ముగించు

AP మెడికల్ సర్వీసెస్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్

a)సంస్థ గురించి పరిచయం:

ఆంధ్రప్రదేశ్హెల్త్, మెడికల్ హౌసింగ్ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APHMHIDC) 1984 సంవత్సరములో ఆంధ్రప్రదేశ్పబ్లిక్ సొసైటీస్ యాక్ట్ 1930 కింద రిజిస్టర్ చేయబడింది. కార్పొరేషన్ యొక్క ప్రధాన విధులు హాస్పిటల్ భవనాల నిర్మాణం మరియు నిర్వహణ. ఇంకా, డ్రగ్స్, సర్జికల్, వినియోగ వస్తువులు, సామగ్రి సేకరణ మరియు పంపిణీ కూడా ప్రభుత్వం (వైద్య మరియు ఆరోగ్య శాఖ) ద్వారా ఈ కార్పొరేషన్‌కు అప్పగించబడింది. తదనంతరం, కార్పొరేషన్ యొక్క నామకరణం ఆంధ్రప్రదేశ్హెల్త్, మెడికల్ హౌసింగ్ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APHMHIDC)నుండి ఆంధ్రప్రదేశ్మెడికల్ సర్వీసెస్ &ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APMSIDC)గామార్చబడినది.
ఈ కార్పొరేషన్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ నేతృత్వంలో ఉంటుంది.ఈ కార్పొరేషన్ ముగ్గురు చీఫ్ ఇంజనీర్ల నేతృత్వంలో మంగళగిరి ప్రధాన కార్యాలయంగా,సూపరింటెండింగ్ ఇంజనీర్ల నేతృత్వంలో 7 సర్కిళ్ళుగా, ప్రతి జిల్లాలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల నేతృత్వంలో 13 డివిజన్లుగా విస్తరించి ఉన్నది. సెంట్రల్ మెడిసిన్ స్టోర్ (కేంద్రీయ మందుల గిడ్డంగి) ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారి పర్యవేక్షణలో నిర్వహించబడుతుంది మరియు 2 లేదా 3 ఫార్మసీ ఆఫీసర్ల సహాయంతో జిల్లాలోని వివిధ ఆసుపత్రులకు మందులు మొదలైన వాటి పంపిణీ జరుపబడుచున్నది.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నేతృత్వంలో APMSIDC డివిజన్, నెల్లూరు మరియు కేంద్రీయ మందుల గిడ్డంగి, నెల్లూరు నిర్వహణ, సంస్థ చార్ట్‌లో పేర్కొన్న సిబ్బందితో పని చేస్తుంది.

b)సంస్థాగత నిర్మాణ క్రమము:

organization structure

c)శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఈ సంస్థ ద్వారా సేవలు అందించబడుచున్న ఆరోగ్య కేంద్రాలు:

  సర్వజన ఆసుపత్రి& వైద్య   కళాశాల జిల్లా వైద్యశాల ప్రాంతీయ వైద్యశాల సామాజిక ఆరోగ్య కేంద్రాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఆరోగ్య ఉప కేంద్రాలు మొత్తము
ఆసుపత్రులు 1 1 1 8 47 29 443 530

d)ముఖ్య కార్యకలాపాలు

APMSIDC డివిజన్,నెల్లూరుఈ క్రింది కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నది.

1. ఆసుపత్రి భవనాల నిర్మాణము మరియు నిర్వహణ:

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రి భవనాల నిర్మాణము మరియు మరమ్మత్తు పనుల నిర్వహణ జరుగుచున్నది.

2. కేంద్రీయ మందుల గిడ్డంగిద్వారాఔషధాల సేకరణ, నిల్వ మరియు పంపిణీ:

కార్యనిర్వాహక ఇంజనీరు, APMSIDC డివిజన్, నెల్లూరు వారి నియంత్రణలో ఉన్న కేంద్రీయ మందుల గిడ్డంగి ద్వారా జిల్లా లోని అన్ని ఆరోగ్య కేంద్రాల సౌకర్యాలకు అవసరమైన ఔషధాల సేకరణ, నిల్వ చేయుట మరియు వాటి పంపిణీ చేయడం జరుగుచున్నది.

3. సివిల్ పనుల అమలు:

APMSIDC డివిజన్, నెల్లూరు వారి నియంత్రణలో జిల్లాలోని పాలిటెక్నిక్ / ఐ.టి.ఐ. కళాశాల భవనములు,రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్‌లు, హాస్టల్ భవనాలు మరియు ఇతర విద్యా మౌలిక సదుపాయాల నిర్మాణం వంటి సివిల్ పనులను నిర్వహించుట జరుగుచున్నది.

ఈ కార్యకలాపాలు,శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆరోగ్య సంరక్షణ మరియు విద్యా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఉన్నాయి.

e)పథకాలు / కార్య ప్రణాళిక:

APMSIDC డివిజన్, నెల్లూరు వారి నియంత్రణలో వివిధ పథకాలద్వారా నిర్వహించబడుచున్న పనులవివరములు :

క్రమ సంఖ్య పథకం  పేరు పనుల  సంఖ్య పనుల విలువ   (రూ. లక్షలలో) పనుల పురోగతి తేది :   31-03-2024 నాటికి ఖర్చు రిమార్కులు
మొదలు కానివి / టెండర్స్థితిలో  ఉన్నవి / రద్దు అయినవి పురోగతిలో ఉన్నవి పూర్తి అయినవి
1 2 3 4 5 6 7 8 9
1 నాబార్డు పనులు (RIDF-XXIV, RIDF-XXV, RIDF-XXVI) 11 7,015.00 7 4 0 3,315.53  
2 సి.యస్.యస్. – PM ABHIM 2 2,500.00 1 1 0 369.05  
3 సి.యస్.యస్. – డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయ  భవనాలు 2 135 0 2 0 0  
4 State Budget – DME మెయింటెనెన్స్ టీచింగ్ ఆసుపత్రులు 14 300 8 1 5 0  
5 State Budget – DME మెయింటెనెన్స్ మెడికల్ కాలేజీలు 7 130 5 0 2 38.53  
6 State Budget – APVVP మెయింటెనెన్స్ 6 180 2 2 2 0  
7 సి.యస్.యస్. -Existing MC PG Seats Phase II &Burns  Wards 2 946.5 2 0 0 0  
  TOTAL 44 11,206.50 25 10 9 3,723.10  

f)సంప్రదించుటకు వివరాలు:

క్రమ సంఖ్య అధికారి పేరు మొబైల్  నెంబరు ఇ-మెయిల్ కార్యాలయ చిరునామా
1 K.I. సుధాకర్ గౌడ్, కార్యనిర్వాహక ఇంజనీరు 8978680844 eeapmsidcnlr[at]gmail[dot]com O/o కార్యనిర్వాహక ఇంజనీరు, APMSIDC డివిజన్,  కేంద్రీయ మందుల గిడ్డంగి భవనము, 1వ అంతస్థు, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణం, నెల్లూరు – 524004

వెబ్సైట్

https://apmsidc.ap.nic.in

ఇ-మెయిల్

eeapmsidcnlr[at]gmail[dot]com

కార్యాలయ చిరునామా

O/o కార్యనిర్వాహక ఇంజనీరు,
APMSIDC డివిజన్, కేంద్రీయ మందుల
గిడ్డంగి భవనము, 1వ అంతస్థు,
ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణం,
నెల్లూరు – 524004.