ముగించు

జాతీయ బాల కార్మిక పథకము (ఎన్.సి.ఎల్.పి)

ఎ) పథకము గురించి పరిచయము:

జాతీయ బాల కార్మిక పథకము నూటికి నూరు శాతము భారత ప్రభుత్వనిధులతో మినిస్ట్రీ ఆఫ్ లేబర్ మరియు ఎంప్లాయిమెంట్, న్యూఢిల్లీ వారి సహకారముతో నిర్వహింపబడుతున్న పథకము. జాతీయ బాల కార్మిక పథకము1860 సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం క్రింద రిజిస్టర్ కాబడిన సంస్థ. ఈ సంస్థకు జిల్లా కలెక్టర్ వారు చైర్మన్ గా ముఖ్యమైన ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్చంధ సంస్థలు, ట్రేడ్ యూనియన్ నాయకులు కమిటి సభ్యులు గా వుంటారు.

బి) సంస్థ యొక్క నిర్మాణము:

NCLP

సి) ఉద్దేశాలు :

  1. అన్నీ రంగాలలో బాల కార్మికులను విముక్తి కల్పించుటకు.
  2. ప్రమాదకరమైన వృత్తులు / పనులలో పనిచేసే పిల్లలను విముక్తి కలిగించి వారిలో వృత్తి నైపుణ్యతను పెంపొందించుటకు.
  3. బాల కార్మికులను నిరంతరం మానిటర్ చేస్తూ అందరిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి పెన్సిల్ పోర్టల్ లో బాలకార్మికుల వివరములను ఎప్పటికప్పుడు నమోదు చేయించుటకు.

సంస్థ పాత్ర మరియు బాధ్యతలు:

  1. బాల కార్మికుల సర్వే నిర్వహించడం.
  2. సర్వేలో గుర్తించ బడిన బాల కార్మికులకు స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం.
  3. మండల మరియు జిల్లా స్థాయిలో బాల కార్మికతకు సంబంధించిన చట్టాలను అమలు అయ్యే విధముగా చేయడం.
  4. బాల కార్మికులను విముక్తి కలిగించు కొనుటకు స్పెషల్ టాస్క్ ఫోర్సు కమిటీని ఏర్పాటు చేయడం.

స్పెషల్ ట్రైనింగ్ సెంటర్ ను గురించి:

  1. ప్రతి సెంటరులో కనిష్టముగా 15 గరిష్టముగా 50 మంది పిల్లలు వుంటారు.
  2. 20 మంది పిల్లలకు ఒక్క వాలంటరీ టీచర్.
  3. స్వచ్చంధ సంస్థల నిర్వాహకులు పిల్లలకు అవసరమైన విద్యను అందించి త్వరగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించుతారు.
  4. సర్వ శిక్షా అభయాన్ నుండి మధ్యాహ్న భోజన పథకము అమలు.
  5. ప్రతి సెంటర్ లో పిల్లలు కనిష్టముగా 3 నెలలు గరిష్టముగా 2 సంవత్సరములు మాత్రమే ఉండవలసి వుంటుంది.
  6. పిల్లలకు స్టైఫండ్ క్రింద నెలకు రూ.400/-లు చెల్లింపు.

ప్రస్తుతము జిల్లాలో క్రింద తెలియపరచిన ప్రకారము స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లు నిర్వహింపబడుతున్నవి.

వరుస  సంఖ్య సంస్థ పేరు ఎస్.టి.సి. నిర్వహిస్తున్న ప్రాంతము పిల్లల సంఖ్య
1 బృందావన్ చైల్డ్ వెల్ఫేర్ సొసైటి శివాలయం స్ట్రీట్, ఆత్మకూరు 27
2 కోస్తా సేవా సమితి -1 కసుమూరు (వి) వెంకటచలం (మం) 22
3 గ్రాస్ ఒంటెలమిట్ట, వెంకటగిరి (మం) 26
4 ఇందిరా భారతి రూరల్ డెవలప్మెంట్ సొసైటి-1 ఎస్.టి.కాలనీ, దోసకాయల దిబ్బ , నెల్లూరు రూరల్ 27
5 ఇందిరా భారతి రూరల్ డెవలప్మెంట్ సొసైటి-2 కోడూరుపాడు, నెల్లూరు రూరల్ 35
6 జయలక్ష్మి మహిళా మండలి -1 చంద్ర మౌళి నగర్, పెద్ద పడుగుపాడు, కోవూరు (మం) 35
7 జయలక్ష్మి మహిళా మండలి -2 భగత్ సింగ్ కాలని, నెల్లూరు టౌన్ 30
8 జాస్మిన్ డ్వాక్రా గ్రూప్ మరుపూరు (వి) పొదలకూరు (మం) 26
9 మహిళా దక్షత సమితి ఇస్లాంపేట, వెంకటేశ్వరపురం, నెల్లూరు టౌన్ 24
10 మైత్రేయిని చారిటబుల్ ట్రస్ట్ కల్లూరుపల్లి ఇందిరమ్మ కాలని, నెల్లూరు 25
11 పీపుల్స్ ఫ్రీ సర్వీస్ హెల్ప్ అడ్వైస్ కమిటి సెంటర్ -1 రాజేంద్ర నగర్, నియర్ ఓల్డ్ కరెంట్ ఆఫీస్,, నెల్లూరు టౌన్ 25
12 పీపుల్స్ ఫ్రీ సర్వీస్ హెల్ప్ అడ్వైస్ కమిటి సెంటర్ -2 పొట్టేపాళెం రోడ్, అరటి తోపు,, నెల్లూరు 23
13 పీపుల్స్ ఫ్రీ సర్వీస్ హెల్ప్ అడ్వైస్ కమిటి సెంటర్ -3 యర్రదోనే, హరనాధపురం,నెల్లూరు టౌన్ 22
14 రూరల్ రీ-కన్స్ట్రక్షన్ సొసైటి ఎస్.సి.కాలనీ,బుడమగుంట , కావలి 23
15 రమాబాయి అంబేద్కర్ మహిళా మండలి -1 వైకుంఠపురము, బోడిగాడితోట, నెల్లూరు టౌన్. 26
16 రూరల్ ఎడ్యుకేషనల్ అండ్ చైల్డ్ హెల్త్ సొసైటి ముసునూరు ఇందిరమ్మ కాలని, కావలి 30
17 రూరల్ రీకన్స్ట్రక్షన్ అండ్ రిహాబిలిటేషన్ ఎడ్యుకేషనల్ సొసైటి-1 దేవరదిబ్బ గిరిజన కాలని, ముత్తుకూరు (మం) 28
18 సూర్య పూర్ ఓల్డ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటి -1 జంగాల కాలనీ, మంచాలపల్లి (వి) అనంత సాగరం (మం) 29
19 సూర్య పూర్ ఓల్డ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటి -2 రాజుపాళెం (వి) కలువాయి (మం) 26
20 తమ్మినేని కృష్ణయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఎ.సి.నగర్, నెల్లూరు టౌన్ 23
21 విజయ మహిళా మండలి -1 వై.ఎస్.ఆర్,నగర్, కొత్తూరు, నెల్లూరు టౌన్ 20
22 విజయ మహిళా మండలి -2 ఐ.ఎం.ఎల్.డిపో, ఎస్.టి.కాలనీ, దేవర పాళెం, నెల్లూరు రూరల్ 21
23 విందుజ రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సొసైటి-1 తిప్ప సెంటర్ , జొన్నవాడ (వి) బుచ్చి రెడ్డి పాళెం (మం) 30
24 బ్రైట్ వే ఫౌండేషన్ బీరంగుంట (వి) అల్లూరు (మం) 30
25 విందుజ రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సొసైటి-2 కొండాయగుంట ఎస్.టి.కాలనీ, బుచ్చి రెడ్డి  పాళెం (మం) 23
26 రమాబాయి అంబేద్కర్ మహిళా మండలి -2 కొండయ్య తోపు, 3 వ మైలు, నెల్లూరు టౌన్. 29
27 శ్రీనివాసమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ శివాజీ నగర్, కొత్తూరు, నెల్లూరు టౌన్ 20
28 స్వయంకృషి రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సొసైటి గున్నంపడియ (వి) కోట (మం) 22
29 కోస్తా సేవా సమితి -2 స్వర్ణ భారత్ ట్రస్ట్ , వెంకటాచలం (మం) 21
    మొత్తము 748

 

డి) సంస్థ నందు పని చేయు వారి వివరములు:

వరుస సంఖ్య పేరు హోదా ఫోన్ నంబర్
1 శ్రీమతి. ఎస్. కనక దుర్గా భవాని ప్రాజెక్ట్ డైరెక్టర్ (ఇన్ చార్జి) 9849909074
2 శ్రీ. పి. మధుసూదనరావు ప్రోగ్రాం మేనేజర్ 9490328899
3 శ్రీ. పి. రమేష్ ప్రోగ్రాం మేనేజర్ 9440130364
4 శ్రీ. ఎ. అనిల్ కుమార్ క్లర్క్ కం – అకౌంటెంట్ 9247486554
5 శ్రీమతి. సి.హెచ్. అమ్మణ్ణి డేటా ఎంట్రీ ఆపరేటర్ 9493028855
6 శ్రీ. జి. వెంకటేశ్వర్లు అటెండర్ 9505853880
7 శ్రీ. కె. మల్లిఖార్జున వ్యాన్ డ్రైవర్ 8919040080

ఇ) ఇ-మెయిల్ పోస్టల్ వివరములు:

అడ్రసు : ప్రాజెక్ట్ డైరెక్టర్, జాతీయ బాల కార్మిక పథకము, రూము నం.15,అంబేద్కర్ సంక్షేమ భవన్, సుబేదారుపేట, నెల్లూరు.

ఇ-మెయిల్ : pdnclpnlr[at]gmail[dot]com