ఎ) శాఖ / సంస్థ గురించి పరిచయం
తెలుగు గంగ నీటిపారుదల ప్రాజెక్టు అమలు కొరకు అటవీ శాఖ బదలాయించిన రిజర్వు అటవీ ప్రాంతమునకు ప్రత్యామ్నాయముగా రెవెన్యూ శాఖవారు అటవీ శాఖకు కేటాయించిన భూములందు వనీకరణ చేయుటకుగాను ఈ ప్రత్యామ్నాయ వనీకరణ పధకము (తెలుగు గంగ ) విభాగము 1989-90 సం// నందు ప్రాంభించడమైనది. ఈ వనీకరణ విభాగము ద్వారా 1989-90 నుండి 1998 -99 సం// ల వరకు రెవెన్యూశాఖ వారు కేటాయించిన భూములందు నీటిపారుదల శాఖ వారు కేటాయించిన నిధులతో 6930 హెక్టారులులలో తోటల పెంపకము జరిగినది. తదుపరి కేంద్ర ప్రభుత్వము ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 6 సంవత్సరముల కాల పరిమితితో పర్యావరణ యాజమాన్య పధకము మంజూరు చేసినారు. ఈ పధకము ననుసరించి కందలేరు జలాశయ పరివాహక ప్రాంతము మరియు తెలుగు గంగ కాలువల వెంబడి తోట పెంపకమునకునిర్దేశింపబడినది
ప్రణాళిక లక్ష్య్తాలు
- పర్యావరణ పరి రక్షణ, బీడు భూములలో పచ్చదనము అభివృధి చేయుట
- రిజర్వాయరు పరివాహక ప్రాంతము నందు నేల కోతకు గురి కాకుండా నివారించుట
- రిజర్వాయరులో మట్టి పేరుకొని ఉండుటను వనములు పెంచి నిరోధించుట
- వన్యప్రాణుల నివాసానికి అనుగుణంగా అటవీ అబివృద్ధి పరచడము
- అటవీ పెంపకములో వనసంరక్షణ ద్వారా పేదలకు అడవిలో చెట్ల పెంపకము చేయుట ద్వారా ఉపాధి కల్పించడము
క్రమ సంఖ్య | పేరు /ఉద్యోగము | ఖాలీల సంఖ్య |
---|---|---|
1 | ఉప అటవీసంరక్షణాధికారి | 01 |
2 | ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ | 02 |
3 | ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ | 03 |