ముగించు

జిల్లా పట్టణ మరియు గ్రామీణ ప్రణాళికశాఖ

ఎ) శాఖ / సంస్థ గురించి పరిచయం:

ఈ కార్యాలయము జి.ఓ.ఎమ్.స్.నేo.292, ఫైనాన్స్ డిపార్టుమెంటు, తేదీ 24.10.2005 ద్వారా 01.03.2007 నుండి ప్రారంభించబడి, జిల్లా పట్టణ మరియు ప్రణాళికాధికారి మరియు సహాయక సిబందితో కార్యకలాపములను కొనసాగించబడుచున్నవి.

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము వారు

        1.జిల్లా పట్టణ మరియు ప్రణాళికాధికారి, 2.టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్, 3. సర్వేయర్ ,4.సీనియర్ సహాయకులను నియామకం చేసియున్న సిబ్బంది ద్వారా మరియు బ్లూప్రింట్ ఆపరేటర్ సర్వే అసిస్టెంట్స్ , కాడ్ ఆపరేటర్ పోస్టులను ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా ఔట్ సోర్సింగ్ పద్దతిలో తీసుకోను విధముగా మంజూరు చేసి వున్నారు.

సంచాలకులు, పట్టాణ మరియు గ్రామీణ ప్రణాళికాధికారివారు తమ ఉతర్వు నేఁ.7284 /07 /పి3 , తేదీ 08.08.2007 ద్వారా జిల్లా అధికారులకు ఈ క్రింది అధికారములను ఇచ్చి వున్నారు.

 సాంకేతిక విషయములు :-

    జిల్లా అధికారులు తమ జిల్లాలోని జనాభా 5000 పైబడి, 10000 లోబడి వున్న గ్రామములందు (మండల కార్య స్దాన గ్రామములు మినహా) ఏ ప్రదేశమును దేనికి యుపయోగించవలెననెడి సూచనలతో      ప్లాన్లు తాయారు చేసి, సంచాలకుల వారి అనుమతులకు పంపించవలెను.

  డి.పి.ఎం.స్ :

   సంచాలకులవారి సూచనల మేరకు నెల్లూరు జిల్లాలోని పురపాలక సంఘ కార్యాలయములనుండి డి.పి.ఎం.ఎస్ లో అనంతర తనిఖీలు, లోపించిన సమాచారం, త్రిప్పి పంపిన ఫైనాన్స్ మరియు భూమి పై తనికీలు వీటికి సంబంధించి లోపించిన సమాచారం తిరస్కరించిన ఫైల్స్ వివరములను తెప్పించుకొని రిపోర్ట్ తాయారు చేసి సంచాలకుల వారికి సమర్పించాలి.

బి.పి.ఎస్

సంచాలకుల వారు ఉత్తర్వులను అనుసరించి, ఈ కార్యాలయముయందు పురపాలక సంగములలో, మరియు నుడా లో వచ్చిన తనిఖీలను నిర్వహించి, బి.పి.ఎస్ ఫిర్యాదులను విన్నపములను పరిశీలించి పని తీరుయొక్క వివరములను ప్రధాన కార్యాలయమునకు పంపించవలిసివున్నది.

పరిశోధనలు:-

సంచలకులవారు ఉత్తర్వులననుసరించి, ఈ కార్యాలయపరిధిలోని నెలకు రెండు గ్రామాలను

సావత్సరిక తనికీలు నిర్వహించి గృహ నిర్మాణములో వున్న / కొత్తగా నిర్మిచిన గృహములయొక్క కొలతలను తీసుకొని సంబంధిత అధికారులు జారీచేసి అనుమతులకు అనుగుణముగా వున్నవో లేవో నిర్ధారించి గ్రామ కార్యదర్శిలకు తీసుకొనవలసిన చర్యలనిమిత్తము తగు సూచనలు ఇవ్వవలసి వున్నది.

గ్రామ ప్రజలకు లేఔట్లు , గృహనిర్మాణముల యొక్క నియమ, నిబంధనలనుగూర్చి వివరించి వారు అనుమతులు తీసుకోనువిధముగా జి.ఓ.ఎమ్.స్.నేo.67 P.R&R.D, తేదీ 26.02.2002 వివరాలను వారికి వివరించాలి.

అవగాహనసదస్సు:

ఈ కార్యాలయపు పరిధిలోని గ్రామా పంచాయతీలలో నెలకు ఒక్క మండలము, ఆయా మండలపరిధిలోని, గ్రామా కార్యదర్శిలకు, సర్పంచులకు భూమి అభివృద్ధి మరియు గృహ నిర్మాణ నియామక పద్దతులను జి.ఓ.ఎమ్.స్.నేo.67 P.R&R.D, తేదీ 26.02.2002 నందు పొందుపరిచిన సూచనలను వివరించుట.

అనుమతులు:-

ఈ కార్యాలయము పరిధిలోని గ్రామ పంచాయతీలలో 2 .50 ఎకరాలలోపు భూమి ఇండ్ల స్థలముగా మార్చుటకు, నివాస గృహ నిర్మాణములకు 3 అంతస్థులపైనా లేదా ఎత్తు 9.00 మీటర్లు పైనా (450 .౦౦ చదరపు మీటర్లులోపు వున్న భూమికి) అనుమతులు ఇచ్చుట మరియు / ఇంజను మరియు కర్మాగారం యొక్క పెట్టుబడి 10 కోట్లు రూపాయల లోపల వున్న కంపెనీలకో సాంకేతిక అనుమతులు ఇచ్చుట.

 

బి) కార్యాలయపు క్రమానుగతశ్రేణి

TOWN AND COUNTRY PLANNING

సి) జిల్లా పట్టణ మరియు గ్రామీణ ప్రణాళికశాఖ వారి కార్యకలాపాలు:-

  1. గృహనిర్మాణ సాంకేతిక అనుమతులు
  2. లేఔట్ల సాంకేతిక అనుమతులు
  3. కర్మాగారములు సాంకేతిక అనుమతులు
  4. ఇండికేటివ్ ల్యాండ్ యూస్ ప్లాన్లను తయారుచేయుట
  5.  సాంవత్సరిక తనిఖీలు
  6.  ఆవగాహన సదస్సులు
  7. సంచలకులవారియితరములైన ఉత్తర్వులను అనుసరించుట

 

డి) సంప్రదింపులు

సీరియల్ నేఁ పేరు హోదా సంప్రదించవలసిన నెంబరు
1. కే. బాబూ రావు జిల్లా పట్టణ మరియు గ్రామీణ ప్రణాళికాధికారి 9849186661
2. యూ.శ్రీనివాస రావు సీనియర్ సహాయకులు 7989419790

 

ఇ) ఇమెయిల్ మరియు తపాలా చిరునామా

జిల్లా పట్టాణ మరియు గ్రామీణ ప్రణాళిక ఆధికారివారి కార్యాలయము

డోర్ నేఁ :908/39, బి.వ్.నగర్,

ఆర్.టి.ఓ కార్యాలయము దగ్గర,

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా

పిన్ కోడ్:524004.

కార్యాలయమునందు సంప్రదించవలసిన నెంబరు:0861-2326811

ఇమెయిల్:dtcponellore[at]rediffmail[dot]com

 

ఎఫ్) ఈ కార్యాలయమునకు సంభందించిన ముఖ్యమైన వెబ్సైట్ల వివరములు

సీరియల్ నేఁ పధకం పేరు వెబ్ సైట్ అడ్రస్సు
1. సంచాలకులు పట్టాన మరియు గ్రామీణ ప్రణాళిక ఆధికారి https://www.dtcp.ap.gov.in
2. ఈ ఆఫీస్ https://nlr.eoffice.ap.gov.in
3. కర్మాగారములు సాంకేతిక అనుమతులు https://www.apindustries.gov.in