సి) పనులు మరియు విధివిధానాలు::
ఈ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమునకు సంబంధించిన ఇంజనీరింగ్ శాఖలు అయిన జలవనరులశాఖ, పంచాయితీరాజ్, గ్రామీణ నీటి పారుదల, ప్రజా ఆరోగ్యశాఖ మరియు కార్పొరేషన్స్ (ఆంధ్రప్రదేశ్ పోలీసు హౌసింగ్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్, ఆంధ్రప్రదేశ్ విద్య మరియు సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ, మొదలగునవి) ద్వారా చేయించిన పనులకు సంబందించిన బిల్లులు ఈ కార్యాలయంలో ఆడిట్ చేసి CFMS ద్వారా అనుమతించిన తరువాత సదరు చెల్లింపులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్ధిక శాఖ నుండి e- కుబేరు ద్వారా సంబందిత లబ్దిదారు/ ఏజెన్సీ బ్యాంకు ఖాతాకు జమచేయపడుతుంది.
పనులకు సంబందించిన బిల్లులలో ఏమైనా లోటు పాట్లు ఉన్నపుడు సదరు శాఖ అధికారి CFMS ద్వారా తెలుసుకొని ఆ లోటు పాట్లను సరిచేసి తిరిగి బిల్లును మరల ఈ కార్యాలయమునకు పంపిన తరువాత సదరు బిల్లునుచెల్లింపులకు ఈ కార్యలయం అనుమతించబడును. ఇంకనూ సాదారణ ప్రజానీకానికి బిల్లు ఏ స్థితిలో ఉన్నదో CFMS “బిల్లు స్టేటస్” నందు తెలియజేయబడుతుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ ఇంజనీరింగ్ శాఖల వారు పంపిన బిల్లులలో ఈ కార్యాలయం ద్వారా అనుమతించి బిల్లుల వివరాలు ఎప్పటికప్పుడు ఖచ్చితముగా ఖర్చు వివరములు తెలుసుకొని మరియు బడ్జెట్ చూసుకొని బిల్లుల చెల్లింపులు అనుమతించబడును.