ముగించు

జిల్లా ఉప కారాగారముల అధికారి కార్యాలయము

ఉపోద్ఘాతము:

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 1 నవంబర్ 1956 నుంచి జైళ్ళ శాఖ ఏర్పడి అమలులోకి వచ్చినది. మద్రాస్ రాష్ట్రము విడిపోయిన తర్వాత ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని జైళ్ళ అన్ని ఈ శాఖ క్రిందకి వచ్చినాయి. తదుపరి 1976 లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉప కారాగారములు (SJ) తో కలిసి అన్ని జైళ్ళు కూడా జైళ్ళ శాఖ అధీనంలోనే ఉండాలని నిర్ణయం తీసుకొన్నది. ఈ సమయంలోనే కొన్ని ప్రత్యేక ఉప కారాగారములను, జిల్లా కారాగారములను వాటి స్థాయిని పెంచి ఉప కారాగారాగాములను-జిల్లా కారాగారములుగా, జిల్లా కారాగారములను-కేంద్ర కారాగారములుగా మార్చటము జరిగినది. 1986 సం.లో జైళ్ళ శాఖను వికేంద్రీకరించి 3 ప్రాంతములుగా ఈ క్రింది విధముగా విభజించడము జరిగినది.

  1. తెలంగాణా ప్రాంతం
  2. కోస్టల్ ఆంధ్ర ప్రాంతం
  3. రాయలసీమ ప్రాంతం

ప్రతి ప్రాంతమునకు కూడా జైళ్ళ ఉప శాఖాధికారి అధిపతిగా ప్రాంతీయ కార్యాలయములు ఏర్పాటు చేసి నిర్వహించబడుతున్నాయి మరియు అన్ని జైళ్ళు కూడా వైద్య సౌకర్యాలు, శుభ్రత, పరిశుభ్రత, సిబ్బంది నివసించుటకు ప్రత్యేక గృహ సముదాయములు మరియు ఖైదీలును సంస్కరించుటకు క్రొత్త పథకములు అమలులోకి తేబడినవి 2014 సం.లో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రము పునర్విభజన జరిగి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రములు విడిపోయి నూతన్ రాష్ట్రాలుగా ఏర్పాటు కాబడినాయి. ఉమ్మడి రాజధాని హైదరాబాదు నందున గల జైళ్ళ శాఖ ప్రధాన కార్యాలయము విజయవాడ నకు మార్చబడినది. నూతన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము 13 జిల్లాలు కలిగి, ఆంధ్ర ప్రదేశ్ జైళ్ళ శాఖ సంచాలకులు మరియు ఇన్స్పెక్టర్ జనరల్ అఫ్ ప్రిజన్స్ వారి ఆధీనంలో రాష్ట్ర పరిపాలన నడుపబడుచున్నది.

SUBJAIL

  1. కేంద్ర కారాగారములు: విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కడప, నెల్లూరు
  2. జిల్లా కారాగారములు: శ్రీకాకుళం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, చిత్తూరు, కర్నూలు, అనంతపురం.
  3. ఆరుబయట కారాగారములు: అనంతపురం, ప్రిజనేర్స్ అగ్రికల్చర్ కాలనీ
  4. ప్రత్యక మహిళా కారాగారములు: రాజమహేంద్రవరం, కడప
  5. బోస్టల్ స్కూలు: విజయనగరం
  6. ప్రత్యేక ఉప కారాగారములు: 11
  7. ఉప కారాగారములు: 85
  8. జిల్లా ఉప కారాగారముల అధికారి కార్యాలయములు: 13

జిల్లాలోని ఉప కారాగారముల పరిపాలనను పర్యవేక్షించుటకు 13 జిల్లాలలో 13 జిల్లా ఉప కారాగారముల అధికారి కార్యాలయములు, డిప్యూటీ సూపరింటెండెంట్ అఫ్ జైలు (ఉప పర్యవేక్షణాధికారి) అధికారి క్రింద పనిచేస్తున్నాయి.

ఆంధ్ర ప్రదేశ్ జైళ్ళ శాఖ దేశములో ఉన్న ఇతర రాష్టముల జైళ్ళ శాఖల కంటే అన్ని విషయముల యందు ముందు ఉంది అభివృద్ది పథంలో నడుస్తున్నది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో వివిధ జైళ్ళలలో స్టెయిన్ స్టీల్ పాత్రలను అల్యూమినియం పాత్ర స్థానంలో వాడుట, కట్టెల పొయ్యల మీద వంటను గ్యాస్ తో వండుట అధునాతన ప్రత్యేక మరుగు దొడ్లు సౌకర్యాలు, సీలింగ్ ఫ్యానులు, నిరంతర నీటి సరఫరా, విద్యుత్ సరఫరా, నూతన వృత్తి పరమైన శిక్షణ తరగతులు ఖైదీల కొరకు ఏర్పాటు మరియు నూతన వసతులు, వైద్యము సౌకర్యాలు మెరుగు పరచే కార్యక్రమాలు చేపట్టడము జరిగింది.

ఆంధ్ర ప్రదేశ్ కారాగార శాఖ సంక్షిప్త సందేశం

ఆంధ్ర ప్రదేశ్ జైళ్ళ శాఖ ఖైదీల కొరకు రక్షిత, భద్రత కలిగిన వాతావరణంలో శిక్ష ఖైదీలు, విచారణ ఖైదీలు కొరకు సుశిక్షితులు అయిన జైళ్ళ శాఖ సిబ్బంది ఖైదీలను సంస్కరించుటకు వారిని సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా తయారు చేసి తిరిగి జీవన స్రవంతిలోకి పంపుట కొరకు జైళ్ళ శాఖ సిబ్బంది అహర్నిశలు కృషి చేయుచున్నది.

దృక్పధం (Vision)

ఆంధ్ర ప్రదేశ్ కారాగార శాఖ ఉన్నతమైన భావాలు, సంస్కరణ సేవలును సమాజము మేలు కొరకు మాతృకగా ఖైదీలును మార్చుట కారాగార శాఖ యొక్క దృక్పధము

ఆంధ్ర ప్రదేశ్ జైళ్ళ శాఖ లక్ష్యాలు

  • ఖైదీలను ఖైదులో సురక్షితంగా వుంచడం
  • ఖైదీల పై నియంత్రణ, క్రమ శిక్షణ వంటి వాటిని నిర్వహించడం, వారిలో ఆరోగ్య పరిరక్షణ అలవాట్లను నెలకొల్పడం
  • ఖైదీలకు ప్రాథమికంగా అవసరమైన మంచి ఆహారం, బట్టలు, పడక మరియు ఆరోగ్య సంరక్షణ వంటి అవసరాలను అందుబాటులో ఉంచడం.
  • ఖైదీలకు చట్టం పట్ల విధేయత కలిగి వుండేలాగా వారికి అవసరమైన సమాచారాన్ని అందించే వాతావరణాన్ని కల్పించే అలవాటు చేయడం.
  • ఖైదీలను జైలు నుంచి సమాజంలోకి విడుదల చేసేలోగా వారిని సమాజం పట్ల ఒక బాధ్యత గల పౌరునిగా మార్చి, సంస్కార వంతులుగా మార్చి బయటకు పంపడం.
  • జైలు సిబ్బందితో క్రమ శిక్షణ తోను, హుందాగాను వ్యవహరించేలా వారికి అవసరమైన శిక్షణ నివ్వడం, వారికి పునశ్చరణ తరగతులను నిర్వహించడం, అధికారులతో పరస్పర సమావేశాలు నిర్వహించడం.
  • జైళ్ళ సేవలను గరిష్ట దృఢదీక్షతో, సమర్ధతో అమలు చేయడం, ఆయా సేవల ద్వారా ఎంచుకున్న ఆశయాలను, లక్ష్యాలను చేరుకోవడం.
  • ఇతర ప్రభుత్వ శాఖల సహకారాన్ని తీసుకోవడం, వారితో సమన్వయంతో వ్యవహరించడం, ముఖ్యంగా నేర న్యాయ వ్యవస్థకు సంబంధించిన విభాగాల సహకారంతో శాంతియుత సమాజ స్థాపనకు పాటుపడడం.

ఆంధ్ర ప్రదేశ్ జైళ్ళ శాఖ

లక్ష్య ప్రకటన

ఆంధ్ర ప్రదేశ్ జైళ్ళు మరియు సంస్కరణ సేవల శాఖ జిల్లాను నిర్వహిస్తుంది మరియు ఖైదీలకు విచారణ మరియు దోషి నిర్దారణ జరిగినపుడు శిక్షణ పొందిన జైళ్ళ సిబ్బంది ద్వారా సురక్షితమైన పర్యావరణాన్ని అందిస్తుంది. ఇది కాక ఖైదీకి తనను పునరుద్ధరించుకొని వారు మరలా సమాజములో బాధ్యత గల పౌరుడిగా మెలుగుటకు అవకాశము కల్పిస్తుంది. అలా జైళ్ళ శాఖ సమాజ రక్షణకు మరియు రాష్ట్రానికి నిరంతర సేవలను అందిస్తుంది.

సంస్థ పేరు, విధులు, బాధ్యతలు

ఈ సంస్థ పేరు జిల్లా ఉప కారాగారముల అధికారి కార్యాలయము, మూలాపేట, నెల్లూరులోని ఆంధ్ర ప్రదేశ్ కారాగార సంస్కరణల శిక్ష సంస్థ కార్యాలయం ప్రాంగణంనందు ఏర్పాటు చేయబడి తేది. 13-09-1990 పనిచేయుచున్నది. ఈ కార్యాలయముల యొక్క ముఖ్య ఉద్దేశ్యము నెల్లూరు నందు గల ఉప కారాగారముల పాలన మొత్తాన్ని పర్యవేక్షించి, ఖైదీలు యొక్క యోగ క్షేమములును చూచుట మరియు సత్ర్పవర్తన కలిగిన పౌరులుగా తీర్చిదిద్ది సమాజంలో ఉత్తమ పౌరులుగా జీవించుటకు కృషి చేయడం జరుగుతుంది.

విధులు, బాధ్యతలు:

గౌరవ కోర్టులు ఆదేశాను సారము శిక్షింప బడిన ఖైదీలు మరియు విచారణ ఉన్న ఖైదీలు, విచారణ ఎదుర్కొన బడుతున్న ఖైదీలకు జైలు నందు ప్రవేశం కల్పించుట, విచారణ ఖైదీలకు కోర్టు వారు ఆదేశించిన సంబంధిత తేదీలలో కోర్టులనందు హాజరు పరుచుట వారికి ఆహారము వసతులను, వస్త్రములును, సబ్బులు, షాంపులు, టూత్ పేస్టు, కొబ్బరి నూనె, వాషింగ్ పౌడర్, రక్షిత మంచినీరు అందించుట, సీలింగ్ ఫ్యానులు, తగినంత వెలుతురు కలిగిన గదులను కేటాయించుట మరియు రాత్రి పూట అవసరముల నిమిత్తము మరుగు దొడ్లు, న్యూస్ పేపర్స్, వీక్లీ లు, గ్రంధాలయ పుస్తకములు, టెలివిజన్ సెట్లు, గదుల లోపల ఆడుకొనేందుకు చెస్, క్యారమ్ బోర్డులు, అక్షరాస్యతను పెంచుటకు సాక్షరత కార్యక్రమం లేదా వయోజన విద్య మొదలగునవి సక్రమంగా ఖైదీలకు అందుబాటులోకి తెచ్చి సౌకర్యాలును కల్పింఛి అమలు అయ్యేందుకు కృషి చేయం జరుగుతుంది.

అధికారుల, సిబ్బంది విధులు:

1. జిల్లా ఉప కారాగారముల అధికారి:

జిల్లా ఉప కారాగారముల అధికారి, నెల్లూరు ప్రతి మాసము ఒక పర్యాయము వారి ఆధీనంలో నడుపబడుచున్న ఉప కారాగారములను పర్యవేక్షించి ఉప కారాగార అధికారులుకు పాలన యందు తగు సూచనలు చేసి ఆ సూచనలు యొక్క వివరములును కారాగారా ఉప శాఖాధికారి, కడప ప్రాంతము, కడప వారికి తెలియ పరిచెదరు.

నెల్లూరు జిల్లా నందు గల ఉప కారాగారముల లో పనిచేయుచున్న సిబ్బంది యొక్క జీత భత్యములును, ఆకస్మిక బిల్లులు, పరిపాలన ఖర్చుల బిల్లులను చెల్లించుట, అర్ధ వార్షిక తనిఖీలును నిర్వహించుట, స్టాక్ వెరిఫికేషన్ చేయుట మరియు ఆ నివేదికలును శ్రీయుత ప్రాంతీయ కారాగార ఉప శాఖాధికారి గారికి కాలానుగుణంగా తెలియజేయుటము మరియు పై అధికారుల ఆదేశముల మేరకు వారు కేటాయించిన తెలిపిన విదులును నిర్వహించుట జరుగుతుంది.

2. కారాగార అధికారి (జైలర్):

నెల్లూరు జిల్లా ఉప కారాగారముల కార్యాలయమునండు ఒక కారాగార అధికారి కలరు. పరిపాలనలో జిల్లా ఉప కారాగారముల అధికారికి అన్ని విషయాలలో సహాయం చేయుటను మరియు అర్థ వార్షిక తనిఖీలను సంవత్సరానికి రెండు సార్లు ఉప కారాగారములందు నిర్వహించుట, జిల్లా ఉప కారాగారముల అధికారి ఆదేశాల మేరకు సమయానుకూలంగా పని చేయుట.

3. సీనియర్ అసిస్టెంట్:

వ్యవస్థాపన, క్యాష్ బుక్స్ నిర్వహణ మరియు సిబ్బందికి యొక్క సర్వీస్ రిజిస్టర్స్, సెక్యూరిటీ డిపాజిట్, కాంట్రాక్టర్లు అగ్రిమెంట్స్ బాండ్స్ , చలానాలును భద్ర పరచుట మరియు సిబ్బంది లోన్స్, రికవరీలు చేయుట, సెలవులు మంజూరు చేయుట, ప్రధాన, ప్రాంతీయ కార్యాలయ జైళ్ళ శాఖ ఉత్తర ప్రత్తుత్తరాలు చూసుకొనుట.

4. జూనియర్ అసిస్టెంట్-కమ్-టైపిస్ట్:

కారాగార అధికారికి మరియు సీనియర్ అసిస్టెంట్ కి ప్రధాన, ప్రాంతీయ జైళ్ళ శాఖ కార్యాలయాలకు మరియు ఇతర కార్యాలయాలకు ఉత్తర ప్రత్తుత్తరాలు తయారుచేయుట మరియు స్టేషన్ ఆర్టికల్స్ స్టాక్ రిజిస్టర్ నిర్వహణ .

5. రికార్డు అసిస్టెంట్:

పాత రికార్డులు, రిజిస్టర్స్, ఫైల్స్, క్యాష్ బుక్స్ భద్ర పరచుట మరియు రోజువారీ స్టాంప్ ఖాతా, ఇన్ వార్డ్, అవుట్ వార్డ్ రిజిస్టర్స్ నిర్వహించటం.

6. ఆఫీస్ సబార్డినేట్:

జిల్లా ఉప కారాగారముల అధికారి, కారాగారాధికారి(జైలర్), సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్ ల యొక్క పనిలో సహాయం చేస్తూ ఆఫీస్ ని శుభ్రంగా ఉంచుతూ ఫైల్స్ మరియు రిజిస్టర్స్ సరైన పద్దతిలో ఉంచుటలో సహాయం చేస్తూ ఉప కారాగారములకు మరియు ఇతర కార్యాలయాలకు ప్రత్త్యుత్తరాలు అందించుచూ తపాలాను పంపుచటంలో పై అధికారులకు సహాయ పడుట.

సంస్థ ఏర్పాటు

జిల్లా ఉప కారాగారముల అధికారి వారి కార్యాలయము, నెల్లూరు ఈ క్రింద తెలిపిన అధికారుల పరిధిలో పని చేయును.

  1. రాష్ట్ర జైళ్ళ శాఖాధిపతి మరియు సంస్కరణల సర్వీసులు, ఆంధ్ర ప్రదేశ్, విజయవాడ
  2. జైళ్ళ శాఖ ఉప సంచాలకులు కడప ప్రాంతము వారు కడప
    మరియు ఈ కార్యాలయము నందు పరిపాలనలో జిల్లా ఉప కారాగారముల అధికారికి సహాయం అందించుటకు కారాగార అధికారి స్థాయి వ్యక్తి ఒకరు గలరు. ఈ జిల్లా ఉప కారాగారముల అధికారి క్రింద తెలిపిన ఉప కారాగారముల జిల్లాలో పని చేయుచున్నవి.

SUBJAILS

ప్రత్యేక ఉప కారాగారము, గూడూరు ఉప కారాగారము, ఆత్మకూరు ఉప కారాగారము, కావలి

జిల్లా ఉప కారాగారముల అధికారి, నెల్లూరు జిల్లా నందు గల ప్రత్యేక ఉప కారాగారము, గూడూరు, ఉప కారాగారములు, ఆత్మకూరు, కావలి నందు సక్రమంగా పరిపాలన మరియు అక్కడ పనిచేయుచున్న సిబ్బంది విధి నిర్వహణ పై మాసములో ఒక సారి ఆకస్మిక తనిఖీ చేయుట, అచ్చట ఖైదీల యోగ క్షేమములు గురించి తెలుసుకొనుట, ఖైదీల ఫిర్యాదులు పరిష్కరించుట సిబ్బంది విన్నపములు తెలుసుకొనుట, ఆహార దినసరి వస్తువులు నిల్వలు సంబంధిత రిజిష్టరులను, బిల్లులు, ప్రిజనర్స్ ప్రాపర్టీ, స్టాక్ గదుల నిల్వలు మరియు అర్ధ వార్షిక, వార్షిక తనిఖీలు నిర్వహించుట మొదలగునవి. నెల్లూరు జిల్లా నందు గల వెంకటగిరి, సూళ్ళూరుపేట ఉప కారాగారములందు తగు సౌకర్యము లేనందున తాత్కాలికంగా మూసి వేయడము జరిగింది. కావున ఆయా ఉప కారాగారముల పరిధిలోని పోలీస్ స్టేషన్ ల నుండి ఈ కారాగారమునకు రిమాండ్, విచారణ, శిక్ష ఖైదీలు ప్రవేశము పొందుతున్నారు.

ప్రత్యక ఉప కారాగారము గూడూరు యొక్క సంక్షిప్త సమాచారము

ప్రత్యేక ఉప కారాగారము, గూడూరు నెల్లూరు జిల్లా ప్రధాన కేంద్రమునకు సుమారు 42 కి.మీ దూరంలో కలదు. ఈ ఉప కారాగారము 0.70 ఎకరముల స్థలము కలిగి సర్వే నెం. 1777/2 నందు కలదు. 1906 లో బ్రిటిష్ వారి కాలములో నిర్మాణము జరిగింది. ఆ కాలములో రెవిన్యూ మరియు న్యాయ శాఖల ఆధ్వర్యంలో ఉప కారాగారము నడుప బడేది. 1987 లో వరకు న్యాయ శాఖ అధ్వర్యంలో ఆధీనంలో నడుప బడుచూ ఖైదీలు యోగ క్షేమములును చూచుటకు ఒక వార్డర్ నియమించడం జరిగింది. శ్రీయుత కలెక్టర్ గారికి ప్రొసీడింగ్ నెం. 12.475/87, తేది: 05-04-1987, ఎం.ఆర్.ఓ. ఆర్.సి. బి. 192/87, తేది: 23-04-1987 జైళ్ళ శాఖ ఉప కారాగారమును స్వాధీన పరుచుకొని కొన్ని మరమత్తులు నిమిత్తం తాత్కాలికంగా మూసివేత మరమ్మత్తులు అనంతరము 26-07-1993 జైళ్ళ శాఖ ఆధీనంలో పనిచేయుట ప్రారంభించబడినది. తరువాత భద్రత కారణాల దృష్ట్యా, సిబ్బంది సౌకర్యార్ధము 2008లో పరిపాలన భవనము నిర్మించి అందులో రెండు గేట్లు, ఖైదీలు వారి బంధువులతో మాట్లాడుటకు ఇంటర్వ్యూ గది, పర్యవేక్షణాధికారి గది, జూనియర్ అసిస్టెంట్ గది, జైళ్ళ శాఖ సిబ్బంది గది, పోలీస్ గార్డ్ గదులును నూతనంగా పరిపాలన భవనంలో అన్ని సౌకర్యాలుతో నిర్మించినారు.

తదుపరి ఈ ఉప కారాగారము, గూడూరును రాష్ట్రములోని 50 కి పైగా లాకప్ గల ఉప కారాగారములను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ అనుమతితో ఈ కారాగారాన్ని ప్రత్యేక ఉప కారాగారంగా ఉన్నతిని కల్పించుచూ జి.ఓ.యం.యస్. నెం. 36 ఫైనాన్సు (ఎస్.ఎం.సి.సి-1) డిపార్టుమెంటు, తేది: 15-02-2012 భారీగా చేసారు. అప్పటి నుండి ఈ కారాగారము ప్రత్యేక ఉప కారాగారము, గూడూరుగా పిలువబడుతూ ఈ ఉప కారాగారానికి పర్యవేక్షణాదికారిగా కారాగారాధికారిని (గజిటెడ్) ను నియమించుట జరిగినది. ఈ క్రింద పేర్కొన బడిన మండలాలలోని పోలిస్ స్టేషనులు నుండి ప్రత్యేక ఉప కారాగారము, గూడూరు నందు రిమాండ్ లేదా విచారణ మరియు శిక్ష ముద్దాయిలు ప్రవేశము పొందుచున్నారు.

  1. గూడూరు, చిల్లకూరు, కోట, వాకాడు, సైదాపురం, చిట్టమూరు, మనుబోలు, ఓజిలి, పొదలకూరు, కండలేరు 
  2. ఫారెస్ట్ డిపార్టుమెంటు వారిచే 
  3. ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిపార్టుమెంటు వారిచే ఎక్సైజ్ కేసులలో గూడూరు, నాయుడుపేట, సూళ్ళురుపేట, వెంకటగిరి నుంచి ఈ క్రింద తెలిపిన గౌరవ కోర్టులు ఈ కారాగార పరిధిలో కలవు.
  • AJFCM గూడూరు
  • II AJFCM గూడూరు
  • ASJ గూడూరు
  • 7 వ ADJ గూడూరు

ప్రత్యేక ఉప కారాగారము, గూడూరు నందు వివిధ కోర్టులు నుండి వచ్చిన విచారణ ఖైదీలు మరియు ఒక నెల శిక్ష విధించబడిన ఖైదీలుకు ప్రవేశము పొందుటకు వీలు కలదు. ఒక మాసము పైన శిక్ష విధించిబడిన ఖైదీలు కేంద్ర కారాగారము, నెల్లూరు కు పంప బడును. ఈ కారాగారములలో చిన్న చిన్న కేసులలో వచ్చిన ముద్దాయిలకు మాత్రమే ప్రవేశము గలదు.

ఆధీకృత వసతి

క్రమ సంఖ్య ఉప కారాగారము పేరు ఆధీకృత వసతి
    పురుషులు స్త్రీలు మొత్తం
1 ప్రత్యేక ఉప కారాగారము, గూడూరు 48 8 56

క్రమానుగత శ్రేణి:

SUBJAILS

ఉప కారాగారము, ఆత్మకూరు యొక్క సంక్షిప్త సమాచారము

నెల్లూరు జిల్లా ప్రధాన కేంద్రము నుండి ఆత్మకూరు 65 కి.మీ దూరంలో కలదు. ఆత్మకూరు నందు రెవిన్యూ మరియు పోలీస్ సబ్ డివిజన్ కలవు. ఉప కారాగారము, ఆత్మకూరు సర్వే నెం. 840/1 లో ఆత్మకూరు పట్టణం పరిధి నందు 0.37 ఎకరాల స్థలంలో విస్తరించి ఉన్నది.

ఈ ఉప కారాగారము 1956 స్థాపితమై న్యాయ శాఖ ఆద్వర్యంలో వారి ఆదీనంలో పని చేయుచున్నది. ఖైదీలు యొక్క దినసరి/రోజువారి అవసరాలును చూచుటకు ఒక వార్దరును నియమించడం జరిగింది. ఈ ఉపకారాగారములోనికి వెళ్ళడానికి ఉప ఖజానాలో నుంచి మార్గం ఉండేది. మొత్తం 8 సెల్ల్స్ ను కలిగి 16 మంది ముద్దాయిలను నిర్బంధించే సామర్ధ్యాన్ని కలిగి వుండేది. ఒక మాసపు లోపు శిక్షబడిన ముద్దాయిలను ఈ ఉప కారాగారములో నిర్బంధించేవారు మరియు అంతకన్నా ఎక్కువ శిక్ష బడిన ముద్దాయిలను కేంద్ర కారాగారానికి బదిలీ చేయడము జరుగుతుంది. తదుపరి 1960 సంవత్సరములో 8 మంది ఆడ ముద్దాయిలను (విచారణ) నిర్భంధించుటకు 8 సెల్స్ కు అదనంగా మరో 4 సెల్స్ ను నిర్మిచారు. ఈ ఉప కారాగారము 1989 వరకు న్యాయ శాఖ ఆధీనములో పనిచేయుచూ తదుపరి జైళ్ళ శాఖకు కలెక్టర్ గారి ఉత్తర్వులు మేరకు ప్రొసీడింగ్ ఆర్.సి.నెం./475/87, తేది: 27-04 1987 మరియు ఎం.ఆర్.ఓ. ప్రొసీడింగ్ నెం. 1092/87, తేది: 08-06-1987 బదిలీ చేయబడింది. తదుపరి ఉప కారాగారము మూసి వేయబడి ఖైదీలను కేంద్ర కారాగారము, నెల్లూరు కు బదిలీచేయడము జరిగింది. పైన పేర్కొనబడిన ఉత్తర్వులు మేరకు జైలు యొక్క స్థలాన్ని పరాధీనం చేయబడి జైళ్ళ శాఖ కు అప్పగించబడినది.

ఈ ఉప కారాగారములో 8 సెల్స్ ను పురుష ముద్దాయిలును 4 సెల్స్ స్త్రీ ముద్దాయిలును అధికారికంగా నిర్భంధించుటకు సామర్ధ్యము కలిగి ఉన్నది. ఉప కారాగార స్థలాన్ని, భవనాలును స్వాధీనం చేసుకొని 1989 పునః నిర్మాణము కావించటం జరిగింది. పాత భవనాలు అన్నీ పూర్తిగా శిథిలము అవడం జైళ్ళ శాఖ వంట గది, ఆరు బయట మరిగు దొడ్లును, స్నానపు గదులును మరియు నీటి సరఫరా సంబంధించిన నిర్మాణములును చేపట్టినది. తదుపరి పరిపాన భవనములో నిర్మించడము జరిగినది. పరిపాన భవనము పర్యవేక్షణాధికారి వారి కార్యాలయము, ఖైదీలు వారి బంధువులతో మాట్లాడే ఇంటర్వ్యూ గది, జూనియర్ అసిస్టెంట్ గది మరియు గార్దింగ్ సిబ్బంద్ గది, పోలీస్ గార్డ్ వారి గదులును 2009 నాటికి నిర్మించడము జరిగింది. ఈ ఉప కారాగారములోని పరిపాలన భవనంలో భద్రత దృష్ట్యా రెండు గేటులును నిర్మించడము జరిగింది. ఈ నిర్మాణములు అన్ని కూడా జైలు సంస్కరణలలో భాగంగా దృక్పధ ప్రణాళికలో వచ్చిన నిధులు క్రింద జైలులో భద్రత, ప్రాథమిక వసతులు కల్పిస్తూ నిర్మించడము జరిగింది. ఇవి అన్ని జైళ్ళ శాఖ యొక్క నియమ నిబంధనలు, లక్షణాలుకు అనుగుణంగా మార్పులు చేస్తూ నిర్మించారు. ఈ ఉప కారాగారము తిరిగి శ్రీ జి. సునీల్ కుమార్, ఇన్స్పెక్టర్ జనరల్ అఫ్ ప్రిజన్స్, ఆంధ్ర ప్రదేశ్ వారి చేత తేది: 21-08-2009 న పునః ప్రారంభించబడి నడుపబడుచున్నది.ఈ ఉప కారాగారము నందు ప్రవేశము పొందుటకు ఆత్మకూరు, అనంతసాగరం, మర్రిపాడు, సీతారామ పురం, ఉదయగిరి, వింజమూరు, అనుసముద్రం పేట, కలువాయి, దుత్తలూరు, సంగం, చేజెర్ల, వింజమూరు మండలం నుంచి మరియు ఫారెస్ట్, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ వారి స్టేషన్ అయిన ఆత్మకూరు, ఉదయగిరి, వింజమూరు నుంచి గౌరవ JFCM ఆత్మకూరు, JFCM ఉదయగిరి వారి చేత రిమాండుకు ఈ ఉప కారాగారమునకు ముద్దాయిలును పంపుచున్నారు.

ఉపకారాగారము: జైళ్ళ శాఖలో ఉప కారాగారము అనునది చిన్న సంస్థ మరియు చివరి సంస్థ ఈ ఉప కారాగారములు ముద్దాయిలు చిన్న చిన్న కేసులలో వచ్చిన నేరం మోపబడివారిని గౌరవ సంబంధిత కోర్టులు వారిచే ప్రవేశము పొందుతున్నారు. ఈ ఉప కారాగారములు ఒక మాసము శిక్ష బడిన ముద్దాయిలు మాత్రమే ప్రవేశము పొందుటకు అవకాశము కలరు. అంతకన్నా ఎక్కువ శిక్షను కలిగిన ముద్దాయిలను కేంద్ర కారాగారము నెల్లూరుకు బదిలీ చేయడము జరుగుతుంది.

ఆధీకృత వసతి

క్రమ సంఖ్య ఉప కారాగారము పేరు ఆధీకృత వసతి
    పురుషులు స్త్రీలు మొత్తం
1 ఉప కారాగారము, ఆత్మకూరు 24 8 32

క్రమానుగత శ్రేణి:

SUBJAILS

ఉప కారాగారము, కావలి యొక్క సంక్షిప్త సమాచారము

నెల్లూరు జిల్లా ప్రధాన కేంద్రము లేదా కార్య స్థానానికి 60 కి.మీ దూరంలో ఈ ఉప కారాగారము, కావలి కలదు. కావలి నందు రెవిన్యూ మరియు పోలీస్ సబ్ డివిజన్స్ కలవు. ఉప కారాగారము, కావలి సర్వే నెం. 1080/3 నందు కావలి పట్టణం పరిధి నందు 0.72 ఎకరాల స్థలంలో విస్తరించి ఉన్నది. ఈ ఉప కారాగారము బ్రిటిష్ కాలంలో 1906 లో నిర్మాణము ప్రారంభించి 1908 నాటికి పూర్తి చేసారు. ఆ సమయంలో ఉప కారాగారము యొక్క పరిపాలన అంతయు రెవిన్యూ వారి ఆధీనంలో తదుపరి న్యాయ శాఖ ఆదీనంలో ఒక వార్డర్ ను ఖైదీల యోగ క్షేమాలును రోజు వారి అవసరాలును చూడటానికి నియమించబడి నడుపబడినది. ఈ ఉపకారాగారమునకు దారి ప్రస్తుత కావలి రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి ఉండేది. మొత్తం 24 సెల్ల్స్ ను (క్రింద 12, మొదటి అంతస్తు నందు 12) నిర్మించి విచారణ, శిక్ష ముద్దాయిలను నిర్భంధించేవారు. ఒక మాసపు లోపు శిక్షబడిన ముద్దాయిలను ఈ ఉప కారాగారములో నిర్బంధించేవారు మరియు అంతకన్నా ఎక్కువ శిక్ష బడిన ముద్దాయిలను కేంద్ర కారాగారము, నెల్లూరుకు బదిలీ చేయడము జరుగుతుంది. తదుపరి కాలములో 24 సెల్స్ లో 3 సెల్స్ ను క్రింద భాగంలో పగలు మరుగు దొడ్లును ఖైదీల అవసరార్ధము నిర్మించడము జరిగింది. తరువాత 1987 నాటికి ఈ ఉప కారాగారాన్ని న్యాయ శాఖ వారు జైళ్ళ శాఖకు అప్పగించినారు. తదుపరి ఉప కారాగారము మూసి వేయబడి ఖైదీలును కేంద్ర కారాగారము, నెల్లూరు కు బదిలీ చేసినారు. ఈ ఉప కారాగారము యొక్క స్థలము స్వాధీనం మరియు పరాధీనం చేయబడింది. గౌరవ కలెక్టర్ గారి ఉత్తర్వులు మేరకు ప్రొసీడింగ్ నెం. ఐ.2.475/87, తేది: 27-04-1987 మరియు ఎం.ఆర్.ఓ. ప్రొసీడింగ్ నెం. 15821/87, తేది: 15-06-1987 ప్రకారము తదుపరి ఈ ఉప కారాగారము స్వాధీనం చేసుకొన్నా పిదప కొన్ని మరమ్మత్తులును, పాత భవనాలుకు చేయుటకు తాత్కాలికముగా మూసి వేయడం జరిగింది. తిరిగి ఉప కారాగారము మరమ్మత్తులు అనంతరం తేది: 26-07-1973 నుంచి ప్రారంభమైనది. తదుపరి జైళ్ళ శాఖలో సంస్కరణలు అమలు మూలంగా క్రొత్తగా పరిపాలన భవనాన్ని నిర్మించి ఇందులో పర్యవేక్షణాధికారి కార్యాలయం, ఖైదీలు లేదా ముద్దాయిలు వారి బంధువులతో మాట్లాడేందుకు ఇంటర్వ్యూ గదులును, జూనియర్ అసిస్టెంట్, గార్దింగ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది వారికి ప్రత్యేక గదులును నిర్మించడము జరిగింది మరియు ఉప కారాగార భద్రత దృష్ట్యా రెండు గేటులును నిర్మించడము జరిగింది. ఈ నిర్మాణములు అన్ని కూడా జైలు సంస్కరణలలో భాగంగా దృక్పధ ప్రణాళికలులో వచ్చిన నిధులు క్రింద భద్రత ప్రమాణాలును పాటించి ప్రాథమిక వసతులును కల్పించుచూ నిర్మించడము జరిగింది. ఇవి అన్ని జైళ్ళ శాఖ యొక్క నియమ నిబంధనలు, లక్షణాలుకు అనుగుణంగా మార్పులు చేస్తూ నిర్మించినారు.

ఈ ఉప కారాగారము నందు కావలి, బోగోలు, కలిగిరి, కొండాపురం, జలదంకి, బిట్రగుంట మండలాల పరిధిలో నేరం మోపబడిన ముద్దాయిలను గౌరవ JFCM, కావలి, ASJ, కావలి, PDM, కావలి వారి ఉత్తర్వులు మేరకు రిమాండ్ విధించబడి నిర్భంధించబడము జరుగుతుంది.

ఆధీకృత వసతి

క్రమ సంఖ్య ఉప కారాగారము పేరు ఆధీకృత వసతి
    పురుషులు స్త్రీలు మొత్తం
1 ఉప కారాగారము, కావలి 57 06 63

క్రమానుగత శ్రేణి:

SUBJAILS

ఉప కారాగారము, వెంకటగిరి యొక్క సంక్షిప్త సమాచారము (నాన్-ఫంక్షనింగ్)

ఈ ఉప కారాగారము నెల్లూరు జిల్లా ప్రధాన లేదా కార్య స్థానానికి 75 కి.మీ దూరంలో కలదు. వెంకటగిరిలో ప్రత్యేక పోలీస్ బెటాలియన్ కలదు. ఈ కారాగారాన్ని గౌరవ కలెక్టర్ గారి ఉత్తర్వులు మేరకు జైళ్ళ శాఖకు ప్రొసీడింగ్ ఆర్.ఓ.12 నెం. 477/87, తేది: 05-04-1987, 27-04-1987 ద్వారా స్వాధీన పరచడమైనది. 1987 సం. లో స్వాధీనం చేసుకోన్నప్పటి నుంచి ఈ ఉప కారాగారము మూసి వేయబడినది. ఈ ఉప కారాగార పరిధిలోని వెంకటగిరి, బాలయపల్లి, డక్కిలి, రాపూర్ మండలాల నుంచి నేరం మోపబడిన ముద్దాయిలు గౌరవ కోర్టు JFCM వెంకటగిరి వారి ఉత్తర్వులు మేరకు రిమాండ్ చేయబడేవారు. ప్రస్తుతము ఈ ఉప కారాగారము బాగా శిథిలమై పోవడం వలన జైళ్ళ శాఖ స్వాధీనం చేసుకోన్నప్పటి నుంచి మూసివేయబడి ముద్దాయిలను నిర్భంధించుటకు ప్రత్యేక ఉప కారాగారము, గూడూరు కు పంపుచున్నారు.

ఆధీకృత వసతి

క్రమ సంఖ్య ఉప కారాగారము పేరు ఆధీకృత వసతి
    పురుషులు స్త్రీలు మొత్తం
1 ఉప కారాగారము, వెంకటగిరి 24 8 32

ఉప కారాగారము, సూళ్ళూరుపేట యొక్క సంక్షిప్త సమాచారము (నాన్-ఫంక్షనింగ్)

ఈ ఉప కారాగారము నెల్లూరు జిల్లా ప్రధాన లేదా కార్య స్థానానికి 100 కి.మీ దూరంలో కలదు. ఈ కారాగారాన్ని గౌరవ కలెక్టర్ గారి ఉత్తర్వులు మేరకు జైళ్ళ శాఖకు ప్రొసీడింగ్ ఆర్.సి.12 నెం. 475/1987, తేది: 05-04-1987, 27-04-1987 ఎం.ఆర్.ఓ. సూళ్ళూరుపేట ప్రొసీడింగ్ నెం. ఆర్.సి.ఏ.473/1987, 05-05-1987 ద్వారా స్వాధీన పరచడమైనది. 1987 సం. లో స్వాధీనం చేసుకోన్నప్పటి నుంచి ఈ ఉప కారాగారము మూసి వేయబడినది. ఈ ఉప కారాగార పరిధిలోని సూళ్ళూరుపేట, దొరవారిసత్రం, తడ, పెళ్ళకూరు, నాయుడుపేట మండలాల నుంచి నేరం మోపబడిన ముద్దాయిలు గౌరవ కోర్టు JFCM సూళ్ళూరుపేట మరియు 2nd క్లాసు మెజిస్ట్రేట్, సూళ్ళూరుపేట వారి ఉత్తర్వులు మేరకు రిమాండ్ చేయబడేవారు. ప్రస్తుతము ఈ ఉప కారాగారము బాగా శిథిలమై పోవడం వలన జైళ్ళ శాఖ స్వాధీనం చేసుకోన్నప్పటి నుంచి మూసివేయబడి ముద్దాయిలను నిర్భంధించుటకు ప్రత్యేక ఉప కారాగారము, గూడూరు కు పంపుచున్నారు.

ఆధీకృత వసతి

క్రమ సంఖ్య ఉప కారాగారము పేరు ఆధీకృత వసతి
    పురుషులు స్త్రీలు మొత్తం
1 ఉప కారాగారము, సూళ్ళూరుపేట 12 06 18

నేర న్యాయ వ్యవస్థ (Criminal Justice System)

1. భద్రత సమీక్ష కమిటీ:

త్రైమాసిక భద్రత సమీక్ష కమిటీ సమావేశముల మండల స్థాయిలోని భద్రత ప్రమానములును చర్చించుటకు గాను ఉప కారాగారములలో నిర్వహించబడును. ప్రభుత్వం జి.ఓ.నం. 106 హోం (పి.ఆర్.ఐ-బి.2) తేది. 08-05-2011 తో చదవండి. జి.ఓ. యం.ఎస్. నెం. 176 హోం (పి.ఆర్.ఐ.బి.2) డిపార్టుమెంటు, తేది:17-06-2002 ప్రకారం మండల స్థాయిలో 3 మాసాలకు ఒకసారి భద్రత సమీక్ష కమిటీ సమావేశాముఅయి వివిధ కారాగారములలో ఉన్న భద్రత ప్రమాణాలును సమీక్షించి అవసరమైన సూచనలు చేయును.

2. విచారణ ఖైదీల సమీక్ష సమావేశం:

తొందరగా కేసులును విచారించి దీర్ఘకాలంగా పెండింగ్ లు ఉన్న కేసులు గురించి, కేసుల చార్జి షీటులు, ముద్దాయిల కోర్టు హాజరు మరియు ఇతర కారాగారానికి సంబధించిన అంశాలుపై సమీక్ష సమావేశమును ప్రతి మాసాంతములో నిర్వహించబడును. ఈ సమావేశమును గౌరవ జిల్లా న్యాయమూర్తిగారిని అధ్యక్షతన నిర్వహించబడును. ఇందు గౌరవ కలెక్టర్ & మేజిస్ట్రేట్, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్, పర్యవేక్షణాధికారి, కేంద్ర కారాగారము, జిల్లా ఉప కారాగారముల అధికారి, నెల్లూరు వారు సభ్యులు ఉంటారు.

3. ఇతర విభాగాలతో సమన్వయము:

  • భవనములు మరమ్మత్తులు మరియు నిర్వహణ, నిర్మాణములను ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్, నెల్లూరు వారికి అప్పగించడమైనది.
  • విద్య, రెవిన్యూ, న్యాయ, పోలీస్, అడవులు, ఆరోగ్య, మహిళా మరియు పిల్లల అభువ్రుద్ధి సంస్థ వారి సేవలను క్రమం తప్పకుండా అందించడం జరుగుతుంది.
  • 1979 లో ఏర్పడిన అకాడమీ అఫ్ ప్రిజన్స్ & కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్, వెల్లూరు, తమిళనాడు సంస్థలో దక్షిణాది 5 రాష్ట్రాల కలయికతో సంయుక్త శిక్షణను మధ్య, పై స్థాయి అధికారులుకు ఇవ్వడం జరుగుతుంది.

ఉప కారాగారములకు సంబంధించిన పథకాలు మరియు కార్యకలాపాలు

1. మినరల్ వాటర్ ప్లాంట్ లు ఏర్పాటు:

భద్రత కలిగిన మంచి నీరును అందించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలో అన్ని కారాగారాలలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జైళ్ళ శాఖ ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ప్లాంట్ లును స్థాపించినది. ఈ పథకం ద్వారా కారాగారాలలో ఉండే ఖైదీలు అందరికి మంచి ఆశయం, లక్ష్యం ఉద్దేశ్యాలతో భద్రతతో కూడిన మంచి నీరు 24 గం. లు త్రాగేందుకు సరఫరా చేస్తున్నాము.

2. ఆధునిక ఆహార స్థాయి:

ఆధునిక డైట్ స్కేల్ ను ప్రవేశ పెట్టి ఉదయము ఖైదీలుకు ఇచ్చే టిఫిన్స్ లో మార్పిడి చేసి చపాతీ, గోధుమ రవ్వ ఉప్మా, పొంగలి, రైస్ రవ్వలను వాటిని తినుటకు పచ్చడి(Chutney)చపాతి కూరను ఇవ్వడము జరుగుతుంది మరియు ప్రతి మంగళవారము ముద్దాయిలందరికి ఉడకపెట్టిన గ్రుడ్డును ప్రతి మాసము మొదటి ఆదివారము 175 గ్రాములు మటన్ ను మాసములోని మిగతా ఆదివారములలో చికెన్ ను 175 గ్రాములును ప్రతి ముద్దాయికి సాయంత్రపు భోజనంలో సరఫరా చేయడము జరుగుతుంది.

3. ఉప కారాగారముల భద్రత:

ఉప కారాగారములలో భద్రతను పెంచుటకు గాను cctvs, కెమెరాలు ప్రతిపాదనలు పంపించుట జరిగింది. ఈ ప్రతి పాదనలలో భాగంగా మొదటిగా ప్రత్యేక ఉప కారాగారము, గూడూరు నందు 10 cctv కెమెరాలు అమర్చడం జరిగింది. సర్వర్ ను పర్యవేక్షణాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేయడమైనది.

4. భద్రత పరికరాలు:

ఉప కారాగారములలో భద్రతను పెంచుటకు గాను ప్రత్యేక ఉప కారాగారము, గూడూరు లో విధులలో ఉన్న సిబ్బందికి వాకీ టాకీ సెట్ లును అందించడమైనది. తదుపరి మిగతా ఉప కారాగారాలకు కూడా సరఫరా చేయబడును.

5. ఉప కారాగారములలో సాంకేతిక పరిజ్ఞానం వాడకం:

గౌరవ కోర్టులు వారిచే విచారణ, రిమాండ్ కు పంప బడే నేరం మోపబడిన ముద్దాయిల యొక్క వేలి ముద్రలును మరియు ఫోటోలు తీసి ఆన్ లైన్ లో భద్రతపరుచుచున్నాము మరియు చాలా వరకు ముద్దాయిల యొక్క ఆధార్ నెంబర్లను సేకరించి ఆన్ లైన్ ఖైదీల నిర్వహణ వ్యవస్థ నందు నమూదు కూడా చేయుచున్నాము.

6. ఫోన్ సౌకర్యాలు:

మా పరిధిలో గల ఉప కారాగారముల అన్నింటిలో ఖైదీలు వారి యొక్క డబ్బులో కుటుంబ సభ్యులు, స్నేహితులు, లాయర్లతో వారములో రెండు సార్లు మాట్లాడించేందుకు సౌకర్యములు కల్పించబడినాయి.

7. ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ:

ప్రతి ఉప కారాగారము సరసమైన మరియు న్యాయమైన పద్ధతిలో నడుప బడుచున్నది. ప్రతి ఉప కారాగారములలో ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేసినాము. ఆ బాక్సులు యొక్క తాళాలును గౌరవ మండల న్యాయ సేవ సంస్థ వారి దగ్గర ఉంచుకొని సందర్శన సమయంలో తెరిచి చూడడం జరుగుతుంది మరియు జైళ్ళ శాఖపై అధికారులు మాసాంతపు, త్రైమాసిక, అర్ధ వార్షిక, వార్షిక తనిఖీలను నిర్వహించినపుడు కూడా నోటీసుకు వచ్చిన ఫిర్యాదులును అన్నింటిని తక్షణమే పరిష్కరించడము జరుగుతుంది. జైళ్ళ శాఖ అధికారులు, న్యాయమూర్తులు మరియు రాష్ట్ర మానవ హక్కుల సంఘం, జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యులకు కూడా ముద్దాయి వారి ఫిర్యాదులు స్వేచ్చగా నిరభ్యంతరంగా, భయం లేకుండా చెప్పుకొనే వ్యవస్థను జైళ్ళ శాఖలో కల్పించడమైనది.

8. వినోద కార్యాకలాపాలు:

ప్రతి ఉప కారాగారములలో ముద్దాయిలు చదువుకొనేందుకు దిన పత్రికలును, చూసేందుకు టెలివిజన్ సెట్స్ ను, ఆడుకోనేందుకు సెల్స్ లోపల చెస్, క్యారమ్స్ బోర్డులును ఇవ్వడము జరుగుతుంది మరియు స్థానిక లైబ్రరీల ద్వారా పుస్తకాలును మార్పిడి పద్ధతిలో కొన్ని గ్రంధాలయ పుస్తకాలును కూడా అందు బాటులో ఉంచుతున్నాము.

9. వయోజన విద్య:

ఉప కారాగారములలో రిమాండ్ లో ఉన్న ఇంటర్, డిగ్రీ కోర్సులు చదివిన ముద్దాయిల సహాయంతో జైళ్ళ శాఖ సిబ్బంది చదువు రాని వారికి చదువు చెప్పించడము నిరంతరంగా జరుగుతుంది. జిల్లా వయోజన విద్య సంస్థ వారు కూడా ఈ కార్యక్రమములలో తోడ్పాటును అందించుచున్నారు.

10. ఖైదీల ఒత్తిడి తగ్గించే కార్యాక్రమములు:

ఖైదీల ఆరోగ్యం గురించి ప్రతి రోజు తీసు కోవాల్సిన జాగ్రత్తలు మరియు HIV, TB, మద్యపాన నిషేధం గురించిన పాటించవలసిన సూచనలు, సలహాలును తెలుపుతూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అందరికి తెలుపుతూ ఆధ్యాత్మిక, నైతికత, ధ్యానం వాటి విలువలు గురించి అర్ధం అయ్యే విధంగా ఉప న్యాసాలు ఇవ్వడం జరుగుతుంది.

అన్ని ఉప కారాగారములలో వివిధ రకాల స్వచ్చంద సంస్థల సేవలను ఉపయోగించు కొనుచూ నైతిక, మతపరమైన, మంచి ఉపన్యాసాలును చెప్పించడము జరుగుతుంది. స్థానికంగా గల గురువుల చేత యోగ, మెడిటేషన్ కార్యక్రమములు క్రమం తప్పకుండా నిర్వహించడం జరుగుతుంది.

11. స్వచ్చంద సేవా సంస్థల సంస్కరణలు:

ఉప కారాగారములలో వివిధ రకాల స్వచ్చంద సేవా సంస్థల చేత సంస్కరణలు చేపట్టబడుతున్నాయి. ముద్దాయిల ప్రవర్తనలో మార్పు తీసుకొని వచ్చుచూ వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది జన జీవన స్రవంతిలోని తీసుకొని రావడం స్వచ్చంద సంస్థల సేవలు చాలా అమోఘమైనవిగా భావించవచ్చును.

12. సాంస్కృతిక కార్యక్రమములు:

ప్రతి ఉప కారాగారములలో సాంస్కృతిక కార్యక్రములును చేయడం జరుగుతుంది. అన్ని పండుగులను జాతి, కులం, మత భేదాలు లేకుండా నిర్వహించడం జరుగుతుంది. ప్రధాన పండుగలు అయిన వినాయక చవితి, రంజాన్, దసరా, క్రిస్టమస్ మొదలగూ వాటితో పాటు జాతీయ పండుగలు అయిన గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం, గాంధీ జయంతి లను ప్రతి ఉప కారాగారములలో ఘనంగా నిర్వహించుచూ వీటి సందర్భానుసారంగా సాంస్కృతిక కార్యక్రమములు నిర్వహించడం జరుగుతుంది.

13. చేయూత నిధి:

ఈ నిధిని జైళ్ళ శాఖ సిబ్బంది స్వచ్చందంగా వ్యక్తిగతంగా వారి యొక్క జీతాన్ని ఇవ్వడం ద్వారా ఏర్పాటు చేసారు. పేద వర్గాలకు చెందిన ఖైదీలు శిక్ష పూర్తి అయిన ఫైన్(అపరాధ రుసుం) చెల్లించలేని వారు ఎవరు ఉంటారో వారికి ఈ నిధి నుండి డబ్బులిచ్చి ఫైన్ చెల్లించి జైలు నుంచి విడుదల చేయడం జరుగుతుంది.

14. ఇంటర్వ్యూలు/ములఖత్:

శిక్ష మరియు రిమాండ్ ముద్దాయి వారి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, లాయర్లను కలవడానికి రిమాండ్/విచారణలో ఉన్న ముద్దాయిలకు వారానికి రెండుసార్లు శిక్ష ముద్దాయిలకు 15 రోజులకు ఒకసారి మరియు ప్రత్యేక పరిస్థితులలో కొన్ని ప్రత్యేక ఇంటర్వ్యూలును పర్యవేక్షణాధికారులు ఇవ్వడము జరుగుతుంది దీనిలో లాయర్లు కు యిచ్చే ఇంటర్వ్యూలుకు పరిమితి లేదు.

15. పారిశుధ్యం మరియు పరిశుభ్రత:

అన్ని ఉప కారాగారములలోను బోర్ వెల్స్ వేయడం ద్వారా నీటి సరఫరా నిరంతర ఆటంకం లేకుండా అందించడం జరుగుతుంది మరియు అన్ని ఉప కారాగారములలో మునిసిపాలిటి నీటి సరఫరా కూడా కలదు. ముద్దాయిలు వాడుకోవడానికి మంచినీరు, త్రాగడానికి, నిల్వ చేసుకోవడానికి అన్ని వసతులు కల్పించబడ్డాయి. అన్ని మరుగు దొడ్లు, స్నానపు గదులు నియమ నిబంధనలు ప్రకారం రాత్రి, పగలు అవసర నిమిత్తం నిర్మించబడ్డాయి. ఆంధ్ర ప్రదేశ్ జైళ్ళ శాఖ ఖైదీలుకు ఈ క్రింద తెలిపిన వస్తువులును వారి వ్యక్తిగత పరిశుభ్రత కోసం ఏటువంటి రుసుము వసూలు చేయకుండా ఉచితంగా ఇవ్వబడుతున్నాయి.

  1. వంటి సబ్బు – 150గ్రాములు మాసానికి
  2. బట్టల సబ్బులు – 200 గ్రాములు మాసానికి
  3. బట్టల సర్ఫ్ – 50 గ్రాములు వారానికి
  4. షాంపూ – 05 మి.లీ. వారానికి
  5. టూత్ పేస్టు – 02 గ్రాములు ప్రతి రోజు
  6. కొబ్బరి నూనె – 14 మి.లీ. వారానికి

మరియు ప్రతి ఖైదీ/ముద్దాయికి వారానికి ఒక సారి షేవింగ్ చేయబడును, మాసానికి ఒకసారి హెయిర్ కటింగ్ చేయబడును. ఉప కారాగారాలలోని అన్ని సెల్స్, బ్యారక్ సరైన వెలుతులు కలిగి ఫ్యానులు అమర్చుట జరిగినది.

16. ఉచిత న్యాయ సహాయం/న్యాయ సహాయ కేంద్రాలు ఏర్పాటు మరియు చట్టపరమైన అక్షర్యాత శిబిరాలు ఏర్పాటు:

ప్రతి ఉప కారాగారములలో న్యాయ సహాయం కేంద్రాలును మండల న్యాయ సంస్థ చైర్మైన్ గారితో సహాయంతో ఏర్పాటు చేసి, న్యాయ సహాయం గురించి చట్టపరంగా లభించే అవకాశాలు, హామీలు, విదులును గురించి ప్రతి మాసాములో శిభిరాలు ఏర్పాటు చేసి ముద్దాయిలకు అవగాహన/జ్ఞానం కలిగించడం జరుగుతుంది. అలాగే పేదరికంలో ఉన్నవారు మరియు లాయరు ఏర్పాటు లేదా పెట్టుకొనే ఆర్ధిక స్థోమత లేని వారికి ప్రభుత్వం తరపు నుంచి ఉచిత న్యాయ సహాయాన్ని అందజేయడం జరుగుతుంది వారికి లాయర్లు ఏర్పాటు చేసి కేసు వాదించేందుకు మరియు బెయిల్ తీసుకొనే వెసులుబాటు కల్పించడమైనది.

17. సిబ్బంది అభివృద్ధి సంక్షేమం:

సిబ్బంది వారి విధులలో ఎదుర్కొనే ఇబ్బండులును పరిష్కరించుచూ వారి ఉన్నతికి చర్యలు తీసుకోవడం, ఉద్యోగ ప్రమాణాలు పెంచడం అలాగే ఉత్తమ సర్వీసులకు రాష్ట్రపతి, గవర్నర్ సంస్కరణ సేవల గుర్తింపు పతకాలును అందించడం, జిల్లా స్థాయి లో గౌరవ కలెక్టర్ & మేజిస్ట్రేట్ మరియు సబ్ డివిజన్ రెవిన్యూ అధికారులు ద్వారా ఉత్తమ సేవలకు ప్రశంస పత్రాలను ఇప్పించడం జరుగుతుంది మరియు జైళ్ళ శాఖ సంక్షేమ నిధి ద్వారా లోనులు, ధన సహాయం, వాహన, విద్య, వ్యక్తిగత అవసరాలుకు అందించడం జరుగుతుంది. సిబ్బంది సమస్యలు గురించి, ఉద్యోగ భద్రత గురించి ప్రతి సంవత్సరం పునఃశ్చరణ కార్యక్రమాలలో చర్చించి వారి అభ్యున్నతికి నిర్ణయాలు తీసుకొంటున్నాము.

18. వైద్య సంరక్షణ:

ఉప కారాగారములలో ప్రవేశించిన ముద్దాయిలందరిని వారంలో రెండుసార్లు ఉప కారాగారముల సందర్శనకు వచ్చే డాక్టర్ గారు క్షుణ్ణంగా పరీక్ష చేసి చూడటం జరుగుతుంది మరియు NHRC వారు ఇచ్చిన ప్రోఫార్మా లో ఉన్న ప్రకారము ముద్దాయిలను పరీక్షించి అవసరమైతే ఏరియా హాస్పిటల్స్ కి లేదా జిల్లా హాస్పిటల్స్ లో మరియు ప్రాంతీయ హాస్పిటల్స్ కి మెరుగైన చికిత్స కోసం పంపడము జరుగుతుంది మరియు అంటువ్యాదులుతో వచ్చిన ముద్దాయిలను ఇతరులనుంచి వేరు చేసి ప్రత్యేక సెల్స్ లోను ఉంచడము జరుగుతుంది. ఇతరులు ఆ వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది.

19. పారదర్శకత:

పరిపాలనలో పారదర్శకత పాటించి ప్రభుత్వేతర సంస్థలును పరిపాలనలో భాగం చేస్తూ వారి సహాయంలో ముద్దాయిలుకు మెడికల్ క్యాంప్ లు, కళ్ళ పరీక్షలు ఎయిడ్స్ అవేరేనెస్ కార్యక్రమాలు, ముద్దాయిలుకు విలువలతో కూడిన విద్య, కౌన్సిలింగ్, నైతిక విలువలతో కూడిన ఉపన్యాసాలు చెప్పించడం ద్వారా ముద్దాయిలలో మార్పుకు కృషి చేయడం జరుగుతుంది.

20. బయటి ప్రపంచంతో పరిచయం:

అందరు శిక్ష రిమాండ్, విచారణ ముద్దాయిలు జైలు బయటి ఉన్న బంధువులు, స్నేహితులుకు ఉత్తరాలును వ్రాసుకోవడానికి ఉత్తరాలను అందించుకోవడానికి ఏటువంటి ఆంక్షలు లేవు మరియు శిక్ష ముద్దాయిలకు 15 రోజులకు ఒకసారి, రిమాండ్ ముద్దాయిలు వారానికి ఒకసారి ప్రభుత్వం పోస్టుకార్డులును ఉచితంగా ఇవ్వడము జరుగుతుంది.

21. జైళ్ళ శాఖ విభాగం యొక్క సాధారణ పని తీరు:

సంవత్సర కాలంలో అధికారి మరియు సిబ్బంది కార్య సంబంధం మర్యాద పూర్వకంగా ఆహ్లాదకరంగా మరియు జైళ్ళ శాఖ విభాగంలో సాధారణ పరిపాలనా చాలా ప్రశాంతంగా సున్నితంగా మరియు ప్రభావవంతంగా ఉంటుంది.

ప్రత్యేక లక్షణాలు

1. వీడియో కాన్ఫరెన్స్:

విచారణ ఖైదీలును హాజరు పరచడానికి గౌరవ హైకోర్టు వారి ఆదేశాలతో 2015 సం. లో ప్రత్యేక ఉప కారాగారము, గూడూరు నందు వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడమైనది తదుపరి ఈ యొక్క వసతిని మిగతా రెండు ఉప కారాగారములు అయిన ఆత్మకూరు, కావలికి విస్తరించి 2018 సం.లో వీడియో కాన్ఫరెన్స్ వసతిని ఏర్పాటు చేసినారు. దీని వలన అవాంఛనీయ సంఘటనలు, సమయం, ఇంధనం, పొదుపు అవుతాయి మరియు ఉప కారాగారములలోనికి నిషేధిత వస్తువులును రాకుండా ఉండటానికి అవకాశం ఉన్నది.

2. జైలు నిర్వహణ సమాచార వ్యవస్థ (PMIS):

ఈ సాఫ్ట్ వేర్ ద్వారా ఖైదీలుకు సంబంధించిన అన్ని కేసులు వివరాలు, చిరునామా, వేలిముద్రలు, పుట్టుమచ్చలు, ఫోటో గ్రాఫ్ ను సేకరించి ఆన్ లైన్ లో నమోదు చేయడం జరుగుతుంది. అలాగే ముద్దాయిలును కలవడానికి వచ్చిన వారి వివరాలును, హాస్పిటల్ ఇత్యాది విషయములును నమోదు చేయడం వలన ఏమైనా గుర్తించ లేని కేసులను చేధించడంలో పురోగతి దొరికే అవకాశం కలదు.

3. పౌర పత్రం:

జైళ్ళ శాఖ ఈ క్రింది సర్వీసులును అందించుచున్నది.

  1. ఖైదీల బంధువులు మిత్రులతో మాట్లాడుటకు పెట్టుకొను దరఖాస్తును అందిన ఒక గంట లోపు వారితో మాట్లాడించుట
  2. ఖైదీలను బెయిల్ పై రిలీజ్ చేయటానికి కోర్టు ఉత్తర్వులు అందిన 2 గం. లలోపు సాయంత్రము గం. 5.30 ని. ల లోపు విడుదల చేయబడును.
  3.  ప్రజల నుండి అందిన అర్జీలపై చర్య
  • పర్యవేక్షణాధికారి గారి పరిధిలో ఒక వారం లోపు
  • శ్రీయుత ప్రాంతీయ జైళ్ళ ఉప శాఖాధికారి గారి పరిధిలో ఒక పక్షము లోపు
  • ప్రధాన కార్యాలయం వారిచే ఒక నెల వ్యవధిలోపు వచ్చిన ఫిర్యాదుల అర్జీలను పరిష్కరించబడును.

4. జైలు అదాలత్ మరియు లోక్ అదాలత్ లు :

కేసుల విచారణ సత్వరంగా పూర్తి చేసి పరిష్కరించుటకు జైలు అదాలత్ లును క్రమం తప్పకుండా నిర్వహించుచూ కొన్ని కేసులును పరిష్కరించుచున్నారు మరియు సుప్రీంకోర్టు అఫ్ ఇండియా వారి ఆదేశాలు మేరకు జాతీయ మెగా లోక్ అదాలత్ లను కోర్టు పరిసర ప్రాంతములు లేదా ప్రాంగణాలలో నిర్వహించుచూ చాలా కాలంగా అపరిష్కరితంగా ఉన్న ఎక్కువ కేసులు సత్వరమే పరిష్కరించడం జరుగుతుంది.

5. అధికారుల మరియు సిబ్బంది శిక్షణ:

జైళ్ళ శాఖ సిబ్బందికి అదునాతన సాంకేతిక శిక్షణ ఇవ్వడానికి జైళ్ళ శాఖ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సంస్కరణల సేవల శిక్షణ సంస్థను తేది: 25-07-2014 నెల్లూరు లో స్తాపితమైనది మరియు ఆరంభ శిక్షణను సిబ్బందికి, అధికారులుకు, వివిధ రకాల పునశ్చరణ శిక్షణ తరగతులను గార్దింగ్, మినిస్టీరియల్, అధికారులు సంవత్సరం మొత్తం ఇవ్వడము జరుగుతుంది మరియు ఈ శిక్షణ కార్యక్రమము చేయడం లో అకాడమీ అఫ్ ప్రిజన్స్ మరియు కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్, వెల్లూరు, తమిళనాడు వారి సూచనలు, సలహాలును తీసుకొని శిక్షణ కార్యక్రమాలు నడుపబడుతున్నవి.

6. బయోమెట్రిక్ హాజరు మరియు ఇ-ఆఫీస్ నిర్వహణ:

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు అన్ని ఉప కారాగారాలలో మరియు జిల్లా ఉప కారాగారముల అధికారి వారి కార్యాలయంలో బయో మెట్రిక్ హాజరును అమలు చేయుచున్నారు మరియు ఈ కార్యాలయ పరిధిలో దాదాపుగా ఎక్కువ శాతం ఫైళ్ళను ఇ-ఆఫీస్ ద్వారా ఇతర కార్యాలయములకు సమాచార మార్పిడి చేయుచున్నాము.

7. పునశ్చరణ తరగతులు (రీట్రీట్):

గత సంవత్సరంలో జరిగిన సంఘటనలు తీసుకొన్న నిర్ణయాలు, భవిష్యత్తు కార్యక్రమాలు కోసం తీసుకొను నిర్ణయాలు, లక్ష్యాలు పై క్రింద స్థాయి నుంచి పై స్థాయి వరకు సమావేశాలును నిర్వహించి ఆ యొక్క సమావేశ వివరాలును ప్రభుత్వానికి పంపించి అనుమతులు పొందడం జరుగుతుంది.

కార్యాచరణ ప్రణాళిక (Action Plan)

1. సూళ్ళురుపేట నందు అధునాతన ఉప కారాగార నిర్మాణం:

సూళ్ళూరుపేట నందు అన్ని హంగులతో, అధునాతన వసతులతో కూడిన ఉప కారాగారము నిర్మాణమునకు జైళ్ళ శాఖ ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించడమైనది.

2. ప్రత్యేక ఉప కారాగారము గూడూరు సత్వర మరమ్మత్తులు:

ప్రత్యేక ఉప కారాగారము, గూడూరు నందు క్రొత్తగా అధునాతన బ్యారక్స్ ను ముద్దాయిలను నిర్భంధించడానికి పగలు మరుగు ద్రొడ్లు, వస్తువులును నిల్వ చేసుకొనే స్టోర్ రూమ్స్ ను నిర్మాణము చేయడానికి ప్రతిపాదనలు జైళ్ళ శాఖ ప్రధాన కార్యాలయానికి సమర్పించడమైనది.

3. CCTVs:

ఉప కారాగారములు కావలి మరియు ఆత్మకూరు నంది CCTVs ను ఏర్పాటు చేయుటకు జైళ్ళ శాఖ కృషి చేయుచున్నది. బడ్జెట్ కేటాయించిన తదుపరి CCTVs ఏర్పాటు చేయడం జరుగుతుంది.

చట్టాలు/నియమ నిబంధనలు

  1. ఏ.పి. ప్రిజన్ రూల్స్ 1979
  2. ది ప్రిజన్స్ యాక్ట్ 1894
  3. ది ప్రిజనర్స్ యాక్ట్ 1900
  4. ఐడెంటిఫికేషన్ అఫ్ ప్రిజనర్స్ యాక్ట్ 1920
  5. ది ప్రిజనర్స్ అటెండేన్స్ ఇన్ కోర్ట్ యాక్ట్, 1955
  6. ప్రొబేషన్ అఫ్ అఫెండర్స్ యాక్ట్ 1958
  7. ది రీపాట్రియేషన్ అఫ్ ప్రిజనర్స్ యాక్ట్ 2003
  8. ప్రిజన్ డెవలప్మెంట్ బోర్డు యాక్ట్ అండ్ రూల్స్
  9. సమాచార హక్కు చట్టం -2005 RTI Act, 2005

సంప్రదించవలసినవి:

క్రమ సంఖ్య పేరు హోదా ఫోన్ నంబరు
1 శ్రీ యన్. రాజేందర్ జిల్లా ఉప కారాగారముల అధికారి (ఉప పర్యవేక్షణాధికారి) జిల్లా ఉప కారాగారముల అధికారి కార్యాలయము, నెల్లూరు ఫోన్ నం. 0861-2330819  సెల్ నం. 9494633887
2 శ్రీ యస్. వెంకటేశ్వర రావు కారాగారాధికారి (పర్యవేక్షణాధికారి), ప్రత్యేక ఉప కారాగారము, గూడూరు ఫోన్ నం. 08624-221818   సెల్ నం. 9494633896
3 శ్రీ జి. మధు బాబు ఉప కారాగారాధికారి (పర్యవేక్షణాధికారి), ఉప కారాగారము, కావలి ఫోన్ నం. 08626-250226    సెల్ నం. 9494633889
4 శ్రీ యస్. రామ కృష్ణ ఉప కారాగారాధికారి (పర్యవేక్షణాధికారి), ఉప కారాగారము, ఆత్మకూరు ఫోన్ నం. 08627-220699    సెల్ నం. 9494633916

ఇ-మెయిల్/తపాలా చిరునామా

క్రమసంఖ్య ఇ-మెయిల్ తపాలా చిరునామ
1 dsjo-nellore[at]ap[dot]gov[dot]in జిల్లా ఉప కారాగారముల అధికారి కార్యాలయము, పాత కేంద్ర కారాగారము ప్రాంగణములో, సి.ఏ.ఎం. హై స్కూల్ ప్రక్కన, మూలాపేట, నెల్లూరు-524 003
2 ssj-guduru[at]ap[dot]gov[dot]in పర్యవేక్షణాధికారి, ప్రత్యేక ఉప కారాగారము, ఎం.ఆర్.ఓ. కార్యాలయము దగ్గర, గూడూరు- 524121
3 sj-kaavali[at]ap[dot]gov[dot]in పర్యవేక్షణాధికారి, ఉప కారాగారము, రూరల్ పోలీస్ స్టేషన్ ప్రక్కన, తాలూకా ప్రాంగణములో,  కావలి – 524201
4 sj-atmakur[at]ap[dot]gov[dot]in పర్యవేక్షణాధికారి, ఉప కారాగారము, సబ్ రిజిస్టార్ కార్యాలయము మరియు కోర్ట్ ఎదురుగా, ఎం.ఆర్.ఓ. కార్యాలయము దగ్గర, ఆత్మకూరు – 524322