ముగించు

ప్రభుత్వ పాలిటెక్నిక్ – గుడూర్

సాంకేతిక విద్యా శాఖ

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం

గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల,తిలక్ నగర్, సిరామిక్ ఫ్యాక్టరీ రోడ్, గూడూరు1957 సం.లో మైనింగ్ ఇన్స్టిట్యూట్ గా ప్రారంభమై తరువాత అదనంగా నాలుగు కోర్సులతో అనగా (సివిల్, మెకానికల్, ఎలెక్ట్రికల్ మరియు సిరామిక్ ఇంజనీరింగ్ కోర్సులతో 1965 సం.లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల గా అవతరించి తరువాత సిరామిక్ ఇంజనీరింగ్ కోర్సు ఈ కళాశాల నుండి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిరామిక్ టెక్నాలజి కోర్సు గా వేరే ప్రాంగణంలో 1986 సం.లో స్థాపిచబడినది. ప్రస్తుతం ఈ కళాశాలలో నాలుగు కోర్సుల తో నడుస్తున్నది అనగా (సివిల్, మెకానికల్, ఎలెక్ట్రికల్ మరియు మైనింగ్ ఇంజనీరింగ్ కోర్సులతో నడుస్తున్నది.

ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో మొత్తం 720 ( బాలురు మరియు బాలికలు) మంది విద్యార్దిని విద్యార్ధులు చదువు కొనే సౌకర్యం కలదు. మరియు ఈ కళాశాలలో బాలురు కు అనుబంధ హాస్టల్ వసతి గృహం సధుపాయం కలదు మరియు ప్రధానాచార్యాలు, శాఖాదీపతులు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అధ్యాపకులు, మినిస్తేరియల్ స్టాఫ్ మరియు నాలుగవ తరగతి స్టాఫ్ మొత్తం కలిపి 103 పోస్టులు మంజూరు చేయబడియున్నవి. మరియు విద్యార్దినీ విద్యార్ధుల కు ఆడుకొనుటకు విశాలమైన ఆట స్థలం కలదు.

సంస్ధ నిర్మాణము:-

GOVT POLYTECHNIC

ప్రత్యేకతలు/కార్యకలాపాలు :

బోధనా, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, CISCO ట్రైనింగ్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్, గేమ్స్, గవర్నమెంట్ స్కీమ్ లు వనం మనం, జన్మభూమి మొదలుగునవి.

కాంటాక్ట్ ఫోన్ నంబర్స్:-

ప్రిన్సిపాల్ : 9912342017
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ : 8367799017

ఈ మెయిల్: gpt017[at]gmail[dot]com.
ఈ ఆఫీసు తపాల్: tappal-gpt-gdrnlr[at]ap[dot]gov[dot]in

పోస్టల్ అడ్రెస్ :
ప్రభుత్వ పాలిటెక్నిక్
తిలక్ నగర్
సిరామిక్ ఫ్యాక్టరీ రోడ్
గూడూరు 524101
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా

 

కాలేజీ వెబ్ సైట్: https://govtpolygudur.ac.in.