ముగించు

సహాయ చెల్లింపుల మరియు ఖాతాల అధికారి – II, పనులు ఖాతాల విభాగం

కార్యాలయపు వివరములు:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్ధిక శాఖకు సంబంధించి పనులు మరియు ఖాతాల విభాగములో ప్రధాన కార్యాలయం అయిన డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అక్కౌంట్స్, ఇబ్రహీంపట్నం, విజయవాడ వారి పరిధిలో ఈ జిల్లాలో రెండు కార్యాలయాలు పని చేస్తున్నవి. అవి,

  1. సహాయ చెల్లింపుల మరియు ఖాతాల అధికారి కార్యాలయం -I, పనులు ఖాతాల విభాగం, నెల్లూరు.
  2. సహాయ చెల్లింపుల మరియు ఖాతాల అధికారి కార్యాలయం -II, పనులు ఖాతాల విభాగం, నెల్లూరు.

సంస్థాగత నిర్మాణం

FINANCE

పనులు మరియు విధివిధానాలు::

ఈ ఆఫీస్ ఫంక్షన్ కాంట్రాక్టర్ల వర్క్ బిల్లులకు సంబంధించిన చెల్లింపు అథారిటీ, అదే విధంగా ఆర్ అండ్ బి, తెలుగుగంగ ప్రాజెక్టు, అటవీ, ప్రజారోగ్యం మరియు ఆర్థిక విభాగాలు మరియు కార్పొరేషన్లు , భూసేకరణ , పునరావాసం మరియు పునరావాస పనులకు సంబంధించిన బిల్లులు ఈ కార్యాలయములో ఆడిట్ చేసి CFMS ద్వారా అనుమతించిన తరువాత సదరు చెల్లింపులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్ధిక శాఖ నుండి e-కుబేరు ద్వారా సంబందిత లబ్దిదారు / ఏజన్సీ బ్యాంక్ ఖాతా కు జమచేయబడుతుంది.

పనులకు సంబందించిన బిల్లులలో ఏమైనా లోటు పాట్లు ఉన్నపుడు సదరు శాఖ అధికారి CFMS ద్వారా తెలుసుకొని ఆ లోటు పాట్లను సరిచేసి తిరిగి బిల్లును మరల ఈ కార్యాలయమునకు పంపిన తరువాత సదరు బిల్లునుచెల్లింపులకు ఈ కార్యలయం అనుమతించబడును. ఇంకనూ సాదారణ ప్రజానీకానికి బిల్లు ఏ స్థితిలో ఉన్నదో CFMS “బిల్లు స్టేటస్” నందు తెలియజేయబడుతుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ ఇంజనీరింగ్ శాఖల వారు పంపిన బిల్లులలో ఈ కార్యాలయం ద్వారా అనుమతించి బిల్లుల వివరాలు ఎప్పటికప్పుడు ఖచ్చితముగా ఖర్చు వివరములు తెలుసుకొని మరియు బడ్జెట్ చూసుకొని బిల్లుల చెల్లింపులు అనుమతించబడును.

పరిచయాలు:-

క్ర.సం. పేరు హోదా ఫోన్ నంబరు
1 శ్రీ వి.శ్రీనివాస్ డైరెక్టర్ ఆఫ్  వర్క్స్  అక్కౌంట్స్, విజయవాడ 9849908961
2 శ్రీ యం రవీంద్ర ప్రసాద్ బాబ్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్  వర్క్స్  అక్కౌంట్స్, ఒంగోలు 9849908964
3 శ్రీ ఆర్ రామకృష్ణారావు అసిస్టెంట్ పే & అక్కౌంట్స్ ఆఫీసర్-II  వర్క్స్  అక్కౌంట్స్,  నెల్లూరు 9866777974
4 శ్రీ జె పి నరసింహులు సూపరింటెండెంట్ (అడ్మిన్) 9440423355
5 శ్రీ జి. రీచర్డ్ రవి సూపరింటెండెంట్ 9966637226
6 శ్రీ సి హెచ్ వి సుబ్బారెడ్డి సూపరింటెండెంట్ 9948038320

 

ఇ-మెయిల్ / పోస్టల్ చిరునామా:

ఇ-మెయిల్: sialaja.koppolu [at]go[dot]in

చిరునామా: O/o సహాయ చెల్లింపుల మరియు ఖాతాల అధికారి కార్యాలయం -I, పనులు

ఖాతాల విభాగం, టి.జి.పి. ప్రాంగణం, ఎన్.జి.ఓ. హోం ఎదురుగా, దర్గామిట్ట, ఎస్.పి.ఎస్.ఆర్. నెల్లూరు జిల్లా, 524003.

ముఖ్యమైన వెబ్‌సైట్ లింకులు:-

సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సి.‌ఎఫ్‌.ఎం‌.ఎస్.) పోర్టల్ కోసం

https://cfms.ap.gov.in