ముగించు

పర్యాటక ప్రదేశాలు

వర్గం ఇతర, చరిత్ర ప్రసిద్ధమైనవి, ధార్మిక, వినోదభరితమైనవి, సహజ/రమణీయమైన సౌందర్యం

నెల్లూరు జిల్లా జిల్లా సాహిత్యమూ, కళలు, సంస్కృతులను గొప్ప వారసత్వ సంపదగా కలిగి, పర్యాటకులకు ఆ సంపద గురించి సంగ్రహముగా తెలియ జేయు చిహ్నముగా నున్నది. ఈ జిల్లాలోని పర్యాటక ప్రదేశములకు చేయు ప్రయాణము మిమ్ములను నిరశాపరచదు. ఈ ప్రదేశములకు మరల మరల సందర్శించినా మొట్టమొదట కలిగిన ఆనందమే కలుగును.

ఈ పర్యాటక ప్రదేశాలు కలిగించు ఆహ్లాదము ప్రతి ఒక్కరిలో ఒక శక్తి ప్రసరణ జరిగినట్లు భావనను కలిగించును. ఈ పర్యాటక ప్రదేశాల ఆకర్షణ మనలను మంత్రముగ్ధులను చేయును. ఈ అందాలను ఆస్వాదిస్తూ ఈ ప్రదేశాలను సందర్శించుట ఒక గొప్ప అనుభూతి.

ఛాయా చిత్రాల ప్రదర్శన

  • కృష్ణపట్నంపోర్ట్
  • సోమశిల
  • వేంకటగిరి కోట

ఎలా చేరుకోవాలి?:

విమానం ద్వారా

నెల్లూరుకు సమీప విమానాశ్రయం తిరుపతి విమానాశ్రయం, చెన్నై విమానాశ్రయం తిరుపతి విమానాశ్రయం, తిరుపతి, ఆంధ్రప్రదేశ్ – నెల్లూరు నుండి దూరం 120 కి.మీ. చెన్నై విమానాశ్రయం, చెన్నై, తమిళనాడు-నెల్లూరు నుండి దూరం 190 కి.మీ.

రైలులో

నెల్లూరు రైల్వే స్టేషన్, రైలు మార్గాల ద్వారా భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాలకు బాగా అనుసంధానించబడి ఉంది హౌరా-చెన్నై, ఢిల్లీ-చెన్నై మెయిన్ లో భాగమైన విజయవాడ-గూడూర్ సెక్షన్లో ఉంది. నిలిచే రైళ్ళ సంఖ్య: 188 ( ప్రతి రోజు మరియు కానివి మొత్తం )

రోడ్డు ద్వారా

నెల్లూరు నగరం చెన్నై-కలకత్తా జాతీయ రహదారిలో ఉంది ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్, చెన్నై మరియు బెంగళూరు అన్ని ప్రధాన నగరాలకు బస్సుల ద్వారా నెల్లూరు కి బాగా అనుసంధానించబడి ఉన్నాయి. నెల్లూరు నుండి : చెన్నై – 172 కి.మీ., విజయవాడ – 224 కి.మీ., విశాఖపట్నం -638 కి.మీ. తిరుపతి – 130 కి.మీ., బెంగళూరు – 377 కి.మీ., హైదరాబాద్ – 516 కి.మీ