ముగించు

కేంద్ర కారాగారము

1. శాఖయొక్కసాధారణ నమూనా :

(శాఖ యొక్క పాత్ర మరియు కార్యాచరణ) :

కేంద్ర కారాగారము, నెల్లూరు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ జైళ్ళు మరియు సంస్కరణ సేవల విభాగం నియంత్రణలో ఉంది.ఇది ప్రగతిశీల విభాగం. జైళ్ళశాఖ హోంశాఖ యొక్కనియంత్రణలో పనిచేస్తోంది. గౌరవకోర్టులు లేక ప్రభుత్వము యొక్క అధికారం పొందిన ఇతర ఏజెన్సీలు ద్వారా ఖైదు చేయబడిన వ్యక్తుల యొక్క సంరక్షణ మరియు వారినిఅదుపు చేయుబాధ్యతను,సంబంధిత వారెంట్లలో పేర్కొన్న కాలానికి కేంద్ర కారాగారము, నెల్లూరు కార్యాలయమునకు అప్పగించబడుతుంది. ఈ కారాగారము యొక్క అధీకృత వసతి 700. జైలు అధికారులకు కారాగారమునందు ఖైదు చేయబడిన నేరస్థుల సంస్కరణ యొక్క గొప్ప బాధ్యతను అప్పగించారు మరియు వారిని చక్కగా సంస్కరించి వారిని బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్ది వారిని తిరిగి సమాజంలోనికిపంపించే బాధ్యత జైలు అధికారులపై ఉంది.ఖైదీల సంస్కరణ కొరకువారికిశిక్షణ మరియు ఉత్పత్తి కార్యకలాపాలు, యోగా, ధ్యానం మొదలైన కార్యక్రమములను జైళ్ళ శాఖ చేపట్టడము జరుగుచున్నది.

2. శాఖ యొక్క కార్యాచరణ పథకములు/ చర్యలు/ ప్రణాళికలు/ లక్ష్య ప్రకటన :

1. మిషన్:

ఆంధ్రప్రదేశ్ మరియు సంస్కరణల సేవల శాఖ జైళ్లను నిర్వహిస్తుంది. ఖైదీలకు విచారణ మరియు దోష నిర్ధారణ జరిగినప్పుడు వారికి శిక్షణ పొందిన జైళ్ళ సిబ్బంది ద్వారా సురక్షితమైన పర్యావరణాన్ని అందిస్తుంది. ఇది కాక ప్రతిఖైదీకి తనను తాను పునరుద్ధరించుకొని శిక్షా కాలం అనంతరం మరలా సమాజములో భాద్యత గల పౌరుడిగా మెలుగుటకు అవకాశము కల్పిస్తుంది. అలా జైళ్ళ శాఖ సమాజ రక్షణచేస్తూ రాష్ట్రానికి నిరంతరం సేవలు అందిస్తుంది.

2. దృష్టి:

మాదృష్టిఅంతా సమాజ శ్రేయస్సుకొరకు అద్బుతమైన సంస్కరణ సేవలను అందించి ఇతరులు అనుకరించు లాగా మరియు దేశము గర్వించేలా ఆదర్శనీయముగా అభివృద్ధి చెందటానికి ముఖ్యపాత్ర వహిస్తుంది.

3. లక్ష్యాలు:

  • లక్ష్య సాధనకు మా యొక్క నియమావళి.
  •  ఖైదీలనుసురక్షిత నిర్బంధంలో ఉంచండం.
  • ఖైదీలపైనియంత్రణ, క్రమశిక్షణ వంటి వాటిని నిర్వహించడం, వారిలోఆరోగ్య పరిరక్షణమరియుఆరోగ్యకర వాతావరణము నెలకొల్పడం.
  • ఖైదీలకు ప్రాధమికముగా అవసరమైన మంచి ఆహారం, దుస్తులు, పడక బట్టలుమరియు ఆరోగ్య సంరక్షణ వంటి అవసరాలను అందుబాటులో ఉంచడం.
  • ఖైదీలకు చట్టం పట్ల విధేయత కలిగి ఉండేలా వారికి అవసరమైన సమాచారాన్ని అందించే వాతావరణాన్ని కల్పించే అలవాటు చేయడం.
  • ఖైదీలను జైలు నుంచి సమాజము లోనికి విడుదల చేసేలోగా వారిని సమాజం పట్ల ఒక భాద్యత గల పౌరునిగా సంస్కారవంతులుగాతీర్చిదిద్దిబయటకు పంపడం.
  • జైలు సిబ్బందినిక్రమశిక్షణతోను, హుందాగానువ్యవహరించేలా వారికి అవసరమైన శిక్షణ ఇవ్వడం, వారికి పునశ్చరణ తరగతులునిర్వహించడం మరియు అధికారులతో పరస్పర సమావేశములు నిర్వహించడం.
  • జైళ్ళ సేవలను దృడ దీక్షతో, సమర్ధతతో అమలు చేయడం. ఆయా సేవల ద్వారా ఎంచుకున్న ఆశయాలను, లక్ష్యాలను చేరుకోవడంలో ఆధునికముగా సామర్ద్యమును కనపరచడం.
  •  ఇతర ప్రభుత్వ శాఖల సహకారాన్ని తీసుకోవడం, వారితో సమన్వయముతో వ్యవహరించడం, ముఖ్యముగా నేరమరియు న్యాయ వ్యవస్థకు సంబంధించిన విభాగాల సహకారంతో శాంతియుత సమాజ స్థాపనకు పాటుపాడడం.
మా దృష్టినిగుర్తెరిగిమా లక్ష్యాలను సాధించుటలోక్రింది విలువలకు కట్టుబడిఉంటాం.

4. విలువలు:

  •  మా యొక్క కార్య సాధనకు సమగ్రత ప్రాధమిక లక్ష్యముగాఉంటుంది:మేము ఎంతోనమ్మకముగామరియుబహిరంగముగాఇంకాసమర్ధవంతమైనపరిశీలనతోపనులుమొదలు పెడతాము. అదే సమయములో ప్రజల సొమ్ము మరియు ఆస్తులను గురించి శ్రద్ధ వహిస్తాము.
  • సిబ్బంది నిబద్దత:సిబ్బంది యొక్క సమర్ధతనుమరియు సామర్ధ్యాన్ని ఉపయోగించి వీలైనంత మేర ఖైదీలను సరిదిద్దేందుకు నిబద్ధులమైఉన్నాము. ఏ సంస్థ కైనా నిబద్ధత గల సిబ్బందే ప్రధానమైన ఆస్తి. కాబట్టివిధుల్లో వీలైనంత సామర్ద్యాన్నిప్రదర్శించుటకు కృషి చేయుచూ ఖైదీలలోబృంద కార్యక్రమాల పట్ల ఆసక్తిని ప్రోత్సహించి, వారి పట్ల సిబ్బంది ఎంతో ఉదారంగాను, గౌరవ ప్రధంగాను వ్యవహరించాల్సివుంది. వారి సంరక్షణ మరియు సంక్షేమం కారాగార సిబ్బందియెక్క ప్రాధమిక ఉద్దేశములు.
  • ఖైదీల పట్ల జాగ్రత్త: ఖైదీలను తోటి వ్యక్తులుగా గుర్తించి వారి పట్ల ఎంతో ఉదారముగావ్యవహరించడం. వారిని శిక్షించడం అంటేవారి స్వేచ్చకుభంగం కలిగించడమేనని గ్రహించాలి. ఖైదులో ఉండగా వారికి గుర్తించబడిన కొన్ని హక్కులు ఉంటాయని, నిర్ణయాలు తీసుకోవడానికి కారణాలు వారికి వివరించి, వారికి ఇబ్బంది కలిగించే అంశాలను గురించి వారితో చర్చించడంమరియు వారి కుటుంబ సభ్యులతో చర్చించడం.
  • సమాన అవకాశాలు: ఖైదీలను సంస్కరించే విషయంలో, వారికి పునరావాసం కల్పించే విషయములో అందరినీ ఒకే విధముగా సమానముగా చూసేందుకు నిబద్దులమై ఉన్నాము. ఖైదులో ఉండగా వారి జీవనానికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకువారిపై ఎటువంటి వివక్షను ప్రదర్శించబడదు.
  • జైలు సిబ్బంది విధులలో విజయం సాధించాలంటే వారి పనితీరును మెరుగు పరచుకోవడం, అందుకోసం అధునాతన పద్దతులను కనుగొనడం అవసరం. ఖైదీలలో సంస్కరణలు తెచ్చే విషయములో మన పనిని సమర్దవంతముగా నిర్వహించాలంటే మనం నూతన విధానాలను తెలుసుకొనిఅభివృద్ధి చేసుకోవడం, మెరుగైనసేవలనుఅనుసరించడం చాలా ముఖ్యం.

3. సంస్థ నిర్మాణము:

Organization Structure

4.సంప్రదించ వలసిన చిరునామా :

క్రమ సంఖ్య పేరు మరియు హోదా ఫోన్ నెంబర్ ఈ మెయిల్ చిరునామా
1 కె.రాజేశ్వరరావు, పర్యవేక్షణాధికారి, కేంద్ర కారాగారము, నెల్లూరు 9494633857 cp-nellore@ap.gov.in కాకుటూరు గ్రామము, చేముడుగుంట పోస్టు, వెంకటాచలము (మండలము),SPSRనెల్లూరు జిల్లా.