శాఖయొక్కసాధారణ నమూనా : (శాఖ యొక్క పాత్ర మరియు కార్యాచరణ)
ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర పునర్విభజన అనంతరం ఈ శిక్షణా సంస్థను హైదరాబాద్ నుండి 2015 సం. లో జి.ఓ. యం.యస్. నెం. 121, తేది: 25-07-2014 ప్రకారం నెల్లూరులో పాత కేంద్రకారాగారం, మూలాపేట, నెల్లూరు నందు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సంస్కరణ సేవల శిక్షణా అకాడమీ (ఏ.పి. స్టార్స్) గా ఏర్పాటు చేయడమైనది.ఆంధ్ర ప్రదేశ్ జైళ్ళ శాఖ అధికారులు శిక్షణాలో భాగంగా ఈ శిక్షణా సంస్థనందు శారీరక దృఢత్వ, మానసిక పరిపక్వత, విదులయందు సేవా, భక్తి, కర్తవ్య నిష్టత, పెంపొందించే విధంగా కరినమైన శిక్షను ఇవ్వడం జరిగింది. శిక్షణలో భాగంగా ఇన్ డోర్ మరియు అవుట్ డోర్, ఫైరింగ్ విభాగాలుగా విభజించి తర్ఫీదును ఇవ్వడం జరుగుచున్నది. శిక్షణ పూర్తి అయిన జైళ్ళ శాఖ సిబ్బంది ఖైదీలను సంస్కరించుటకు వారిని సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా తయారు చేసి తిరిగి జీవన స్రవంతిలోకి పంపుట కొరకు జైళ్ళ శాఖ సిబ్బంది అహర్నిశలు కృషి చేయుచున్నారు మరియు మినిస్టీరియల్ సిబ్బందికి కూడా వివిధ కోర్సులలో శిక్షణ ఇచ్చి వారి వృత్తి పరమైన నైపుణ్యం పెంచడానికి తోడ్పాటు ఇవ్వడం జరిగినది.
దృక్పధం (Vision)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సంస్కరణల సేవల శిక్షణా సంస్థ ఉన్నతమైన భావాలు, సంస్కరణ సేవలును, హిత భోదలు సమాజము మేలు కొరకు మాతృకగా ఖైదీలును మార్చుటకు సిబ్బందికి తర్పీదు, వివిధ విస్తృతమైన గ్రంధాలయముతో, అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ తో సిబ్బందికి తర్ఫీదు ఇవ్వడం
లక్ష్య ప్రకటన
ఆంధ్ర ప్రదేశ్ జైళ్ళు మరియు సంస్కరణ సేవల శాఖ జైళ్ళను నిర్వహిస్తుంది మరియు ఖైదీలకు విచారణ మరియు దోషి నిర్దారణ జరిగినపుడు శిక్షణ పొందిన జైళ్ళ సిబ్బంది ద్వారా సురక్షితమైన పర్యావరణాన్ని అందిస్తుంది. ఇది కాక ఖైదీకి తనను పునరుద్ధరించుకొని వారు మరలా సమాజములో బాధ్యత గల పౌరుడిగా మెలుగుటకు అవకాశము కల్పిస్తుంది. అలా జైళ్ళ శాఖ సమాజ రక్షణకు మరియు రాష్ట్రానికి నిరంతర సేవలను అందిస్తుంది.
సంస్థ పేరు, విధులు, బాధ్యతలు
ఈ సంస్థ పేరు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సంస్కరణల సేవల శిక్షణ సంస్థ, మూలాపేట, నెల్లూరులోని పాత కేంద్ర కారాగారము ప్రాంగణంనందు ఏర్పాటు చేయబడి 2015 సం. నుండి పనిచేయుచున్నది. ఈ శిక్షణా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యము ఈ శిక్షణా సంస్థలో క్రొత్తగా నియమింపబడిన సిబ్బంది మరియు సర్వీసులో కొనసాగుతున్న కార్యనిర్వాహక మరియు మినిస్టీరియల్ సిబ్బందికి వివిధ కోర్సులలో శిక్షణ ఇచ్చి వారి వృత్తి పరమైన నైపుణ్యం పెంచడానికి తోడ్పాటు శిక్షణ ఇవ్వడం జరిగుతుంది.
విలువలు
మా యొక్క కార్య సాధనకు ఈ శిక్షణా సంస్థలో సమగ్రత ప్రాధమిక లక్ష్యముగా ఉంటుంది: మేము ఎంతో నమ్మకముగా మరియు బహిరంగముగా ఇంకా సమర్ధవంతమైన పరిశీలనతో పనులు మొదలు పెడతాము. అదే సమయములో ప్రభుత్వ సొమ్ము మరియు ఆస్తులను గురించి శ్రద్ధ వహిస్తాము.