GOVT. స్కూల్ ఆఫ్ మ్యూజిక్ & డాన్స్
పరిచయం:-
విక్రమ సింహపురి పట్టణముగా వాసికెక్కిన నెల్లూరు పట్టణములో సాంస్కృతిక వారసత్వ సంపదకు నిలయముగా దాదాపు 30 సంవత్సరముల నుండి నెల్లూరు ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల స్ధాపించబడింది. సాహితీ రంగంలో సంగీత రంగములో మహాన్నత కళాకారులకు కేంద్ర బిందువైన నెల్లూరు పట్టణానికి ఇది తలమానికం.
1976 ప్రాంతంలో నెల్లూరు జిల్లా కోట గ్రామములొ నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు కుటుంబ సభ్యులా వారి సహృదయ విద్యాన్యతతో చిన్న స్కూల్ గా స్దాపించబడింది. కళలకు ఎంతో ఆదరణ ఉండడముతో చాలా మంది విద్యార్ది విద్యార్దులు చేరడముతో ఆనతి కాలములో మంచి సంగీత నృత్య పాఠశాలగా గుర్తింపు పొందింది.
కాంగ్రెస్ ప్రభుత్వములో నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్న సమయములో ప్రముఖ సాహితీమూర్తులు, ఎన్నో అత్యోన్నత పదవులు అలకరించిన స్వర్గీయ డా,, బెజవాడ గోపాల్ రెడ్డి తదితరలు కోరిక మేరకు 1990 ప్రాంతములో దాదాపు నెల్లూరు జిల్లాకేంద్రమునకు తరలించబడినది. ఎంతో మంది మహనీయ సంగీత నృత్య కళాకారులు ఈ పాఠశాల లో ఆచార్యులుగా ప్రధానాచార్యులుగా పని చేసి ఈ సంగీత న్యత్య పాఠశాలను మఃహోన్నతమైన స్ధితికి తీసుకొని వచ్చారు. ప్రతి సంవత్సరం అప్పటి నుండి ఈనాటి వరకు కూడా 500 మంది విద్యార్ది విద్యార్ధులతో కళకళలాడుతుంది. గాత్రం వాద్యం (వయోలిన్ , వీణా మృదంగం నాదస్వరం, డోలు ) నృత్యం భారత నాట్యం వివిధ విభాగాలలో శిక్షణ ఇవ్వడము జరుగుతుంది. ప్రతి సంవత్సరము కూడా యూనివర్సిటీ పరీక్షలైన సర్టిఫీకేట్ మరియు డిప్లామో కోర్సులలో విద్యార్ధిని విద్యార్ధులు పరీక్షలు వ్రాస్తూ ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులై పాఠశాల వైభవాన్ని పెంచుతున్నారు. అంతేకాక ఈ సంస్ధలలో శిక్షణ తీసుకొన్న వారుమంచి సంగీత నృత్య శిక్షకులు గానూ ప్రదర్శనా కళాకారులుగాను మంచిపేరును సాధించారు.
శాఖ నిర్మాణం
సాంస్కృతిక శాఖ ప్రధాన కార్యాలయము – రూపురేఖలు
ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము – భాషా సాంస్కృతిక శాఖ సృజనాత్మకత మరియు సాంస్కృతిక సమితి వారి పర్యవేక్షణ క్రింద నడుపబడుచున్నది.సాంస్కృతికశాఖవారి ప్రధాన కార్యాలయము విజయవాడ లో ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ఘంటశాల వేంకటేశ్వర రావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రాంగణములో ఉన్నది. సంచాలకులు లేదా ముఖ్య కార్యనిర్వాహణ అధికారి ఈ సంస్దకి అధికారిక పెద్దగా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ లో తదితర ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల కళశాలలు నిర్వహింపబడితాయి. పలు ప్రాంతాలలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రభుత్వ పరమైనవి. వివిధ కళాకారుల చేత ప్రదర్శింపచేయడము. ప్రభుత్వ పరమైన సంగీత నృత్య పాఠశాలలు మరియు కళాశాలలను నిర్వహించడము వీరి ప్రధాన విధి.
ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల రూపురేఖలు
ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల నెల్లూరు – ఆర్ టి సి బస్ స్టాండ్ దగ్గర , డి యస్ ఆర్ కళ్యాణ మండపము వెనుక నెల్లూరు. చరవాణి సంఖ్య 9440361606 దూరవాణి సంఖ్య 0861-2328285.
దాదాపు 35 సంవత్సరముల నుండి నెల్లూరు జిల్లా కేంద్రములో నడపబడుచున్న నెల్లూరు ప్రభుత్వ నృత్య పాఠశాల లో నేర్పబడుచున్న విషయములు 1. గాత్రము 2. వీణా 3. వయోలిన్ 4. భారత నాట్యం 5. మృదంగం 6. డోలు 7. నాదస్వరం. ఈ విభాగాలలో ఏడు మండి అధ్యాపకులు పని చేయుచున్నారు. దాదాపు 400 మండి పైచిలుకు విద్యార్ధిని విద్యార్ధులు పైన పేర్కొన్న రంగాలలో శిక్షణ తీసుకొంటున్నారు.
అద్యపకులు వివరములు:-
ప్రధాన కార్యాలయము
డైరెక్టర్, భాష మరియు సాంస్కృతిక విభాగం, . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన కార్యాలయం: విజయవాడ – ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల
ప్రధాన కళాశాల
ప్రిన్సిపాల్
ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల
నెల్లూరు
కార్యాలయము- జూనియర్ సహాయకులు
ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల
నెల్లూరు
శ్రీమతి కె. తిరుపతమ్మ,
సహాయక లెక్చరర్, భరతనాట్యం
చరవాణి: 9866458206
శ్రీ ఐ పినాకపాణి
వాద్యకారుడు, మృదంగం, భరతనాట్యం విభాగం , చరవాణి: 9291372724
బి. మదేశ్వర కుమార్
సహాయక లెక్చరర్, వీణా
చరవాణి: 9989320093
శ్రీ యం. లోకేశ్ బాబు
వయోలిన్ ఉపాద్యాయుడు
చరవాణి: 9966026608
శ్రీ జె వి. సురేశ్
నాదస్వరం ఉపాద్యాయుడు
చరవాణి: 9393552454
శ్రీ జె మల్లిఖార్జున
డోలు ఉపాద్యాయుడు
చరవాణి: 7989818593
కార్యాలయపు సిబ్బంది
శ్రీ యం’ సాయిబాబు,
ప్రిన్సిపాల్ (FAC)
సహాయ లెక్చరర్, మృదంగం
చరవాణి: 9440361606
శ్రీ యం.డి జావిద్ బాషా
చరవాణి: 9000786599
ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల నిర్వహించు వార్షిక సాంస్కృతిక కార్యక్రమాలు
- శ్రీత్యాగరాజ స్వామి వారి స్మరణోత్సవం- బహుళ పంచమి
- కార్తీక మాసోత్సవం- కార్తీక సోమవార సాంస్కృతిక కార్యక్రమాలు
- భారత రత్న యం.యస్. సుబ్బలక్ష్మి జయంత్యోత్సరములు
- హరికధగాన సప్తాహములు
- నృత్సోత్సవములు – వివిద విశేష సందర్భాలలో చేసే నృత్య ప్రదర్శనలు
- వివిధ వాగ్సేమకారుల స్మరణోత్సవములు , జయంత్యుత్సరములు
- స్ధానిక సంగీత నృత్య కళాకారుల సహాయ సహకారంతోను కళపోషకుల వదాన్సతతొ ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం.
పైన పేరొన్న విధానంతో సంగీత నృత్య పాఠశాల సాంస్కృతిక కేంద్రముగా శోభిల్లుచున్నది. నృత్య శిక్షకులుగాను, ప్రదర్శన కళాకారులుగాను మంచిపేరును సాధించారు.