కార్మిక శాఖ
ఎ) ప్రొఫైల్ :
డిపార్ట్మెంట్ పాత్ర మరియు చేయు విధులు
1. న్యాయపరమైన సేవలు:
సహాయ కార్మిక కమీషనరు, నెల్లూరు మరియు గూడూరు వారు కనీస వేతనముల చట్టము, జీతముల చెల్లింపుల చట్టము, కార్మిక నష్ట పరిహార చట్టము, ఇండస్ట్రియల్ వివాదముల చట్టముల క్రింద వివిధ కేసులలో క్వాషీ జుడీషియల్ ఆధారిటీగా కోర్టును నిర్వహించెదరు.
ఉప కార్మిక కమీషనరు, నెల్లూరు వారు కనీస వేతనముల చట్టము, జీతముల చెల్లింపుల చట్టము, కార్మిక నష్ట పరిహార చట్టము, ఇండస్ట్రియల్ వివాదముల చట్టముల క్రింద వివిధ కేసులలో అప్పీలేట్ ఆధారిటీగా మరియు క్వాషీ జుడీషియల్ ఆధారిటీగా కోర్టును నిర్వహించెదరు.
బి) డిపార్టుమెంటు యొక్క ఆకృతి
ఉప కార్మిక కమీషనరు వారి కార్యాలయపు సిబ్బంది
[/vc_column_text][/vc_column][/vc_row]
సి) సంక్షేమ పధకములు/విధులు/కార్యాచరణ
- సంఘటిత రంగ కార్మికుల విభాగము:
- అసంఘటిత రంగ కార్మికుల విభాగము
1. సంఘటిత రంగ కార్మికుల విభాగము:
ఎ) ఆంధ్ర ప్రదేశ్ కార్మిక సంక్షేమ నిధి బోర్డు, విజయవాడ
ఈ దిగువ చూపిన పధకములను సంఘటిత రంగ కార్మికుల విభాగము ద్వారా రిజిష్టరు కాబడిన ఆంధ్ర ప్రదేశ్ కార్మిక సంక్షేమ నిధిలో సబ్యులైన కార్మికులకు (ప్రజా సాధికారిక సర్వేలోని నమోధుకాని చంద్రన్నబీమా ద్వారా వర్తించని కార్మికులకు) మంజూరు చేయుచున్నది.
1. ప్రమాద మరణ పధకము: రూ. 5,00,000/- (కార్మిక సంక్షేమ మండలి నందు కార్మికులుగా రిజిష్టరు కాబడి ప్రజా సాధికారిక సర్వేలో నమోదుకాని చంద్రన్నబీమా మొత్తము లబించని కార్మిక సంక్షేమ మండలి లబ్దిదారులకు మాత్రమే)
2. సాదారణ మరణ పధకము: రూ. 20,000/- (కార్మిక సంక్షేమ మండలి నందు కార్మికులుగా రిజిష్టరు కాబడి ప్రజా సాధికారిక సర్వేలో నమోదుకాని చంద్రన్నబీమా మొత్తము లబించని కార్మిక సంక్షేమ మండలి లబ్దిదారులకు మాత్రమే)
3. అంత్యక్రియల పధకము: రూ. 10,000/-(కార్మిక సంక్షేమ మండలి నందు కార్మికులుగా రిజిష్టరు కాబడి ప్రజా సాధికారిక సర్వేలో నమోదుకాని చంద్రన్నబీమా మొత్తము లబించని కార్మిక సంక్షేమ మండలి లబ్దిదారులకు మాత్రమే)
4. వివాహ కానుక పధకము: రూ. 20,000/- (కార్మిక సంక్షేమ మండలి నందు కార్మికులుగా రిజిష్టరు కాబడి ప్రజా సాధికారిక సర్వేలో నమోదుకాని చంద్రన్నబీమా మొత్తము లబించని కార్మిక సంక్షేమ మండలి లబ్దిదారులకు మాత్రమే)
5. ప్రమాదవశాత్తు గాయపడి శాశ్వత అంగవైకల్యము పొందినవారికి రూ.2,50,000-00 (కార్మిక సంక్షేమ మండలి నందు కార్మికులుగా రిజిష్టరు కాబడి ప్రజా సాధికారిక సర్వేలో నమోదుకాని చంద్రన్నబీమా మొత్తము లబించని కార్మిక సంక్షేమ మండలి లబ్దిదారులకు మాత్రమే)
బి). దిగువ చూపిన పధకములు రిజిష్టరు కాబడిన ఆంధ్ర ప్రదేశ్ కార్మిక సంక్షేమ నిధి కార్మికులకు నేరుగా వారి బ్యాంకు అకౌంట్లో సహాయ కార్మిక కమీషనరులు నెల్లూరు మరియు గూడూరు వారి ద్వారా జమ చేయబడుతుంది.
6. అంగ వైకల్యము గల వారికి స్కాలర్ షిప్: రూ. 10,000/-
7. స్కాలర్ షిప్లు : రూ. 10,000/-
8. ప్రసూతి సహాయము: రూ. 20,000/-
9. కుటుంభ నియంత్రణ ఆర్దిక సహాయము: రూ. 5,000/-
10. దీర్ఘ కాలిక వ్యాధుల ఆర్దిక సహాయము: రూ. 50,000/-
b) ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు, విజయవాడ ద్వారా ఈ క్రింది పధకములు అమలు చేయబడు చున్నవి.
1. ప్రమాద వశాత్తు మరణము: రూ. 5,00,000/- (భవన నిర్మాణ కార్మికులుగా రిజిష్టరు కాబడి ప్రజా సాధికారిక సర్వేలో నమోదుకాని చంద్రన్నబీమా మొత్తము లబించని భవన నిర్మాణ కార్మికులకు మాత్రమే)
2. శాస్విత అంగవైకల్యము : రూ. 5,00,000/- (భవన నిర్మాణ కార్మికులుగా రిజిష్టరు కాబడి ప్రజా సాధికారిక సర్వేలో నమోదుకాని చంద్రన్నబీమా మొత్తము లబించని భవన నిర్మాణ కార్మికులకు మాత్రమే)
3. సహజమరణము మరియు ధహన ఖర్చులకు: రూ.80,000/- (భవన నిర్మాణ కార్మికులుగా రిజిష్టరు కాబడి ప్రజా సాధికారిక సర్వేలో నమోదుకాని చంద్రన్నబీమా మొత్తము లబించని భవన నిర్మాణ కార్మికులకు మాత్రమే)
4. వివాహ కానుక పధకము:: రూ.20,000/- (భవన నిర్మాణ కార్మికులుగా రిజిష్టరు కాబడి ప్రజా సాధికారిక సర్వేలో నమోదుకాని చంద్రన్నబీమా మొత్తము లబించని భవన నిర్మాణ కార్మికులకు మాత్రమే)
5. నమోదు కానీ భవన నిర్మాణ కార్మికుల ప్రమాద వశాత్తు మరణము: రూ. 50,000/-
b)ఈ క్రింది స్కీముల మొత్తములు ఆన్ లైన్ ద్వారా బ్యాంక్ నుండి బోర్డు నంధు నమోధు కాబడిన భవన నిర్మాణ కార్మికులకు ఆర్ధిక సహాయము చేయబడుచున్నది. చంద్రన్నబీమా తో సంబంధం లేదు.
6. ప్రసూతి సహాయము పధకము : రూ. 20,000/- మహిళా కార్మికులు లేదా నిర్మాణ కార్మికుల కుమార్తె లకు మాత్రమే వర్తించును.
7. తాత్కాలిక వైకల్యము ( టెంపరరీ డిసెబిలిటీ) పధకము క్రింద గరిష్టముగా రూ.9,000/- ఆర్ధిక సహాయము చేయబడుచున్నది.
2. ఆనంఘటిత కార్మికుల వ్యవస్థ:
a) ఈ – శ్రమ్
ఈ పధకమునకు అర్హులు :
16 నుండి 59 సం. ల వయస్సు లోపు వారు
ఆదాయపు పన్ను చెల్లించని వారు
EPFO మరియు ESI సదుపాయము లేని వారు
వర్తించు పధకములు
1. ప్రమాద మరణము – Rs.2,00,00/-
2. అంగ వైకల్యము – Rs.2,00,00/-
b) PM – SYM
నెలసరి ఆదాయము రూ. 15,000/- ల లోపు కలిగియున్న వారందరూ అర్హులే.
18 నుండి 40 సం. ల లోపు కలిగియున్న వారందరూ అర్హులే
EPFO మరియు ESIC చెల్లించని వారు
PM – NPS
ఆదాయపు పన్ను చెల్లించని వారు, వార్షిక టర్నోవర్ కోటి యాభై లక్షల లోపు ( 1.50 కోట్లు) ఉన్న వారు
18 నుండి 40 సం. ల లోపు కలిగియున్న వారందరూ అర్హులే
EPFO మరియు ESIC చెల్లించని వారు
1. పై రెండు పధకములలో చేరిన వారికి 60 సం. దాటిన తర్వాత నెలవారి భరోసా పెన్షన్ రూ. 3000/- లు లభించును.
2. ఈ స్కీము వలన వ్యాపారి చెల్లించే నిధికి సమానంగా కేంద్ర ప్రభుత్వము కూడా అంటే మొత్తాని పింఛను నిధికి జమ చేస్తుంది
3. మరణాంతరము జీవిత భాగస్వామికి 50% మొత్తం చెల్లిస్తారు
4. ఈ స్కీము లో చేతిన అనంతరము పదేళ్ళ లోపు వైదొలగాలను కుంటె మీరు చెల్లించిన మొత్తాన్ని సేవింగ్స్ బ్యాంక్ ఖాతా వడ్డి రేటుతో తిరిగి ఇస్తారు. 10 సం. తరువాత వైదొలిగితే పింఛన్ ఫండ్లో పొందిన వడ్డెతో సహా తిరిగి చెల్లిస్తారు. ప్రతి నెలా ప్రీమియం చెల్లిస్తూ మధ్యలో చనిపోతే ఆ స్థానములో వారి జీవిత భాగ స్వామి సభ్యులుగా కొనసాగవచ్చు. వారు కూడా పూర్తి పింఛన్ పొందవచ్చు.
5. జీవిత భాగస్వామి మృతి చెందాకా ఈ పధకము నుండి వైదొలగాలనుకుంటే చందా మొత్తాన్ని వడ్డితో సహా చెల్లిస్తారు.
డి) సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు .
క్రమ సంఖ్య | డివిజన్ /మండల్ అధికారులు | మొబైల్ నంబర్లు | మెయిల్ ID |
---|---|---|---|
1 | ఉపకార్మిక కమీషనర్, నెల్లూరు | 9492555114 | dcl[dot]nellore[at]gmail[dot]com |
2 | సహాయకార్మిక కమీషనర్, నెల్లూరు | 9492555115 | acl[dot]nlr[at]gmail[dot]com |
3 | సహాయకార్మిక కమీషనర్, గూడూరు | 9492555116 | acl[dot]gudur[at]gmail[dot]com |
4 | సహాయకార్మిక కమీషనర్, (SSPO) నెల్లూరు | – | – |
5 | సహాయకార్మిక కమీషనర్, (SSP) కావలి | – | – |
6 | సహాయకార్మిక అధికారి, 1 వ వలయము , నెల్లూరు | 9492555117 | alo1[dot]nellore[at]gmail[dot]com |
7 | సహాయకార్మిక అధికారి, 2వ వలయము , నెల్లూరు | 9492555118 | alo2[dot]nellore[at]gmail[dot]com |
8 | సహాయకార్మిక అధికారి, 3వ వలయము , నెల్లూరు | 9492555119 | alo3[dot]nellore[at]gmail[dot]com |
9 | సహాయకార్మిక అధికారి, 4వ వలయము , నెల్లూరు | 9492555120 | alo4[dot]nellore[at]gmail[dot]com |
10 | సహాయకార్మిక అధికారి, కావలి. | 9492555121 | alo[dot]kavalii[at]gmail[dot]com |
11 | సహాయకార్మిక అధికారి. గూడూరు | 9492555122 | alo[dot]gudur[at]gmail[dot]com |
12 | సహాయకార్మిక అధికారి,నాయుడుపేట | 9492555123 | alo[dot]naidupet[at]gmail[dot]com |
13 | సహాయకార్మిక అధికారి,ఆత్మకూరు | 9492555124 | atmakur[dot]alo[at]gmail[dot]com |
14 | సహాయకార్మిక అధికారి,ఉదయగిరి | 9492555125 | alo[dot]udayagiri[at]gmail[dot]com |
15 | సహాయకార్మిక అధికారి,రాపూరు | 9492555126 | alo[dot]rapur[at]gmail[dot]com |
ఇ) ముఖ్యమైన లింకులు:(వెబ్ సైట్స్)
1 | కార్మిక శాఖ, ఆంధ్ర ప్రదేశ్ | http://www.labour.ap.gov.in |
---|---|---|
2 | భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు , ఆంధ్ర ప్రదేశ్ | http://www.apbocwwb.ap.nic.in |
3 | కార్మిక సంక్షేమబోర్డ్, ఆంధ్ర ప్రదేశ్ | www.aplabourwelfareboard.ap.gov.in |