సి) పధకాలు / చర్యలు / ప్రణాళికా చర్యలు
లక్ష్యాలు
- చేనేత పరిశ్రమలో అత్యున్నత సాంకేతిక ప్రామాణాలను పెంపోందించుటకు ఉపకరించు స్వల్ప కాలిక మరియు దీర్ఘకాలిక శిక్షణనిచ్చి సాంకేతిక నైపుణ్యత గలిగిన మానవ వనరులను తయారుచేసి చేనేత మరియు జౌళి మరియు దుస్తుల తయారి పరిశ్రమలకు అందించుట.
- చేనేత పరిశ్రమకు సాంకేతిక నిపుణులను అనుసంధానించుట.
- విద్యార్ధులకు ప్రపంచ వస్త్ర పరిశ్రమకు అవసరమయిన అధునాతన దుస్తుల తయారి నైపుణ్య శిక్షణను అందించుట.
కార్యాకలాపాలు
బోధనంశాలు (పాఠ్యాప్రణాళిక)
శిక్షననందు క్రింద తెలిపిన అంశాలలో బోధన మరియు శిక్షణ ఇవ్వబడును.
- నూలు వడుకుట.
- వస్త్ర నిర్మాణము (నేత).
- రూప రచన.
- రంసల అద్దకం.
- రూప ముద్రణ.
- జౌళి పరీక్షలు.
- దుస్తుల తయారీ.
- విపణి మరియు యాజమాన్య పద్దతులు.
- కాలుష్య నియంత్రణ.
- కంప్యూటర్ ఉపయోగవిధానము.
- వ్యక్తిత్వ మరియు సమాచార నైపుణ్యము.
ప్రవేశ వయోపరిమితి
సంస్థ యిచుచ్చున 3 సంవత్సరాల డిప్లొమా కోర్సులో ప్రవేశము పొందుటకు వయో పరిమితి ఆ సంవత్సరంలో జూలై 1 వ తేదీ కి యస్.సి. మరియు యస్.టి. అభ్యర్ధులకు 15 నుండి 25 సంవత్సరాలు ఇతరులకు 15 నుండి 23 సంవత్సరాలు.
సీట్లు కేటాయింపు
సంస్థ నందు మొత్తం సీట్ల సంఖ్య -60, ఇందులో ఈ క్రింద తెలియపరిచిన దామాషా ప్రకారం సీట్ల కేటాయించబడును.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములకు |
47 |
తమిళనాడు |
4 |
కేరళ |
3 |
కర్ణాటక |
3 |
పాండిచ్చేరి |
1 |
మహారాష్ట్ర |
1 |
మొత్తం |
60 |
ఆంధ్రప్రదేశ్ తరుపున ఇతర రాష్ట్రములకు పంపు అభ్యర్ధుల వివరములు
- భారతీయ చేనేత సాంకేతిక శిక్షణా సంస్థ,సేలం(తమిళనాడు) – 11
- కర్ణాటక చేనేత సాంకేతిక శిక్షణా సంస్థ, గడగ్(కర్ణాటక) – 04
ప్రవేశ విధానం
10 వ తరగతి లేదా తత్సమానమయిన పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ మరియు ఇతర రాష్ట్రములకు చెందిన విద్యార్ధులకు సీట్లు కౌన్సిలింగ్ ద్వారా సీట్లు కేటాయించబడును.
శిక్షణ భత్యము
ఈ సంస్థ నందు ప్రవేశము లభించిన ప్రతి విద్యార్ధి విద్య సంవత్సరమునకు ఈ క్రింద తెలిపిన విధముగా 10 నెలలకు శిక్షణా భత్యమును పొందుదురు.
- మొదటి సంవత్సరం విద్యార్ధులు – 1000/-/నెలకు
- రెండవ సంవత్సరం విద్యార్ధులు – 11000/-/నెలకు
- మూడవ సంవత్సరం విద్యార్ధులు – 1200/-/నెలకు
డిప్లొమా ధృవీకరణ పత్రపరీక్షలలో ఉత్తీర్ణులై మంజూరు
3 సంవత్సరాల శిక్షణను విజయవంతముగా పూర్తీ చుకున్న విద్యార్ధులకు భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేనేత అభివృద్ధి కమీషనర్, న్యూ ఢిల్లీ వారి చే జారీ చేయబడ డిప్లొమో ధ్రువీకరణ పత్రం జారీ చేయబడును.
ప్రస్తుత విద్యార్ధుల సంఖ్య
ప్రస్తుతము సంస్థ నందు చదువుచున్న విద్యార్ధుల సంఖ్య వివరములు ఈ క్రింద తెలియపరచడమైనది.
క్రమ సంఖ్య |
విద్యార్ధి తరగతి |
బాలురు |
బాలికలు |
మొత్తం |
1. |
మొదటి సంవత్సరం |
46 |
14 |
60 |
2 |
రెండవ సంవత్సరం |
46 |
12 |
58 |
3 |
మూడవ సంవత్సరం |
37 |
16 |
53 |
|
మొత్తం |
129 |
42 |
171 |
డిప్లోమో పూర్తీ చేసిన విద్యార్ధుల వివరములు
ఇప్పటి వరకు 923 మంది విద్యార్ధులు 3 సంవత్సరముల డిప్లోమో శిక్షణను పూర్తిచేసుకున్నారు వారి వివరములు క్రింద తెలియపరచడమైనది.
క్రమ సంఖ్య |
పూర్తిచేసిన సంవత్సరము |
విద్యార్ధుల సంఖ్య |
1 |
1995 |
28 |
2 |
1996 |
31 |
3 |
1997 |
41 |
4 |
1998 |
31 |
5 |
1999 |
35 |
6 |
2000 |
40 |
7 |
2001 |
27 |
8 |
2002 |
36 |
9 |
2003 |
41 |
10 |
2004 |
29 |
11 |
2005 |
20 |
12 |
2006 |
33 |
13 |
2007 |
34 |
14 |
2008 |
38 |
15 |
2009 |
42 |
16 |
2010 |
54 |
17 |
2011 |
27 |
18 |
2012 |
56 |
19 |
2013 |
18 |
20 |
2014 |
48 |
21 |
2015 |
27 |
22 |
2016 |
34 |
23 |
2017 |
48 |
24 |
2018 |
53 |
25 |
2019 |
52 |
|
Total |
923 |
923 మంది విద్యార్ధులను గాను 90 శాతం విద్యార్ధులు చేనేత ఎగుమతులు,దుస్తులు తయారీ కేంద్రములు,బట్టల తయారీ మిల్లులు, నూలు మిల్లులు,రూపరచన మరియు పరీక్ష కేంద్రముల యందు ఉపాధి పొందుచుచున్నారు.
కొంత మంది జౌల్యానిక పారిశ్రామిక వేత్తలుగా తమ సొంత వ్యాపార సంస్థలను నెలకొల్వి,ఇతర సాంకేతిక నిపుణులను కూడా ఉపాధి చూపుచున్నారు.