ముగించు

సాంఘిక సంక్షేమ శాఖ

ఎ) శాఖ / సంస్థ గురించి పరిచయం:

సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య ఉద్దేశ్యము షెడ్యూల్డు కులముల వారి విద్యా పురోగతి, సామాజిక, ఆర్ధిక అభివృద్ధి, సంక్షేమము మరియు రక్షణ మరియు షెడ్యూల్డు కులముల వారి సామాజిక భద్రత కొరకు జోగినుల పునరావాసము, వెట్టి చాకిరి నిర్మూలన మరియు పారిశుధ్య కార్మికుల పునరావాసము.

షెడ్యూల్డు కులముల విద్యార్దుల కోసము సాంఘిక సంక్షేమ శాఖ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా యందు పాథశాల స్దాయిలో 70 వసతి గృహములు మరియు 2 ఆనంద నిలయాలు మరియు కళాశాల స్దాయిలో 13 వసతి గృహములు నిర్వహించబడుచున్నవి.

 

బి) సంస్ధగత నిర్మాణ క్రమము

SOCIAL WELFARE

వివిధ వసతి గృహములు:

వసతి గృహము బాలురు బాలికలు మొత్తము చేరిన విద్యార్దులు
ప్రి మెట్రిక్ 43 27 70 5551
ఆనంద నిలయాలు 1 1 2 82
కళాశాల వసతి గృహాలు 5 8 13 1226
మొత్తము 49 36 85 6853

వసతి గృహములలో విద్యార్దులకు కల్పించిన సౌకర్యాలు :

  1. డైట్ చార్జీలు @ Rs. 1,000/- (3rd & 4th తరగతులకు) మరియు 1,250/- (5th to 10th తరగతులకు)
  2. కాస్మెటిక్ చార్జీలు @ Rs.100/- బాలురకు (3rd & 4th తరగతులకు), మరియు @ 110/- for బాలికలకు మరియు 125/- బాలురకు (5th to 10th తరగతులకు ) మరియు @ 165/- బాలికలకు, వీటికి అదనముగా 3rd to 10th తరగతి చదువు బాలురకు హెయిర్ కటింగ్ చార్జీల క్రింద నెలకు @ 30/- చెల్లించబడును.
  3. నాలుగు జతల సమదుస్తులు, కార్పెట్, దుప్పటి, స్టీల్ ప్లేటు, గ్లాసు, ట్రంక్ బాక్సు ప్రతి విద్యార్దికి ఇవ్వబడును.

వసతి గృహాలలో మార్చి 2019 పడవ తరగతి ఫలితాలు :

విద్యార్దులు జిల్లా ఉత్తిర్ణతా శాతము
వ్రాసిన వారు పాసయిన వారు ఫెయిల్ అయిన వారు ఉత్తిర్ణతా శాతము  
1219 903 316 74.08 83.19

యస్.సి అడ్వకేట్ పధకము :

జిల్లా సెలక్షన్ కమిటి ప్రతి సంవత్సరము 8 మంది యస్.సి. అడ్వకేట్ లను ఎంపిక చేసి వారికి పుబ్లిక్ ప్రాసిక్యుటర్ & ప్రభుత్వ న్యాయవాదుల వద్ద అడ్మినిస్ట్రేషన్ అఫ్ జస్టిస్ పై శిక్షణ ఇప్పించబడును. ఈ శిక్షణా సమయము నందు నెలకు రు.1,000/- వేతనము మొత్తము 36 నెలల పాటు మరియు స్టేషనరీ మరియు పుస్తకముల కోసము రు.6,000/- ఇవ్వబడును.

ఉత్తమ పాథశాలలో ప్రవేశము :

నిరుపేదలైన షెడ్యూల్డు కులముల విద్యార్దులకు ఎంపిక చేయబడిన ఉత్తమ ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ లలో 5 వ తరగతి వారికి రెసిడెన్షియల్ మరియు 1 వ తరగతి వారికి డే స్కాలర్స్ పధకము ద్వారా ప్రవేశము కల్పించి 10 వ తరగతి వరకు ఉచిత విద్య, మరియు సదుపాయాలు కల్పించబడును. రెసిడెన్షియల్ పధకము క్రింద 350 సీట్లు, డే స్కాలర్స్ పధకము క్రింద 200 మందికి ప్రవేశము కల్పించబడును.

మెట్రిక్ అనంతర ఉపకారవేతనములు :-

జిల్లాలోని కళాశాలలో (ప్రభుత్వ / ప్రైవేటు ) ఇంటర్మీడియట్ మరియు ఆ పైన తరగతులు చదువు షెడ్యూల్డు కులముల విద్యార్దులకు ఉపకారవేతనములు మరియు పూర్తీ ఫీజు రీ యంబర్సుమెంటు మంజూరు చేయబడును. విద్యార్ది యొక్క హాజరు శాతాన్ని బట్టి ఉపకారవేతనములు విద్యార్ది బ్యాంకు ఖాతాకు మరియు ఫీజు రీ యంబర్సుమెంటు కళాశాల ప్రిన్సిపాల్ బ్యాంక్ ఖాతాకు నేరుగా జమ చేయబడును.

ప్రి మెట్రిక్ ఉపకారవేతనములు:

వై. యస్. ఆర్ విద్యా దీవెన :-

ప్రభుత్వ / ఎయిడెడ్ / స్దానిక సంస్థల పాథశాలలో 9 మరియు 10 వ తరగతి చదువుచున్న విద్యార్దులకు ప్రి-మెట్రిక్ ఉపకార వేతనము క్రింద నెలకు రు. 150/ చొప్పున 10 నెలలకు మరియు రు. 750/- ఆడహక్ గ్రాంటు కలిపి మొత్తము సంవత్సరమునకు రు. 2,250/- ప్రతి విద్యార్ధికి చెల్లింపబడును.

కొత్త పధకము:-

ప్రభుత్వ / ఎయిడెడ్ / స్దానిక సంస్థల పాథశాలలో 5 నుండి 8 వ తరగతి వరకు చదువుచున్న విద్యార్దులకు ప్రి-మెట్రిక్ ఉపకార వేతనము క్రింద బాలురకు సంవత్సరమునకు రు. 1000/ మరియు బాలికలకు సంవత్సరమునకు రు. 1500/ చొప్పున చెల్లించబడును. .

స్కిల్ అప్ గ్రెడేషన్ పధకము :-

విదేశీ యునివర్సిటిల లో చేరుటకు అవసరమైన ఎలిజబులిటి పరిక్షలు TOFEL/IELTS మరియు GRE/GMAT లకు అవసరమైన కోచింగ్ ను షెడ్యూల్డు కులముల విద్యార్దులకు ఎంపిక చేయబడిన సంస్థల యందు ఉచిత శిక్షణ ఇప్పించబడును.

అంబేద్కర్ ఓవర్శిస్ విద్యానిధి :

విదేశాలలో ఉన్నత చదువులు చదువగోరు షెడ్యూల్డు కులముల విద్యార్దులకు ఈ పధకము ద్వారా రు.15 లక్షల ఉపకారవేతనము మరియు ఫ్లైట్ చార్జీలు, వీసా చార్జీలు చెల్లింపబడును.

వై. యస్. ఆర్ విద్యోన్నతి :-

సివిల్ సర్వీస్ పరిక్షలు వ్రాయ గోరు షెడ్యూల్డు కులముల విద్యార్దులకు దేశంలోని వివిధ ప్రాంతాలలో ఎంపిక చేయబడిన ప్రఖ్యాత సంస్థల సంస్థల యందు ఉచిత శిక్షణ ఇప్పించబడును

ఉచిత విద్యుత్ పధకము :-

100 యూనిట్ల లోపు విద్యుత్ వాడు షెడ్యూల్డు కులముల కుటుంబాలకు ఈ పధకము ద్వారా ఉచిత విద్యుత్ అందించబడును. ప్రభుత్వ ఉత్తర్వ్యులు .No.91 SW (SCP.A2) Dept, Dt. 24.07.2019 ప్రకారము ఉచిత విద్యుత్ యూనిట్ల వాడకము 200 యూనిట్ల వరకు పెంచడము జరిగినది

ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన :

ఈ పధకము భారత ప్రభుత్వము చే అమలు చేయబడుచున్న కేంద్ర ప్రాయోజిత కార్యక్రమము. 500 మంది జనాభా లేక 50% పై బడి షె.కు. ల జనాభా వున్న గ్రామమును ఎంపిక చేసి ఆ గ్రామములలో మౌళిక సదుపాయములు కల్పించుట ద్వారా అభివృద్ధి సాధించడము ఈ పధకము యొక్క ముఖ్య ఉద్దేశ్యము.

డప్పు కళాకారులకు ఫించన్లు :                      

షెడ్యూల్డు కులములోని డప్పు కళాకారులకు ఆర్దికముగా చేయూత నిచ్చుటకు ప్రభుత్వము వారు నెలకు రూ.3000/- లు ఫించను తో పాటుగా ఒక జత సమ దుస్తులు, ఒక జత గజ్జలు, మరియు ఒక డప్పు వాయిద్యము మంజూరు చేయుట కొరకు ఈ పధకమును ప్రవేశ పెట్టినారు. 

సాంప్రదాయ చర్మకారులకు ఫించన్లు, పనిముట్లు మరియు పెట్టుబడి నిధి పంపిణీ పధకం :

షెడ్యూల్డు కులములకు చెందిన సాంప్రదాయ చర్మకారుల జీవనోపాధిని మెరుగుపరచడానికి, ఆర్దికముగా చేయూత నందించడానికి ప్రభుత్వం ఈ పధకం ద్వారా నెలకు రూ.2000/- లు ఫించను తో పాటుగా పనిముట్లకు రూ. 10,000 లు మరియు ముడిసరుకుల కొనుగోలు పెట్టుబడి నిధి క్రింద  రూ. 20,000 లు ప్రోత్సహకమును అందిస్తుంది.

సి) ముఖ్యమైన వెబ్ సైట్ లింకులు

1. https://jnanabhumi.ap.gov.in

2. https://jnbnivas.apcfss.in

3. https://epass.apcfss.in

4. https://socialwelfare.apcfss.in

5. https://scsp.apcfss.in