C.సంస్థ యొక్క ముఖ్యమైన పధకాలు/ కార్యక్రమాలు / ప్రణాళిక:
2023-2024 ఆర్ధిక సంవత్సరంలో ఆత్మ పధకం ద్వారా నెల్లూరు జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలు
క్రమ. సంఖ్య |
కార్యక్రమం పేరు |
విడుదలైన నిధులు |
ఖర్చు లక్షలలో |
నిర్వహించబడిన కార్యక్రమాల సంఖ్య |
లబ్దిదారుల సంఖ్య |
1 |
శిక్షణలు -రాష్ట్ర పరిధిలో |
6.5 |
0.8 |
2 |
80 |
2 |
శిక్షణలు- జిల్లా పరిధిలో |
2.92 |
59 |
2314 |
3 |
ప్రదర్శనలు |
1.133 |
55 |
55 |
4 |
విజ్ఞాన సందర్శన- రాష్ట్ర పరిదిలో |
0.4 |
1 |
40 |
5 |
ఎక్సిబిషన్ & కిసాన్ మేళ |
0.5 |
2 |
95 |
6 |
రైతులతో శాస్త్రవేత్తల చర్చా గోష్టి |
0.193 |
1 |
50 |
7 |
క్షేత్ర దినోత్సవము |
0.09 |
2 |
80 |
8 |
పొలంబడి |
0.247 |
1 |
25 |
9 |
శిక్షణ & సందర్సన సమావేశాలు |
0.216 |
12 |
0 |
|
మొత్తం |
6.5 |
6.499 |
135 |
2739 |
శిక్షణా కార్యక్రమాలు -రాష్ట్ర పరిధిలో :
• వేరుశనగ సాగు మరియు వ్యవసాయ యాంత్రికరణతో ఉత్పత్తి, సాంకేతికతపై నాయుడుపేట సబ్ డివిజన్ లోని రైతులు మరియు గ్రామ వ్యవసాయ సహాయకులకు అవగాహన కల్పించడానికి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం తిరుపతిలో అంతర జిల్లా శిక్షణ మరియు విజ్ఞాన సందర్శన నిర్వహించడం జరిగినది.
• దోస, మామిడి, క్యాబేజి , ధనియాలు మరియు పూల పంటల రకాలు మరియు సాగులపై వెంకటగిరి బ్లాక్ లోని రైతులకు విఏఏలకు, వీహెచ్ఏలకు అవగాహన కల్పించేందుకు అనంతరాజుపేటలోని ఉద్యాన పరిశోధన స్థానములో అంతర్ జిల్లా శిక్షణ మరియు విజ్ఞాన సందర్శన నిర్వహించడం జరిగినది.
శిక్షణా కార్యక్రమాలు-జిల్లా పరిధిలో :
• వరి, వేరుశనగ, పప్పు ధాన్యాలు మరియు మినుములలో సమగ్ర సస్యరక్షణ యాజమాన్యంపై శిక్షణ.
• వేసవి దుక్కుల వల్ల ఉపయోగాలు.
• మారకద్రవ్యాల సాగు నిర్మూలనపై అవగాహన.
• పచ్చి రొట్టె పైర్ల ప్రాముఖ్యత.
• చిరుధాన్యాల సాగు మరియు పోషక విలువల ప్రాముఖ్యతపై శిక్షణ.
• కూరగాయ పంటల సాగులో యాజమాన్య పద్ధతులు.
• జీవన ఎరువులు ప్రాముఖ్యత మరియు నానో ఎరువుల ఉపయోగం.
• డ్రోన్ టెక్నాలజీ పై అవగాహన.
• ప్రత్తిలో గులాబీ రంగు పురుగు సమగ్ర నిర్మూలన పై శిక్షణ.
• రబీ సీజన్ కి అనువైన క్రొత్త వరి రకాలు.
• ముందస్తు వాతావరణ సూచనలు మరియు వ్యవసాయంలో వాటి అనుకరణ.
• భూమి ఆరోగ్య యాజమాన్యం.
• సూక్ష్మ పోషక లోపాలు లక్షణాలు మరియు వాటి సవరణ, జీవన ఎరువులు మరియు జీవన పురుగుమందుల ప్రాముఖ్యత.
ప్రదర్శనలు :
నిర్వహింపబడిన ప్రదర్శన క్షేత్రాలు
• హైడ్రోజల్ వాడకంపై ప్రదర్శన క్షేత్రము.
• జీవన ఎరువుల వాడకంపై ప్రదర్శన క్షేత్రం.
• మినుము పంట క్రొత్త రకాలైన LBG- 904 మరియు LBG-932 రకాల ప్రదర్శన క్షేత్రాలు.
• పశువులలో ఎక్టో పరాన్న జీవుల నియంత్రణపై ప్రదర్శన.
• పుచ్చకాయ సాగులో మల్చింగ్ వాడకంపై ప్రదర్శన.
• రాష్ట్ర పరిధిలో విజ్ఞాన సందర్శన :
• వేరుశనగ సాగులో కొత్త రకాలు వాడకం, యాంత్రికరణ దిగుబడి పెంపుపై రైతులకు అవగాహన కల్పించుటకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, తిరుపతికి విజ్ఞాన సందర్శన చేయడమైనది.
ఎగ్జిబిషన్ మరియు కిసాన్ మేళ :
• స్వాతంత్ర దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవం సందర్భంగా శకటం సిద్ధం చేయడం జరిగింది .
రైతులతో శాస్త్రవేత్తల చర్చా గోష్టి :
• పొదలకూరు సబ్ డివిజన్ పరిధిలో పప్పు ధాన్యాల పంట ఉత్పత్తి పై రైతుల తో శాస్త్రవేత్తల చర్చా గోష్టి నిర్వహించడం జరిగినది.
క్షేత్ర దినోత్సవాలు:
• క్షేత్ర దినోత్సవాలు ఉదయగిరిలో సబ్ డివిజన్లో నువ్వు పంటపై (వైఎల్ఎం- 66)(శారద) మరియు వింజమూరు సబ్ డివిజన్లో వరి పంట (బి.పి.టి-5204) సాగులో అధిక దిగుబడులు సాదించిన రైతుల క్షేత్రాలలో నిర్వహించడమైనది.
పొలం బడి :
టి .పి గూడూరు మండలం లోని 25 మంది రైతులకు వరి పైరుపై పొలంబడి నిర్వహించాదమైనది.
స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రాం:
నెల్లూరు జిల్లాలోని ఐదు పాఠశాలలో నేల ఆరోగ్యం పై పాఠశాల విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరిగినది.భూసార పరీక్ష ప్రాముఖ్యత, మట్టి నమూనా సేకరణ పై క్షేత్ర ప్రదర్శన, మట్టి నమూనా సేకరణలో వాడు పనిముట్లను మరియు వివిధ రకాల నేల రంగులను ప్రత్యక్షంగా చూపించడం జరిగింది.
MANAGE సహకారంతో DAESI మరియు STRY కార్యక్రమాలు నిర్వహణ:
• STRY శిక్షణ లో భాగంగా గ్రామీణ యువతకు 15 మందికి విత్తన ఉత్పత్తిపై శిక్షణ ఇవ్వడం జరిగినది.
• దేశీ కార్యక్రమం కింద 45 మంది డీలర్లకు కేవీకే నెల్లూరు నందు వ్యవసాయ వనరులపై శిక్షణ ఇవ్వడం జరిగినది.
కార్య ప్రణాళిక:
2024-2025 సంవత్సరానికి ప్రతిపాదిత కార్యాచరణ ప్రణాళిక
2024-2025 సంవత్సరానికి ఇప్పటివరకు విడుదలైన నిధులు : 1.3లక్షలు
క్రమ. సంఖ్య |
కార్యక్రమం పేరు |
విడుదలైన నిధులు లక్షలలో |
ఖర్చు లక్షలలో |
నిర్వహించబడిన కార్యక్రమాల సంఖ్య |
లబ్దిదారుల సంఖ్య |
1 |
శిక్షణలు- జిల్లా పరిధిలో |
1.3 |
1 |
20 |
700 |
2 |
ప్రదర్శనలు- వేరుశనగ లో నూతన రకం విశిష్ట (TCGS-1694) |
0.16 |
4 |
4 |
3 |
ప్రదర్శనలు- సజ్జ ABV-O4 రకం |
0.04 |
10 |
10 |
4 |
నిమ్మ పంట పై రైతులతో శాస్త్రవేత్తల చర్చా గోష్టి |
0.1 |
1 |
50 |
|
మొత్తం |
1.3 |
1.3 |
35 |
764 |