ముగించు

చేనేత వస్త్రాలు మరియు వస్త్రాలు

1. చేనేత జౌళి శాఖ వివరములు :

  1. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత మరియు జౌళి శాఖ ఆధీనంలో చేనేత మగ్గముల సొసైటీలు, మర మగ్గముల సొసైటీలు, అప్పెరల్ ఎక్స్ పోర్ట్ పార్క్స్ మరియు గార్మెంట్ రంగాలు పనిచేయుచున్నవి.
  2. భారతదేశంలో అతిపెద్ద చేనేత పరిశ్రమగా ఆంధ్రప్రదేశ్ ఉన్నది. ఈ రాష్ట్రంలో 2,00,310 చేనేత సహకార సంఘ సభ్యులుగా ఉన్నారు. మరియు రాష్ట్రంలో చేనేత సహకారేతర సభ్యులుగా 1,58,902 మంది ఉన్నారు. మరియు మర మగ్గముల ద్వారా చేనేత సహకార సంఘ సభ్యులు మరియు సహకారేతర సభ్యులు రాష్ట్రంలో 81,000 కరెంటు మర మగ్గములపై పని చేయుచున్నారు.
  3. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత జౌళి శాఖ ఆధీనంలో 1282 చేనేత సహకార సంఘములు పనిచేయుచున్నవి. మరియు రాష్ట్రములో కాటన్, 896 సిల్క్, 325 నూలు – 61 సంఘములు మరియు 166 టైలర్స్ సహకార సంఘములు, 193 మర మగ్గములు సంఘములు ఉన్నవి. ఇవి కాక ఒక్క అఫెక్స్ సొసైటి ఉన్నది. రాష్ట్రంలో ఆప్కో ద్వారా చేనేత ఉత్పత్తులు మార్కెటింగ్ జరుగుచున్నవి.
  4. అనేకమైన కేంద్ర ప్రభుత్వ పధకాలు మరియు రాష్ట్ర ప్రభుత్వ పధకాలు అమలు చేయబడుచున్నవి. ఈ పథకాలు ఆర్ధికంగా వెనుకబడిన చేనేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వ వాటా, రాష్ట్ర ప్రభుత్వ వాటాగా మరియు చేనేత కార్మికుని షేర్ ద్వారా అమలు చేయబడుచున్నవి.

 

2. సంస్థ నిర్మాణము:

HANDLOOMS AND TEXTILES

3. సహాయ సంచాలకులు, చేనేత మరియు జౌళి శాఖ, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వారి కార్యాలయములో చేనేత కార్మికులకు అమలు జరుపుచున్న సంక్షేమ మరియు అభివృద్ధి పథకములపై సంక్షిప్త నివేదిక

  • జిల్లాలో సుమారు 6,136 మంది చేనేత కార్మికులు ఉన్నారు, వీరిలో 24,544 మంది చేనేత కుటుంబ సభ్యులు 35 మండలాలలోని 107 గ్రామాలలో మరియు 4 మునిసిపాలిటిలలో ఉన్నారు.
  • జిల్లాలో (44) చేనేత సహకార సంఘములకు గాను, అందులో (20) పనిచేయుచున్న చేనేత సహకార సంఘములు మరియు (24) పనిచేయని చేనేత సహకార సంఘములు వున్నాయి.
  • నెల్లూరు జిల్లాలో వెంకటగిరి మెర్సిరైజైడ్ చీరలు, శిల్క్/శిల్క్ వెంకటగిరి జందాని చీరలు, వెంకటగిరి చీరలు, పాటూరు పట్టు చీరలు మరియు నారాయణరెడ్డిపేట చీరలు రాష్ట్రములోనే గాక, దక్షిణ భారతదేశమంతా ప్రశస్తి గడించినవి.
  • చేనేత పరిశ్రమ ప్రగతి కొరకు చేనేత మరియు జౌళి శాఖ ద్వారా వివిధ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నవి.

వివరములు:

(1) మహాత్మా గాంధీ బునకర్ భీమా యోజన (ఇన్సూరెన్సు):

ఈ పథకమును 2005-06 అమలు జరుగుచున్నది. కానీ, ది:31.05.2017వ తేదీ నుండి నిలిపి వేయడమైనది. ది:01.06.2017వ తేదీ నుండి 18-50 సంవత్సరముల చేనేత కార్మికులకు ప్రధానమంత్రి జీవన జ్యోతి భీమా యోజన క్రింద రూ.80/-ల చొప్పున చెల్లించి నమోదు అయిన వారికి సాధారణ మరణానికి రూ.2,00,000/-లు మరియు 51-59 సంవత్సరముల చేనేత కార్మికులకు ఆమ్ ఆద్మీ భీమా యోజన (AABY) క్రింద రూ.80/-ల చొప్పున చెల్లించి నమోదు అయిన వారికి సాధారణ మరణానికి రూ.60,000/-లు చెల్లించునట్లు పథకమును రూపొందించబడినది. అయితే రాజన్న భీమాలో పేరు నమోదు అయివున్నట్లయితే వారు ఒక పథకము ద్వారా మాత్రమే లబ్ది పొందగలరు.

ఈ పథకము క్రింద్ర 2019-20 సంవత్సరమునకు (303) మంది చేనేత కార్మికులు రెన్యువల్ చేయించుకొని ఉన్నారు.

(2) ప్రధానమంత్రి ముద్ర యోజన పథకము:

2018-19 సంవత్సరమునకు గాను, ఈ పథకము క్రింద (1200) టార్గెట్ మంజూరు చేయగా, అందులో (349) ముద్ర ఋణములు మంజూరు చేసి, రూ.176.50 లక్షలు లబ్దిదారులకు వారి వారి బ్యాంకు ఖాతాలలో జమ చేయడమైనది.

2019-20 సంవత్సరమునకు గాను, ఈ పథకము క్రింద (400) టార్గెట్ మంజూరు చేయగా, ఇప్పటివరకు (600) ముద్ర ఋణ దరఖాస్తులను వివిధ బ్యాంకు బ్రాంచి మేనేజర్లకు పంపడం జరిగినది. ఇప్పటివరకు (12) ఋణములు మంజూరు చేసి, రూ.6.00 లక్షలు చేనేత కార్మికుల బ్యాంకు ఖాతాలకు జమ చేయడమైనది. ఋణముల మంజూరు కొరకు సంబంధిత బ్యాంకు బ్రాంచి మేనేజరులతో సంప్రదింపులు జరుగుచున్నవి.

(3) నేత బజారు:

సహకార, సహకారేతర రంగములలోని కార్మికులు తయారు గావించిన వస్త్రముల అమ్మకాల కొరకు నెల్లూరు నగరమున గల CAM లే-అవుట్, రమేష్ రెడ్డి నగర్, ఫత్తేఖాన్ పేట, నెల్లూరు నందు “నేత బజారు” ఏర్పాటుకు 20 సెంట్లు స్థలము కేటాయించవలసినదిగా ప్రతిపాదనలు శ్రీయుత కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వారి ద్వారా కమీషనర్, నెల్లూరు కార్పొరేషన్, నెల్లూరు వారికి పంపబడినవి.

(4) కేంద్ర ప్రభుత్వము ద్వారా కార్వే సంస్థచే జిల్లాలోని చేనేత కార్మికుల ఫోటో గుర్తింపు కార్డు సర్వే నిర్వహణ:

కేంద్ర ప్రభుత్వము ద్వారా కార్వే సంస్థచే శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని చేనేత కార్మికుల ఫోటో గుర్తింపు కార్డులు పంపిణీ చేయుటకు చేనేత కార్మికులు ఉన్న మండలాలను, గ్రామాలను గుర్తించి సర్వే చేయడం జరిగినది. సదరు సర్వే నందు (7357) చేనేత మగ్గము నేయు కార్మికులను మరియు (1687) అనుబంధ వృత్తి కార్మికులు వెరశి మొత్తము (9044) చేనేత కార్మికులను కార్వే సంస్థ వారు గుర్తించినారు. చేనేత కార్మికులకు ఫోటో గుర్తింపు కార్డులు జారీ కార్వే సంస్థ ద్వారా చేయవలసియున్నది.

(5) చేనేత కార్మికుల సంక్షేము కొరకు ప్రకటించబడిన ప్యాకేజీ:

రాష్ట్ర ప్రభుత్వము ద్వారా చేనేత కార్మికులకు (1) ప్రతి చేనేత కుటుంబమునకు వేతన భృతి పరిహారము, (2)100 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్తు, (3)ఆరోగ్య భీమా పథకము, (4)వర్కు షెడ్ తో కూడిన గృహముల మంజూరు మరియు (5)పట్టణ ప్రాంతములో సాముహిక వర్కు షెడ్డుల నిర్మాణములతో కూడిన (5) పథకములతో ప్యాకేజీ ప్రకటించడమైనది. లబ్దిదారుల ఎంపిక కొరకు గ్రామస్థాయి కమిటీలతో సర్వే నిర్వహించబడినది. 6136 మంది చేనేత లబ్దిదారుల కుటుంబములను గుర్తించుట జరిగినది. ఆయా మండల కమిటీల ఆమోదముతో శ్రీయుత జిల్లా కలెక్టర్ వారి ద్వారా ప్రతిపాదనలు శ్రీయుత డైరెక్టర్, చేనేత మరియు జౌళి శాఖ, ఆంధ్రప్రదేశ్, అమరావతి వారికి ప్రతిపాదనలు పంపియున్నాము.

(6) చేనేత వృద్ధాప్య ఫింఛన్లు:

ది:30.06.2019 నాటికి జిల్లాలో గల (5830) మంది చేనేత కార్మికులకు వృద్ధాప్య ఫింఛన్లు రూ.2,000/-ల చొప్పున మంజూరు చేసియున్నారు.

(7) బ్లాక్ లెవెల్ చేనేత క్లస్టర్స్:

జిల్లాలో (11) బ్లాక్ లెవెల్ చేనేత క్లస్టర్ల ప్రతిపాదనలకు గానూ, (2) బ్లాక్ లెవెల్ చేనేత క్లస్టరులు మంజూరైనవి. వాటిలో (1) వెంకటాచలం బ్లాక్ లెవెల్ చేనేత క్లస్టరుకు రూ.165.820 లక్షలతో ప్రాజెక్ట్ మంజూరై, అందులో రూ.32.310 లక్షలు మొదటి విడతగా మంజూరై,విడుదలైనవి. (2) చెన్నూరు బ్లాక్ లెవెల్ చేనేత క్లస్టరుకు రూ.178.210 లక్షలతో ప్రాజెక్ట్ మంజూరై, అందులో రూ.35.830 లక్షలు మొదటి విడతగా మంజూరై, విడుదల కాబడినవి. ఈ క్లస్టర్ల అమలుకు సొసైటీ ఫర్ వీవర్స్ వెల్ఫేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (SWWAP), గుంటూరు జిల్లాను ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా ఏర్పరచినారు.

1. మంజూరైన రెండు క్లస్టర్స్ యొక్క వివరములు:

క్రమ సంక్య క్లస్టర్ పేరు అమలు చేయు సంస్థ పేరు మొత్తం లబ్ధిదారుల సంఖ్య ఆమోదించ బడిన మొత్తం కేంద్ర ప్రభుత్వం తరపున వాటా లబ్దిదారుని వాటా మొదటి విడతలో విడుదల చేయబడిన మొత్తము అమలుచేయు సంస్థకు విడుదల చేయబడిన మొత్తము జాతీయ చేనేత అభివృది కార్పొరేషనుకు విడుదల చేయబడిన మొత్తము
1 వెంకటాచలం SWWAP 301 165.82 159.495 6.325 32.31 16.56 15.75
2 చెన్నూరు SWWAP 369 178.21 171.535 6.675 35.83 17.83 18
    మొత్తము :: 670 344.03 331.03 13 68.14 34.39 33.75

2. ప్రభుత్వము మంజూరు చేయవలసిన (9) బ్లాక్ లెవెల్ క్లస్టర్స్ యొక్క ప్రతిపాదనలు:

క్రమ. సంఖ్య క్లస్టర్ పేరు క్లస్టర్ సముదాయం మొత్తం లబ్ధిదారుల సంఖ్య ప్రతిపాదించ బడిన మొత్తం
1 కోవూరు కోవూరు మండలములో-గుమ్మళ్ళదిబ్బ, పాటూరు, ఇనమడుగు, కోవూరు. వేగూరు, పడుగుపాడు, గంగవరం గ్రామాలు. 312 184.41
2 యన్.టి.ఆర్ వెంకటగిరి మునిసిపాలిటి నందు – 4వ, 6వ మరియు  7వ వార్డులు. 293 169.08
3 శ్రీ వరసిద్ది వినాయక వెంకటగిరి మునిసిపాలిటి నందు – 3వ మరియు 4వ వార్డులో కొంత భాగము. 292 168.93
4 శ్రీ చాముండేశ్వరి వెంకటగిరి మునిసిపాలిటి నందు – 8వ, 9వ, 10వ మరియు  11వ వార్డులు. 289 168.48
5 మార్కండేయ వెంకటగిరి మునిసిపాలిటి నందు – 12వ, 13వ, 14వ మరియు 15వ వార్డులు. 367 180.18
6 మార్లగుంట డక్కిలి మండలము నందు — మార్లగుంట, మోపూరు, ఆల్తూరుపాడు మరియు వెలికల్లు గ్రామాలు. 165 141.32
7 బుచ్చిరెడ్డిపాలెం బుచ్చిరెడ్డిపాళెం మండలము నందు – బుచ్చిరెడ్డిపాళెం, వడ్డిపాలెం, కొత్త మినగల్లు, రామచంద్రపురం గ్రామాలు. 324 173.73
8 మన్నార్ పోలూరు సూళ్ళూరుపేట మండలము నందు – మన్నార్ పోలూరు, దామానెల్లూరు, డేగవారికండ్రిగ, ఉగ్గుముడి గ్రామాలు  మరియు తడ మండలములోని అండగుండాల గ్రామము. 264 170.57
9 ఏ.యస్.పేట ఏ.యస్ పేట మండలము నందు – కావలియడవల్లి, ఏ.యస్.పేట, జమ్మవరం, జువ్వలగుంటపల్లి, హసనాపురం, చందులూరుపాడు, అక్బరాబాద్, శ్రీకొలను గ్రామాలు. 455 185.08
    మొత్తము 2761 1918.61

(8) టెక్స్ టైల్ పార్కు, వెంకటగిరి:

టెక్స్ టైల్ పార్కు కొరకు వెంకటగిరి నందు 49.92 ఎకరముల స్థలము కేటాయించడమైనది. సదరు స్థలము నందు టెక్స్ టైల్ పార్కు నిర్మాణము కొరకు రూ.785.00 లక్షలు ప్రాజెక్ట్ అవుట్ లే గా కాగా, ఇప్పటివరకు రూ.100.00 లక్షలు మంజూరు అయినవి.

టెక్స్ టైల్ పార్కుకు కేటాయించిన స్థలమును చేనేత మరియు జౌళి శాఖకు బదలాయించుటకు ప్రతిపాదనలు పంపబడినవి. శ్రీయుత కమీషనర్, చేనేత మరియు జౌళి శాఖ, ఆంధ్రప్రదేశ్, అమరావతి వారు, వైస్ చైర్మన్ / మేనేజింగ్ డైరెక్టర్, ఆంధ్ర ప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (APIIC), విజయవాడ వారికి లేఖ ద్వారా జోనల్ మేనేజర్, APIIC, నెల్లూరు వారికి వెంకటగిరి టెక్స్ టైల్ పార్కు అభివృద్ధి పనులు ప్రారంభించుటకు ఆదేశము జారీ చేయవలసినదిగా కోరియున్నారు.

 

పరిచయము

క్రమ సంఖ్య పేరు మరియు హోదా ఫోన్ నెంబర్
1 శ్రీ బి. శ్రీనివాస్ రావు, సహాయ సంచాలకులు, చేనేత మరియు జౌళి శాఖ, నెల్లూరు జిల్లా 7981130439
2 శ్రీ సి‌.హెచ్. విజయ్ బాబు, అభివృద్ధి అధికారి (కార్యాలయము), చేనేత మరియు జౌళి శాఖ , నెల్లూరు జిల్లా 9948198863
3 శ్రీ ఏ. వెంకటేశ్వర్లు, అభివృద్ధి అధికారి (హౌసింగ్), చేనేత మరియు జౌళి శాఖ, నెల్లూరు జిల్లా 9642277551
4 శ్రీ పి . ప్రసాద రావు, సహాయ అభివృద్ధి అధికారి, చేనేత మరియు జౌళి శాఖ, నెల్లూరు జిల్లా 8790596503
5 శ్రీ పి. వెంకట రావు, సహాయ అభివృద్ధి అధికారి, చేనేత మరియు జౌళి శాఖ , నెల్లూరు జిల్లా 9866204289
6 శ్రీ సి.హెచ్. ప్రశాంత్, సహాయ అభివృద్ధి అధికారి, చేనేత మరియు జౌళి శాఖ, నెల్లూరు జిల్లా 9848684473
7 కుమారి రజని కుమారి, సహాయ అభివృద్ధి అధికారి, చేనేత మరియు జౌళి శాఖ, నెల్లూరు జిల్లా 8465869150

 

5. E-మెయిల్ మరియు పోస్టల్ చిరునామా:

E-Mail ID: adhandtnlr[at]ymail[dot]com

tappal-hat-nlr[at]ap[dot]gov[dot]in

పోస్టల్ చిరునామా: సహాయ సంచాలకులు, చేనేత మరియు జౌళి శాఖ,

ఇంటి నెం: 9/825, మొదటి అంతస్థు, పశువుల ఆసుపత్రి ఎదురుగా,

సంతపేట, నెల్లూరు-524001, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.

 

6. చేనేత మరియు జౌళి శాఖకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వము వారు ఉపయోగిస్తున్న వెబ్ సైట్ వివరములు:

కేంద్ర ప్రభుత్వము యొక్క వెబ్ సైట్ : https://www.handlooms.nic.in

రాష్ట్ర ప్రభుత్వము యొక్క వెబ్ సైట్ : https://www.aphandtex.gov.in