ముగించు

ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు

1. సాధారణ నమూనా

ఎ) శాఖ యొక్క పాత్ర మరియు కార్యాచరణ:

టెక్స్ట్ బుక్స్ వారి కార్యాలయము ప్రధానముగా పాఠశాల లకు అవసరమైయే ప్రభుత్వ పాఠ్యపుస్తకములు ముద్రణా మరియు పంపిణీల కొరకు ఉద్దేశించబడినవి. మావిభాగము పాఠశాల విద్యాశాక లో ఒక భాగముగా వున్నవి. పాఠశాల విద్యాశాక కమిషనర్ గారు శాకఅధిపతిగా వున్నారు. అందులో విభాగముగా వున్న ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ పాఠ్యపుస్తక ముద్రణా విభాగమునకు ప్రత్యేకముగా సంచాలకులు వున్నారు. వారి యొక్క ప్రధాన కార్యాలయము గుంటూరు లో ఉన్నది.

ఈ శాఖకుసంభందించి ప్రతి జిల్లా ప్రధాన కార్యాలయము నందు 13 జిల్లా లో కూడా జిల్లా ప్రభుత్వ పాఠ్యపుస్తక విక్రయ కార్యాలయములు వున్నవి. ఈ కార్యాలయములో ప్రభుత్వము చే సరఫరా చేయబడిన పాఠ్యపుస్తకములు భద్రపరచి సంభందిత మండల విద్యాశాఖ అధికారులు ద్వారా పాఠశాలలకు పంపిణీ చేయుట జరుగుచున్నది.

 

బి) సంస్ధగత నిర్మాణ క్రమము

 

TEXT BOOKS

1 నుండి 10 వ తరగతి విధ్యార్ధులకు అవసరమైన ప్రభుత్వ పాఠ్యపుస్తకములు ముద్రించి జిల్లా విద్యాశాక అధికారి వారిచే యివ్వబడిన పాఠ్యపుస్తకములు ఇండెంట్ ప్రకారము సంభందిత మండల విధ్యాశాఖ అధికారులు ద్వారా జిల్లా లోని ప్రభుత్వ పాఠశాలలకు పంపిణీ చేయడం ఈ కార్యాలయము యొక్క ప్రధాన ఉద్దేశ్యం.

 

సి) పథకాలు / చర్యలు / ప్రణాళికా చర్యలు

  1. జిల్లాలోని పాఠశాల ప్రధాన ఉపాద్యాయులు మరియు మండల విధ్యాశాఖ అధికారులు రాబోయే విద్యా సంవత్సరమునకు సంభంధించి పాఠశాలల వారీగా అవసరమైన పాఠ్యపుస్తకములు ఇండెంట్ కమీషనర్ వారి వెబ్ సైట్ లో ఆన్ లైన్ లో నమోదు చేయడము జరుగుచున్నది. ఈ ఇండెంట్ పాఠశాల విధ్యార్ధుల చైల్డ్ ఇన్ఫో ఆధారముగా అకాడమిక్ సంవత్సరము ప్రారంబించదానికి 6 నెలలు ముందే తయారు చేయడము జరుగుతుంది.
  2. జిల్లా విద్యాశాఖ అధికారి సంబంధిత మండల విధ్యాశాఖ అధికారులు సమర్పించబడిన టెక్స్ట్ బుక్స్ ఈవెంట్ ను దృవీకరించి కమీషనర్ పాఠశాల విద్యా ఆంధ్రప్రదేశ్ వారికి సమర్పించడము జరుగుచున్నది.
  3. కమీషనర్ పాఠశాల విద్యా శాఖ వారు రాష్ట్రం లోని అన్నీ జిల్లా విధ్యా శాఖ అధికారుల వారి వద్ద నుంచి ఆన్ లైన్ లో సమర్పించబడిన జిల్లా టెక్స్ట్ బుక్ ఇండెంట్ ఆధారముగా స్టేట్ ప్రింటింగ్ రిక్వయర్ మెంట్ తయారు చేసి ప్రభుత్వ అనుమతితో సంచాలకులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠ్యపుస్తక ముద్రణా విభాగము, గుంటూరు పంపడము జరుగుచున్నది.
  4. కమీషనర్ పాఠశాల విద్యా వారి అధేశముల ప్రకారము సంచాలకులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠ్యపుస్తక ముద్రణా విభాగము, గుంటూరు వారు ప్రింటింగ్ కొరకు అవసరమైన పేపరు సేకరించుట కొరకు మరియు పాఠ్యపుస్తక ముద్రణా కొరకు టెండర్స్ కాల్ పాల్ చేసి పాఠ్యపుస్తకము ముద్రించి జిల్లా లోని టెక్స్ట్ బుక్స్ కార్యాలయమునకు’ పంపడము జరుగుచున్నది మరియు స్టేట్ వారీగా పాఠ్యపుస్తకములు ముద్రణా మరియు పంపిణీ ల విషయమై సంచాలకుల వారి కార్యాలయము నుంచి మోనిటరింగ్ చేయడము జరుగుచున్నది.
  5. సంచాలకులు పాఠ్యపుస్తకములచే సరఫరా చేయబడిన పాఠ్యపుస్తకములను జిల్లా టెక్స్ట్ బుక్స్ వారి కార్యాలయములలో మేనేజరు మరియు కార్యాలయ సిబ్బంది టెక్స్ట్ బుక్స్ లు తీసుకొని వారి కార్యాలయ గుడెములలో భద్ర పరచి జిల్లా లోని అందురు మండల విద్యా శాఖ అధికారులకు అయా మండలముల యొక్క టెక్స్ట్ బుక్స్ ఇండెంట్ ప్రకారము పాఠ్యపుస్తకములు ఎపియస్ ఆర్ టి సి లాజిక్ స్టిక్స్ వారి ద్వారా యం. ఆర్. సి. పాయింట్ వద్దకు చేర్చడము జరుగుచున్నది. టెక్స్ట్ బుక్స్ వారి కార్యాలయములో తీసుకొనబడిన అందిన పాఠ్యపుస్తకములు మరియు యం ఇ వో లకు బట్వాడ చేయబడిన పాఠ్యపుస్తకములు సి యస్ ఇ వెబ్ సైట్ నందు నమోదు చేయడము జరుగుచున్నది.
  6. టెక్స్ట్ బుక్స్ వారి కార్యాలయము నుంచి యం ఇ వో లకు సరఫరా చేయబడిన పాఠ్యపుస్తకములను యం ఇ వో లు అయా మండలములోని అన్నీ ప్రభుత్వ పాఠశాలకు సరఫరా చేయడము జరుగుచున్నది. యం ఇ వో చే తీసుకొనబడిన పాఠ్యపుస్తకముల వివరములు మరియు పాఠశాలలకు పంపిణీ చేయబడిన పాఠ్యపుస్తకముల వివరములు సి యస్ ఇ వెబ్ సైట్ నందు నమోదు చేయడము జరుగుచున్నది.
  7. పాఠశాల ప్రధాన ఉపాద్యాయులు యం ఇ వో లచే పంపబడిన పాఠ్యపుస్తకములను అయా పాఠశాల లోని విధ్యార్ధులకు ఉచితముగా బట్వాడా చేయడము జరుగుచున్నది. మరియు ప్రధాన ఉపాద్యాయులచే తీసుకొనబడిన మరియు విధ్యార్ధులకు పంపిణీ చేయబడిన పాఠ్యపుస్తకముల వివరములు సి యస్ ఇ వెబ్ సైట్ నందు స్టూడెంట్ యప్ ద్వారా నమోదు చేయడము జరుగుచున్నది.
  8. ప్రభుత్వపాఠ్యపుస్తక ముద్రణా మరియు పంపిణీ సమాచార మొత్తము కూడా పాఠశాల విధ్యా కమీషనర్ వారి వెబ్ సైట్ నందు పారదర్శకమైన రీతిలో అందరికీ అందుబాటులో ఉండేలాగా ఉంచబడుచున్నది.

 

డి) సంప్రదించవలసిన సిబ్బంది వివరములు

వరుస సంఖ్య పేరు హోదా చరవాణి సంఖ్య
1. టి. విజయ కుమార్ మేనేజరు 9701585110
2. పి. సురేష్ బాబు సీనియర్ సహాయకులు 9492888152
3. పి. నాగరాజు వెర్ హౌస్ మెన్ 9160226056
4. సి హెచ్ మల్లిక లస్కర్ 9290968402
5. ఎ.లక్ష్మయ సెక్యూరిటీ పర్సన్ 9392949508

 

ఇ) ఈమైల్ పోస్టల్ చిరునామా:-

dgtbsonellore[at]gmail[dot]com

చిరునామా: మేనేజరు , జిల్లా ప్రభుత్వ పాఠ్యపుస్తక విక్రయ కార్యాలయము- నెల్లూరు,

ఇంటి నెంబరు 24/373 , ఏనుగు పట్టాభిరామిరెడ్డి ట్రస్టు బిల్డింగ్ ,

ఫత్తెఖాన్ పేట ఆర్ టి సి బస్ స్టాండ్ దగ్గర , శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జిల్లా- ఆంద్రప్రదేశ్ – 524003

 

ఈ) ముఖ్యమైన వెబ్ సైట్లు

AP Government text Book Press , School Education Department of Andhra Pradesh : https://cse.ap.gov.in