పనులు మరియు విధివిధానాలు::
ఈ ఆఫీస్ ఫంక్షన్ కాంట్రాక్టర్ల వర్క్ బిల్లులకు సంబంధించిన చెల్లింపు అథారిటీ, అదే విధంగా ఆర్ అండ్ బి, తెలుగుగంగ ప్రాజెక్టు, అటవీ, ప్రజారోగ్యం మరియు ఆర్థిక విభాగాలు మరియు కార్పొరేషన్లు , భూసేకరణ , పునరావాసం మరియు పునరావాస పనులకు సంబంధించిన బిల్లులు ఈ కార్యాలయములో ఆడిట్ చేసి CFMS ద్వారా అనుమతించిన తరువాత సదరు చెల్లింపులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్ధిక శాఖ నుండి e-కుబేరు ద్వారా సంబందిత లబ్దిదారు / ఏజన్సీ బ్యాంక్ ఖాతా కు జమచేయబడుతుంది.
పనులకు సంబందించిన బిల్లులలో ఏమైనా లోటు పాట్లు ఉన్నపుడు సదరు శాఖ అధికారి CFMS ద్వారా తెలుసుకొని ఆ లోటు పాట్లను సరిచేసి తిరిగి బిల్లును మరల ఈ కార్యాలయమునకు పంపిన తరువాత సదరు బిల్లునుచెల్లింపులకు ఈ కార్యలయం అనుమతించబడును. ఇంకనూ సాదారణ ప్రజానీకానికి బిల్లు ఏ స్థితిలో ఉన్నదో CFMS “బిల్లు స్టేటస్” నందు తెలియజేయబడుతుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ ఇంజనీరింగ్ శాఖల వారు పంపిన బిల్లులలో ఈ కార్యాలయం ద్వారా అనుమతించి బిల్లుల వివరాలు ఎప్పటికప్పుడు ఖచ్చితముగా ఖర్చు వివరములు తెలుసుకొని మరియు బడ్జెట్ చూసుకొని బిల్లుల చెల్లింపులు అనుమతించబడును.