ముగించు

ప్రభుత్వ పాలిటెక్నిక్ ఆత్మకూరు

I. క్లుప్త పరిచయం:-

జూన్ 5 వ తేదీ ,1957 న జీవో (G.O.M.S నెంబర్ .1166 ) ద్వారా సాంకేతిక విద్య శాఖ స్థాపించబడింది.దీని ముఖ్య ఉద్దేశం సాంకేతిక విద్యను అందరికి అందుబాటులోకి తేవడం. దీనిలో భాగంగా వివిధ ఇంజనీరింగ్ కళాశాలలను, పాలిటెక్నిక్ కళాశాలలను మరియు సాంకేతిక పరీక్షలను ఓకే గొడుగు కిందకు తీసుకురావడం జరిగింది .

ప్రభుత్వ పాలిటెక్నిక్, ఆత్మకూరు

ప్రభుత్వ పాలిటెక్నిక్ ఆత్మకూరు యొక్క ఆశయం విద్యార్థులను ఉత్తమ ఇంజనీర్లుగా తీర్చిదిద్దాలని వారిని దేశ సమగ్ర అభివృద్ధిలో కీలక భాగస్వాములుగా చేయాలని. ఈ ఉన్నతాశయం తో విద్యార్థులకు నాణ్యత కలిగిన సాంకేతిక విద్యను అందించాలని పాటుబడటం జరుగుతుంది. వారిలో సృజనాత్మకతను పెంపొందించి వారికి అవసరమైన తోడ్పాటునందించడం ద్వారా వారిని అత్యంత సృజనాత్మకత కలిగిన మేధావులుగా తీర్చిదిద్దడమే ఈ కళాశాల ప్రధానోద్దేశ్యము.

అర్హత కలిగి చదువుకోలేని పేద మరియు బడుగువర్గాలకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందించాలనే సదాశయం తో ప్రభుత్వ పాలిటెక్నిక్ ను ఆత్మకూరు లో స్థాపించడం జరిగింది. ఇక్కడ గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కేవలం నాణ్యమైన విద్య మాత్రమే సమాజాన్ని సుసంపన్నం చేయగలదనే దృఢవిశ్వాసం తో ముందుకు సాగుతున్నది ఈ విద్యాసంస్థ. సహనం అలవర్చుకున్న నాడు సమాజం లో శాంతి, సామరస్యం, వెల్లివిరుస్తాయి.ఈ యజ్ఞం లో ప్రభుత్వ పాలిటెక్నిక్,ఆత్మకూరు సగర్వముగా పాలుపంచుకుంటున్నది.

నేటి విద్యార్థులే రేపటి నిపుణులు .కావున ఇక్కడ విద్యార్థులకు ఎక్కడా ఏ విషయం లోను రాజీ పడకుండా మంచి నాణ్యత కలిగిన విద్యను బోధించడం జరుగుతున్నది .తద్వారా సమాజానికి దేశానికీ అవసరమైన మానవ వనరులను అందించడంలో మా వంతు కృషి మేము సలుపుతున్నాము. అంతే గాక ప్రతి విద్యార్థి సామజిక బాధ్యత ,నీతి నియమాలు , నాయకత్వ లక్షణాలు వంటివి అలవర్చుకొనే విధంగా వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాము .ఇది దేశాన్ని ప్రగతి పధంలోకి నడిపించడానికి కీలకమని భావిస్తున్నాము.

కళాశాల గురించి:-

ప్రభుత్వ పాలిటెక్నిక్,ఆత్మకూరు సాంకేతిక విద్య శాఖ,(ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం) లో ఒక భాగం. 1-4-2011 న G.O.M.S నo 28 ఉన్నత విద్యా శాఖ (TE-1) ద్వారా జారీ చేయబడిన ఉత్తర్వులను అనుసరించి ఈ విద్యాసంస్థ ప్రారంభించబడినది. ఈ కళాశాలలో మూడు విభాగాలు వున్నాయి.

  1. డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజినీరింగ్ (60 సీట్లు).
  2. డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ (60 సీట్లు).
  3. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ (60 సీట్లు)

ఈ కళాశాలకు ఏ .ఐ .సి .టి. ఇ, న్యూ ఢిల్లీ, అనుమతి కలదు .ఇక్కడ విద్యార్థులకు కావలసిన వనరులు, వసతులు , అవకాశాలు మెండుగా వున్నాయి. అందువల్ల వారు విద్యలోనేకాక, ఆటలలోనూ ,సాంస్కృతిక పోటీలలోనూ తమ ప్రతిభా పాటవాల్ని ప్రదర్శిస్తూ ఈ కళాశాల ప్రతిష్టను ఇనుమడింపచేస్తున్నారు .

ఈ కళాశాల బొంబాయి హైవే ఆత్మకూరు కు మూడు కి.మి. దూరంలో గల వెంకట్రావు పల్లిలో ప్రారంభించబడింది. ఈ కళాశాలకు అభిముఖంగా అభయాంజనేయ స్వామి దేవలయం కలదు. ఇచ్చట విద్యార్థులకు అవసరమైన పరిశుభ్రమైన త్రాగునీరు, పలహారశాల, మరుగుదొడ్లు మరియు అన్ని వసతులు కల్పించబడినవి. విశాలమైన తరగతి గదులు,ప్రయోగశాల,గ్రంధాలయం,కంప్యూటర్ సెంటర్ ఈ కళాశాలలో ప్రధాన ఆకర్షణలు

ప్రాంగణనియామకాలు:-

ఏ కళాశాలకైనా గుర్తింపు తెచ్చేవి ప్రాంగణనియామకాలు. విద్యార్థులు డిప్లొమా పూర్తి చేసుకునే లోపలే మంచి ఉద్యోగాలను పొందేవిధంగా ప్రభుత్వ పాలిటెక్నిక్, ఆత్మకూరులో పకడ్బంది వ్యవస్థ వున్నది. ఇక్కడ విద్యార్థులకు ఉద్యోగాలకు సంభంధించిన సమాచారం ఇవ్వడం దగ్గర్నుంచి వాళ్లకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించడంలో సమగ్ర శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళు మంచి సంస్థలలో అవకాశాలు పొందుతున్నారు.ఇక్కడ ప్రాంగణనియామకాలు చేప్పట్టే ముఖ్యమైన సంస్థల్లో కొన్ని ఇసుజు,మెగా ఇన్ ఫ్రొ ప్రైవేట్ లిమిటెడ్, అక్బర్ ఆటోమొబైల్స్, నెల్లూరు, కృష్ణపట్నం పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్, హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ ,వెర్టెక్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కీలక ప్రక్రియలో మమేకమై విద్యార్థులకు మంచి భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్న ఆత్మకూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ సిబ్బంది అభినందనీయులు

ఆటలు :

ఇక్కడ చెస్ , క్యారమ్స్ వంటి ఇండోర్ ఆటలకు, వాలీబాల్, క్రికెట్, కబడ్డీ వంటి ఆటలకు సైతం కావలిసిన మైదానం, వసతులున్నాయి. ఈ కళాశాల విద్యార్థులు ఎన్నో ప్రతిష్టాత్మక పోటీలలో పాల్గొని మంచి విజయాలు సాధించారు . ఒక వ్యాయమ అధ్యాపకుడు విద్యార్థులకు నిరంతరం తర్షీదు ఇచ్చి వాళ్ళను సానబెట్టే విధంగా కృషి చేస్తున్నారు .

II. సంస్థ నిర్మాణం

GOVT POLYTECHNI ATMAKUR

 

III. సంప్రదించవలిసిన అధికారి :

డాక్టర్ .టి.నారాయణ ,M.com., Ph.D., B.L.,

ప్రిన్సిపాల్ ,

మొబైల్ నెంబర్ :7901620305

ఈమెయిల్: drtnnlr[at]gmail[dot]com

కళాశాల చిరునామా:

ప్రభుత్వ పాలిటెక్నిక్ ,

అభయాంజనేయ స్వామి గుడి ఎదురుగా ,

బొంబాయి హైవే ,వెంకట్రావుపల్లి,

ఆత్మకూరు,

S.P.S.R. నెల్లూరు జిల్లా,

ఆంధ్ర ప్రదేశ్,

పిన్కోడ్ :524322

ఇమెయిల్: gpatm305[at]gmail[dot]com

IV. IMPORTANT WEBSITE LINKS:

S.NO NAME  OF THE WEBSITE WEBSITE LINK
1 డిపార్ట్మెంట్ అఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ , ఆంధ్రప్రదేశ్ https://dteap.nic.in
2 సాంకేతిక విద్య మరియు శిక్షణ మండలి , ఆంధ్ర ప్రదేశ్ https://sbtetap.gov.in
3 ప్రభుత్వ పాలిటెక్నిక్ , ఆత్మకూరు https://www.govtpolyatmakur.ac.in
4 అల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ https://aicte-india.org