ముగించు

సాంఘిక సంక్షేమ శాఖ

ఎ) శాఖ / సంస్థ గురించి పరిచయం:

సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య ఉద్దేశ్యము షెడ్యూల్డు కులముల వారి విద్యా పురోగతి, సామాజిక, ఆర్ధిక అభివృద్ధి, సంక్షేమము మరియు రక్షణ మరియు షెడ్యూల్డు కులముల వారి సామాజిక భద్రత కొరకు జోగినుల పునరావాసము, వెట్టి చాకిరి నిర్మూలన మరియు పారిశుధ్య కార్మికుల పునరావాసము.

షెడ్యూల్డు కులముల విద్యార్దుల కోసము సాంఘిక సంక్షేమ శాఖ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా యందు పాథశాల స్దాయిలో 58వసతి గృహములు మరియు 1ఆనంద నిలయముమరియు కళాశాల స్దాయిలో 12వసతి గృహములు నిర్వహించబడుచున్నవి.

బి) సంస్ధగత నిర్మాణ క్రమము

organization structure

వివిధ వసతి గృహములు:

వసతి గృహము బాలురు బాలికలు మొత్తము వసతి గృహములు చేరిన విద్యార్దుల సంఖ్య
ప్రి మెట్రిక్ 37 21 58 3454
ఆనంద నిలయాలు 0 1 1 44
కళాశాల వసతి గృహాలు 5 7 12 964
మొత్తము 42 29 71 4462

వసతి గృహములలో ప్రత్యెక సౌకర్యాలు .

  •  జిల్లాలోని అన్ని వసతి గృహములలో విద్యార్దుల హాజరు బయోమెట్రిక్ / ఐరిష్ ద్వారా నమోదు చేయడము జరుగుతుంది. విద్యార్దులఆన్ లైన్ హాజరును బట్టి వసతి గృహమునకు సంబందించిన అన్ని రకాల బిల్లులు పోర్టల్ నందు జనరేట్ చేయబడును.
  •  తేది. 01.06.2023నుండిడైట్ చార్జీలు @ Rs. 1,150/- (3rd& 4thతరగతులకు), Rs. 1,400/- (5th to 10thతరగతులకు), Rs. 1600/- (కళాశాల వసతి గృహములకు).
  •  కాస్మెటిక్ చార్జీలు @ Rs. 125/- (3rd& 4thతరగతులకు) బాలురకు, Rs. 130/- బాలికలకు, Rs. 150/- (5th to10th తరగతులకు) బాలురకు మరియు @ 200/- బాలికలకు, వీటికి అదనముగా మూడు నుండి 10 వ తరగతి వరకు చదువు బాలురకుహెయిర్ కటింగు చార్జీల క్రింద నెలకు @ Rs. 50/- చెల్లించబడును.
  •  ప్రభుత్వము చే నిర్దేసించబడిన మెనూను అన్ని వసతి గృహములలో అమలు చేయడము జరుగుతుంది..
  •  వసతి గృహములలోని 10వ తరగతి విద్యార్దులకోసం నాలుగు సబ్జెక్టులకు(ఇంగ్లీష్, హిందీ, లెక్కలు మరియు సైన్సు) ట్యూటర్ లను నెలకు రు. 1,500 గౌరవ వెతనముతో నియమించడము జరిగింది.
  •  వసతి గృహ విద్యార్దులకు ప్లేట్లు, గ్లాసులు, బెడ్డింగు మెటీరియల్, ట్రంకుపెట్టెలు నోటు పుస్తకములు సరఫరా చేయడము జరిగినది.
  •  7వ తరగతి ఆపైన చదువుచున్న బాలికలకుపాథశాల ద్వారా శానిటరీ నేప్కిన్స్ సరఫరా చేయడము జరిగినది.
  •  వసతి గృహ విద్యార్దులకుపాథశాలద్వారావిద్యాకానుకకిట్ల క్రిందయూనిఫాం, షు, సాక్స్, స్కూల్ బ్యాగ్సరఫరా చేయబడును.

వసతి గృహములలో మార్చి 2024 పదవతరగతి ఫలితాలు :

పడవ తరగతి విద్యార్దులు ఉన్న వసతి గృహములు పరీక్షకు హాజరైన  వారు పరీక్షపాసయిన  వారు ఫెయిల్అయిన  వారు ఉత్తీర్ణతా  శాతము
49 473 422 51 89.22

మెట్రిక్ అనంతర ఉపకారవేతనములు :-

  • ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వముప్రతిష్టాత్మకముగా ఇంటర్మీడియట్ పైన తరగతులు చదువగోరు యస్.సి/యస్.టి/ బి.సి/ ఇ.బిసి/ మైనారిటీ విద్యార్దులకు ఆర్ధిక భారం లేకుండా అర్హత కలిగిన అందరు విద్యార్దులకు మెట్రిక్అనంతర ఉపకారవేతనములు మంజూరు చేయబడును. ఈ పధకము నందు రెండు కేటగిరి ల యందు ఉపకారవేతనములు మంజూరు చేయబడును.
    i) MTF (Maintenance charges)
    ii) RTF (Reimbursement of Tuition Fee)

అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి :

  • ఈ పధకము ద్వారా విదేశాలలో ఉన్నత విద్య చదవగోరు యస్.సి/యస్.టి/ బి.సి/ ఇ.బిసి/ మైనారిటీ విద్యార్దులకు ర్యాంక్ 1 నుండి 100 వరకు యునివర్సిటీలలో చదువుచున్న విద్యార్దులకు పూర్తీ ఫీజు ను నాలుగు విడతలుగా చెల్లించడము జరుగుతుంది.
  •  ప్రభుత్వ ఉత్తర్వులు తేది. 02.02.23 ప్రకారము ఈ పదకమును యస్.సి / యస్.టి / బి.సి / మైనారిటీవిద్యార్దులకు 101నుండి 200 ర్యాంకు యూనివర్సిటీ లలో చదువుచున విద్యార్దులకు నూరు శాతము ఫీజు లేదా రు.75 లక్షలు ఏది తక్కువైతే అది మరియు ఇ.బి.సి / కాపు విద్యార్దులకు యాభై శాతము ఫీజు లేదా రు.50 లక్షలు ఏది తక్కువైతే అది చెల్లించబడును.

ఉచిత విద్యుత్ పధకము :-

  • యస్.సి సబ్ ప్లాన్ చట్టము 2013 ద్వారా 100 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించేషెడ్యూల్డు కులముల కుటుంబాలకు ఈ పధకము ద్వారా ఉచిత విద్యుత్ అందించబడును. ప్రభుత్వ ఉత్తర్వ్యులు .No.91 SW (SCP.A2) Dept , Dt. 24.07.2019 ప్రకారము ఉచిత విద్యుత్ యూనిట్ల వాడకము 200 యూనిట్ల వరకు పెంచడము జరిగినది

డప్పు కళాకారులకు పెన్షన్లు:               

  •  షెడ్యూల్డు కులములోని డప్పు కళాకారులకు ఆర్దికముగా చేయూత నిచ్చుటకు ప్రభుత్వము వారు నెలకు రూ.3000/- లు ఫించను తో పాటుగా ఒక జత సమ దుస్తులు, ఒక జత గజ్జలు, మరియు ఒక డప్పు వాయిద్యము మంజూరు చేయుట కొరకు ఈ పధకమును ప్రవేశ పెట్టినారు. జూన్ 2024 నుంచి పెన్షన్ నెలకురు.4,000/- గా పెంచడము జరిగినది.

సాంప్రదాయ చర్మకారులకుపెన్షన్లు, పనిముట్లుమరియు పెట్టుబడినిధి పంపిణీ :

  •  షెడ్యూల్డుకులములకుచెందినసాంప్రదాయచర్మకారులజీవనోపాధినిమెరుగుపరచడానికి, ఆర్దికముగా చేయూత నందించడానికి ప్రభుత్వం ఈ పధకం ద్వారా నెలకు రూ.2000/- లు ఫించను తో పాటుగా పనిముట్లకు రూ. 10,000 లు మరియు ముడిసరుకుల కొనుగోలు పెట్టుబడి నిధి క్రింద రూ. 20,000 లు ప్రోత్సహకమును అందిస్తుంది. జూన్ 2024 నుంచి పెన్షన్ నెలకురు.4,000/- గా పెంచడము జరిగినది

యస్.సి. / యస్.టి బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ :

  •  సాంఘిక సంక్షేమ శాఖ నోడల్ ఏజన్సీగాజిల్లాలో యస్.సి/ యస్.టి పోస్టుల భర్తీ జిల్లా కలెక్టర్ వారి అధ్యక్షతన జరుగును.

వివిధ చట్టముల అమలు :

  • సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా స్థాయిలో 1. PREVENTION OF ATROCITIES ACT 1989 2. PROHIBITION OF EMPLOYEMNET OF MANUAL SCAVENGERS AND THEIR REHABILITATION ACT 2013 3. BONDED LABOUT SYSTEM (ABOLITION) ACT 1976ఈ చట్టముల అమలు పనితీరు పర్యవేక్షించును.
  •  జిల్లా స్థాయి మరియు సబ్-డివిజన్ స్థాయిలో విజిలెన్సు అండ్ మానిటరింగు కమిటీలను ఏర్పాటు చేసి చట్టాల అమలు పనితీరును periodical reviewsద్వారా సమీక్షించును.

 E-Mail Address :

dydir_sw_nlr[at]ap[dot]gov[dot]in

పోస్టల్ అడ్రస్ :

జిల్లా యస్.సి. సంక్షేమ మరియుసాదికారతా
అధికారి వారి కార్యాలయము,
పినాకినీ గెస్ట్ హౌస్ వెనుక
పాత దూరదర్శన్ భవన్,
బారా షాహీద్ దర్గా దగ్గర, నెల్లూరు –524 003