ఎకానమీ
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా యొక్క ఆర్ధిక ప్రగతి ప్రధానంగా వ్యవసాయము మరియు వ్యవసాయ అనుబంధ రంగములపై ఆధారపడి వున్నది. జిల్లాలో వివిధ పంటల క్రింద సాగు కాబడిన విస్తీర్ణము మొత్తం 2.91 లక్షల హెక్టార్లు కాగా దీనిలో నీటి పారుదల కాబడినది 2.00 లక్షల హెక్టార్లు (68.73%), నీటి పారుదల కాబడిన విస్తీర్ణములో కాలువల క్రింద 50%, భూగర్భ జలవనరుల క్రింద 42%, చెరువులు మరియు ఇతరముల ద్వారా 8% సాగు కాబడినది.
వ్యవసాయము మరియు వ్యవసాయ అనుబంధ రంగములు జిల్లా ఆదాయము పెరుగుదలకు దోహద కారీ రంగాలుగా వుంటూ వీటి ద్వారా రూ.16,495 కోట్లు (34.11%), పరిశ్రమల రంగము ద్వారా రూ.11,472 కోట్లు (23.73%), సేవా రంగము ద్వారా రూ.20,385 కోట్లు (42.16%) మొత్తము జిల్లాకు రూ.48,353 కోట్ల రూపాయల ఆదాయము సమకూరుచున్నది.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆదాయ ప్రగతి రేటు 2017-18 సంవత్సరమునకు 12.90%గా వుంటూ ప్రతి సంవత్సరమునకు రూ.4,224 కోట్ల రూపాయలు పురోగతి కలిగివున్నది.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా యొక్క తలసరి ఆదాయము 2016-17 సంవత్సరమునకు రూ.1,33,970/- కాగా 2017-18 సంవత్సరమునకు 16.52% పెరుగుదలతో రూ.1,56,106/-గా నమోదు కాబడినది.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆర్ధిక ప్రగతికి దోహద కారీ రంగాలు :
వ్యవసాయ రంగము
జిల్లా ఆర్ధిక ప్రగతిలో వ్యవసాయ రంగము ద్వారా సంవత్సరమునకు రూ.1763 కోట్ల రూపాయలు ఆర్జించు చున్నది. దీనిలో ప్రధానంగా వరిపంట ద్వారా రూ.1283 కోట్ల రూపాయలు (72.78%), వేరుశనగ పంట ద్వారా రూ.138 కోట్ల రూపాయలు (7.81%), పొగాకు పంట ద్వారా రూ.57 కోట్ల రూపాయలు (3.22%) ఆర్జించు చున్నది. ఈ మూడు పంటలు ఆర్ధిక ప్రగతికి వ్యవసాయ రంగములో ప్రధానంగా దోహదకారులుగా వుంటూ తమ వంతుగా 83.81% ఈ రంగానికి సమకూర్చు చున్నవి.
ఉద్యానవన పంటలు
జిల్లా ఆర్ధిక ప్రగతిలో ఉద్యానవన పంటల ద్వారా సంవత్సరమునకు రూ.1251 కోట్ల రూపాయలు ఆర్జించు చున్నది. దీనిలో ప్రదానంగా నిమ్మ పంట ద్వారా రూ.493 కోట్ల రూపాయలు (39.44%), మామిడి పంట ద్వారా రూ.167 కోట్ల రూపాయలు (13.34%), అరటి పంట ద్వారా రూ.125 కోట్ల రూపాయలు (10.03%) ఆర్జించు చున్నది. ఈ మూడు పంటలు ఆర్ధిక ప్రగతికి ఉద్యానవన రంగములో ప్రధానంగా దోహదకారిగా వుంటూ తమ వంతుగా 62.81% ఈ రంగానికి సమకూర్చు చున్నవి.
పశుసంవర్ధక రంగము
జిల్లా ఆర్ధిక ప్రగతిలో పశుసంవర్ధక రంగము ద్వారా సంవత్సరమునకు రూ.2292 కోట్ల రూపాయలు ఆర్జించు చున్నది. దీనిలో ప్రధానంగా పాల అమ్మకం ద్వారా రూ.1546 కోట్ల రూపాయలు (67.45%), మాంస విక్రయము ద్వారా రూ.541 కోట్ల రూపాయలు (23.61%), పౌల్ట్రీ (మాంసము) ద్వారా రూ.82 కోట్ల రూపాయలు (3.58%), గ్రుడ్లు ద్వారా రూ.44 కోట్ల రూపాయలు (1.90%) ఆర్జించు చున్నది. ఈ మొత్తము రంగములు ప్రధానంగా దోహదకారులుగా వుంటూ తమ వంతుగా 96.54% ఈ రంగానికి సమకూర్చు చున్నవి.
మత్స్య రంగము
జిల్లా ఆర్ధిక ప్రగతిలో మత్స్య రంగము ద్వారా సంవత్సరమునకు రూ.6245 కోట్ల రూపాయలు ఆర్జించు చున్నది. దీనిలో ప్రధానంగా రొయ్యలు అమ్మకం ద్వారా రూ.5368 కోట్ల రూపాయలు (85.95%), మంచి నీటి చేపల విక్రయము ద్వారా రూ.463 కోట్ల రూపాయలు (7.42%) మరియు సముద్రపు చేపల విక్రయము ద్వారా రూ.414 కోట్ల రూపాయలు (6.63%) ఆర్జించు చున్నది.
పరిశ్రమల రంగము
జిల్లా ఆర్ధిక ప్రగతిలో పరిశ్రమల రంగము ద్వారా సంవత్సరమునకు రూ.9809 కోట్ల రూపాయలు ఆర్జించు చున్నది. దీనిలో ప్రధానంగా తయారీ రంగము ద్వారా రూ.4167 కోట్ల రూపాయలు (42.48%), నిర్మాణ రంగము ద్వారా రూ.3690 కోట్ల రూపాయలు (37.62%), విద్యుత్ రంగము ద్వారా రూ.1130 కోట్ల రూపాయలు (11.52%), గనులు మరియు ఖనిజ రంగం ద్వారా రూ.822 కోట్ల రూపాయలు (8.38%) ఆర్జించు చున్నది.
సేవా రంగము
జిల్లా ఆర్ధిక ప్రగతిలో సేవా రంగము ద్వారా సంవత్సరమునకు రూ.15,450 కోట్ల రూపాయలు ఆర్జించు చున్నది. దీనిలో ప్రధానంగా వాణిజ్యం ద్వారా రూ.3124 కోట్ల రూపాయలు (20.22%), రోడ్డు రవాణా ద్వారా రూ.2408 కోట్ల రూపాయలు (15.59%), గృహ నిర్మాణము ద్వారా రూ.1731 కోట్ల రూపాయలు (11.20%), విద్యా రంగము ద్వారా రూ.1462 కోట్ల రూపాయలు (9.46%), స్థిరాస్తి వ్యాపారం ద్వారా రూ.816 కోట్ల రూపాయలు (5.28%), వైద్య రంగము ద్వారా రూ.376 కోట్ల రూపాయలు (2.44%), హోటల్స్ మరియు రెస్టారంట్ల ద్వారా రూ.369 కోట్ల రూపాయలు (2.39%), నీటి రవాణా ద్వారా రూ.146 కోట్ల రూపాయలు (0.95%) ఆర్జించు చున్నది. ఈ మొత్తము సేవా రంగములు ప్రధానంగా దోహదకారులుగా వుంటూ తమ వంతుగా 67.52% ఈ రంగానికి సమకూర్చు చున్నవి.