ముగించు

లీగల్ మెట్రోలాజీ

1. జిల్లా ప్రదాన కార్యాలయము:

శ్రీయుత కె. ఇశాక్
ఉప నియంత్రకులు వారి కార్యాలయము
డోర్ నెం. 23/1304,
టెక్కేమిట్టా,
నెల్లూరు – 524003.

2. పరిచయము:

 ఈ శాఖా ముఖ్య విధులు వ్యాపారస్తులు ఉపయోగించే తూనికలు మరియు కొలతల పరికరముల తనిఖీ చేయుటకు మరియు ముద్రలు వేయుట, వ్యాపార సంస్థల నందు తూనిక మరియు కొలతల పరికరములు ఉపయోగించి చేసే మోసాలను అరికట్టడం మరియు వ్యాపారస్తులు చేసే మోసాల గురించి వినియోగదారులకు అవగాహనా సదస్సులు ఏర్పాటు చేయడం.
ఈ క్రిందనుదహరించిన చట్టము నియమావళులు ప్రస్తుతము అమలులో వున్నవి.
* లీగల్ మెట్రాలాజి చట్టము, 2009
* లీగల్ మెట్రాలాజి (ప్యాకజ్ద్ కమ్మోడిటీస్) నియమావళి, 2011
* లీగల్ మెట్రాలాజి (జనరల్) నియమావళి, 2011
* ఆంధ్రప్రదేశ్ లీగల్ మెట్రాలాజి (అమలు) నియమావళి, 2011
పైన పేర్కొన్న చట్టాలు మరియు నియమాలతో పాటు ఈ క్రింది నిబంధనావళి ఆదేశాలు
అమలు చేయుట
* పెట్రోలు మరియు డీజిల్ (సరఫరా, పంపకం మరియు అక్రమాల నివారణ) ఆదేశం, 1998.

3. వ్యవస్థ స్వరూపం:

 శ్రీయుత నియంత్రకులు, లీగల్ మెట్రాలజి శాఖాదిపతిగా వ్యవహరించెదరు. ఈ శాఖ యొక్క పరిపాలనా నియత్రణ మరియు పర్యవేక్షణ వారి ఆధ్వర్యములో జరుగును.
జిల్లా స్థాయిలో (జోనల్ స్థాయిలో) శ్రీయుత ఉప నియంత్రకులు వారు లీగల్ మెట్రాలజి శాఖాదిపతిగా వ్యవహరించెదరు. వారి పరిధి మొత్తం నెల్లూరు జిల్లా వరకు ఉండును. నెల్లూరు జిల్లా ఉప నియంత్రకులు వారి కార్యాలయము ప్రస్థుతము ప్రైవేటు భవనం డోర్ నెం 23/1304, టేక్కేమిట్ట, నెల్లూరు నందు నిర్వహించ బడుతున్నది.
నెల్లూరు జిల్లా ఉప నియంత్రకులు ఆధ్వర్యము లో (03) సహాయ నియంత్రకులు మరియు (07) పరిశీలకులు పమిచెయుచున్నారు.

లీగల్ మెట్రాలజి శాఖ నెల్లూరు నందు పని చేయుఅధికారుల వివరములు :

సంఖ్య అధికారి పేరు హోదా మొబైల్‌ నెంబరు
1. శ్రీ   కె. ఇశాక్ ఉప   నియంత్రకులు, లీగల్ మెట్రాలజి, నెల్లూరు 9398155484
2. శ్రీ.   యన్. ఈశ్వర రావు సహాయనియంత్రకులు,   లీగల్ మెట్రాలజి, నెల్లూరు 9440168585
3. శ్రీ   యం.డి. కరిముల్లా పరిశీలకులు,   కావలి 9885886947
4. శ్రీ   డి. అనీల్ కుమార్(I/c) పరిశీలకులు,   నెల్లూరు 9398136106

4. కర్తవ్యం:

* వ్యాపారస్తులు ఉపయోగించే తూనికలు, కొలతలు మరియు తూనిక పరికరములను సరిచూసి ముద్రలు వేయుట.
* దుకాణాలు తనిఖీ చేసి లీగల్ మెట్రాలాజి చట్టములను ఉల్లంఘించిన వారి పైన కేసులు నమోదు చేయుట.
* ప్యాకజి కమోడిటీస్ నియమాలను ఉల్లంఘించిన వారి పైన కేసులు నమోదు చేయుట.
* వ్యాపార సంస్థలనందు తూనిక మరియు కొలతల పరికరములు ఉపయోగించి చేసే మోసాలను అరికట్టడం.
* వినియోగదారులను చైతన్యవంతులు చేయుటకు అవగాహనా సదస్సులు నిర్వహించుట.

5. లీగల్ మెట్రాలజి శాఖ యొక్క ప్రత్యేక వైఖరి :

*  జిల్లా లోని ఇతర శాఖల అధికారులతో కలసి వివిధ వ్యాపార సంస్థల పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి చట్టాలను ఉల్లంఘించిన వారి పైన కేసులు నమోదు చేయుట. 

*  విద్య సంస్థల నందు తూనికలు, కొలతలు మరియు తూనిక పరికరములను ప్రదర్శించి అవగాహనా సదస్సులు ద్వారా విద్యార్ధులకు అవగాహన కల్పించుట. 

*  వినియోగదారుల సంఘాల ద్వార అవగాహనా సదస్సులు ఏర్పాటు చేసి వినియోగదారులను చైతన్యపరుచుట. 

6. లీగల్ మెట్రాలజి శాఖ పై సాధారణ ప్రజల యొక్క అంచనాలు :

* తూనికలు మరియు కొలతలలో వ్యాపారస్తులు చేసే అక్రమాలు మరియు మోసాల నుండి సమాజములోని అన్ని తరగతుల ప్రజలకు రక్షణ కలిపించడం.
* నిత్యావసరాలైన పాలు, కూరగాయలు, పండ్లు, మరియు వంట గ్యాసు మొదలగు వాటిని సరిఅయిన తూకం / కొలతలలో ప్రతి సాధారణ గృహిణి పొందటం.
* ఆయిల్ కంపెనీల నుండి ట్యాంకు ట్రక్కులకు, ట్యాoకు ట్రక్కుల నుండి డీలర్లకు మరియు డీలర్ల నుండి వినియోగదారులకు పెట్రోల్, డీజిల్ మరియు కిరోసిన్ వాటిని సరియైన కొలతలతో పొందటం.
* వ్యవసాయదారులు తాము ఉత్పత్తి చేసిన పంటలను అమ్మకపు సమయములో వర్తకులు / వ్యాపార దళారులు ద్వారా తూకములో జరిగే మోసాల నుండి రక్షణ.
* ఆహార సరఫరా సంస్థ గిడ్డింగుల నుండి చౌకధర దుకానములకు మరియు చౌకధర దుకాణముల నుండి రేషన్ కార్డు దారులకు సరిపడా సరఫరా జరుగుట.
* వినియోగదారుని యొక్క నిర్వచనం వినియోగదారుల రక్షణ చట్టం నందు పేర్కొనట్లుగా, లీగల్ మెట్రాలజి చట్టాలు అమలుపరుచు విషయములో సమాజంలోని ప్రతి పౌరుడు ఒక వినియొగదారుడు.

7. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరములో లీగల్ మెట్రాలజి శాఖ, నెల్లూరు జిల్లా సాధించిన ప్రగతి :

సంవత్సరము స్టాంపింగ్ ఫీజు కాంపౌండింగ్ ఫీజు కేసుల సంఖ్య
2023-24 12307711/- 5236000/- 725

8. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరములో మా శాఖ జరిపిన పరిసీలనలు మరియు నమోదు చేసిన కేసు వివరములు

సంఖ్య వ్యాపార సంస్థ పరిసీలనల సంఖ్య కేసుల సంఖ్య కాంపౌండింగ్ ఫీజు
1 Dispensing   pumps 220 16 215000/-
2 LPG 38 9 70000/-
3 Fertilizers 110 28 517000/-
4 Edible oil 80 6 320000/-
5 Kirana 267 91 351500/-

Email :

dclmnel[at]gmail[dot]com

Important Links :

https://aplm.gov.in/