1. సాధారణ నమూనా
ఎ) శాఖ యొక్క పాత్ర మరియు కార్యాచరణ:
టెక్స్ట్ బుక్స్ వారి కార్యాలయము ప్రధానముగా పాఠశాల లకు అవసరమైయే ప్రభుత్వ పాఠ్యపుస్తకములు ముద్రణా మరియు పంపిణీల కొరకు ఉద్దేశించబడినవి. మావిభాగము పాఠశాల విద్యాశాక లో ఒక భాగముగా వున్నవి. పాఠశాల విద్యాశాక కమిషనర్ గారు శాకఅధిపతిగా వున్నారు. అందులో విభాగముగా వున్న ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ పాఠ్యపుస్తక ముద్రణా విభాగమునకు ప్రత్యేకముగా సంచాలకులు వున్నారు. వారి యొక్క ప్రధాన కార్యాలయము గుంటూరు లో ఉన్నది.
ఈ శాఖకుసంభందించి ప్రతి జిల్లా ప్రధాన కార్యాలయము నందు 13 జిల్లా లో కూడా జిల్లా ప్రభుత్వ పాఠ్యపుస్తక విక్రయ కార్యాలయములు వున్నవి. ఈ కార్యాలయములో ప్రభుత్వము చే సరఫరా చేయబడిన పాఠ్యపుస్తకములు భద్రపరచి సంభందిత మండల విద్యాశాఖ అధికారులు ద్వారా పాఠశాలలకు పంపిణీ చేయుట జరుగుచున్నది.