చేనేత వస్త్రాలు మరియు వస్త్రాలు
పరిచయం:
-
సహకార రంగం నందు పని చేస్తున్న చేనేత కార్మికులకు మగ్గంపై నేయుటకు అవసరమైన నూలు పాగడాలు ఆప్కో ద్వారా అందచేసి వారి నేసిన ఉత్పతులకు మార్కెటింగ్ సౌకర్యం అందచేస్తూ వారికి వేతనాలు అందిస్తూ వారి జీవనోపాధికి ఆధారముగా పని కలిపిస్తుంది.చేనేత క్లస్టర్స్ లో నమోదైన చేనేత కార్మికులకు మగ్గము మరియు ఇతర మగ్గం పరికరాలు 90% సబ్సిడీ తో అందించబడుతుంది మరియు సహకార రంగం మరియు సహకరేతర రంగం నందు ఉన్న చేనేత కార్మికులకు సామాజిక, ఆర్ధిక, అభ్యున్నతి కొరకుకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వివిధ రకాల ప్రభుత్వ పథకాలు చేనేత మరియు జౌళి శాఖ ద్వారా అమలవుతాయి.
- జిల్లాలో సుమారు 4000మంది మగ్గము కలిగిన చేనేత కార్మికులు ఉన్నారు. మరియు 5,144 చేనేత కుటుంబాలు30 మండలాలలోసంగం, వింజమూరు,A.S.పేట, పొదలకూరు, బుచ్చి, కోవూరు, వెంకటాచలం మరియు నెల్లూరు రూరల్ లో విస్తరించి ఉన్నారు. పాలీ కాటన్ శారీస్, పాటూరు పట్టు, నారాయణరెడ్డి పేట శారీస్ మరియు ఇతర ప్రాంతాలలో కాటన్ శారీస్ రకములు ప్రసిద్ది చెందినవి.
- జిల్లాలో మోతము (18) చేనేత సహకార సంఘములు ఉండగా అవి డార్మేంట్ దశలో ఉన్నవి.
2. జిల్లాలో డిపార్టుమెంటు నిర్మాణం:
గమనిక : చేనేత మరియు జౌళి శాఖ నందు గ్రామ, మండల మరియు డివిజినల్ స్థాయిలలో కార్యాలయాలు కానీ స్టాఫ్ కానీ ఉండరు.
ఉద్యోగ హోదాల వివరాలు:
వ.సం. | ఉద్యోగ హోదా పేరు | మంజురైన సంఖ్య | ప్రస్తుతం పనిచేస్తున్న వారి సంఖ్య | ఖాళీల వివరాలు |
---|---|---|---|---|
1 | సహాయ సంచాలకులు | 1 | 1 | 0 |
2 | అభివృద్ధి అధికారి | 1 | 1 | 0 |
3 | సహాయ అభివృద్ధి అధికారి | 5 | 2 | 3 |
4 | ఆఫీస్ సబ్ ఆర్డినేట్ | 2 | 2 | 0 |
5 | నైట్ వాచ్ మాన్ | 1 | 0 | 1 |
TOTAL | 10 | 6 | 4 |
- చేనేత పరిశ్రమ ప్రగతి తద్వారా చేనేత పారిశ్రామికుల సామాజిక, ఆర్ధిక, అభ్యున్నతి కొరకు చేనేత మరియు జౌళి శాఖ ద్వారా వివిధ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నవి.
2023-24 సంవత్సరములో సాధించిన ప్రగతి వివరములు:
రాష్ట్ర ప్రభుత్వ పథకాలు:
1.నేతన్న నేస్తం పథకం:
2019 వ సంవత్సరములో రాష్ట్ర ప్రభుత్వము చేనేత కార్మికుల సంక్షేమం కొరకు YSR నేతన్న నేస్తం పథకం ప్రవేశపెట్టినది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం చేనేత కార్మికులు తమ స్వంత మగ్గము ఆధునికీకరణ మరియు అనుబంధ పరికరములు అనగా జకార్డు, మోటార్, డాబి, అచ్చులు మరియు పన్నెలు మరియు లాడు కొమ్ములు మొదలగునవి) చేసుకొని మెరుగైన ఉత్పత్తి సాధించుటకు మరియు మర మగ్గముల పోటీనుండి తట్టుకొని చేనేత మార్కెట్ ను పెంపొందించుకొనడం తద్వారా ఆర్థిక జీవన ప్రమాణం మెరుగుపరచుకొనుటకు ప్రభుత్వం ఆర్థిక సహాయమును సంవత్సరమునకు రూ. 24000/-లు ఒక్క కుటుంబానికి ఒక లబ్ధిదారుని చొప్పున (5) సంవత్సరాలు పాటు ఇవ్వబడినది.
వ.సం. | సంవత్సరం | చేనేత కార్మికుల సంఖ్య /చేనేత మగ్గములు | మొత్తం నగదు @24000/- |
---|---|---|---|
1 | 2019-20 | 4110 | Rs.9.8640 Cr |
2 | 2020-21 | 3833 | Rs.9.1992 Cr |
3 | 2021-22 | 3316 | Rs.7.9584 Cr |
4 | 2022-23 | 3639 | Rs.8.7336 Cr |
5 | 2023-24 | 3817 | Rs.9.1608 Cr. |
2023-24 సంవత్సరానికి నియోజకవర్గాల వారిగా నేతన్న నేస్తం పథకం లబ్దిదారులు:
వ.సం. | అసెంబ్లీ నియోజక వర్గం పేరు | లబ్దిదారుల సంఖ్య | పంపిణీ చేయబడిన నగదు (ఒకొక్కరికి రూ.24,000/- చొప్పున) (రూ.లక్షలలో) |
---|---|---|---|
1 | నెల్లూరు రూరల్ | 133 | 31.92 |
2 | నెల్లూరు అర్బన్ | 518 | 124.32 |
3 | కోవూరు | 520 | 124.8 |
4 | కావలి | 74 | 17.16 |
5 | ఉదయగిరి | 652 | 156.48 |
6 | ఆత్మకూరు | 1276 | 306.24 |
7 | వెంకటగిరి (కలువోయ,రాపూరు&సైదాపురం మండలాలు) | 53 | 12.72 |
8 | సర్వేపల్లి | 588 | 141.12 |
9 | కందుకూరు | 3 | 0.72 |
మొత్తం | 3817 | 916.08 |
(2) NTR భరోసా పెన్షన్ పథకం:
ఈ పథకం క్రింద 50 సంవత్సరములు నిండిన చేనేత కార్మికులకు నెలకు రూ.3000/- చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. జూన్ నెల 2024 వరకు 3217 మంది చేనేత కార్మికులు నెలకు రూ.4000/- చొప్పునమొత్తం రూ.1,28,68,000/- లబ్ది పొందియున్నారు.
అర్హత ప్రమాణాలు:
1 | 50 సంవత్సరాలు దాటిన చేనేత కార్మికులు చేనేత పెన్షన్ కు అర్హులు. |
2 | ఒక కుటుంబములో ఒక చేనేత పెన్షన్ అనుమతించబడుతుంది. |
3 | మొత్తం కుటుంబం ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో నెలకు రూ.10,000/- కంటే తక్కువగా ఉండాలి మరియు పట్టణ ప్రాంతాలలో నెలకు రూ.12,000/- కంటే తక్కువగా ఉండాలి. |
4 | అదార్ కార్డ్ ప్రకారం వయస్సు నిర్ధారణ. |
5 | కుటుంబానికి మాగాణి భూమి 3.00 ఎకరాల కంటే తక్కువ ఉండాలి లేదా మెట్ట భూమి 10.00 ఎకరాల కంటే తక్కువ ఉండాలి లేదా మాగాణి మరియు మెట్ట రెండు కలిపి 10.00 ఎకరాల కంటే తక్కువ ఉండాలి. |
6 | కుటుంబం నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు.(టాక్సీ, ట్రాక్టర్లు, ఆటోలు మినహాయించబడ్డాయి) |
7 | కుటుంబ సభ్యులెవరు ప్రభుత్వ ఉద్యోగి మరియు పెన్షన్ దారు కాకూడదు. |
8 | కుటుంబం యొక్క నివాస యూనిట్ (సొంత/అద్దె) విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్స్ కంటే తక్కువ ఉండాలి. |
9 | మునిసిపల్ ప్రాంతాలలో కుటుంబానికి నిర్మించబడిన ప్రాంతము 750 చదరపు అడుగులు కంటే తక్కువ ఉండాలి. |
10 | కుటుంబ సభ్యులెవరు ఆదాయపన్ను చెల్లింపు దారు కాకూడదు. |
నియోజకవర్గాల వారిగా NTR భరోసా పెన్షన్ పథకం కింద చేనేత పెన్షన్ లబ్దిదారులు:
వ.సం. | అసెంబ్లీ నియోజక వర్గం పేరు | లబ్దిదారుల సంఖ్య | పంపిణీ చేయబడిన పెన్షన్నగదు (ఒకొక్కరికి రూ.4,000/- చొప్పున) |
---|---|---|---|
1 | నెల్లూరు రూరల్ | 225 | Rs.9,00,000/- |
2 | నెల్లూరు అర్బన్ | 411 | Rs.16,44,000/- |
3 | కోవూరు | 852 | Rs.34,08,000/- |
4 | కావలి | 115 | Rs.4,60,000/- |
5 | ఉదయగిరి | 314 | Rs.12,56,000/- |
6 | ఆత్మకూరు | 650 | Rs.26,00,000/- |
7 | వెంకటగిరి (కలువోయ,రాపూరు &సైదాపురం మండలాలు) | 53 | Rs.2,12,000/- |
8 | సర్వేపల్లి | 519 | Rs.20,76,000/- |
9 | కందుకూరు | 78 | Rs.3,12,000/- |
GRAND TOTAL | మొత్తం | Rs.1,28,68,000/- |
కేంద్ర ప్రభుత్వ పథకాలు :
(3) ముద్ర యోజన పథకము:
ఈ పథకం క్రింద చేనేత కార్మికులకు మరియు చేనేత సహకార సంఘాలకు ముడిసరుకుల కొనుగోలు నిమిత్తం మరియు వారి యొక్క వృత్తిని అభివృద్ధిపరుచుట కొరకు బ్యాంకుల ద్వారా 20% సబ్సిడీ తో రుణములు మంజూరు చేయబడతాయి.
వ.సం. | సంవత్సరం | లక్ష్యం | బ్యాంకులకు పంపించిన దరఖాస్తులు | సాధించిన ప్రగతి | |||
---|---|---|---|---|---|---|---|
Phy. | Fin. | Phy. | Fin. | Phy. | Fin. | ||
1 | 2019-20 | 400 | 200 | 600 | 300 | 403 | 303.6 |
2 | 2020-21 | 1330 | 665 | 273 | 136.5 | 218 | 160.55 |
3 | 2021-22 | 1478 | 739 | 586 | 295 | 172 | 140 |
4 | 2022-23 | 410 | 205 | 128 | 64 | 45 | 23 |
5 | 2023-24 | 320 | 160 | 265 | 213 | 103 | 86.9 |
6 | 2024-25 (జూలై, 2024) | 475 | 237.5 | 113 | 88 | 10 | 11.1 |
ప్రస్తుత ఆర్థిక సంవత్సరము 2024-25కి గాను చేనేత ముద్రా యోజన పథకం కింద కమీషనర్ మరియు చేనేత జౌళి శాఖ, మంగళగిరి వారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వారికి భౌతికముగా 475 మరియు ఆర్థికముగా రూ.237.50 లక్ష్యముగా నిర్దేశించినారు. జూన్, 2024 వరకు 10 ముద్రా ఋణముల దరఖాస్తులను వివిధ బ్యాంకులకు పంపించడమైనది మరియు ఈ కార్యాలయము యొక్క అభివృద్ది అధికారి మరియు సహాయ అభివృద్ది అధికారులు చేనేత కార్మికుల నుండి ముద్రా ఋణముల దరఖాస్తుల స్వీకరించుచున్నారు మరియు బ్యాంకు మేనేజర్ లతో చేనేత ముద్రా ఋణముల మంజూరు గురించి చర్చించు చున్నారు.
(4) ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా యోజన (PMJJBY):
(5) ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన (PMSBY):
సమగ్ర చేనేత క్లస్టర్ అభివృద్ధి పథకం (CHCDS) కింద అమలులో భాగంగా బ్లాక్ లెవెల్ హ్యాండ్ లూమ్ క్లస్టర్ (BLC)మంజూరు :
(6) బ్లాక్ లెవెల్ చేనేత క్లస్టర్స్:
జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం పథకం (NHDP) కింద వెంకటాచలం బ్లాక్ లెవెల్ హ్యాండ్ లూమ్ క్లస్టర్ 2016-17 సంవత్సరం లో మంజూరు చేయబడినది మరియు ఈ పథకం మేనేజింగ్ డైరెక్టర్, సొసైటీ ఫర్ వీవర్స్ వెల్ఫేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (SWWAP), గుంటూరు వారి ద్వారా నిర్వహించబడుతుంది.
ఈ క్లస్టర్ వివరాలు కింద వివరించబడ్డాయి.
వ.సం. | బ్లాక్ లెవెల్ హ్యాండ్ లూమ్ క్లస్టర్ పేరు | లబ్దిదారుల సంఖ్య | అమోదించబడిన మొత్తం ఖర్చు | 1 వ విడతగా విడుదలైన మొత్తం | 2 వ విడతగా విడుదలైన మొత్తం | విడుదల చేసిన మొత్తం |
---|---|---|---|---|---|---|
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
1 | వెంకటాచలం BLC | 301 | 165.82 | 32.31 | 52.768 | 85.078 |
పైన పేర్కొనిన మొత్తం నగదు ఈ క్రింది విధముగా ఖర్చు చేయబడినది.
అవగాహన శిబిరాలు: రెండు అవగాహన సమావేశాలు నిర్వహించబడ్డాయి.
శిక్షణ కార్యక్రమాలు: 1. 80 మంది చేనేత కార్మికులకుసిల్క్ బై సిల్క్, కాటన్ బై సిల్క్, కటింగ్ బుట వంటి రకాలపై శిక్షణ ఇచ్చారు.
2.20 మంది చేనేత కార్మికులకు డిజైనింగ్ లో శిక్షణ ఇచ్చారు.
-
- లబ్దిదారులకు HSS పథకం కింద ఈ క్రింది విధముగా మగ్గం పరికరాలు పంపిణీ చేయబడ్డాయి.
వ.సం. | హెచ్.ఎస్.ఎస్ పరికరము పేరు | లబ్దిదారుల సంఖ్య | మొత్తం ఖర్చు | ||
---|---|---|---|---|---|
మొదటి విడత | రెండవ విడత | మొత్తం | |||
బేస్ లైన్ సర్వే | 2 | ||||
ప్రోడక్ట్ డెవలప్మెంట్ | 1 | ||||
డాక్యుమెంటేషన్ | 0.25 | ||||
డిజైనర్ మరియు CDE జీతాలు | 8 | ||||
స్కిల్ అప్ గ్రేడేషన్ | 5.98 | ||||
ప్రాజెక్ట్ నిర్వహణ ఖర్చు | 8.5 | ||||
1 | i) ఫ్రేమ్ లూమ్స్ (ఐరన్) – 60″ Frame Loom (Iron) – 60″ RS (alongwith Read, Heald) | 63 | 51 | 114 | 30.74 |
2 | ii) మోటారైస్డ్ లిఫ్టింగ్ డివైస్ ఫర్ జకార్డ్ (Single Liver) | 11 | 12 | 23 | 3.65 |
3 | iii)కంప్లీట్ సెట్ ఆఫ్ జకార్డ్ | 0 | 6 | 6 | 1.1 |
240 hooks | |||||
4 | iv)మోటారైస్డ్ పర్న్ కం బాబిన్/ డబ్బా వైన్డింగ్ మెషిన్ | 6 | 9 | 15 | 0.67 |
5 | v) హీల్స్ /రీడ్స్/బాబిన్స్ (Heals/Reeds/Bobbins etc) | 1 | 0 | 1 | 0.03 |
6 | vi)ఇండివిడ్యువల్వర్క్ షెడ్స్ | 2 | 20 | 22 | 26.39 |
TOTAL | 83 | 98 | 181 | 88.32 |
(7) జాతీయ మరియు జిల్లా స్థాయిలో చేనేత ప్రదర్సనల (ఎక్స్పో& ఎగ్జిబిషన్) నిర్వహణ:
డెవలప్మెంట్ కమీషనర్ ఆఫ్ హ్యాండ్ లూమ్స్ , జౌళి మంత్రిత్వ శాఖ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, న్యూ ఢిల్లీ వారు రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలలో చేనేత ఎక్స్పో లు మరియు ప్రత్యేక చేనేత ఎక్స్పో లు నిర్వహణకు నిధులు మంజూరు చేస్తారు.
ప్రత్యేక చేనేత ఎక్స్పో నిర్వహించడం యొక్క ప్రధాన లక్ష్యం చేనేత సహకార సంఘాలు వద్ద ఉత్పత్త్తి అయిన నాణ్యమైన చేనేత వ్రస్త్ర ఉత్పత్తులను ఒకే వేదిక పై వినియోగ దారులకు తక్కువ ధరలకు (ఉత్పత్తి వ్యయంపై)విక్రయించడం మరియు దీని ద్వారా చేనేత కార్మికులకు నిరంతర ఉపాధి లభ్యమవుతుంది.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రత్యేక చేనేత ఎక్స్పో తేది:15.03.2023 నుండి తేది:28.03.2023 వరకు (14) రోజుల పాటు నిర్వహించబడినది.మొత్తం 70 సొసైటీలు /మాస్టర్ వీవర్స్ మరియు హ్యాండ్ లూమ్ వీవర్ గ్రూప్ లు పాల్గొన్నాయి. రూ.139.13 లక్షల అమ్మకాలు జరిగాయి.
(8) ప్రతి సంవత్సరం ఆగష్టు 7 వ తేదిన జాతీయ చేనేత దినోత్సవాన్ని పాటించడం:
సాధారణంగా క్షీణిస్తున్న చేతి వృత్తుల ప్రత్యేకించి చేనేత పరిశ్రమ పునరుద్ధరణకు మరియు చేనేత వృత్తి యొక్క గొప్ప వారసత్వాన్ని నిలబెట్టడానికి మరియు సమృద్ధిగా కొనసాగించుటకు గౌరవనీయులైన ప్రధాన మంత్రి గారి పిలుపు మేరకు 2015 వ సంవత్సరం నుండి మొత్తం దేశ వ్యాప్తంగా జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగష్టు 7 వ తేది న జరుపుకుంటున్నాము.
ఆప్కో ద్వారా జిల్లా ప్రధాన కార్యాలయాలు మరియు జిల్లాలలోని ప్రముఖ ప్రదేశాలలో జిల్లా స్థాయి చేనేత ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ నిర్వహించడం ద్వారా ఆగష్టు 7 వ తేదిన జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించాలని చేనేత మరియు శాఖ ప్రతిపాదించింది.
జిల్లా ప్రధాన కార్యాలయములలో చేనేత కార్మికులు, స్థానిక MP , MLA లు ఇతర ప్రముఖ నాయకులు మరియు చేనేత మరియు జౌళి శాఖ సిబ్బందితో చేనేత వాక్/ర్యాలీలు జరుగుతాయి.
జిల్లా నలుమూలల నుండి చేనేత కార్మికులు తమ ప్రతినిధులతో పాటు వివిధ అంశాలపై చర్చించడానికి మరియు చేనేత పునరుద్ధరణకు వినూత్న ఆలోచనలను రూపొందించుటానికి అర్థవంతమైన వేదికను అందించే కార్యక్రమములో పాల్గొంటున్నారు.
ఈ సందర్భముగా చేనేత రంగములో ప్రతిభ కనబరిచిన అర్హులైన సీనియర్ చేనేత కార్మికులను గుర్తించి వారిని సత్కరించాలి.
• జాతీయ చేనేత దినోత్సవంగా ఆగష్టు 7 వ తేదిని ఎందుకు ఎంచుకున్నారు:
1905వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వంలో బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూకలకత్తా టౌన్ హాల్లో స్వదేశీ ఉద్యమాన్ని స్మరించుకోవడానికిమరియు ఈ ఉద్యమం దేశీయ ఉత్పతులు మరియు ఉత్పత్తి ప్రక్రియను పునరుద్ధరించడం లక్ష్యంగా పెట్టుకుంది.
(9) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చేనేత కార్మికుల సహకార సంఘం (ఆప్కో):
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చేనేత కార్మికుల సహకార సంఘం (ఆప్కో) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సహకార సంఘాల రిజిస్ట్రేషన్ చట్టం 1964 కింద నమోదైన ప్రాథమిక చేనేత కార్మికుల సహకార సంఘాల ద్వారా ఉత్పత్తి చేయబడిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యము అందించాలనే ప్రధాన లక్ష్యంతో స్థాపించబడినది.
ఆప్కో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఒడిశా మరియు న్యూఢిల్లీ లలో 100 కంటే ఎక్కువ సేల్స్ ఎంపోరియంలను స్థాపించించినది మరియు ఆప్కో కి అనుబంధముగా ఉన్న 952 ప్రాథమిక చేనేత కార్మికుల సహకార సంఘాల ద్వారా ఉత్పత్తి చేయబడిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యమును అందిస్తుంది.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 2 సేల్స్ ఎంపోరియంలు పనిచేస్తున్నాయి ఒకటి నెల్లూరు పట్టణంలో మరియు మరొక సేల్స్ ఎంపోరియం బుచ్చిరెడ్డిపాలెంలో జిల్లా ప్రధాన కార్యాలయానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.
(10) వెంకటగిరి పట్టు చీరల పై సంక్షిప్త నోటు:
(11) పాటూరు కాటన్ సిల్క్ చీరలు ఉత్పత్తికి “ఒక జిల్లా – ఒక ఉత్పత్తి (ODOP)” అవార్డులు:
ఒక జిల్లా – ఒక ఉత్పత్తి (ODOP)” అవార్డుల లక్ష్యాలు :
- ODOP విధానం ద్వారా రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతాలు , జిల్లాలు మరియు విదేశాల్లో భారతీయ మిషన్లు రాష్ట్రం/జిల్లాల ఆర్థిక అభివృద్ధి కోసం చేసే అసాధారణ పనిని గురించడం.
- విజయవంతమైన ODOP ఇంటర్వెన్షన్స్లలో నిర్మాణాత్మక పోటీ, ఆవిష్కరణ మరియు సమర్ధవంతమైన పబ్లిక్ సర్వీస్ డెలివరీని ప్రోత్సహించడం.
- అనుభవ భాగస్వామ్యం ద్వారా ఉత్తమ అభ్యాసాల ప్రతిరూపణ మరియు సంస్థాగతీకరణను ప్రోత్సహించడం.
- ODOP ఉత్పత్తుల సరఫరా గొలుసులో విజయవంతమైన గుర్తింపు మరియు అడ్డంకులను పరిష్కరించడం కోసం చేసిన అవిష్కరనలను గుర్తించడం.
(12)జిల్లాలో కొనసాగుతున్న పథకాలప్రస్తుతం పరిస్థితి:
ఈ క్రింది గ్రామాలలో 3 కొత్త చేనేత కార్మికుల సహకార సంఘాలు మరియు 3 చేనేత అభివృద్ధి క్లస్టర్స్ లను ఈ కార్యాలయము ప్రతిపాదించినది.
1. నారాయణరెడ్డి పేట గ్రామంలోని ఈశ్వరయ్య తోట, నెల్లూరు రూరల్ మండలం.
2. పాటూరు మరియు గుమ్మళ్ళదిబ్బ గ్రామాలు, కోవూరు మండలం.
3. కావలియడవల్లి గ్రామము, అనుమసముద్రం పేట మండలం.
Contacts:
వ.సం. | పేరు మరియు హోదా | మొబైల్ ఫోన్ నెంబర్ |
---|---|---|
1 | శ్రీ పి. వరప్రసాద్, M.A., HDCM, సహాయ సంచాలకులు(చే&జౌ)/జిల్లా చేనేత మరియు జౌళి శాఖ అధికారి. | కార్యాలయ ల్యాండ్ ఫోన్ నెంబర్ :0861-2327996 మొబైల్ ఫోన్ నెం.9393229463 |
2 | శ్రీమతి కె. మాధవి లత, అభివృద్ధి అధికారి(చే &జౌ) | 9490788502 |
3 | శ్రీ పి ప్రసాద రావు, సహాయ అభివృద్ధి అధికారి (చే&జౌ) | 8790596503 |
4 | శ్రీమతి డి.రజని కుమారి, సహాయ అభివృద్ధి అధికారి(చే&జౌ) | 8468869150 |
ఇ-మెయిల్ /తపాలా చిరునామా
E-Mail ID: adhandtnlr[at]ymail[dot]com
సహాయ సంచాలకులు వారి కార్యాలయము,
చేనేత మరియు జౌళి శాఖ,
స్తోనేహౌస్ పేట, జిల్లా గ్రంధాలయము దగ్గర,
రేబాల పిల్లల ఆసుపత్రి క్వార్టర్స్ -1,
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా -524002,
Office Phone No.:0861-2327996