ముగించు

జిల్లా గిరిజన సంక్షేమ శాఖ

ఎ) ప్రొఫైల్

  • నవ్యాంధ్రలో మొత్తం 34 గిరిజన తెగలలో అత్యధికంగా ఈ జిల్లలో యానాది, ఎరుకుల, నక్కల తెగల వారు అన్ని మండలాలలోని నివశించుచున్నారు.
  • సాధారణంగా యానాది తెగ వారు చెరువుగడ్లపై, జనావాసానికి దూరంగా నివశిస్తుంటారు. ముఖ్యంగా వీరియొక్క ప్రధాన వృత్తి చేపల వేటగాను వ్యవసాయ కూలీలుగాను, పారిశుభ్ర కూలీలుగాను, రిక్షా కూలీలు మొదలగు వృత్తులు వీరియొక్క జీవనాధారం. ఎరుకుల తెగల వారు ప్రధాన వృతి చిన్న చిన్న వ్యాపారాలు చేయడం, బాతులు పెంచడం, వ్యాపార రీత్యా ఇతర రాష్ట్రాలకు వెళ్ళడం జరుగును మరియు నక్కల తెగల వారు కూడా ప్రధాన వృతి బొమ్మలు తయారు చేసి చిన్న చిన్న వ్యాపారాలు చేయడం, వ్యాపార రీత్యా ఇతర రాష్ట్రాలకు వెళ్ళడం జరుగును.
  • మొత్తం జనాభాలో 40.49% తో అక్షరాస్యత కల్గియున్నారు. ఇందులో పురుషులు 43.51 % మరియు స్త్రీలు 37.39% తో అక్షరాస్యతతో ఈ క్రింద తెల్పిన జనాభా (సెన్సెక్స్ 2011) కల్గియున్నారు.
విస్తీర్ణం చ.కి.మీ మండలాలు హ్యాబిటేషన్స్ సాధారణ జనాభా గిరిజన జనాభా శాతం
        యానాది నాన్ యానాది మొత్తం ఎస్.టి యానాది
13076 46 1778 2963557 251677 34320 285997 9.65 88

 

బి) ఆర్గనైజేషన్ చార్ట్

TRIBAL WELFARE

సి) పథకాలు / వార్షిక ప్రణాళిక

షెడ్యూల్డు తెగల విద్యార్దుల కోసము గిరిజన సంక్షేమ శాఖ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా యందు 21 విద్యాలయములు నిర్వహించబడుచున్నవి, వాటి వివరములు ఈ దిగువ చూపడమైనది.

వివిధ రకముల విద్యాలయాలు :

విద్యాలయాలు బాలురు బాలికాలు మొత్తం విద్యాలయాలు విద్త్యాలయాలలో చేరిన విద్యార్ధుల సంఖ్య
రెసిడెన్షియల్ పాఠశాలలు 07 06 13 2767
ఆశ్రమ ఉన్నత పాథశాల 0 01 01 509
సమీకృత సంక్షేమ వసతి గృహ సముదాయము 01 0 01 141
ప్రి మెట్రిక్ వసతి గృహము 01 0 01 180
పోస్ట్ మెట్రిక్ వసతి గృహము 3 2 05 504
మొత్తము 12 09 21 4101

విద్యార్దులకు కల్పించు సౌకర్యాలు :

  • డైట్ చార్జీలు @ Rs. 1,000/- (3rd & 4th తరగతులకు) మరియు Rs. 1,250/- (5th to 10th తరగతులకు)
  • కాస్మెటిక్ చార్జీల క్రింద @ Rs.100/- బాలురకు (3rd & 4th తరగతులకు), మరియు @ 110/- for బాలికలకు మరియు Rs. 125/- బాలురకు (5th to 10th తరగతులకు ) మరియు @ 165/- బాలికలకు చొప్పున కాస్మెటిక్ వస్తువులు సరఫరా చేయబడును మరియు 3rd to 10th తరగతి చదువు బాలురకు హెయిర్ కటింగ్ చార్జీల క్రింద నెలకు @ 30/- చెల్లించబడును.
  • నాలుగు జతల సమదుస్తులు, నైట్ డ్రెస్స్ మూడు జతలు, కార్పెట్, దుప్పటి, స్టీల్ ప్లేటు, గ్లాసు, ట్రంక్ బాక్సు, స్కూల్ బ్యాగ్, స్పోర్ట్స్ మెటిరిల్స్ ఇవ్వబడును. .

మార్చి 2019 పడవ తరగతి ఫలితాలు :

మొత్తం విద్యార్ధులు జిల్లా స్థాయిలో ఉత్తీర్నత శాతము
పరీక్షకు హాజరైన వారు ఉత్తీర్నత అయినవారు పరీక్ష తప్పినవారు ఉత్తీర్నత శాతము  
223 166 57 74 83.19

కులాంతర వివాహ ప్రోత్సాహకాలు :

వధూవరులలొ ఒకరు షెడ్యూల్డు తెగలకు చెందినవారైతే వారికి ప్రోత్సాహక బహుమతి క్రింద రు. 50,000/- మంజూరు చేయబడును.

ఉత్తమ పాథశాలలో ప్రవేశము :

నిరుపేదలైన షెడ్యూల్డు తెగల విద్యార్దులకు ఎంపిక చేయబడిన ఉత్తమ ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ లలో 3, 5, 8 వ తరగతి వారికి రెసిడెన్షియల్ పధకము ద్వారా 1255 విద్యార్ధులకు ప్రవేశము కల్పించి 10 వ తరగతి వరకు ఉచిత విద్య, మరియు సదుపాయాలు కల్పించబడును.

మెట్రిక్ అనంతర ఉపకారవేతనములు :-

జిల్లాలోని కళాశాలలో (ప్రభుత్వ / ప్రైవేటు ) ఇంటర్మీడియట్ మరియు ఆ పైన తరగతులు చదువు షెడ్యూల్డు తెగల విద్యార్దులకు ఉపకారవేతనములు మరియు పూర్తీ ఫీజు రీ యంబర్సుమెంటు మంజూరు చేయబడును. విద్యార్ది యొక్క హాజరు శాతాన్ని బట్టి ఉపకారవేతనములు విద్యార్ది బ్యాంకు ఖాతాకు మరియు ఫీజు రీ యంబర్సుమెంటు కళాశాల ప్రిన్సిపాల్ బ్యాంక్ ఖాతాకు నేరుగా జమ చేయబడును.

ప్రి – మెట్రిక్ ఉపకారవేతనములు:

వై. యస్. ఆర్ విద్యా దీవెన :-

ప్రభుత్వ / ఎయిడెడ్ / స్దానిక సంస్థల పాఠశాలలో 9 మరియు 10 వ తరగతి చదువుచున్న గిరిజన విద్యార్దులకు ప్రి-మెట్రిక్ ఉపకార వేతనము క్రింద నెలకు రు.150/- చొప్పున 10 నెలలకు మరియు రు.750/- ఆడహక్ గ్రాంటు కలిపి మొత్తము సంవత్సరమునకు రు.2,250/- ప్రతి విద్యార్ధికి చెల్లింపబడును.

కొత్త పధకము:-

ప్రభుత్వ / ఎయిడెడ్ / స్దానిక సంస్థల పాథశాలలో 5 నుండి 8 వ తరగతి వరకు చదువుచున్న గిరిజన విద్యార్దులకు ప్రి-మెట్రిక్ ఉపకార వేతనము క్రింద బాలురకు సంవత్సరమునకు రు.1000/- మరియు బాలికలకు సంవత్సరమునకు రు. 1500/- చొప్పున చెల్లించబడును. .

స్కిల్ అప్ గ్రెడేషన్ పధకము :-

విదేశీ యునివర్సిటిల లో చేరుటకు అవసరమైన ఎలిజబులిటి పరిక్షలు TOFEL/IELTS మరియు GRE/GMAT లకు అవసరమైన కోచింగ్ ను షెడ్యూల్డు తెగల విద్యార్దులకు ఎంపిక చేయబడిన సంస్థల యందు ఉచిత శిక్షణ ఇప్పించబడును.

అంబేద్కర్ ఓవర్శిస్ విద్యానిధి :

విదేశాలలో ఉన్నత చదువులు చదువగోరు షెడ్యూల్డు తెగల విద్యార్దులకు ఈ పధకము ద్వారా రు.15 లక్షల ఉపకారవేతనము మరియు ఫ్లైట్ చార్జీలు, వీసా చార్జీలు చెల్లింపబడును.

వై. యస్. ఆర్ విద్యోన్నతి :-

సివిల్ సర్వీస్ పరిక్షలు వ్రాయ గోరు షెడ్యూల్డు తెగల విద్యార్దులకు దేశంలోని వివిధ ప్రాంతాలలో ఎంపిక చేయబడిన ప్రఖ్యాత సంస్థల సంస్థల యందు ఉచిత శిక్షణ ఇప్పించబడును

ఉచిత విద్యుత్ పధకము :-

100 యూనిట్ల లోపు విద్యుత్ వాడు షెడ్యూల్డు తెగల కుటుంబాలకు ఈ పధకము ద్వారా ఉచిత విద్యుత్ అందించబడును. ప్రభుత్వ ఉత్తర్వ్యులు No.91 SW (SCP.A2) Dept, Dt. 24.07.2019 ప్రకారము ఉచిత విద్యుత్ యూనిట్ల వాడకము 200 యూనిట్ల వరకు పెంచడము జరిగినది.

డి) అధికారుల వివరములు

వ.నెం. అధికారి పేరు మరియు హోదా మొబైల్ నెంబరు
1 శ్రీమతి బి.విద్యా రాణి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి 9490957020
2 శ్రీ ఎన్.నవీన్ కుమార్, పర్యవేక్షకులు 9618002031
3 కుమారి కె.జ్యోత్స్న, సహాయ గిరిజన సంక్షేమ అధికారి, గూడూరు 9491947547
4 శ్రీ కె.అంకయ్య, సహాయ గిరిజన సంక్షేమ అధికారి, నెల్లూరు 9247132758

 

ఇ) కార్యాలయపు చిరునామా మరియు ఇ-మెయిల్ వివరములు

ఇ-మెయిల్ : dtwo.nlr[at]gmail[dot]com

చిరునామా :

జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి వారి కార్యాలయము,

కొండాయపాళెం గేటు దగ్గర

దర్గామిట్ట, ఎల్.ఐ.సి. ప్రక్కన

నెల్లూరు – 524 004.

టెలిఫోను : 0861-2328603

ఎఫ్) ముఖ్యమైన వెబ్ సైట్ల వివరములు:

వ.నెం. వివరణ వెబ్ సైట్ చిరునామా
1 జిల్లా ఎన్.ఐ.సి. కేంద్రము http://www.nellore.ap.gov.in/
2 సమాచార హక్కు చట్టం https://www.apic.gov.in
3 స్పందన http://spandana.ap.gov.in/officer_login
4 బయోమెట్రిక్ – అటెండెన్సు http://apitdanlr.attendance.gov.in
5 ఏ.పి. ట్రైబ్స్ http://aptribes.gov.in/
6 గిరి ప్రగతి http://giripragati.ap.gov.in/
7 సి.ఎఫ్.యం.ఎస్., http://cfms.ap.gov.in
8 గురుకులం http://aptwgurukulam.ap.gov.in/
9 జ్ఞానభూమి https://jnanabhumi.ap.gov.in