ముగించు

సహాయ చెల్లింపుల మరియు ఖాతాల అధికారి – 1, పనులు ఖాతాల విభాగం

ఎ) శాఖ / సంస్థ గురించి పరిచయం:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్ధిక శాఖకు సంబంధించి పనులు మరియు ఖాతాల విభాగములో ప్రధాన కార్యాలయం అయిన డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అక్కౌంట్స్, ఇబ్రహీంపట్నం, విజయవాడ వారి పరిధిలో ఈ జిల్లాలో రెండు కార్యాలయాలు పని చేస్తున్నవి. అవి,

  1. సహాయ చెల్లింపుల మరియు ఖాతాల అధికారి కార్యాలయం -I, పనులు ఖాతాల విభాగం, నెల్లూరు.
  2. సహాయ చెల్లింపుల మరియు ఖాతాల అధికారి కార్యాలయం -II, పనులు ఖాతాల విభాగం, నెల్లూరు.

బి) సంస్థాగత నిర్మాణం

FINANCE

సి) పనులు మరియు విధివిధానాలు::

ఈ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమునకు సంబంధించిన ఇంజనీరింగ్ శాఖలు అయిన జలవనరులశాఖ, పంచాయితీరాజ్, గ్రామీణ నీటి పారుదల, ప్రజా ఆరోగ్యశాఖ మరియు కార్పొరేషన్స్ (ఆంధ్రప్రదేశ్ పోలీసు హౌసింగ్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్, ఆంధ్రప్రదేశ్ విద్య మరియు సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ, మొదలగునవి) ద్వారా చేయించిన పనులకు సంబందించిన బిల్లులు ఈ కార్యాలయంలో ఆడిట్ చేసి CFMS ద్వారా అనుమతించిన తరువాత సదరు చెల్లింపులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్ధిక శాఖ నుండి e- కుబేరు ద్వారా సంబందిత లబ్దిదారు/ ఏజెన్సీ బ్యాంకు ఖాతాకు జమచేయపడుతుంది.

పనులకు సంబందించిన బిల్లులలో ఏమైనా లోటు పాట్లు ఉన్నపుడు సదరు శాఖ అధికారి CFMS ద్వారా తెలుసుకొని ఆ లోటు పాట్లను సరిచేసి తిరిగి బిల్లును మరల ఈ కార్యాలయమునకు పంపిన తరువాత సదరు బిల్లునుచెల్లింపులకు ఈ కార్యలయం అనుమతించబడును. ఇంకనూ సాదారణ ప్రజానీకానికి బిల్లు ఏ స్థితిలో ఉన్నదో CFMS “బిల్లు స్టేటస్” నందు తెలియజేయబడుతుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ ఇంజనీరింగ్ శాఖల వారు పంపిన బిల్లులలో ఈ కార్యాలయం ద్వారా అనుమతించి బిల్లుల వివరాలు ఎప్పటికప్పుడు ఖచ్చితముగా ఖర్చు వివరములు తెలుసుకొని మరియు బడ్జెట్ చూసుకొని బిల్లుల చెల్లింపులు అనుమతించబడును.

డి) పరిచయాలు:-

క్ర.సం. పేరు హోదా ఫోన్ నంబరు
1 శ్రీ వి. శ్రీనివాస్ డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అక్కౌంట్స్, విజయవాడ 9849908961
2 శ్రీ ఎం. రవీంద్ర ప్రసాద్ బాబ్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అక్కౌంట్స్, ఒంగోలు 9849908964
3 శ్రీ ఎస్. శ్రీపతి ఆచార్యులు అసిస్టెంట్ పే & అక్కౌంట్స్ ఆఫీసర్-I, వర్క్స్ అక్కౌంట్స్, నెల్లూరు 9866777973
4 శ్రీ ఆర్. రామకృష్ణ రావు సూపరింటెండెంట్ (అడ్మిన్) 9676734167
5 శ్రీ కె.వి. శేషయ్య సూపరింటెండెంట్ 9177766098
6 శ్రీమతి పి. అనిత సూపరింటెండెంట్ 9246438198

ఇ) ఇ-మెయిల్ / పోస్టల్ చిరునామా:

ఇ-మెయిల్: paosp_nlr[at]yahoo[dot]co[dot]in

చిరునామా: O/o సహాయ చెల్లింపుల మరియు ఖాతాల అధికారి కార్యాలయం -I, పనులు

ఖాతాల విభాగం, టి.జి.పి. ప్రాంగణం, ఎన్.జి.ఓ. హోం ఎదురుగా, దర్గామిట్ట, ఎస్.పి.ఎస్.ఆర్. నెల్లూరు జిల్లా, 524003.

ఎఫ్) ముఖ్యమైన వెబ్‌సైట్ లింకులు:-

సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సి.‌ఎఫ్‌.ఎం‌.ఎస్.) పోర్టల్ కోసం

https://cfms.ap.gov.in.