ఎ) సంస్థ యొక్క వివరాలు :
జిల్లా వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం లిమిటెడ్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంస్థను 20-12-1976 వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగినది.
లక్ష్యాలు :
జిల్లా సంఘము యొక్క ప్రధాన లక్ష్యాలు :
- వెనుకబడిన తరగతులకు చెందిన పేదలను సాంఘికంగా మరియు ఆర్ధికంగా అభివృద్ధి చేయుటకుగాను ఆదాయాన్ని కలిగించు ఆస్తులను సృష్టించుటకు ఆర్ధిక సహయం అందించుట.
- ఆర్ధిక మద్దతు పథకాలలో నెలకొని ఉన్న సంక్లిష్ట అర్దికాంతరాలను పూరించుట.