c) పథకాలు / వార్షిక ప్రణాళిక
3.i బ్యాంకు లింకేజి పథకములుః
ప్రభుత్వ ఉత్తర్వుల నెం.31 గి.సం. (జి.సి.సి) శాఖ, తేది.01.06.2015 ప్రకారము మండల స్థాయి ఎంపిక కమిటీచే ఎంపికకాబడిన గిరిజన యానాది, యానాదేతరులు లకు ప్రభుత్వ ఉత్తర్వుల నెం.101 సోషల్ వెల్ఫేర్ (ఎస్.సి.పి-1) శాఖ తేది.31.12.2013, ప్రకారము 18 నుండి 55 మధ్య వయస్సు కల్గిన వారికి వివిధ రకాల జీవనోపాధి సహయతా పథకాలను మంజూరుచేయబడును. యానాదులకు యూనిట్ విలువలో 90% లేదా రూ.1.00 లక్షలు మరియు యానాదేతరులకు యూనిట్ విలువ 60% లేదా రూ.1.00 లక్షలు ఏది తక్కువ అయితే ఆ మొత్తమును సబ్సిడిని మంజూరుచేయబడును. ఆ మేరకు, ఈ ఆర్ధిక సం.ము అనగా 2019-20 లో 1333 మంది గిరిజనులకు రూ.1874.60 లక్షల మేర వార్షిక ప్రణాళికను ఆమోదము పొందియున్నది.
3.ii. ఎన్.ఎస్.టి.ఎఫ్.డి.సి:
ప్రభుత్వ ఉత్తర్వుల నెం.72 గిరిజన సంక్షేమ (టి.డబ్ల్యు.జి.సి.సి) శాఖ, తేది.06.06.2016 ప్రకారము 18 నుండి 45 సం.ముల మధ్య వయస్సు కల్గిన గిరిజన యానాదులకు ఈ పథకము క్రింద వివిధ నైపుణ్యతతో వ్యక్తిగత యూనిట్లను గిరిజన సంక్షేమ శాఖ సబ్సిడితో పాటు, లబ్దిదారుని వాటాతో టర్మ్ లోను మంజూరుచేయుట జరుగుచున్నది.
3.iii. అగ్రికల్చర్ సర్వీసు కనెక్షన్:
గిరిజన వ్యవసాయ రైతులకు మంజూరుచేసిన బోరుబావులకు 100% శాతం పూర్తి సబ్సిడితో ఈ పథకము క్రింద విద్యుత్ సౌకర్యము కల్పించుట జరుగుచున్నది.
3.iv. ఎస్.సి.ఎ-టి.ఎస్.ఎస్.
ఈ పథకము క్రింద ఇతర శాఖల సమన్వయముతో అనగా వ్యవసాయ, ఉద్యాన, మత్స్య మరియు పశుసంవర్ధక శాఖల సమన్వయముతో ట్రైకార్ సబ్సిడితో యూనిట్లను మంజూరుచేయబడుచున్నది. ఆ మేరకు, ఈ ఆర్ధిక సం.ములో అనగా 2019-20 లో 1135 మంది గిరిజన రైతులకు లబ్దిచేకూరే విధంగా రూ.467.14 లక్షలతో అమలుచేయుటకు ప్రణాళిక ఆమోదము పొందియున్నది.
3.v. నైపుణ్యాభివృద్ధి పథకములు:
గిరిజన సంక్షేమ శాఖ మరియు ఆం.ప్ర.రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యములో నిరుద్యోగ గిరిజన యువతీ, యువకులకు నైపుణ్యతో కూడిన వివిధ రకాల శిక్షణలను శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలము ఎర్రగుంట నేషల్ హైవే ప్రక్కన ఏర్పాటుచేసిన యూత్ ట్రైనింగ్ సెంటర్ లో రీటైల్ సెక్టారు, కంప్యూటర్ హార్డ్ వేర్, నెట్ వర్కింగ్, హాస్పిటాలిటీ, జనరల్ డ్యూటీ అటెండెంటు, బ్యాంకింగ్ సెక్టార్లలో ఉచిత శిక్షణను కల్పించి, శిక్షణాంతరము ప్రైవేటు సంస్థలలో ఉద్యోగావకాశాలను కల్పించబడును.
3.vi. గురుకుల విద్యాసంస్థలు:
- పబ్లిక్ మరియు సప్లిమెంటరీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన గిరిజన విద్యార్ధులకు జూనియర్ కళాశాలలో కేటాయించిన సీట్ల మేరకు అడ్మిషన్లు కల్పించబడును.
- గురుకుల విద్యాసంస్థలు అనగా సోమశిల, చిట్టేడు మరియు చంద్రశేఖరపురంలలోని పాఠశాలలో ప్రవేశ పరీక్ష లేకుండా 3వ తరగతి లో అడ్మిషన్లు కల్పించబడును. సదరు పాఠశాలలో ఇతర కులాల వారికి అనగా ఎస్.సిలకు-12%; బి.సిలకు-4%; ఓ.సిలకు-2% ప్రవేశము కల్పించబడును. బ్యాక్ లాగ్ ఖాళీలను గిరిజనులచే మాత్రమే సీట్లను పూరించబడును.
- ఓజిలి మరియు చంద్రశేఖర పురం లలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రవేశ పరీక్షల ద్వారా 6వ తరగతిలో ప్రవేశం కల్పించబడుచున్నది.
3.vii. గిరిజన కాలనీలలో మౌళిక సదుపాయల కల్పన:
గిరిజన కాలనీలలో వివిధ రకాల మౌళిక సదుపాయాలు అనగా రోడ్లు, విద్యుత్ మరియు త్రాగునీటి సౌకర్యములను సంబంధిత శాఖల వారిచే ట్రైబల్ సబ్ ప్లాన్ క్రింద చేపట్టబడును.
3. viii. ఇంజనీరింగ్ పనులు:
ఐ.టి.డి.ఏ ప్రాజెక్టు పరిధీలోని నెల్లూరు, చిత్తూరు మరియు కడప జిల్లాలలోని జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారులు మరియు గురుకుల విద్యాసంస్థల ప్రిన్సిపాళ్ళ వద్ద నుండి వసతి గృహాలు, గురుకుల విద్యాసంస్థలలో మౌళిక సదుపాయాలు, చిన్న రిపేర్లు, భవన నిర్మాణాలకై వచ్చిన ప్రతిపాదనలను గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగముచే అట్టి పనులను చేపట్టబడుచున్నవి.