ముగించు

ప్రభుత్వ సర్వజన వైద్యశాల

ఎ) శాఖ / సంస్థ గురించి పరిచయం:

ప్రభుత్వ సర్వజన వైద్యశాల గతంలో డి.ఎస్.ఆర్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి గా పిలిచేవారు. డి.ఎస్.ఆర్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి, నెల్లూరును 18.12.1968న అప్పటి గౌరవ కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ వీరేంద్ర పాటిల్ ప్రారంభించారు. 79.35 ఎకరాలు ఉన్న భూమిలో ఓ.పి భవనం నిర్మించబడింది. సుదీర్ఘ ప్రయాణం తరువాత 12-03-2013 తేదీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 750 పడకలతో ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ప్రభుత్వ సర్వజన వైద్యశాల మార్చబడినది (GO Ms నం .53 తేదీ 12-03-2013). ప్రభుత్వ వైద్య కళాశాల కి దివంగత శ్రీ అనం చెంచు సుబ్బారెడ్డి గారి పేరు పెట్టారు. ప్రసూతి మరియు పిల్లల సంరక్షణ విభాగాన్ని 03-04-2013 న అప్పటి గౌరవ ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఇన్-పేషెంట్ విభాగాన్ని 31-03-2017 న అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ప్రారంభించారు.

 

బి) సంస్థాగత నిర్మాణం

GGH

వైద్యశాల అందించు సేవలు

 

24/7 అత్యవసర మరియు ఐ.సి.యు సేవలు

25 పడకలతో అత్యవసర సేవల విభాగము కలదు. మెడికల్.ఐ.సి.యు, సర్జికల్.ఐ.సి.యు, గైనేకోలోజి.ఐ.సి.యు, పీడియాట్రిక్.ఐ.సి.యు, నవజాత శిశు సంరక్షణ.ఐ.సి.యుల లో ఎమర్జెన్సీ మెడిసిన్ వైద్యులు వెంటిలేటర్లు, డీఫిబ్రిలేటర్, పల్స్ ఆక్సిమీటర్లు, కార్డియాక్ మానిటర్లు లాంటి అత్యాధునిక పరికరాలతో అత్యవసర సేవలు అందిస్తున్నారు.

ఆపరేషన్ థియేటర్లు

ఆసుపత్రిలో మొత్తం 14 ఎ / సి ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి, వీటిలో 10 ఆపరేషన్ థియేటర్లు “మాడ్యులర్ విత్ లామినార్ ఎయిర్ ఫ్లో సిస్టమ్” లో సరికొత్త పరికరాలతో ఉన్నాయి. వెంటిలేటర్లు, సెంట్రల్ ఆక్సిజన, డీఫిబ్రిలేటర్లు, ఇన్ఫ్యూషన్ మరియు సిరంజి పంపులు వంటి లైఫ్ సేవింగ్ పరికరాలు ఉన్నాయి.

ఇన్‌-పేషెంట్ వార్డులు

అన్ని ఇన్‌-పేషెంట్ వార్డులు విద్యార్థులకు బోధనా పడకలతో విశాలంగా రూపొందించబడ్డాయి క్లినికల్ ప్రదర్శన గదులు, చికిత్స గదులు, డ్యూటీ వైద్యులు మరియు ప్రతి వార్డులో నర్సుల గదులు కలవు. ఆసుపత్రిలో ఇన్-పేషెంట్లకు రోజుకు మూడుసార్లు ఉచిత వైద్య సేవలతో పాటుగా, ఉచిత మందులు మరియు మూడు పూటల ఆహారం ఉచితంగా అందించబడతాయి. ప్రసూతి సేవలు పొందిన మహిళలకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆర్ధిక సహాయం పొందగలరు. ఇంకా తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్, మదర్ కిట్, బేబీ కిట్, టీకా, మహా ప్రస్థానం వంటి మొదలగు సేవలు కలవు.

అవుట్-పేషెంట్ డిపార్ట్మెంట్

జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఎముకలు మరియు కీళ్లు, ప్రసూతి, చిన్నపిల్లల విభాగము, కంటి విభాగము, మానసిక వైద్య విభాగము, చెవి ముక్కు గొంతు విభాగము, క్షయ వ్యాధి నిర్ములన విభాగము, చర్మ వ్యాధుల విభాగము, మొదలగు అన్ని విభాగాలతో అవుట్-పేషెంట్ సేవలు కలవు. పురుషులు మరియు స్త్రీలను వేర్వేరు గదులలో చూడబడును.

రోగ నిర్ధారణ సేవలు

అధునాతన పరికరాలతో కూడిన రక్త పరీక్షల విభాగము మరియు రేడియాలజీ విభాగము కలదు. రక్త పరీక్షల విభాగం లో పాథాలజీ, మైక్రో-బయాలజీ, బయో-కెమిస్ట్రీ డిపార్ట్మెంట్స్ కలవు. రేడియాలజీ విభాగం లో రోగ నిర్ధారణలో CT స్కాన్, ఎక్స్‌రే మరియు అల్ట్రా సౌండ్ మొదలగు పరికరాల కలవు.

సహాయక సేవలు

వైద్యశాల పరిపాలన విభాగము , ఐ బ్యాంకు, బ్లడ్ బ్యాంక్, సిఎస్ఎస్డి, లాండ్రీ, ఫార్మసీ స్టోర్స్, పోస్ట్-ఆపరేటివ్ వార్డులు, పారిశుధ్యం, భద్రత, చెదలు మరియు ఎలుకలు నియంత్రణ మరియు మెడికల్ రికార్డ్స్ విభాగం ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయి.