు ప్రదేశాలలో ప్రతిష్టించినాఋ. అందులో మొదటిది నాడు “ రత్నగిరి గా” పిలవబడే నేటి జొన్నవాడ, రెండోవాడి “ తల్పగిరి” గా పిలవబడే నేటి రంగానాయకుల పేట , మూడవది “ వేదగిరి” సప్త మహర్షుల ఆధ్వర్యములో ఈ కొండపై యాగాన్ని నిర్విగ్నముగా పూర్తి చేయగానే అ హోమ గుండాల నుండి వెలువడిన ఒక తేజో జ్యోతి కొంచెం దూరము ప్రయాణించి ఒక గుహలోకి ప్రవేశించగా ఆ అంతటా ఆ జ్యోతిని వెంబడించిన మహర్షుల అందరికి గుహలో ఆజ్యోతి బదులుగా నరసింహ మూర్తి అవతారము ప్రత్యేక్షమైనది అంతటా అ ప్రతిమను వారు అచటనే ప్రతిష్టించారు. అదే నేటి వేదగిరి గుహలోని మూల విరాట్ అయిన శ్రీ నరసింహ స్వామి వారు ప్రధాన ఆలయమునకు కొంత ఎత్తులో శ్రీ ఆదిలక్ష్మి వారి సన్నిధి కలదు. ఈ ఆలయము కొండమీద ఉండుచే గోపురము చాల దూరము నుండి కూడా కనపడును. స్వామీ వారికి ,అమ్మ వారికి నిత్య పూజలతో పాటు పర్వదినాలలో విశేష పూజలు జరుగుతాయి. ప్రతి సంవత్సరము వైశాఖ మాసములో బ్రహ్మోత్సవములు కూడా నిర్వహించబడతాయి.

ఈప్రసిద్ది దేవాలయము నెల్లూరు పట్టణములో గల మూలుమూడి బస్టాండు నుండి 14 కి.మీ. దూరములో వున్నది. ఆర్ టి సి బస్సు లేదా ఆటో సౌకర్యము ద్వారా చేరుకొనవచ్చును.

పెంచలకోన

పెంచలకోన దేవాలయం

పెంచలకోన

ఇది చాలా ప్రాచీన పవిత్ర ప్రదేశం (తీర్థయాత్ర కేంద్రం). లార్డ్ నరసింహ ఇక్కడ ఒక గొప్ప శిలగా ఉన్నట్లుగా యోగా మ్రోరా (ఋతుపవలో ఉన్న భంగిమలో) గా పిలిచాడు మరియు అందుచే అది పనేసిలా యొక్క (భారీ రాతి) పేరును పొందింది మరియు కాలక్రమంలో â ?? Penchalakonaâ ?. రాక్షసుడు హిర్యాన్య కసిప్పాను చంపిన తరువాత, పంచలకొనోలో స్నానం చేసి నరసింహ స్నానం చేసిన తరువాత, నరసింహ యొక్క అవతార? (అవతారం), తన కోపం మరియు క్రూరత్వాన్ని తొలగించాడు. సోమసిల నరసింహస్వామి పేరుతో ఇక్కడ లార్డ్ వెళుతుంది మరియు నవా నరసింహస్ (తొమ్మిది ఆవిర్భావములలో) ఒకటిగా మారింది. ప్రజలు గతంలో ఈ ప్రాంతంలో గడిపినందున కంవా ఈ ప్రాంతంలో నివసిస్తుండటంతో, ఇక్కడ ప్రవహించే నది కన్వ నడి పేరును సంపాదించి, కండలేరు అయింది.

మన్నారుపోలూర్

మన్నారుపోలూరు

మన్నారుపోలూర్

  ఈ ఆలయము చాల పురాతనమైనది. ఈ ఆలయములో జాంబవతీ, సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మ కొలువై ఉన్నారు. ఈ ఆలయము ఎంతో మనోహరముగా ఉండుటవలన దేవాలయము లో ప్రతిష్టించిన స్వామి వారిని అళగుమన్నారు ( తమిళములో అళగు అంటే అందం) అని పిలువబడుచున్నారు. ఈ దేవాలయ ప్రాంగణములో శ్రీ రామాలయము కూడా ఉన్నది. ఒకే ప్రాంగణములో శ్రీకృష్ణ, శ్రీ రామాలయాలు ఉండి వాటికి విడివిడిగా ధ్వజస్తంభాలు , బలిపీఠాలు ఉండటము ఈ ఆలయములోనే మాత్రమే మనకు కనపడుతుంది. శ్రికృష్ణుడు- జాంబవంతుల మధ్య ద్వంద్వ పోరాటము ఈ మన్నారు పోలూరు లోనే జరిగినది పురాణ ఇతిహసము. శ్రీ మహావిష్ణువు మాల్లయుద్ధము చేసిన ఊరు కనక ఈ ప్రాంతానికి “ మల్ల హరి పోరు ఊరు “ అనే పేరు వచ్చిందని, కాల క్రమములో అదే “ మన్నారు పోలూరు” గా మారిందని స్ధానికులు అంటారు. ఈ ఆలయములో మల్ల హరి కృష్ణ స్వామి పూజలందుకొంటున్నారు. ఈ ఆలయములో 9 అడుగుల ఎత్తు గరుగ్మంతుని విగ్రహము , 9.5 అడుగుల ఎత్తు జాంబవంతుడు , సుగ్రీవ , జటయూవుల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడి మరొక విశిష్టత శ్రీకృష్ణుడు, రాదా దేవి, రుక్మిణి, సత్యభామ తో కొలువుదీరిన ధామాలు ఎన్నో ఉన్నవి. కానీ శ్రీకృష్ణుడు జాంబవతీ తో కలిసి వెలసిన’ క్షేత్రము ఇది ఒకటే. ఇదేకగాక మరొక విశేషము ఏమిటంటే ఈ ఆలయాన్ని తొలిసారిగా ఇక్కడ నిర్మించినది శ్రీకృష్ణుడు మామగారైనా జాంబవంతుడు అంటారు. ఈ ఆలయ శిల్పకళాశోభ వర్ణనతీతము. ఇన్ని విశేషములు గల దేవాలయలము మనదేశములో ఒక మన్నారు పోలూరు లో తప్ప మరెక్కడా కనపడదు. ఇచట నిత్య పూజలతో పాటు స్వామి వార్లకు ఇతర పర్వ దినాలలో ఉత్సవములు కూడా నిర్వహించెదరు. ఈ దేవాలయము శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, సూళ్ళురుపేట కు 3 కి.మీ దూరములో మన్నారు పోలూరు అనే గ్రాములో కలదు. నెల్లూరు పట్టణము నుండి సూళ్ళురుపేట 100 కి.మీ దురములో కలదు. నెల్లూరు పట్టణము నుండి రైలు , బస్సు సౌకర్యము ద్వారా సుళ్ళురుపేట కు చేరుకొని, తదుపరి మన్నారు పోలూరు కు ఆటో సౌకర్యము కలదు.

చెంగాలమ్మ ఆలయం - సూళ్ళురుపేట

చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయము

చెంగాలమ్మ ఆలయం – సూళ్ళురుపేట

సూళ్ళురుపేట లో కాళింది నది తీరాన బంగాళాఖాతానికి – పులికాట్ సరసుకు పశ్చిమ దిశలో వున్న గ్రామములో చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయము ఉన్నది. ముందుగా ఈమె “ టెంకాళి మాతా” గా అవతరించి చెంగాలమ్మ గా ప్రాచుర్యం పొందినది అని తెలియచున్నది. ఇక్కడ యున్న పురాతన ఆలయం 4 , 5 శతాబ్దములో స్ధాపించినదిగా చరిత్ర తెలియజేస్తుంది. చెంగాలమ్మ ఉత్సవాలు జరిగినప్పుడు ఒక పెద్ద కర్ర కు ఒక మేకును కట్టి మూడు సార్లు గాలిలో కర్రను గిరగిర త్రిప్పుతారు. ఇలా త్రిప్పడాన్ని “ సుళ్ళు ఉత్సవం” అని అంటారు. ఆవిధముగా ఈ ఊరుకి సూళ్ళురుపేట అనే పేరు వచ్చినది. ఈ ఆలయాన్ని టెంకాళి స్వయంభూదేవి పేరుతొకూడా పిలుస్తారు. అమ్మ వారి శిరసుపై ఆలయములోని మర్రిచెట్టు జడలు తగులుతున్నట్లుగా కనిపిస్తాయి. సూళ్ళురుపేట గ్రామములో ప్రవహించు పవిత్ర కాళంగి నదిలో శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారు ఇసుకలో కప్పబడి వున్న విగ్రహమును పశువుల కాపరులు చూసి గ్రామా పెద్దలకు చెప్పగా వెంటనే వారు గ్రామస్తులతో కలసి ఆప్రాంతానికి వెళ్ళి ఆ అమ్మవారి విగ్రహమునుచూచి సంతోషముతో పైకి లేపుటకు ప్రయత్నంచగా , అది సాద్యం కాలేదు. వారు తిరిగి గ్రామమునకు వెళ్ళి , మర్నాడు మరికొంత మందితో వచ్చి చూడగా , అమ్మవారి విగ్రహము దక్షిణ ముఖముగా నిటారుగా నిలువబడి మహిషాసూర మర్ధినిగా స్వయంబుగా వెలసిన దృశ్యాని చూచి అందరు ఆశ్చర్య పోయారు. వెంటనే ఆ గ్రామస్తులు ఒక ఆలయాన్ని కట్టించి, తలుపులు పెట్టుటకు ప్రయత్నించగా , గ్రామా పెద్దకు అమ్మవారు కలలో కనపడి నా ఆలయమునకు తలుపులు పెట్టవద్దని, భక్తులకు 24 గంటలు తన దర్శన భాగ్యము కల్పించవలసినదిగా తెలియజేయగా, గ్రామ పెద్ద తలుపులు చేయించుటకు తెచ్చిన చెక్కను గర్భగుడి వెనుకభాగములో ఉంచారు. తెల్లవారే సరికి ఆ చెక్క మొక్కగా చిగురించి , కొన్నాలకు అది మహా వ్రుక్షముగా మారింది. నాటి నుండి ఆచెట్టు నందిఈశ్వరుడునికి శిరస్సు గా , అమ్మవారి ప్రతిమగా , 5 శిరసుల నాగేంద్ర స్వామి గా వివిధ ఆకృలతో అనేకమంది భక్తులకు వివిధ ఆకారాలలో మహిమాన్వితముగా దర్శినమిస్తూ భక్తుల పూజలు అందుకొంటుంది. అమ్మవారిని దర్శించుకొని , చెట్టు చుట్టూ మూడు ప్రదర్శనలు చేసినచో వివాహము కానీ వారికి వివాహము , సంతానము లేని ఆరికి సంతానము , కాలసర్ప దోషాల నుండి విముక్తులై వారి వారి కోరికలు చిగురిస్తాయని భక్తకోటి నమ్మకం. ఈ అమ్మవారిని ప్రతి రోజు భక్తులు దర్శిస్తుంటారు. అతి వైభముగా నిర్వహించే చెంగాలమ్మ జాతరలో మన రాష్ట్రము నుండే గాక ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకొంటారు. ఈ అమ్మవారికి జరిగే నిత్య పూజలు, ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు.
ఈ దేవాలయము శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా , సూళ్ళురుపేట లో కలదు. నెల్లూరు పట్టణము నుండి సుమారు 100 కి.మీ దూరములో కలదు. రైలు, బస్సు సౌకర్యము ద్వారా సూళ్ళురుపేట కు చేరుకొని , ఆలయమును దర్శించుకొనవచ్చును.

సోమశిల డ్యామ్

సోమశిల డ్యామ్

 సోమశిల డ్యామ్

 నెల్లూరు జిల్లలో సోమశిల డ్యామ్ అతి పెద్ద నీటిపారుదల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టును నీటిపారుదలసామర్ద్యం పెంచడము కొరకు నిర్మించబడినది. ఈ ప్రాజెక్టు ను సోమశిల గ్రామానికి సమీపములోని పెన్నానది మీదుగా నిర్మించడమైనది.ఈ ప్రాజెక్టు వద్ద తూర్పు కనుమల యొక్క సహజ సౌందర్యం పర్యాటకులను ఆకర్షించేలా ఉండి, ప్రముఖ పర్యాటక కేంద్రంగా పేరుగాంచినది. ఈగ్రామములో ఒకవైపు సోమనాదునిగా శివుడు భక్తులను ఆశీర్వదించబడుతున్న ఆలయంకలదు . మరియు అవతలివైపు పెన్నానది తీరాన ఒక ఆశ్రమము ఉండి, పర్యాటకులను, విధ్యార్ధులను ఆకర్షించే విధముగా ప్రాచుర్యం పొందింది.
ఈడ్యామ్ నెల్లూరు జిల్లా , అనంతసాగరం మండలములోని సోమశిల గ్రామములో కలదు. నెల్లూరు పట్టణము నుండి 90 కి.మీ.దూరములో కలదు. నెల్లూరు పట్టణము నుండి ఆర్ టి సి బస్సు సౌకర్యము కలదు.

కండలేరు డ్యామ్

కండలేరు డ్యామ్

కండలేరు డ్యామ్

ఈ డ్యామ్ కండలేరు నది మీదుగా నిర్మించబడినది. ఇది వెలుగొండ కొండలలో ఉద్భవించి దాని ప్రవాహము గూడూరు మీదుగా ఉండి, సుమారు 11 కి,మీ. విస్తరించి మరియు తమిళనాడుకు త్రాగునీటిసరఫరాకు ఉపయోగపడుచున్నది.ఈ డ్యామ్ పరివాహక ప్రాంతము అంతయును చుట్టూ కొండలు, అటవీ ప్రాంతముతో ఎంతో ఆహ్లాదకరమైన పర్యాటక కేంద్రములో ప్రసిద్దిచెందినది. ఇది ప్రపంచములోనే భూమి ఆనకట్ట మరియు 68 టియంసి నీటిని నిల్వ చేయు సామర్ధ్యము కలిగినది.
ఈ కండలేరు డ్యామ్ నెల్లూరు నుండి 60 కి.మీదూరములో ఉన్నది. ఇది నెల్లూరు నుండి కడపకు వెళ్ళు రాష్ట్ర రహదారి మార్గములో ( వయా రాపూరు , రాజంపేట ) నందు కలదు. ఈ కండలేరు డ్యామ్ రాపూరు మండలములో ఒక భాగమైయున్నది. పర్యాటక కేంద్రముగా భాసిల్లుతున్నది. నెల్లూరు పట్టణము నుండి రాపూరు కు ఆర్ టి సి బస్సు సౌకర్యము కలదు.

ఉదయగిరి కోట

ఉదయగిరి కోట

ఉదయగిరి కోట

ఈ కోట సముద్రమట్టానికి 379 అడుగుల ఎత్తులో కలదు. కోట పరిసర ప్రాంతములలో గోప్ప ప్రకృతి సౌందర్యం మరియు కొండ చూట్టు పచ్చని వృక్షాలు మరియు అందమైన జలపాతములు కలవు. కోట మీదకు వెళ్ళుటకు కాళీ నడక మార్గము తప్ప వేరే ఇతర రవాణా సౌకర్యము లేదు. గజపతి రాజులు మరియు విజయ నగర రాజుల పాలనాకాలములో ఈ కోట సరికొత్త శోభను సంతరించుకొన్నది. ఇచ్చట బయటపడిన పురాతన ఆలయ కట్టడముల ద్వారా అప్పటి నిర్మాణ కౌశలం ఎంత అద్భుతముగాఉన్నదో వెల్లడగుచున్నది. కొండపైనిర్మించిన శ్రీ రంగనాధలయము చోళ సంస్కృతిని ప్రతిభింభిసుండగా , బాలకృష్ణ మందిరము , పల్లవ సంస్కృతిని , పారువేట మండపము విజయనగర సంస్కృతిని ప్రతిభింభిస్తున్నాయి. ఇక్కడ ఉన్న ఇతర నిర్మాణాలలో చిన్న మసీదు మరియు పెద్ద మసీదు చెప్పుకోదగినవి. ప్రతిసంవత్సరం రబీ- ఉల్- అవల్ నెల నందు గందోత్సవము ఘనముగా నిర్వహించబడును. ఈకోట పర్యాటక కేంద్రముగా ప్రసిద్దిచెందినది.
నెల్లూరు నుండి 100 కి.మీ దూరములో ఉదయగిరి కోట ఉన్నది. నెల్లూరునుండి బస్సు సౌకర్యము కలదు.