9TH BN. APSP, వెంకటగిరి
PAST HISTORY :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉతర్వులు GO.MS.No.776 Home (Police-D) Dept. dtd.21.12.1991 ప్రకారం నెల్లూరు జిల్లాలో 205.10 ఎకరాల స్థలం మరియు చిత్తూరు జిల్లా నుండి 98.85 ఎకరాల విస్తీర్ణంలో 9 వ పటాలం వల్లివేడు గ్రామం, వెంకటగిరి మండలం, నెల్లూరు నందు 21.11.1991 న మూడు కంపినీలు మరియు హెడ్ క్వార్టర్ కంపినీ తో ప్రారంబించబడినది. తదుపరి 2009 సం,, లో మరో మూడు కంపినీలను మంజూరు చేసినారు.
ప్రస్తుతం ఈ బెటాలియన్ కు యల్.ఎస్.పాత్రుడు 19.05.2016 నుండి కమాండెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు.
ఈ బెటాలియన్ కు 2009 సం,, లో బెటాలియన్ ట్రైనింగ్ సెంటర్ ను ప్రభుత్వం మంజూరు చేసినది. ఇప్పటివరకు నాలుగు బ్యాచ్ లకు ట్రైనింగ్ ఇచ్చినారు. ప్రస్తుతం SCTPC (AR) 262 మందికి ఐదవ బ్యాచ్ నకు ట్రైనింగ్ ఇస్తున్నారు.
ప్రస్తుతం పై అధికారులు ఉత్తర్వులు మేరకు ఈ బెటాలియన్ నుండి ఒక కంపినీ ని SDRF విధులు నిమిత్తం కేటాయించినారు. వీరు రాష్ట్రం లో ప్రకృతి విపత్కర సమయాలలో విధులు నిర్వహిస్తునారు. ఇంతక ముందు ఈ బెటాలియన్ సిబ్బంది స్వాతంత్ర్య మరియు గణతంత్ర దినోత్సవం కవాతు నందు పాల్గొని పై అధికారు మన్నలను పొందినారు.
ఈ బెటాలియన్ సిబ్బంది రాష్ట నలుమూలల యందు బందో బస్త్ విధులు, వి.ఐ.పి సెక్యూరిటీ విధులు, ఎన్నికల విధులు, అసెంబ్లీ విధులు మరియు ఇతర రాష్త్రాలో కూడా ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు.
ఈ బెటాలియన్ సిబ్బందికి వారి వారి సేవలను గుర్తించి రాష్త్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు వారికి సేవా పథకం – 1, అత్త్యున్నత సేవాపతకం- 15 మరియు ఇండియన్ పోలీస్ మెడల్ -1 తో సత్కరించడమైనది.
బెటాలియన్ అభివృద్ధి కార్యక్రమాలు:-
- హెడ్ ఆఫీస్ ఉత్తర్వులు ప్రకారం గ్రీవెన్స్ సెల్ బెటాలియన్ హెడ్ క్వార్టర్స్ నందు స్థాపించబడినది.
- ప్లాస్టిక్ వస్తువులు నివారణ గురించి అవగాహన మరియు ఇంప్లిమెంట్ జరుగుచున్నది. (బయో-డి వస్తువులు మాత్రమే బెటాలియన్ లో వాడుతున్నారు.)
- ట్రైనీస్ కు ప్రత్యకంగా ధోభి మరియు బార్బర్ గదులును నిర్మించాము.
- హాస్పిటల్ నందు సీసనల్ మందులు అందుబాటు లో ఉంచాము. షుగర్, మలేరియా వంటి వ్యాధులకు టెస్ట్ లు ఇక్కడే చేసే విధముగా ఏర్పాటు చేసాము.
- సబ్సిడీ క్యాంటిన్ నందు ౩౦% రాయితి తో సిబ్బంది కి వస్తువులను అందుబాటు లోకి తీసుకొని రావడమైనది.
- మినరల్ వాటర్ ప్లాంట్ ను సిబ్బంది అతి దగ్గరగా ఉండేవిధముగా పునఃప్రారంభించడ మైనది.
- మినీ క్యాంటిన్ ను క్వార్టర్స్ నందు సిబ్బంది దగ్గరగా ఉండేవిధముగా పునఃప్రారంభించడ మైనది.
- బి.టి.రోడ్ ను M.T.పార్క్ నుండి A.G-1 గార్డ్ వరకు వేయడం జరిగినది.
- బెటాలియన్ క్వార్టర్స్ నందు సిమెంట్ రోడ్ వేయడం జరిగినది.
- బెటాలియన్ మహిళలకు కూడా స్పోర్ట్స్ మరియు Cultural activities ను నిర్వహించడ మైనది.
- అత్యవసర వైద్య సేవల నిమిత్తం 24 గంటలు అంబులెన్స్ ను అందుబాటు లో ఉంచడమైనది.
- SCTPCs ప్రతి వారం రిక్రియేషన్ మరియు ప్రతి నెల Cultural activities ను నిర్వహిస్తున్నాము.
- SCTPCs కు మొబైల్ బ్యాంకింగ్ గురించి అవగాహన సదస్సు నిర్వహించి వారి అందరికి అకౌంట్స్ ను ఇప్పించడ మైనది.
ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలనీ దానికి మీ సహాయ సహాకారాలు అందిస్తారని భావిస్తూ మరొకసారి విచ్చేసిన అందరికి నా హృదయ పూర్వక అభినందనలు.
| కమాండెంట్ (CMT) | |
|---|---|
| అడిషనల్ కమాండెంట్ (ADDL CMT) | అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AO) |
| అసిస్టెంట్ కమాండెంట్ (AC/DSP) | సూపరింటెండెంట్ (SUPDT) |
| రిజర్వు ఇన్స్పెక్టర్ (RI) | సీనియర్ అసిస్టెంట్ (Sr) |
| రిజర్వు సబ్ ఇన్స్పెక్టర్ (RSI) | జూనియర్ అసిస్టెంట్ (Jr) |
| అసిస్టెంట్ రిజర్వు సబ్ ఇన్స్పెక్టర్ (ARSI) | టైపిస్ట్ |
| హెడ్ కానిస్టేబుల్ (HC) | రికార్డ్ అసిస్టెంట్ (RC) |
| పోలీస్ కానిస్టేబుల్ (PC) | ఆఫీస్ సబ్ఆర్డినేట్ |
Contacts of Higher Officers :-
| క్ర.స | పేరు | హోదా | ఫోన్ నెంబర్ |
|---|---|---|---|
| 1 | శ్రీ ఎల్ ఎస్. పాత్రుడు | కమాండెంట్ | 9440627447 |
| 2 | శ్రీ పి.మోహన్ ప్రసాద్ | అడిషనల్ కమాండెంట్ | 9440627446 |
| 3 | శ్రీ కె.సువర్నబాబు | అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ | 9989713689 |
| 4 | శ్రీ జి.దామోదర్ | RSI- అడ్జుదేంట్ | 9440906554 |
ఇమెయిల్ & పోస్టల్ చిరునామా
Email : itcoreteam9apsp[at]gmail.com
అడ్రస్ : కమాండెంట్, 9th Bn APSP, వెల్లివెడు, వేంకటగిరి (మండలం), శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా , PIN CODE : 524132