శిక్షణా మరియు ఉపాధి ప్రొత్సాహక సంస్థ (సెట్నెల్)
ఎ) సంస్థ యొక్క వివరములు:
నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించుటకు జిల్లా కలెక్టరు గారి అధ్యక్షతన 1981వ సంవత్సరములో శిక్షణా మరియు ఉపాధి ప్రోత్సాహక సంస్థ ఏర్పాటు చేయడం జరిగినది. రాష్ట్ర స్థాయిలో యువజన సర్వీసులశాఖ కమీషనర్ గారు ఈ సంస్థకు కార్యాచరణ, నిధులు ఏర్పాటు చేసి కార్యకలాపాలను సమీక్షించెదరు.
బి) సంస్థ యొక్క నిర్మణము
ముఖ్య కార్యనిర్వహణాధికారి |
---|
మేనేజర్ |
సూపరింటెండెంట్ |
అకౌంటెంట్ |
సీనియర్ సహాయకులు |
జూనియర్ సహాయకులు |
ఆఫీస్ సబార్దినేట్ |
సి) సంస్థ నిర్వహించు పనులు మరియు వార్షిక ప్రణాళిక
ప్రస్తుతము ఈ సంస్థ ద్వార యూత్ వెల్ఫేర్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నది.
1. జాతీయ / అంతర్జాతీయ ముఖ్య దినోత్సవములు
ప్రతి సంవత్సరము మేనేజింగ్ డైరెక్టర్, ఏ.పి.స్టెప్. వారి ఆదేశముల ప్రకారము జాతీయ / అంతర్జాతీయ ముఖ్య దినోత్సవములు నిర్వహించబడును.
2. యువజనోత్సవములు
యువత లోని కళా నైపుణ్యాన్ని వెలికితీసి వారిని ప్రోత్సహించుటకు యువజనోత్సవాలు నిర్వహించబడుచున్నవి. ప్రతి సంవత్సరము స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జనవరి నెలలో భ్రమణ పద్దతిలో ఎన్నుకొనబడిన రాష్ట్రం లో భారత ప్రభుత్వం ఆ రాష్ట్ర సహకారముతో అన్ని రాష్ట్రాల నుండి కళాకారులను ఆహ్వానించి జాతీయ యువజనోత్సవాలు నిర్వహించెదరు. జాతీయ యువజనోత్సవాలలో రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించుటకు మొదట డివిజన్ స్ధాయి యువజనోత్సవాలను ఆగస్టు . సెప్టెంబరు నెలలో జరుపుకొని , వాటిలో ప్రధమ స్ధానం లో నిలిచిన వారికి తిరిగి జిల్లాస్ధాయిలో పోటీలు నిర్వహించబడుచున్నవి. ఈ జిల్లాస్ధాయి యువజనోత్సవాలలో ప్రధమ స్ధానం లో నిలిచిన యువ కళాకారులను డిసెంబరు చివరి వారం లో రాష్ట్రస్ధాయిలో యువజనోత్సవాలు నిర్వహించి, రాష్ట్రస్ధాయిలో ప్రధమ స్ధానం లో నిలిచిన వారిని జాతీయ స్ధాయి పోటీలకు ఎంపిక చేసెదరు. శాస్త్రీయ నృత్యము, శాస్త్రీయ సంగీతము, జానపద నృత్యము, జానపద సంగీతము, ఏకాంకిక నాటిక మొదలగు విభాగములకు సంబంధించి 18 అంశములలో పోటీలను నిర్వహించబడును. ఈ పోటీలకు 15 నుండి 29 సంవత్సరముల మధ్య వయస్సు గల యువతీ యువకులు అర్హులు. పోటీలలో గెలుపొందిన వారికి ప్రశంసా పత్రము, మెమెంటో మరియు పాల్గొన్నవారికి ప్రశంసా పత్రము ఇవ్వబడును.
3. యువజన వారోత్సవములు
ప్రతి సంవత్సరము స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జనవరి నెల 12 నుంచి 18వ తేది వరకు విద్యార్ధులు, యువజన సంఘాల సభ్యులతో కలసి యువజన వారోత్సవాలు (యువ మహోత్సవం) నిర్వహించబడుతాయి. ఈ సందర్భంగా గ్రామీణ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు,రంగోళీ పోటీలు, యువజన సదస్సులు, ర్యాలీలు మొదలగు కార్యక్రమాలతో యువమహోత్సవాలు నిర్వహించబడతాయి. పోటీలలో గెలుపొందిన వారికి ప్రశంసా పత్రం, మెమెంటోలతో సత్కరించబడును మరియు పాల్గొన్నవారికి ప్రశంసా పత్రము ఇవ్వబడును.
4. రక్తదాన సిబిరములు, అవయవ దానములపై అవగాహన సదస్సులు
జిల్లాలోని యువజన సంఘాల సహకారముతో రక్త శిబిరములను ఏర్పాటు చేసి యువతకు రక్త దానముపై అవగాహన కల్పించి వారిచే రక్తదానము చేయించబడును. అలాగే వారికి అవయవ దానం పై అవగాహన కల్పించడం జరుగుతుంది.
5. వక్తిత్వ వికాసం మరియు కెరీర్ గైడెన్స్ పై అవగాహన కార్యక్రమాలు
కమీషనర్ , యువజనసర్వీసుల శాఖ , విజయవాడ ఆదేశముల మేరకు జిల్లాలోని అన్ని పాఠశాలలో, కళాశాలలో విద్యార్ధులకు వక్తిత్వ వికాసం మరియు కెరీర్ గైడెన్స్ పై అవగాహన కార్యక్రమము నిర్వహించబడును..
6. సైబర్ నేరాలు, ఈవ్ టీజింగ్ , మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళల అక్రమ రవాణా మరియు దిశా చట్టం పైఅవగాహన కార్యక్రమాలు
కమీషనర్ , యువజనసర్వీసుల శాఖ , విజయవాడ ఆదేశముల మేరకు జిల్లాలోని అన్ని పాఠశాలలో, కళాశాలలో విద్యార్ధులకు సైబర్ నేరాలు, ఈవ్ టీజింగ్ , మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళల అక్రమ రవాణా మరియు దిశా చట్టం పైఅవగాహన కార్యక్రమము నిర్వహించబడును.
7. యువజన సంఘాల ఏర్పాటు
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల యువతలో అవగాహన కల్పించి అట్టి కార్యక్రమాలలో వారిని భాగస్వామ్యం చేసి వాటి విజయవంతంకై జిల్లా యందు యువజన సంఘాలను ఏర్పాటు చేయడం మరియు ఇంతకు ముందే ఏర్పడిన యువజన సంఘాలను బలోపేతం చేయడం జరుగుతుంది.
డి) సంస్థ నందు పనిచేయు వారి వివరములు
వరుస సంఖ్య | పేరు | హోదా | ఫోన్ నెంబర్ |
---|---|---|---|
1 | వై. వెంకటయ్య | ముఖ్యకార్యనిర్వాహణాధికారి | 9849909074 |
2 | బి. శ్రీనివాస రావు | మేనేజర్ (ఇంచార్జ్) | 9849913074 |
3 | యండి. గయజ్ అహమద్ | సూపరింటెండెంట్ | 9491652138 |
4 | జి. రవిచంద్రన్ | సీనియర్ సహాయకులు | 9848737316 |
5 | సి.వి.ఆర్. ఆంజనేయులు | ఆఫీస్ సబార్డినేట్ | 9000083933 |
6 | కె. వెంకటేశ్వర్లు | ఆఫీస్ సబార్డినేట్ | 9441960779 |
7 | యం. బ్రహ్మయ్య | ఆఫీస్ సబార్డినేట్ | 9908703952 |
8 | పి. ప్రసాద్ రావు | వాచ్ మెన్ | 9849662377 |
ఇ) ఈ మెయిల్ / పోస్టల్ అడ్రస్ వివరములు
ఈ మెయిల్ –
setnelnellore[at]gmail[dot]com
పోస్టల్ అడ్రస్ –
ముఖ్య కార్యనిర్వహణాధికారి,
సెట్నెల్ కార్యాలయము,
ఏ కె. నగర్ పోస్ట్ ఆఫీస్,
ఇండస్ట్రియల్ ఎస్టేట్,
ఆంధ్ర కేసరి నగర్ , నెల్లూరు – 524004