జిల్లా గిరిజన సంక్షేమ శాఖ
ఎ) ప్రొఫైల్
-
- నవ్యాంధ్రలో మొత్తం 34 గిరిజన తెగలలో అత్యధికంగా ఈ జిల్లలో యానాది, ఎరుకుల, నక్కల తెగల వారు అన్ని మండలాలలోని నివశించుచున్నారు.
- సాధారణంగా యానాది తెగ వారు చెరువుగడ్లపై, జనావాసానికి దూరంగా నివశిస్తుంటారు. ముఖ్యంగా వీరియొక్క ప్రధాన వృత్తి చేపల వేటగాను వ్యవసాయ కూలీలుగాను, పారిశుభ్ర కూలీలుగాను, రిక్షా కూలీలు మొదలగు వృత్తులు వీరియొక్క జీవనాధారం. ఎరుకుల తెగల వారు ప్రధాన వృతి చిన్న చిన్న వ్యాపారాలు చేయడం, బాతులు పెంచడం, వ్యాపార రీత్యా ఇతర రాష్ట్రాలకు వెళ్ళడం జరుగును మరియు నక్కల తెగల వారు కూడా ప్రధాన వృతి బొమ్మలు తయారు చేసి చిన్న చిన్న వ్యాపారాలు చేయడం, వ్యాపార రీత్యా ఇతర రాష్ట్రాలకు వెళ్ళడం జరుగును.
- మొత్తం జనాభాలో 40.49% తో అక్షరాస్యత కల్గియున్నారు. ఇందులో పురుషులు 43.51 % మరియు స్త్రీలు 37.39% తో అక్షరాస్యతతో ఈ క్రింద తెల్పిన జనాభా (సెన్సెక్స్ 2011) కల్గియున్నారు.
మండలాలు | పంచాయితీ | హ్యాబిటేషన్స్ | సాధారణ జనాభా | గిరిజన జనాభా | శాతం | |||
---|---|---|---|---|---|---|---|---|
యానాది | నాన్ యానాది | మొత్తం | ఎస్.టి | యానాది | ||||
38 | 824 | 1249 | 2469712 | 176314 | 39138 | 215452 | 8.72 | 88.00 |
బి) ఆర్గనైజేషన్ చార్ట్
సి) పథకాలు / వార్షిక ప్రణాళిక
షెడ్యూల్డు తెగల విద్యార్దుల కోసము గిరిజన సంక్షేమ శాఖ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా యందు 34 విద్యాలయములు నిర్వహించబడుచున్నవి, వాటి వివరములు ఈ దిగువ చూపడమైనది.
వివిధ రకముల విద్యాలయాలు :
విద్యాలయాలు | బాలురు | బాలికాలు | కో- ఎడ్ | మొత్తం విద్యాలయాలు | విద్త్యాలయాలలో చేరిన విద్యార్ధుల సంఖ్య |
---|---|---|---|---|---|
రెసిడెన్షియల్ పాఠశాలలు | 6 | 4 | 0 | 10 | 1929 |
ఆశ్రమ ఉన్నత పాథశాల | 0 | 1 | 1 | 1 | 488 |
సమీకృత సంక్షేమ వసతి గృహ సముదాయము | 1 | 0 | 0 | 1 | 101 |
ప్రి మెట్రిక్ వసతి గృహము | 1 | 0 | 0 | 1 | 180 |
పోస్ట్ మెట్రిక్ వసతి గృహము | 1 | 1 | 0 | 1 | 82 |
గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ | 0 | 0 | 19 | 19 | 299 |
మొత్తము | 8 | 7 | 20 | 33 | 2780 |
విద్యార్దులకు కల్పించు సౌకర్యాలు :
- డైట్ చార్జీలు @ Rs. 1,150/-(3rd & 4th తరగతులకు), మరియు @ Rs.1400/-(5th to 10th తరగతులకు).
- కాస్మెటిక్ చార్జీల క్రింద @ Rs.125/- బాలురకు (3rd & 4th తరగతులకు), మరియు @ 130/- for బాలికలకు మరియు Rs. 150/- బాలురకు (5th to 10th తరగతులకు ) మరియు @ 200/- బాలికలకు చొప్పున కాస్మెటిక్ వస్తువులు సరఫరా చేయబడును మరియు 3rd to 10th తరగతి చదువు బాలురకు హెయిర్ కటింగ్ చార్జీల క్రింద నెలకు @ 30/- చెల్లించబడును.
మార్చి 2024 పడవ తరగతి ఫలితాలు :
మొత్తం విద్యార్ధులు | జిల్లా స్థాయిలో ఉత్తీర్నత శాతము | |||
---|---|---|---|---|
పరీక్షకు హాజరైన వారు | ఉత్తీర్నత అయినవారు | పరీక్ష తప్పినవారు | ఉత్తీర్నత శాతము | |
320 | 267 | 53 | 83 | 83.19 |
మెట్రిక్ అనంతర ఉపకారవేతనములు :
జిల్లాలోని కళాశాలలో (ప్రభుత్వ / ప్రైవేటు ) ఇంటర్మీడియట్ మరియు ఆ పైన తరగతులు చదువు షెడ్యూల్డు తెగల విద్యార్దులకు ఉపకారవేతనములు మరియు పూర్తీ ఫీజు రీ యంబర్సుమెంటు మంజూరు చేయబడును.2023-24 విద్య సంవత్సరము కాను Rs.10327397/- మొదటి క్వార్టర్ ద్వారా 1632 విద్యార్దులకు తేది: 01/03/2024 న విడుదల చేయబడినది.
ప్రి – మెట్రిక్ ఉపకారవేతనములు:
అమ్మ వొడి :
2021-22 విద్య సంవత్సరము కాను అమ్మ వొడి పధకం క్రింద 45077 విద్యార్దులకు కాను 28878 విద్యార్దులకు వారి తల్లుల బ్యాంకు ఖాతా లో జమచేయబడినది.
ఉచిత విద్యుత్ పధకము :
100 యూనిట్ల లోపు విద్యుత్ వాడు షెడ్యూల్డు తెగల కుటుంబాలకు ఈ పధకము ద్వారా ఉచిత విద్యుత్ అందించబడును. ప్రభుత్వ ఉత్తర్వ్యులు No.91 SW (SCP.A2) Dept, Dt. 24.07.2019 ప్రకారము ఉచిత విద్యుత్ యూనిట్ల వాడకము 200 యూనిట్ల వరకు పెంచడము జరిగినది.
RoFR పధకం:
ఈ పధకం 2006 వ సంవత్సరము లో ప్రారంభం అయినది. కావున ఈ పధకం క్రింద మొత్తము 1060 పట్టాలు ద్వారా 28099 ఎకరముల అడవి భూమిని పంపిణి చేయడమైనది.
డి) అధికారుల వివరములు:
వ.నెం. | అధికారి పేరు మరియు హోదా | మొబైల్ నెంబరు |
---|---|---|
1 | శ్రీమతి, పి బి కె పరిమళ జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి | 9490957020 |
2 | శ్రీ బి రాజసోము , పర్యవేక్షకులు | 9985674700 |
3 | శ్రీ కె.అంకయ్య, సహాయ గిరిజన సంక్షేమ అధికారి, నెల్లూరు | 9247132758 |
ఇ) కార్యాలయపు చిరునామా మరియు ఇ-మెయిల్ వివరములు
ఇ-మెయిల్ :
dtwo[dot]nlr[at]gmail[dot]com
చిరునామా :
జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి వారి కార్యాలయము,
కొండాయపాళెం గేటు దగ్గర
దర్గామిట్ట, ఎల్.ఐ.సి. ప్రక్కన
నెల్లూరు – 524 004.
టెలిఫోను : 0861-2328603
ఎఫ్) ముఖ్యమైన వెబ్ సైట్ల వివరములు:
వ.నెం. | వివరణ | వెబ్ సైట్ చిరునామా |
---|---|---|
1 | జిల్లా ఎన్.ఐ.సి. కేంద్రము | http://www.nellore.ap.gov.in/ |
2 | సమాచార హక్కు చట్టం | https://www.apic.gov.in |
3 | స్పందన | http://spandana.ap.gov.in/officer_login |
4 | బయోమెట్రిక్ – అటెండెన్సు | http://apitdanlr.attendance.gov.in |
5 | ఏ.పి. ట్రైబ్స్ | http://aptribes.gov.in/ |
6 | సి.ఎఫ్.యం.ఎస్., | http://cfms.ap.gov.in |
7 | గురుకులం | http://aptwgurukulam.ap.gov.in/ |
8 | జ్ఞానభూమి | https://jnanabhumi.ap.gov.in |
9 | నిధి పేరోల్ హెర్బ్ | https://nidhi.apcfss.in/login |
10 | సర్వీస్ చైన్ మ్యనేగేమెంట్ | https://scm.ap.gov.in/ |