దేవాదాయ ధర్మాదాయ శాఖ
ఎ)శాఖ / సంస్థ గురించి పరిచయం:
38 మండలములు మరియు 4 రెవిన్యూ డివిజన్లు గా ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మొత్తం 1203 దేవస్థానములు మరియు సంస్థలు ఉన్నవి. అందులో 210 ఆదాయము వచ్చు దేవస్థానము / సంస్థలు ఉన్నవి మరియు 993 లనుండి ఎలాంటి ఆదాయము లేని దేవస్థానము / సంస్థలు ఉన్నవి.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మొత్తం 210 ఆదాయము వచ్చు దేవస్థానము / సంస్థలు ఉన్నవి ఈ దేవస్థానము / సంస్థలు చాలావరకు కార్యనిర్వహణాధికారులు ఆధీనములో ఉన్నవి, కొన్ని వంశపార్యంపర్య ధర్మకర్తల ఆధీనములో ఉన్నవి.
ఈ దేవస్థానము / సంస్థలను సెక్షన్ 6 దేవదాయ శాఖ చట్టం 30/1987 క్రింద (ఎ)(బి)(సి)(డి) గా వర్గీకరించ బడ్డాయి. ఈ దేవస్థానము / సంస్థలు శ్రీయుత కమీషనరు, దేవదాయ ధర్మదాయ శాఖ, ఆంధ్ర ప్రదేశ్ గొల్లపూడి, శ్రీయుత ఉప కమీషనరు, దేవదాయ ధర్మదాయ శాఖ, గుంటూరు మరియు సహాయ కమీషనరు, దేవదాయ ధర్మదాయ శాఖ, నెల్లూరు వారితో పాటుగా శ్రీయుత ప్రాంతీయ సంయుక్త కమీషనరు, దేవదాయ ధర్మదాయ శాఖ, మల్టీ జోన్-II, తిరుపతి వారి పర్యవేక్షక నియంత్రణలో ఉంటాయి.
దేవస్థానము / సంస్థలను ఆదాయమును బట్టి ఈ క్రింది విధముగా వర్గీకరించారు.
ఆదాయ పరిధి | వర్గీకరణ | పర్యవేక్షణ అధికారి | |
---|---|---|---|
రూ. 1 కోటి పైన | 6(ఎ) | శ్రీయుత కమీషనరు | 11 |
రూ.25 లక్షల పైన 1 కోటి లోగా | 6(ఎ) | శ్రీయుత ప్రాంతీయ సంయుక్త కమీషనరు | 14 |
రూ.2 లక్షల పైన 25 లక్షల లోగా | 6(బి) | శ్రీయుత ఉప కమీషనరు | 101 |
రూ.2 లక్షల లోగా | 6(సి) | సహాయ కమీషనరు | 1068 |
మఠం | 6(డి) | అదాయమును బట్టి | 9 |
మొత్తం >> | 1203 |
రెవిన్యూ శాఖ వారి రికార్దులతో దేవదాయ శాఖ రికార్డును పరిశీలించగా శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో మొత్తం ఎకరాలు 22,668.89 సెంట్ల భూమి దేవదాయ శాఖ ఉంది అందులో పట్టణప్రాంతంలో మొత్తం ఎకరాలు 4,449.60 సెంట్ల సదరు మొత్తం భూమిని అన్యక్రాంతం కాకుండా కాపాడవలసి ఉంది.
బి) సంస్థ నిర్మాణం (Organization Structure):
సి) పరిచయము
వ.సంఖ్య | పేరు మరియు హోదా | ఫోన్ నెంబరు |
---|---|---|
1 | జిల్లా దేవదాయ శాఖాధికారి, దేవదాయ శాఖ | 0861-2331223 9491000678 |
2 | ఉప కమీషనరు & కార్యనిర్వహణాధికారి, శ్రీ పెనుశిల లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం, పెంచలకోన క్షేత్రం, రాపూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. | 9491000737 |
3 | ఉప కమీషనరు & కార్యనిర్వహణాధికారి, శ్రీ మాల్యాద్రి లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం, మాలకొండ, చుండీ గ్రామము, వి. వి. పాలెం మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. | 9491000732 |
4 | సహాయ కమీషనరు & కార్యనిర్వహణాధికారి, శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం, జన్నవాడ క్షేత్రం, బుచ్చిరెడ్డిపాలెం మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా | 9491000734 |
5 | సహాయ కమీషనరు & కార్యనిర్వహణాధికారి, శ్రీ రాజ రాజేశ్వరి అమ్మవారి దేవస్థానం, దర్గామిట్ట, నెల్లూరు నగరం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా | 9491000735 |
6 | సహాయ కమీషనరు & కార్యనిర్వహణాధికారి, శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం, మూలపేట, నెల్లూరు నగరం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా | 9491000736 |
డి) ఇ మెయిల్ / చిరునామా :
కార్యాలయ ఈమెయిలు చిరునామ: acnlr_endts[at]yahoo[dot]com
endow-acnlr[at]gov[dot]in
కార్యాలయ చిరునామా :
సహాయ కమీషనరు,
దేవదాయ ధర్మదాయ శాఖ,
పాత సర్వోదయ కళాశాల,
డా. పెంచాలమ్మ ఆసుపత్రి ప్రక్కన,
జి.యన్.టి. రోడ్,
నెల్లూరు నగరం,
నెల్లూరు – 524001
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా