ముగించు

ఆంధ్ర ప్రదేశ్ ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల మండలి

ఎ) శాఖ / సంస్థ గురించి పరిచయం: :

ఆంధ్ర ప్రదేశ్ ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల మండలి నెల్లూరు పట్టణములో ఏ. కె నగర్ వీధి యందు ఉన్నది. సదరు మండలి 1959 లో గ్రామీణ వృత్తిదారుల చిన్న తరహా పరిశ్రమలు స్థాపించుట ద్వారా ఉపాధి పొందుటకై ఏర్పాటు చేయబడినది. సదరు మండలి క్రింద ఈ వృత్తులను పొందుటకై బ్యాంకుల ద్వారా రుణ సదుపాయము కల్పించి ప్రోత్సహించుచున్నది. అనగా కుండల తయారీ, ఇటుకల తయారీ, వడ్రంగి పనులు, ఇనుప పనిముట్లు తయారు చేయుట. చాక్ పీసులు తయారీ చేయుట, చీపురు పుల్లలు తయారీ చేయుట మొదలైనవి.

భారత ప్రభుత్వము ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం 2008 ఏప్రిల్ నెల నుండి ప్రారంభించడం జరిగింది. సదరు పథకం ప్రధాన మంత్రి ఉపాధి యోజన మరియు గ్రామీణ ఉద్యోగ కల్పన పథకంను కలుపుట ద్వారా ఏర్పడినది. సదరు పథకం మినిస్ట్రీ అఫ్ మైక్రో స్మాల్ మరియు మీడియం ఎంట్రప్రైజెస్ (యం. .స్. యం. ఇ )సదరు పథకం ఖాదీ మరియు గ్రామీణ ఉపాధి కమిషన్ అను చట్టబద్ధమైన సంస్థ ద్వారా అమలు చేయబడుచున్నది. రాష్టంలో గల సదరు సంస్థ సంచాలకుల ఆఫీస్ ల ద్వారా రాష్టాల గ్రామీణ పరిశ్రమల మండలి ద్వారా మరియు జిల్లా పరిశ్రమల కేంద్రముల ద్వారా అమలు చేయబడుచున్నది. సదరు పథకము లకు ప్రభుత్వం అందచేయు సబ్సిడీ లబ్ధిదారులు బ్యాంకు అకౌంట్ నందు జమచేయబడును.

పంచాయతీ రాజ్ సంస్థలు మరియు సదరు సంస్థల ద్వారా ఈ పథకం లబ్ధిదారుల గుర్తింపునకు మరియు ఆర్థికంగా వెసులుబాటు గల ప్రాజెక్టులను ప్రాంతీయాల వారీగా గుర్తించుటకు మరియు శిక్షణ కార్యక్రమము నందు తోడ్పడు దురు.

ఉదేశ్యములు :

1. ఉపాధి కల్పన : దీనియొక్క ఉద్దేస్యమై ఉన్నది. స్వయం ఉపాధి కల్పన ప్రాజెక్ట్ లు మరియు సూష్మ పరిశ్రమల స్థాపన దీని ఉద్దేస్యమై ఉన్నది.

2. విభిన్న ప్రాంతాలలో ఉన్నటువంటి వృత్తిదారులు మరియు గ్రామీణ పట్టణ నిరుద్యోగులు ఉన్నచోట ఉపాథి కల్పించుట దీనియొక్క ఉద్దేశ్యము.

3. సాంప్రదాయ మరియు ఇతర వృత్తిదారులకు స్థిరమైన స్వయం ఉపాధి కల్పించుట ద్వారా పట్టణమునకు వలస పోకుండా చూచుట ఈ పథకం యొక్క ముఖ్య ఉదేశ్యము.

4. వృత్తిదారుల సంపాదన శక్తీ పెంచుట ద్వారా గ్రామీణ పట్టణ వృత్తిదారులకు ఉత్పాదక శక్తీ పెంచుట దీని లక్ష్యమై ఉన్నది.

ఆర్ధిక సహాయము యొక్క వివరములు :

కేటగిరి 20 వేల లోపు జనాభా గల గ్రామీణ ప్రాంతాలలో యూనిట్స్ స్థాపిస్తే. పట్టణ ప్రాంతాలలో యూనిట్స్ స్థాపిస్తే
జనరల్ 25 శాతం 15 శాతం
ప్రత్యేక తరగతి / బలహీన వర్గాలు (ఎస్.సి / ఎస్.టి / ఓ.బి.సి/ మహిళలు / వికలాంగులు / మాజీ సైనిక్యోద్యులు ) 35` శాతం 25 శాతం

లబ్ధిదారుల పక్రియ ఎంపిక :

జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటి ద్వారా ఈ పథకం క్రింద లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగును. సదరు కమిటి యందు ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల మండలి, జిల్లా పరిశ్రమల మండలి మరియు బ్యాంకుల నుండి ప్రతినిదులు సభ్యులుగా ఉందురు. సదరు టాస్క్ ఫోర్స్ కు సంబంధింత జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ ఛైర్మెన్ గా వ్యవహరించుదురు. సదరు అప్లికేషన్ ను క్షుణ్ణముగా పరిశీలించి కలెక్టర్ గారు ఆమోదించిన తరువాత బ్యాంకులకు పంపబడును. ఈ ప్రకియను ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ స్కోర్ కార్డు ని స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా మరియు రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా తో సంప్రదించును.

ఈ ఎన్నిక ప్రకియ పార దర్శకంగాను, నిస్పక్షపాతంగాను ఉండి, పంచాయత్ రాజ్ సంస్థలను కూడా ఇందులో బాగస్వాములుగా చేయవచ్చును. మరియు ఎన్నిక కాబడిన లబ్దిదారులకు మొదటి దఫా ఋణము మంజూరు చేయుటకు ముందు ఇ.డి.పి ట్రైనింగ్ కు పంపుదురు.

ఈ పథకం క్రింద గరిష్టముగా ఉత్పాదక రంగములో ప్రాజెక్టులకు రూ 25 లక్షల ఋణము మరియు సేవ రంగమునకు రూ 10 లక్షులుగా నిర్ణయంచబడినది.

2018-19 సంవత్సరము నకు ఈ పథకం క్రింద ఆంధ్ర ప్రదేశ్ ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల మండలి మంగళగిరి, అమరావతి వారు టార్గెట్ గా 25 యూనిట్స్ మరియు మార్జిన్ మనీ 75 లక్షలు నెల్లూరు జిల్లాకు కేటాయించినారు. సదరు టార్గెట్ అనుసరించి 23 యూనిట్స్ మంజూరు చేయబడి 68.42 లక్షల మార్జిన్ మనీ మంజూరు చేయబడినది.

బి) ఆర్గనైజషన్ స్ట్రక్చర్ :

KHADI

సి) స్కీం / ఆక్టివిటీ / యాక్షన్ ప్లాన్ :

2008 సంవత్సరము నుండి నేటి వరకు ఆంధ్ర ప్రదేశ్ ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల మండలి వారు ప్రధాన మంత్రి ఉపాధి కల్పనా పథకంను అమలు చేయుచున్నారు.

డి) కాంటాక్ట్స్ :

వరుస సంఖ్య ఉద్యోగి పేరు హోదా ఫోన్ నెంబర్
1 వై బాల సుబ్రహ్మణ్యం సహాయ సంచాలకులు 9440814625
2. జి జెడ్. ప్రతాప్ సింగ్ జూనియర్ ఇన్స్పెక్టర్ 9493356321
3. కె. శ్రీదేవి డేటా ఎంట్రీ ఆపరేటర్ 9700261885

ఇ) ఈ మెయిల్ / పోస్టల్ అడ్రస్ :

ఈ మెయిల్ : deputydirector[dot]nlr[at]gmail[dot]com

అడ్రస్ : సహాయ సంచాలకులు

ఆంధ్ర ప్రదేశ్ ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల మండలి

జిల్లా పరిశ్రమల కేంద్రము

ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఏ. కె నగర్

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్ట్రిక్ట్ -524004

ఎఫ్) వెబ్ సైట్ లింకులు :

వరుస పథకం వెబ్ సైట్ అడ్రస్
1. పి. ఎం. ఇ. జి.పి www.kvic.org.in
www.kviconline.gov.in